← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరంజ్యోతిః paraṃjyōtiḥ

Original — తెలుగు
  1. జ్యోతిషామపి ప్రకాశకత్వాత్.

(తేజోరూపములైన - ప్రకాశించునదియగు - వాటినికూడ ప్రకాశింప చేయునదగుటచేత పరంజ్యోతి - పరమాత్మ, పరబ్రహ్మ).

  1. తచ్ఛుభ్రం - జ్యోతిషాం జ్యోతిః (ముండకోపనిషత్తు)

“న తత్ర సూర్యోభాతి, న చంద్ర తారకం నేమా విద్యుత్ భాంతి, కుతో(అ)యమగ్నిః? తమేవ భాంత మనుభాంతి సర్వం, తస్య భాసా సర్వమిదం విభాతి”. (ముండకోపనిషత్)

” న తద్భాసయతే సూర్యో, నశశాంకో, న పాపకః||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 6)

(ఆ పరబ్రహ్మ ప్రకాశించు రూపములు గలవాటిని ప్రకాశింపచేయువాడు - అక్కడ - అతని యెదుట సూర్యుడు ప్రకాశింపడు - అతని తేజస్సు ముందు సూర్యుని తేజస్సు దివిటీముందు దీపమువలె నుండును. అట్లే చంద్రుడుకాని నక్షత్రములుకాని అక్కడ ప్రకాశింపవు - విద్యుత్ కాంతి కూడ నక్కడప్రకాశింపదు - ఇట్టి స్థిథిలో అగ్నిమాత్రము అక్కడ ఎట్లు ప్రకాశించును? (ప్రకాశించదు). ప్రకాశించుచున్న ఆ పరబ్రహ్మ వలననే ఇవన్నియు (అతని ప్రకాశము వీటిలో నుండుటవలననే) ప్రకాశించుచున్నవి. అతని కాంతివలననే ఈ ప్రపంచకమంతయు వెలుగుచున్నది - కంటికి కనబడు చున్నది. సూర్యుడు మొదలగు తేజస్సు గలవి స్వతః తేజోమూర్తులు కావు.

“యదాదిత్యగతం తేజో, జగద్భాసయతే(అ)ఖిలం |

యచ్చంద్రమసి, యచ్ఛాగ్నౌ తత్తేజోవిద్ధిమామకం ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 12)

ఈ జగత్తు అంతటినిప్రకాశింపచేయుచున్న సూర్యునిలోని తేజస్సు, చంద్రుని తేజస్సు, అగ్ని తేజస్సు నాదే (భగవంతునిదే) అని తెలుసుకొనుము. నేను వాటిలో ఉండుటవలననే నా తేజస్సుతో అవి ప్రకాశించుచున్నవి). సూర్యుడు మొదలగు ప్రకాశరూపములకంటె ఉత్కృష్టమైన, పెద్దదైన ప్రకాశము (కాంతి) కలదగుట చేత పరబ్రహ్మ పరం జ్యోతి).

  1. “సర్వస్యై వాస్య నామరూపక్రియా కారక ఫలజాతస్య యాభి వ్యక్తిస్సా బ్రహ్మ జ్యోతిస్సత్తా నిమిత్తా - యధా సూర్యాది సూర్యాదిజ్యోతిస్సత్తా నిమిత్తా, సర్వ రూపజాతస్యాభివ్యక్తిః తద్వత్” - (శ్రీశంకరః - బ్రహ్మసూత్ర భాష్యే - 1 - 3 - 22)

నామరూపక్రియలతోనుండు ఈ జగత్తంతయు ప్రకాశించుట - జగత్తులోని వస్తువులుగానుండి ప్రకాశించుట, కనబడుట - ఆ పరబ్రహ్మ యొక్క ప్రకాశమువలననే - ప్రకాశమానముగానుండు భగవంతుని యొక్క సత్తామాత్రము (చైతన్యశక్తి) వలననే - సూర్యునిలోని తేజస్సు ఈ ప్రపంచములోని వస్తువులను ప్రకాశింప చేయు చున్నట్లు, సూర్యుని తేజస్సు వలననే వస్తువులన్నియు కనబడుచున్నట్లునూ, అతని కాంతిచేతనే అన్నియు శక్తి వంతమగుచున్నట్లునూ -).

  1. “సర్వేషాం జ్ఞాన కారణత్వేన పరంజ్యోతిః నారాయణః” - (జ్యోతిషాం జ్యోతిః)

(సమస్తమైన వాటి జ్ఞానమునకు కారణమగుతచేత ‘పరంజ్యోతి’ అని పరబ్రహ్మ చెప్పబడుచున్నాడు. తేజోరూపము చిద్రూపము అగుటచేత జ్ఞానము - జ్ఞానకారణమగుటచేత ’ పరం జ్యోతిః ’)..

  1. “ఇచ్చా, జ్ఞాన క్రియా చైవ రౌద్రీ , బ్రాహ్మీ తు వైష్ణవీ |

త్రిథాశక్తిః స్థితా యత్రి తత్పరం జ్యోతి ||“.

(ఇచ్చా జ్ఞానక్రియా శక్తులు అను మూడు శక్తులు అయిన పార్వతి, సరస్వతి , లక్ష్మి - ఎందుగలవో అది పరం జ్యోతి).

  1. “తం దేవాః జ్యోతిషాం జ్యోతి రాయు రాపో స తే(అ)మృతమితి”.

(దేవతలు ఆ పరబ్రహ్మను ప్రకాశించువాటి ప్రకాశమని అమృతమని (మరణము లేనిదని - మోక్షరూపమని) ఉపాసించెదరు).

  1. “పరబ్రహ్మ గమ్యం పరంజ్యోతిమూర్తిం” (శ్రీరామకర్ణాముతం - 29 - 2 - 15)

  2. (దండకము) “- అధ్యాత్మ తత్వంబవన్నం బరంజ్యోతివన్నం బ్రపంచం బవన్నం బ్రపంచం బవన్నన్న ధిష్ఠాతవన్నన్ సదా సాక్షి వన్నన్, గుణాతీత, నీవేకదా | - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 203)

Transliteration
  1. jyōtiṣāmapi prakāśakatvāt.

(tējōrūpamulaina - prakāśiṃcunadiyagu - vāṭinikūḍa prakāśiṃpa cēyunadaguṭacēta paraṃjyōti - paramātma, parabrahma).

  1. tacchubhraṃ - jyōtiṣāṃ jyōtiḥ (muṃḍakōpaniṣattu)

“na tatra sūryōbhāti, na caṃdra tārakaṃ nēmā vidyut bhāṃti, kutō(a)yamagniḥ? tamēva bhāṃta manubhāṃti sarvaṃ, tasya bhāsā sarvamidaṃ vibhāti”. (muṃḍakōpaniṣat)

” na tadbhāsayatē sūryō, naśaśāṃkō, na pāpakaḥ||“. (śrīmadbhagavadgīta - 15 - 6)

(ā parabrahma prakāśiṃcu rūpamulu galavāṭini prakāśiṃpacēyuvāḍu - akkaḍa - atani yeduṭa sūryuḍu prakāśiṃpaḍu - atani tējassu muṃdu sūryuni tējassu diviṭīmuṃdu dīpamuvale nuṃḍunu. aṭlē caṃdruḍukāni nakṣatramulukāni akkaḍa prakāśiṃpavu - vidyut kāṃti kūḍa nakkaḍaprakāśiṃpadu - iṭṭi sthithilō agnimātramu akkaḍa eṭlu prakāśiṃcunu? (prakāśiṃcadu). prakāśiṃcucunna ā parabrahma valananē ivanniyu (atani prakāśamu vīṭilō nuṃḍuṭavalananē) prakāśiṃcucunnavi. atani kāṃtivalananē ī prapaṃcakamaṃtayu velugucunnadi - kaṃṭiki kanabaḍu cunnadi. sūryuḍu modalagu tējassu galavi svataḥ tējōmūrtulu kāvu.

“yadādityagataṃ tējō, jagadbhāsayatē(a)khilaṃ |

yaccaṃdramasi, yacchāgnau tattējōviddhimāmakaṃ ||“. (śrīmadbhagavadgīta - 15 - 12)

ī jagattu aṃtaṭiniprakāśiṃpacēyucunna sūryunilōni tējassu, caṃdruni tējassu, agni tējassu nādē (bhagavaṃtunidē) ani telusukonumu. nēnu vāṭilō uṃḍuṭavalananē nā tējassutō avi prakāśiṃcucunnavi). sūryuḍu modalagu prakāśarūpamulakaṃṭe utkṛṣṭamaina, peddadaina prakāśamu (kāṃti) kaladaguṭa cēta parabrahma paraṃ jyōti).

  1. “sarvasyai vāsya nāmarūpakriyā kāraka phalajātasya yābhi vyaktissā brahma jyōtissattā nimittā - yadhā sūryādi sūryādijyōtissattā nimittā, sarva rūpajātasyābhivyaktiḥ tadvat” - (śrīśaṃkaraḥ - brahmasūtra bhāṣyē - 1 - 3 - 22)

nāmarūpakriyalatōnuṃḍu ī jagattaṃtayu prakāśiṃcuṭa - jagattulōni vastuvulugānuṃḍi prakāśiṃcuṭa, kanabaḍuṭa - ā parabrahma yokka prakāśamuvalananē - prakāśamānamugānuṃḍu bhagavaṃtuni yokka sattāmātramu (caitanyaśakti) valananē - sūryunilōni tējassu ī prapaṃcamulōni vastuvulanu prakāśiṃpa cēyu cunnaṭlu, sūryuni tējassu valananē vastuvulanniyu kanabaḍucunnaṭlunū, atani kāṃticētanē anniyu śakti vaṃtamagucunnaṭlunū -).

  1. “sarvēṣāṃ jñāna kāraṇatvēna paraṃjyōtiḥ nārāyaṇaḥ” - (jyōtiṣāṃ jyōtiḥ)

(samastamaina vāṭi jñānamunaku kāraṇamagutacēta ‘paraṃjyōti’ ani parabrahma ceppabaḍucunnāḍu. tējōrūpamu cidrūpamu aguṭacēta jñānamu - jñānakāraṇamaguṭacēta ’ paraṃ jyōtiḥ ’)..

  1. “iccā, jñāna kriyā caiva raudrī , brāhmī tu vaiṣṇavī |

trithāśaktiḥ sthitā yatri tatparaṃ jyōti ||“.

(iccā jñānakriyā śaktulu anu mūḍu śaktulu ayina pārvati, sarasvati , lakṣmi - eṃdugalavō adi paraṃ jyōti).

  1. “taṃ dēvāḥ jyōtiṣāṃ jyōti rāyu rāpō sa tē(a)mṛtamiti”.

(dēvatalu ā parabrahmanu prakāśiṃcuvāṭi prakāśamani amṛtamani (maraṇamu lēnidani - mōkṣarūpamani) upāsiṃcedaru).

  1. “parabrahma gamyaṃ paraṃjyōtimūrtiṃ” (śrīrāmakarṇāmutaṃ - 29 - 2 - 15)

  2. (daṃḍakamu) “- adhyātma tatvaṃbavannaṃ baraṃjyōtivannaṃ brapaṃcaṃ bavannaṃ brapaṃcaṃ bavannanna dhiṣṭhātavannan sadā sākṣi vannan, guṇātīta, nīvēkadā | - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 203)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.