← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరాయణం parāyaṇaṃ

Original — తెలుగు
  1. పరమం అయనం, ఆశ్రయం, ప్రాప్యం, ప్రాప్యస్థానం.

(ఉత్కృష్టమైన ఆశ్రయము, పొందతగిన స్థానము - పొంద తగినవాడు).

  1. పరమ శరణం (ఉత్కృష్టమైన శరణమైనవాడు).

  2. సర్వప్రాణాశ్రయం. (సమస్త ప్రాణులకు ఆశ్రయమైనవాడు)

  3. పరేషాం బ్రహ్మదీనాం అయనం ఆశ్రయ భూతం.

(ఛతుర్ముఖ బ్రహ్మ మొదలగువారికి ఆశ్రయమైనవాడు - భగవంతుడు - భగవంతునిలోనుండి పుట్టి అతనిలోనే లయమగువాడు).

  1. ఉత్తమానామాశ్రయః.

(ఉత్తములైన వారలకు ఆశ్రయమైనవాడు).

  1. ఉత్కృష్టాధారత్వాత్ పరాయణత్వం -

(ఉత్కృష్టమైన ఆధారమగుటవలన భగవంతుడు పరాయణము అని చెప్పబడినది).

  1. పరం ఉత్కృష్టం అయనం స్థానం పునరావృత్తి శంకా రహితం ఇతి పరాయణం -

(తిరిగి జన్మించుట యను శంకలేని ఉత్కృష్టమైనస్థానము).

  1. “యదా జ్ఞయా ప్రవర్తంతే సర్వే, యస్మిన్ అధిగతే హృదయ గ్రంధిర్భిద్యతే -”

భిద్యతే హృదయగ్రణిశ్చిధ్యతే సర్వ సంశయాః |

క్షీ యంతే చాస్య కర్మాణి తస్మిన్ దృఇష్టే పరావరే” ఇతిశ్రుతేః. (ముండకోపనిషత్ - 2 - 2 - 8)

యస్య విజ్ఞాన మాత్రేణ ఆనందలక్షణో మోక్షః ప్రాప్యతే, యద్విద్వాన్ నబిభేతి కుతశ్చన, యత్ప్రవిష్టస్య న విద్యతే పునర్భవః; యస్య చ వేదనాత్ తదేవ భవతి - “బ్రహ్మ వేద భ్రహ్మైవ భవతి”. (ముండకోపనిషత్ - 3 - 2 - 9)

ఇతి శ్రుతేః, యద్విహా యా పరః పంథా నృణాం నాస్తి - “నాన్యః పంథా విద్యతే అయనాయ” (తైత్తిరీయోపనిషత్ - 3 - 13)

ఇతి శ్రుతేః - తదుక్తం ఏకం పరాయణం - (శ్రీశంకరః)

(“ఎవని ఆజ్ఞవలన సమస్తమును ప్రవర్తించు చున్నదో, ఎవనిని తెలుసుకొనిన హృదయమందలి గ్రంధులు (ముడులు) విడిపోవునో, సంశయములన్నియు తీరిపోవునో, కర్మలన్నియు ఫలమునీయ కనే నశించిపోవునో” అని ముండకోపనిషత్తులో చెప్పబడినది. “ఎవనిని తెలుసుకొనిన మాత్రమున పరమానందరూపమగు మోక్షము ప్రాప్తించునో, ఎవనిని తెలుసుకొనిన నరునకు దేనివలననూ భయము కలుగదో, ఎవరిని పొందిన తిరిగి జన్మించుట ఉండదో, ఎవనిని తెలుసుకొనిన ‘అతనే తాని’ అగునో -”బ్రహ్మజ్ఞానము కలవాడు బ్రహ్మమే యగునో” - అని ముండకోపని షత్తులో చెప్పబడినది. “నరులకు మోక్షముకొఱకు ఎవడు కాక మఱియొక మార్గము లేదో” అని తైత్తిరీయోపనిషత్తులో చెప్పబడినది. పై విధముగా శ్రుతులలో చెప్పబడిన పర మాత్మయే ఒకడే అయిన పరాయణము - పరమ అయనము).

  1. “పరమం యో మహత్తేజః, పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం ||”. (మహా భారతే)

(ఉత్కృష్టమైన తేజో రూపమైనది, తపోరూపమైనది - (గొప్పగా తపింపచేయునది - వేడిమి నిచ్చి, శక్తిని కలిగించునది), పరమ బ్రహ్మ అయినదే పరాయణము - పరమ అయనము - మోక్షస్థానము).

  1. “హరిః పరాయణం పరం హరిః పరాయణం పరం |

పునః పునర్వదామ్యహం హరిః పరాయనం పరం ||“.

(శ్రీహరియే పరమ పరాయణము అని మాటి మాటికి చెప్పుచున్నాను).

  1. “నారాయణం మహా జ్ఞేయం విశ్వాత్మానం పరాయణం”. (మంత్రపుష్పం)

(శ్రీమన్నారయణుడే గొప్ప తెలుసుకోగల వస్తువు - అతనే ప్రపంచమంతటికి ఆత్మ అయినవాడు - అతనే పరమ అయనము).

Transliteration
  1. paramaṃ ayanaṃ, āśrayaṃ, prāpyaṃ, prāpyasthānaṃ.

(utkṛṣṭamaina āśrayamu, poṃdatagina sthānamu - poṃda taginavāḍu).

  1. parama śaraṇaṃ (utkṛṣṭamaina śaraṇamainavāḍu).

  2. sarvaprāṇāśrayaṃ. (samasta prāṇulaku āśrayamainavāḍu)

  3. parēṣāṃ brahmadīnāṃ ayanaṃ āśraya bhūtaṃ.

(chaturmukha brahma modalaguvāriki āśrayamainavāḍu - bhagavaṃtuḍu - bhagavaṃtunilōnuṃḍi puṭṭi atanilōnē layamaguvāḍu).

  1. uttamānāmāśrayaḥ.

(uttamulaina vāralaku āśrayamainavāḍu).

  1. utkṛṣṭādhāratvāt parāyaṇatvaṃ -

(utkṛṣṭamaina ādhāramaguṭavalana bhagavaṃtuḍu parāyaṇamu ani ceppabaḍinadi).

  1. paraṃ utkṛṣṭaṃ ayanaṃ sthānaṃ punarāvṛtti śaṃkā rahitaṃ iti parāyaṇaṃ -

(tirigi janmiṃcuṭa yanu śaṃkalēni utkṛṣṭamainasthānamu).

  1. “yadā jñayā pravartaṃtē sarvē, yasmin adhigatē hṛdaya graṃdhirbhidyatē -”

bhidyatē hṛdayagraṇiścidhyatē sarva saṃśayāḥ |

kṣī yaṃtē cāsya karmāṇi tasmin dṛiṣṭē parāvarē” itiśrutēḥ. (muṃḍakōpaniṣat - 2 - 2 - 8)

yasya vijñāna mātrēṇa ānaṃdalakṣaṇō mōkṣaḥ prāpyatē, yadvidvān nabibhēti kutaścana, yatpraviṣṭasya na vidyatē punarbhavaḥ; yasya ca vēdanāt tadēva bhavati - “brahma vēda bhrahmaiva bhavati”. (muṃḍakōpaniṣat - 3 - 2 - 9)

iti śrutēḥ, yadvihā yā paraḥ paṃthā nṛṇāṃ nāsti - “nānyaḥ paṃthā vidyatē ayanāya” (taittirīyōpaniṣat - 3 - 13)

iti śrutēḥ - taduktaṃ ēkaṃ parāyaṇaṃ - (śrīśaṃkaraḥ)

(“evani ājñavalana samastamunu pravartiṃcu cunnadō, evanini telusukonina hṛdayamaṃdali graṃdhulu (muḍulu) viḍipōvunō, saṃśayamulanniyu tīripōvunō, karmalanniyu phalamunīya kanē naśiṃcipōvunō” ani muṃḍakōpaniṣattulō ceppabaḍinadi. “evanini telusukonina mātramuna paramānaṃdarūpamagu mōkṣamu prāptiṃcunō, evanini telusukonina narunaku dēnivalananū bhayamu kalugadō, evarini poṃdina tirigi janmiṃcuṭa uṃḍadō, evanini telusukonina ‘atanē tāni’ agunō -”brahmajñānamu kalavāḍu brahmamē yagunō” - ani muṃḍakōpani ṣattulō ceppabaḍinadi. “narulaku mōkṣamukoṟaku evaḍu kāka maṟiyoka mārgamu lēdō” ani taittirīyōpaniṣattulō ceppabaḍinadi. pai vidhamugā śrutulalō ceppabaḍina para mātmayē okaḍē ayina parāyaṇamu - parama ayanamu).

  1. “paramaṃ yō mahattējaḥ, paramaṃ yō mahattapaḥ paramaṃ yō mahadbrahma paramaṃ yaḥ parāyaṇaṃ ||”. (mahā bhāratē)

(utkṛṣṭamaina tējō rūpamainadi, tapōrūpamainadi - (goppagā tapiṃpacēyunadi - vēḍimi nicci, śaktini kaligiṃcunadi), parama brahma ayinadē parāyaṇamu - parama ayanamu - mōkṣasthānamu).

  1. “hariḥ parāyaṇaṃ paraṃ hariḥ parāyaṇaṃ paraṃ |

punaḥ punarvadāmyahaṃ hariḥ parāyanaṃ paraṃ ||“.

(śrīhariyē parama parāyaṇamu ani māṭi māṭiki ceppucunnānu).

  1. “nārāyaṇaṃ mahā jñēyaṃ viśvātmānaṃ parāyaṇaṃ”. (maṃtrapuṣpaṃ)

(śrīmannārayaṇuḍē goppa telusukōgala vastuvu - atanē prapaṃcamaṃtaṭiki ātma ayinavāḍu - atanē parama ayanamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.