పరిణామవాదోపి న ప్రపంచోత్పత్తి విషయే యుజ్యతే. కారణవస్తునః ప్రాక్ సిద్ధ కారణావస్థా పరిత్యాగ పూర్వకోవస్థాంతర ప్రాప్తిః పరిణామః - యథామృత్పరిణామో ఘటః ఇతి, పథాన పరిణామో జగత్ ఇతి చ సాంఖ్యాః వదంతి. బ్రహ్మ పరిణామో జగత్ ఇతి కేచన ఉపాసకాః మన్యంతే తదుభయం సూత్ర భాష్య కారాదిభిః ఖండితం చైతన్యస్య ఆకాశాదపి సూక్ష్మత్వేన నిరవయవ త్వాదేవ ఉపాసకమతం అత్యంతం అసంగతమేవ ఇత్థం పరిణామ వాదోపి న యుజ్యతే -
(ప్రపంచ సృష్టి విషయములో పరిణామవాదము సరికాదు, ఉపయోగపడదు - కారణవస్తువు తనకు ముందున్న కారణాకారమును (కారణముగానుండు స్థితిని) - తనలోనుండి ఇంకొక కార్యవస్తువును పుట్టించ కలుగు స్థితిని - విడిచిపెట్టి, ఇంకొక అవస్థను పొందుట, ఇంకొక రూపమును పొందుట పరిణామము - మట్టి యొక్క పరిణామము కుండ అయినట్లు ప్రథానము యొక్క పరిణామమే జగత్తు అని సాంఖ్యుల అభిప్రాయము. కొందఱు ఉపాసకులు బ్రహ్మ యొక్క పరిణామమే జగత్తు అని అభిప్రాయ పడుతున్నారు - బ్రహ్మ సూత్రములకు భాష్యము వ్రాసిన ఆచార్యులవారందరూ ఈ రెండు అభిప్రాయములను ఖండించినారు. చైతన్యమనునది చిచ్ఛక్తి ఆకాశముకంటె సూక్ష్మమగుటచేతను అవయవములు లేనిదగుటచేతను ఉపాసకుల మతము సంగతముకాదు - ఆ ప్రకారముగానే పరిణామ వాదము కూడ సంగతము కాదు).
(భగవంతునికి రెండు శక్తులు గలవు - ఒకటి అపరాశక్తి; ఇదియే ప్రకృతి - ఇది జడము - ఇది తనంతట తానేపనియు చేయనేరదు. రెండవశక్తి పరాశక్తి; ఇదియే చైతన్య శక్తి - భగవంతుని చిచ్ఛక్తి. ఈ చైతన్య శక్తి అపరాశక్తిలో ప్రవేశించినపుడు (భగవంతుడు తన చైతన్య శక్తితో ప్రకృతిలో ప్రవేశించి నపుడు) ప్రకృతి పురుషుల సం యోగమువలన, అపరాశక్తికి (ప్రకృతికి) చైతన్యము కలిగి తనలోనుండి మహత్తత్వము మొదలగు తత్వములను కార్యరూప ములుగా ఉద్భవించునట్లుగా చేయ గలిగెను – అట్టికార్యరూపము లన్నింటిలోను భగవంతుని చైతన్యశక్తి యుండి వాటిలోనుండి మరల కార్యవస్తువులను పుట్టించుచున్నది. అందుచేత ప్రకృతి జగత్తునకు ఉపాదానకారణము - కార్యవస్తువును పుట్టించుటకు కావలసిన ద్రవ్యము నిచ్చునది, కుండకు మట్టివలె. భగవంతుడు తన చైతన్యశక్తి రూపములో జగత్తునకు నిమిత్తకారణము - కుండకు కుమ్మరి వాని వలె. అందుచేత పరాశక్తి, అపరాశక్తి భగవంతునివే కనుక, అతనిలో నుండునవియే కనుక. (ఎవనిశక్తి యైనను వానినుండి విడదీయుటకు వీలుకాదుకనుక). సృష్టికిముందు భగవంతుడొక్కడే యుండెనని శ్రుతులు చెప్పుటచేత, ఈ స్థూల జగత్తు అంతయును భగవంతుని స్థూలరూపమే అని చెప్పుటచేతను భగవంతుడే యీ జగత్తుగా మారెను - అతను తప్ప యింకేదియు లేదనియు (భగవంతుడద్వయుడనియు) చెప్పుటచేత నీ ప్రపంచమంతయు భగవంతుడే - ఒక విత్తనము దానిలోనుండి పుట్టిన చెట్టుగానయినట్లే, ప్రపంచములోని ఏ వస్తువులోనైనను భగవంతుని చైతన్యశక్తి లేనిదే అందులోనుండి మఱియొక వస్తువు పుట్టదు. అందుచేత సౄష్టికికారణము ఆరంభములోను ఇప్పటివరకు ప్రతి వస్తువు పుట్టుటకు నికముందు పుట్టుటకు కూడ భగవంతుడే కారణము. ఇదంతయు భగవంతుని సృష్టియే. ప్రకృతి (matter) ఒక్కటి యీ జగత్తులోని వస్తువులుగా తనంతట తానే మారుట అసంభవము - భగవంతుని చైతన్య శక్తియే - ఆ చైతన్య శక్తిలోనుండు భగవంతుడే - సృష్టిని చేయుచున్నాడు - అతనిని అతని చైతన్యశక్తికి భేదములేదు - వేరు లేదు - చైతన్య శక్తియే భగవంతుడు, భగవంతుడే చైతన్య శక్తి. భగవంతునికి అవయవములు లేకపోవుట చేతను, ఎల్లపుడు ఒకే రూపముతో (చైతన్యమాత్రుడుగానే) ఉండువాడగుటచేతను, పుట్టుక లేనివాడగుటచేతను అతనికి పరిణామములు లేవు).
pariṇāmavādōpi na prapaṃcōtpatti viṣayē yujyatē. kāraṇavastunaḥ prāk siddha kāraṇāvasthā parityāga pūrvakōvasthāṃtara prāptiḥ pariṇāmaḥ - yathāmṛtpariṇāmō ghaṭaḥ iti, pathāna pariṇāmō jagat iti ca sāṃkhyāḥ vadaṃti. brahma pariṇāmō jagat iti kēcana upāsakāḥ manyaṃtē tadubhayaṃ sūtra bhāṣya kārādibhiḥ khaṃḍitaṃ caitanyasya ākāśādapi sūkṣmatvēna niravayava tvādēva upāsakamataṃ atyaṃtaṃ asaṃgatamēva itthaṃ pariṇāma vādōpi na yujyatē -
(prapaṃca sṛṣṭi viṣayamulō pariṇāmavādamu sarikādu, upayōgapaḍadu - kāraṇavastuvu tanaku muṃdunna kāraṇākāramunu (kāraṇamugānuṃḍu sthitini) - tanalōnuṃḍi iṃkoka kāryavastuvunu puṭṭiṃca kalugu sthitini - viḍicipeṭṭi, iṃkoka avasthanu poṃduṭa, iṃkoka rūpamunu poṃduṭa pariṇāmamu - maṭṭi yokka pariṇāmamu kuṃḍa ayinaṭlu prathānamu yokka pariṇāmamē jagattu ani sāṃkhyula abhiprāyamu. koṃdaṟu upāsakulu brahma yokka pariṇāmamē jagattu ani abhiprāya paḍutunnāru - brahma sūtramulaku bhāṣyamu vrāsina ācāryulavāraṃdarū ī reṃḍu abhiprāyamulanu khaṃḍiṃcināru. caitanyamanunadi cicchakti ākāśamukaṃṭe sūkṣmamaguṭacētanu avayavamulu lēnidaguṭacētanu upāsakula matamu saṃgatamukādu - ā prakāramugānē pariṇāma vādamu kūḍa saṃgatamu kādu).
(bhagavaṃtuniki reṃḍu śaktulu galavu - okaṭi aparāśakti; idiyē prakṛti - idi jaḍamu - idi tanaṃtaṭa tānēpaniyu cēyanēradu. reṃḍavaśakti parāśakti; idiyē caitanya śakti - bhagavaṃtuni cicchakti. ī caitanya śakti aparāśaktilō pravēśiṃcinapuḍu (bhagavaṃtuḍu tana caitanya śaktitō prakṛtilō pravēśiṃci napuḍu) prakṛti puruṣula saṃ yōgamuvalana, aparāśaktiki (prakṛtiki) caitanyamu kaligi tanalōnuṃḍi mahattatvamu modalagu tatvamulanu kāryarūpa mulugā udbhaviṃcunaṭlugā cēya galigenu – aṭṭikāryarūpamu lanniṃṭilōnu bhagavaṃtuni caitanyaśakti yuṃḍi vāṭilōnuṃḍi marala kāryavastuvulanu puṭṭiṃcucunnadi. aṃducēta prakṛti jagattunaku upādānakāraṇamu - kāryavastuvunu puṭṭiṃcuṭaku kāvalasina dravyamu niccunadi, kuṃḍaku maṭṭivale. bhagavaṃtuḍu tana caitanyaśakti rūpamulō jagattunaku nimittakāraṇamu - kuṃḍaku kummari vāni vale. aṃducēta parāśakti, aparāśakti bhagavaṃtunivē kanuka, atanilō nuṃḍunaviyē kanuka. (evaniśakti yainanu vāninuṃḍi viḍadīyuṭaku vīlukādukanuka). sṛṣṭikimuṃdu bhagavaṃtuḍokkaḍē yuṃḍenani śrutulu ceppuṭacēta, ī sthūla jagattu aṃtayunu bhagavaṃtuni sthūlarūpamē ani ceppuṭacētanu bhagavaṃtuḍē yī jagattugā mārenu - atanu tappa yiṃkēdiyu lēdaniyu (bhagavaṃtuḍadvayuḍaniyu) ceppuṭacēta nī prapaṃcamaṃtayu bhagavaṃtuḍē - oka vittanamu dānilōnuṃḍi puṭṭina ceṭṭugānayinaṭlē, prapaṃcamulōni ē vastuvulōnainanu bhagavaṃtuni caitanyaśakti lēnidē aṃdulōnuṃḍi maṟiyoka vastuvu puṭṭadu. aṃducēta sṝṣṭikikāraṇamu āraṃbhamulōnu ippaṭivaraku prati vastuvu puṭṭuṭaku nikamuṃdu puṭṭuṭaku kūḍa bhagavaṃtuḍē kāraṇamu. idaṃtayu bhagavaṃtuni sṛṣṭiyē. prakṛti (matter) okkaṭi yī jagattulōni vastuvulugā tanaṃtaṭa tānē māruṭa asaṃbhavamu - bhagavaṃtuni caitanya śaktiyē - ā caitanya śaktilōnuṃḍu bhagavaṃtuḍē - sṛṣṭini cēyucunnāḍu - atanini atani caitanyaśaktiki bhēdamulēdu - vēru lēdu - caitanya śaktiyē bhagavaṃtuḍu, bhagavaṃtuḍē caitanya śakti. bhagavaṃtuniki avayavamulu lēkapōvuṭa cētanu, ellapuḍu okē rūpamutō (caitanyamātruḍugānē) uṃḍuvāḍaguṭacētanu, puṭṭuka lēnivāḍaguṭacētanu ataniki pariṇāmamulu lēvu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.