← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పాశములు pāśamulu

Original — తెలుగు
  1. చతుర్వింశతి తత్వాని మాయాకర్మగుణా ఇతి |

విషయా అపి కీర్త్యంతే పాశా ని బంధనాత్ |

తైర్బద్ధా శ్శివ భక్త్యెవ ముచ్యంతే సర్వదేహినః ||

(ఇరువదినాలుగు తత్వములు మాయవలన కలిగిన గుణములు. ఇవి విషయములని చెప్పబడుచున్నవి ఇవి జీవులను బంధించు చున్నవి గనుక పాశములని చెప్పబడుచున్నవి. ఈ పాశములచే కట్టబడిన వారు శివుని యందలి భక్తిచేతనే వాటినుండి ముక్తిని పొందుదురు).

  1. “పంచక్లేశైః ద్విపంచాశత్పాశైః బధ్నాతియః పశూన్ |

స ఏవ మోచకస్తేషాం భక్త్యా సమ్యగుపాసితః“.

(అవిద్య మొదలగు అయిదు క్లేశములచేత పశువులను బంధించు ఆ శివుడే - పశుపతియే - తనను భక్తితోఉపాసించు భక్తులకు ఆ పాశములనుండి విముక్తి కలిగించును).

  1. పాశ్యతే బద్ధ్యతే యేన సః పాశః - దేహేంద్రియాది సం యోగ వియోగ లక్షణం.

(బంధించునది పాశము. దేహమును ఇంద్రియములను కలుపుచు విడదీయుచు నుండు లక్షణములు గలది).

  1. పాశ్యంతే ఇతి పాశాః, తమో రూపాదయః -

(బంధించునవి పాశములు - తమోరూపము గలవి)

  1. పాశ్యతే బద్ధ్యతే స్వాజ్ఞే ఇతి పాశాః - స్వాతిరిక్తా స్తితా బుద్ధి వృత్తి రూపాః పాశాః.

(తన నిజరూపమును తెలియని అజ్ఞానమందు బంధించునది పాశము. పరమాత్మకాక యితరమున్న దని భావించుట పాశము).

  1. యేన ఇదం సర్వం పాశ్యతే బద్ధ్యతే ఇతి పాశః.

(ఈ జగత్తు అంతయు దేనిచేత బంధింపబడుచున్నదో అది పాశము).

  1. అణవమలం, మాయికమలం, కార్మికమలం ఇతి మలత్రయ రూపాః త్రయః పాశాః.

(అణవమలము, మాయికమలము, కార్మికకమలము, అను మూడు విధముల మలములు మూడు ఫాశములు).

  1. “ఘృణా, శంకా, స్పౄహా, లజ్జా, జుగుప్సా చేతి పంచమీ |

కులం శీలం తథా జాతిరష్టౌ పాశాః ప్రకీర్తితాః ||“.

(ఘృణా, శంక, స్పృహ, లజ్జ, జుగుప్స, కులము, శీలము, జాతి అను ఎనిమిది పాశములని చెప్పబడుచున్నది).

  1. అవిద్య, అస్మితా, రాగము, అభినివేశము అని అయిదు క్లేశములచేత బద్దులయి ఉండుటచేత అవియే పాశములు.

  2. జ్ఞాత్వా దేవం సర్వపాశాపహానిః, క్షీణైః క్లేశైః జన్మ మృత్యు ప్రహానిః.

(ఆత్మజ్ఞానము తెలిసిన తర్వాత సర్వపాశములు విడిపోవును - క్లేశములు క్షీణించిన జననమరణరూప మైన సంసారము నశించును).

  1. పాశము అనగా త్రాడు - కట్టివేయునది. విషయములతో కూడిన సంసారము జీవుని ఆకర్షించి త్రాడుతోకట్టివేసినట్లు బంధించును.
Transliteration
  1. caturviṃśati tatvāni māyākarmaguṇā iti |

viṣayā api kīrtyaṃtē pāśā ni baṃdhanāt |

tairbaddhā śśiva bhaktyeva mucyaṃtē sarvadēhinaḥ ||

(iruvadinālugu tatvamulu māyavalana kaligina guṇamulu. ivi viṣayamulani ceppabaḍucunnavi ivi jīvulanu baṃdhiṃcu cunnavi ganuka pāśamulani ceppabaḍucunnavi. ī pāśamulacē kaṭṭabaḍina vāru śivuni yaṃdali bhakticētanē vāṭinuṃḍi muktini poṃduduru).

  1. “paṃcaklēśaiḥ dvipaṃcāśatpāśaiḥ badhnātiyaḥ paśūn |

sa ēva mōcakastēṣāṃ bhaktyā samyagupāsitaḥ”.

(avidya modalagu ayidu klēśamulacēta paśuvulanu baṃdhiṃcu ā śivuḍē - paśupatiyē - tananu bhaktitōupāsiṃcu bhaktulaku ā pāśamulanuṃḍi vimukti kaligiṃcunu).

  1. pāśyatē baddhyatē yēna saḥ pāśaḥ - dēhēṃdriyādi saṃ yōga viyōga lakṣaṇaṃ.

(baṃdhiṃcunadi pāśamu. dēhamunu iṃdriyamulanu kalupucu viḍadīyucu nuṃḍu lakṣaṇamulu galadi).

  1. pāśyaṃtē iti pāśāḥ, tamō rūpādayaḥ -

(baṃdhiṃcunavi pāśamulu - tamōrūpamu galavi)

  1. pāśyatē baddhyatē svājñē iti pāśāḥ - svātiriktā stitā buddhi vṛtti rūpāḥ pāśāḥ.

(tana nijarūpamunu teliyani ajñānamaṃdu baṃdhiṃcunadi pāśamu. paramātmakāka yitaramunna dani bhāviṃcuṭa pāśamu).

  1. yēna idaṃ sarvaṃ pāśyatē baddhyatē iti pāśaḥ.

(ī jagattu aṃtayu dēnicēta baṃdhiṃpabaḍucunnadō adi pāśamu).

  1. aṇavamalaṃ, māyikamalaṃ, kārmikamalaṃ iti malatraya rūpāḥ trayaḥ pāśāḥ.

(aṇavamalamu, māyikamalamu, kārmikakamalamu, anu mūḍu vidhamula malamulu mūḍu phāśamulu).

  1. “ghṛṇā, śaṃkā, spṝhā, lajjā, jugupsā cēti paṃcamī |

kulaṃ śīlaṃ tathā jātiraṣṭau pāśāḥ prakīrtitāḥ ||“.

(ghṛṇā, śaṃka, spṛha, lajja, jugupsa, kulamu, śīlamu, jāti anu enimidi pāśamulani ceppabaḍucunnadi).

  1. avidya, asmitā, rāgamu, abhinivēśamu ani ayidu klēśamulacēta baddulayi uṃḍuṭacēta aviyē pāśamulu.

  2. jñātvā dēvaṃ sarvapāśāpahāniḥ, kṣīṇaiḥ klēśaiḥ janma mṛtyu prahāniḥ.

(ātmajñānamu telisina tarvāta sarvapāśamulu viḍipōvunu - klēśamulu kṣīṇiṃcina jananamaraṇarūpa maina saṃsāramu naśiṃcunu).

  1. pāśamu anagā trāḍu - kaṭṭivēyunadi. viṣayamulatō kūḍina saṃsāramu jīvuni ākarṣiṃci trāḍutōkaṭṭivēsinaṭlu baṃdhiṃcunu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.