“ఆ బ్రహ్మంబు (శబ్దబ్రహ్మంబు) ఈ నాభి పర్యంతంబు ఆ వాయువుచేత (మూలాధారస్థిత
పవనముచేత) అభివ్యజ్యమానంబై విమర్శ రూపంబైన మనంబుతోడం గూడి సామాన్యశ్యంద ప్రకాశ రూపిణియు,
కార్యబిందు తత్వాత్మకయు, నీశ్వరాధి దేవతయునై వశ్యంతీ వాక్కనంబడు”.
“మూలాధారగతాశక్తిః స్వాధారా బిందురూపిణీ |
తస్యాముత్ప ద్యతే నాదః సూక్ష్మ బీజాదివాంకురః |
తాం పశ్యంతీం విదుర్విశ్వం యయా పశ్యంతి యోగినః ||“.
- “పరావాగ్దేవతకు నాలుగు స్థానములు - పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అను సంజ్ఞలు కలవి. సకల
వ్యవహారమును ప్రధమమందు సహస్రార మధ్యవర్తియగు సాక్షిస్థానమందు స్ఫురణశక్తి కలుగుచున్నది. పిదప ఆ
క్రియ యే ఇంద్రియ సంబంధమైనదో ఆ ఇంద్రియము ప్రేరేపింపబడి ఆ యింద్రియముచే ఆ క్రియ జరుగును. గాన నొక
శబ్దముచ్చరించ దలచి నపుడు ముందు సహస్రారమందు ఇచ్చ జనించును. గాన అది పరావాక్కు స్థానము.
పిదప వాక్కునకు వాయువు ఆధారముగాన ఆ శబ్దోచ్చారణ యిచ్ఛ జనించిన వెంటనే అచటనుండి వ్యాపించియున్న
పరానాడీ ద్వారా ప్రేరణమయి మూలాధారమందు వాయువు ఉత్పన్నమగును. అది పశ్యంతీ స్థానము. ఆ వాయువు పరానాడీ
ద్వారా స్వాధిష్ఠాన మణి పూరములు దాటి అనాహతమను సంవిత్కమలమును పొందినపుడుమధ్యమ యనబడును -
అంతటినుండి విశుద్ధ కమలమును పొందినపుడు వైఖిరి అని తేజోమయమైన స్వష్టాక్షరములు కలిగి ఆ
శబ్దముచ్చరించ బడుచున్నవి. ఈ నాలుగు స్థానములలో సహస్రార గతమయిన
1. పరాస్థానమును,
2. మూలాధారగతమైన వాయూత్పత్తి రూప పశ్యంతీ స్థానమును,
3. సంవిత్కమలమును - పొందిన మధ్యమ అనియును –
ఈ మూడు స్థానములు తేజోమయములు “.
Transliteration
“ā brahmaṃbu (śabdabrahmaṃbu) ī nābhi paryaṃtaṃbu ā vāyuvucēta
(mūlādhārasthita pavanamucēta) abhivyajyamānaṃbai vimarśa rūpaṃbaina
manaṃbutōḍaṃ gūḍi sāmānyaśyaṃda prakāśa rūpiṇiyu, kāryabiṃdu
tatvātmakayu, nīśvarādhi dēvatayunai vaśyaṃtī vākkanaṃbaḍu”.
“mūlādhāragatāśaktiḥ svādhārā biṃdurūpiṇī |
tasyāmutpa dyatē nādaḥ sūkṣma bījādivāṃkuraḥ |
tāṃ paśyaṃtīṃ vidurviśvaṃ yayā paśyaṃti yōginaḥ ||“.
- “parāvāgdēvataku nālugu sthānamulu - parā, paśyaṃtī, madhyamā,
vaikharī anu saṃjñalu kalavi. sakala vyavahāramunu pradhamamaṃdu
sahasrāra madhyavartiyagu sākṣisthānamaṃdu sphuraṇaśakti kalugucunnadi.
pidapa ā kriya yē iṃdriya saṃbaṃdhamainadō ā iṃdriyamu prērēpiṃpabaḍi ā
yiṃdriyamucē ā kriya jarugunu. gāna noka śabdamuccariṃca dalaci napuḍu
muṃdu sahasrāramaṃdu icca janiṃcunu. gāna adi parāvākku sthānamu. pidapa
vākkunaku vāyuvu ādhāramugāna ā śabdōccāraṇa yiccha janiṃcina veṃṭanē
acaṭanuṃḍi vyāpiṃciyunna parānāḍī dvārā prēraṇamayi mūlādhāramaṃdu
vāyuvu utpannamagunu. adi paśyaṃtī sthānamu. ā vāyuvu parānāḍī dvārā
svādhiṣṭhāna maṇi pūramulu dāṭi anāhatamanu saṃvitkamalamunu
poṃdinapuḍumadhyama yanabaḍunu - aṃtaṭinuṃḍi viśuddha kamalamunu
poṃdinapuḍu vaikhiri ani tējōmayamaina svaṣṭākṣaramulu kaligi ā
śabdamuccariṃca baḍucunnavi. ī nālugu sthānamulalō sahasrāra
gatamayina
1. parāsthānamunu,
2. mūlādhāragatamaina vāyūtpatti rūpa paśyaṃtī sthānamunu,
3. saṃvitkamalamunu - poṃdina madhyama aniyunu –
ī mūḍu sthānamulu tējōmayamulu “.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.