మిడు దీపమును మ్రింగబోయి దానిపై బడి మరణించు న్యాయము).
“యథా ప్రదీప్తం జ్వలనం పతం గాః విశంతి నాశాయ సమృద్ధవేగాః |
తధైవ నాశాయ విశంతిలోకాస్తవాపి వక్త్రాణి సమృద్ధ వేదాః ||” (శ్రీమద్భగవద్గీత - 11 - 28)
(బాగా ప్రజ్వలించుచున్న మంటయందు మిడతలు దానిని ఆహారమనుకొని దానిమీద పడి తొందర తొందరగా చనిపోవునట్లు ఈ ప్రజలందరూ - లోకులు - భగవంతుడవైన నీ నోటిలో తొందరతొందరగా వాటి నాశముకొఱకు ప్రవేశించుచున్నారు - ఇట్లు వినాశము నొందుటకు తమవశమును మించిన శక్తిచే ప్రేరేపించబడినవారై ప్రాణులు నాశము నొందుచున్నారు. ఇట్లే ఎక్కడెక్కడపారుచున్న నదులైనను వేగ వేగముగా ప్రవహించి సముద్రములో కలిసి దానిలో నామరూపములు లేనివై లీనమగుచున్నవి.శక్తియే - లేనివై లీనమగుచున్నవి. ఇట్లు ఆ నదులు ప్రవహించుటకు కారణము మానవాతీతశక్తియే - ఆకర్షణ - శక్తియే - భగవంతుడు ఇట్టి అకర్షణశక్తిగలవాడు, కనుకనే సంకర్షణుడు - ‘సం కర్షతి సమ్యక్ కర్షతి’ అని చెప్పబడుచున్నాడు). బుద్ధిపూర్వకముగా నశించుటకు మిడతలు ఉదాహరణము, అవశమై - చేయునది లేక - ప్రకృతి విధానము (natural law - gradient) ను అనుసరించి సముద్రములో లీనమగుటకు నదులు ఉదాహరణము. (water finds its level - నీరు పల్లమెరుగు).
miḍu dīpamunu mriṃgabōyi dānipai baḍi maraṇiṃcu nyāyamu).
“yathā pradīptaṃ jvalanaṃ pataṃ gāḥ viśaṃti nāśāya samṛddhavēgāḥ |
tadhaiva nāśāya viśaṃtilōkāstavāpi vaktrāṇi samṛddha vēdāḥ ||” (śrīmadbhagavadgīta - 11 - 28)
(bāgā prajvaliṃcucunna maṃṭayaṃdu miḍatalu dānini āhāramanukoni dānimīda paḍi toṃdara toṃdaragā canipōvunaṭlu ī prajalaṃdarū - lōkulu - bhagavaṃtuḍavaina nī nōṭilō toṃdaratoṃdaragā vāṭi nāśamukoṟaku pravēśiṃcucunnāru - iṭlu vināśamu noṃduṭaku tamavaśamunu miṃcina śakticē prērēpiṃcabaḍinavārai prāṇulu nāśamu noṃducunnāru. iṭlē ekkaḍekkaḍapārucunna nadulainanu vēga vēgamugā pravahiṃci samudramulō kalisi dānilō nāmarūpamulu lēnivai līnamagucunnavi.śaktiyē - lēnivai līnamagucunnavi. iṭlu ā nadulu pravahiṃcuṭaku kāraṇamu mānavātītaśaktiyē - ākarṣaṇa - śaktiyē - bhagavaṃtuḍu iṭṭi akarṣaṇaśaktigalavāḍu, kanukanē saṃkarṣaṇuḍu - ‘saṃ karṣati samyak karṣati’ ani ceppabaḍucunnāḍu). buddhipūrvakamugā naśiṃcuṭaku miḍatalu udāharaṇamu, avaśamai - cēyunadi lēka - prakṛti vidhānamu (natural law - gradient) nu anusariṃci samudramulō līnamaguṭaku nadulu udāharaṇamu. (water finds its level - nīru pallamerugu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.