← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పతితుడు patituḍu

Original — తెలుగు
  1. పడినవాడు; పదవి చెడినవాడు; పాపాత్ముడు; భ్రష్టుడు.

  2. “చిత్తశుద్ధిమృతే త్యాగం యః కరోతి స్వకర్మణాం |

స ఈ శాజ్ఞ పరిత్యాగీ పతత్వేవస సం శ యః |

శ్రుతి స్మృతీమ మైవాజ్ఞే యస్తు ఉల్లఘ్య వర్తతే |

ఆజ్ఞా భంగీ మమద్వేషీ మద్భక్తోపి న వైష్ణవః||” (గీతాభావ ప్రకాశము - 5 - 66, 67)

(చిత్తశుద్ధి లేక ఎవడు సమస్తమైన కర్మలను వదలివేయునో - కర్మ సన్యాసము చేయునో - అతను భగవంతునియొక్క ఆజ్ఞోల్లంఘనము చేసినవాడు. అందుచేత పతితుడగును. ఎందుచేతననగా -శ్రుతి స్మృతి - ఈ రెండునూ భగవంతుని ఆజ్ఞను తెలుపునవి. వీటిని ఉల్లంఘించి ప్రవర్తించువాడు నా భక్తుడైనను నన్ను ద్వేషించువాడే, వైష్ణవుడుకాడు).

  1. “అకుర్వన్విహితం కర్మ నిందితం చ సమాచరన్ |

ప్రసజ్ఞం శ్చేంద్రియార్థేషు నరః పతనమృచ్ఛతి ||” (మనుః)

(శ్రుతి స్మృతులలో విహితమైన సంధ్యావందనాది కర్మల నాచరింపక, నిషిద్ధకర్మలైన సురాపానాదికర్మల నాచరించుచు శబ్దాది విషయములం దత్యంతాసక్తుడై ప్రవర్తించు మనుష్యుడు పతితుడగును).

  1. యో మనుష్యో జ్ఞాత్వా బుద్ధ్యా శాస్త్రాణాం ఆజ్ఞాయాః పాలనమకృత్వా శాస్త్ర ప్రతికూల మ మర్యాదితం కార్యం కరోతి తథా తత్ప్రేమేతి వ్యప దిశ్య దోషముక్తో భవితు మిచ్ఛతి, సో అవస్యమేవపతతి. భగవతా స్వయముక్తం –

“యః శాస్త్ర విధముత్సృజ్య వర్తతే కామ కారతః |

న స సిద్ధియవాప్నోతి న సుఖం నపరాం గతిం ||” (శ్రీమద్భగవద్గీత - - - )

“యో మనుష్యః శాస్త్ర విధిం త్యక్త్వా యధేచ్ఛామా భరతి, స నసిద్ధిం ప్రాప్నోతి, న పరాంగతిం లబహతేలభతే, నాపిచ తేన సుఖమేవ ప్రాప్యతే ||”

(శాస్త్రములో చెప్పిన విధిని తెలిసియు వాటిని పాలించక, శాస్త్రములో చెప్పిన దానికి విరుద్ధముగాఎవడు కర్మలు చేయునో, భక్తుడనని చెప్పుకొనునో అట్టివాడు తప్పక భ్రష్టుడగును. ఈ విషయముశ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు - ” ఎవడు శాస్త్రములో విధించినవి మానితన ఇష్టానుసారము ప్రవర్తించునో అట్టివాడు సిద్ధిని పొందడు, ఈ లోకములో సుఖమును పొందడు,పరమపదమును పొందడు).

Transliteration
  1. paḍinavāḍu; padavi ceḍinavāḍu; pāpātmuḍu; bhraṣṭuḍu.

  2. “cittaśuddhimṛtē tyāgaṃ yaḥ karōti svakarmaṇāṃ |

sa ī śājña parityāgī patatvēvasa saṃ śa yaḥ |

śruti smṛtīma maivājñē yastu ullaghya vartatē |

ājñā bhaṃgī mamadvēṣī madbhaktōpi na vaiṣṇavaḥ||” (gītābhāva prakāśamu - 5 - 66, 67)

(cittaśuddhi lēka evaḍu samastamaina karmalanu vadalivēyunō - karma sanyāsamu cēyunō - atanu bhagavaṃtuniyokka ājñōllaṃghanamu cēsinavāḍu. aṃducēta patituḍagunu. eṃducētananagā -śruti smṛti - ī reṃḍunū bhagavaṃtuni ājñanu telupunavi. vīṭini ullaṃghiṃci pravartiṃcuvāḍu nā bhaktuḍainanu nannu dvēṣiṃcuvāḍē, vaiṣṇavuḍukāḍu).

  1. “akurvanvihitaṃ karma niṃditaṃ ca samācaran |

prasajñaṃ ścēṃdriyārthēṣu naraḥ patanamṛcchati ||” (manuḥ)

(śruti smṛtulalō vihitamaina saṃdhyāvaṃdanādi karmala nācariṃpaka, niṣiddhakarmalaina surāpānādikarmala nācariṃcucu śabdādi viṣayamulaṃ datyaṃtāsaktuḍai pravartiṃcu manuṣyuḍu patituḍagunu).

  1. yō manuṣyō jñātvā buddhyā śāstrāṇāṃ ājñāyāḥ pālanamakṛtvā śāstra pratikūla ma maryāditaṃ kāryaṃ karōti tathā tatprēmēti vyapa diśya dōṣamuktō bhavitu micchati, sō avasyamēvapatati. bhagavatā svayamuktaṃ –

“yaḥ śāstra vidhamutsṛjya vartatē kāma kārataḥ |

na sa siddhiyavāpnōti na sukhaṃ naparāṃ gatiṃ ||” (śrīmadbhagavadgīta - - - )

“yō manuṣyaḥ śāstra vidhiṃ tyaktvā yadhēcchāmā bharati, sa nasiddhiṃ prāpnōti, na parāṃgatiṃ labahatēlabhatē, nāpica tēna sukhamēva prāpyatē ||”

(śāstramulō ceppina vidhini telisiyu vāṭini pāliṃcaka, śāstramulō ceppina dāniki viruddhamugāevaḍu karmalu cēyunō, bhaktuḍanani ceppukonunō aṭṭivāḍu tappaka bhraṣṭuḍagunu. ī viṣayamuśrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu - ” evaḍu śāstramulō vidhiṃcinavi mānitana iṣṭānusāramu pravartiṃcunō aṭṭivāḍu siddhini poṃdaḍu, ī lōkamulō sukhamunu poṃdaḍu,paramapadamunu poṃdaḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.