← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పౌరుషం pauruṣaṃ

Original — తెలుగు
  1. పురుషస్య కర్మ పౌరుషం పురుషకారః, ఉద్యోగం -

(పురుషుడు చేసిన పని పౌరుషము; పురుషకారము; ఉద్యోగము, పురుష ప్రయత్నము, వ్యాపారము).

  1. “పురుషకారం -” శక్నోమి ఇదం కర్మ సమాపయితుం “ఇత్యేవం ఆత్మ సామర్థ్యం” (శ్రీశంకరః)

(పురుషకారము - ఈ పనిని నేను పూర్తిగా చేయగలను, చేయుశక్తి గలవాడను - అని తెలుపునట్టి ఆత్మయొక్క సామర్థ్యము).

  1. పురుష సంబంధి క్రియా శక్తిరూపం. (పురుషునియొక్క క్రియా శక్తిరూపము).

  2. పురుషః వైరాజః తత్కృతః పౌరుషః.

(పురుషుడు - అనగావిరాట్పురుషుడు - అనేకవిధములుగా ప్రకాశించువాడు - అతనుచేసినది పౌరుషము).

  1. పురుషరూపేణ భగవతాకృతం. (పురుషరూపముతో భగవంతుడు చేసిన పని).

  2. పరమ పురుష సంబంధినం, ప్రభావం; పురుషస్య ఈశ్వరస్య ప్రభావం విక్రమం కాలం.

(పరమ పురుషునికి సంబంధించినది; అతని ప్రభావము. ఈశ్వరుని విక్రమము, పరాక్రమము, కాలము).

  1. భగవదీయం. (భగవతునికి సంబంధించినది).

  2. ఉద్యమః (ఉద్యమము; ప్రయత్నము).

  3. పరమ పురుషత్వ సూచకం. (పరమ పురుషుని శక్తిని సూచించునది).

  4. పురుషస్య భావః, యతః పురుష బుద్ధిః ఇత్యేకే; సంతాన పరంపరా హేతు భూతం, రేతః ఇత్యపరే; యద్వా పౌరుషం సామర్థ్యం కర్తృత్వ శక్తిః ఇత్యర్థః - తధైవ హి కర్తురాత్మనః కారకాంతరేభ్యః ప్రాధాన్యం; యద్వా, పౌరుషం పుంస్త్వం స్త్రీనపుంసక వ్యావృత్తః, సత్వాది స్వభావ విశేషః “.

(పురుషుని భావము పౌరుషము. అనగా పురుషుని బుద్ధి యని యొకరి అభిప్రాయము. సంతానము పరంపరగా - ఒకరినుండి ఇంకొకరు - కలుగుటకు కారణమైన రేతస్సు అని మఱియొకరు, లేకసామర్థ్యము - అనగా కర్తృత్వశక్తి - అనగా - పనులను చేయుటలో కావలసిన శక్తి; లేక, పౌరుషమనగా పుంస్త్వము - స్త్రీత్వము నపున్సకత్వము కానిది; సత్త్వము మొదలగు స్వభావ విశేషము కలిగియుండుట).

  1. “కొందఱు పురుష శబ్దవాచ్యుండైన ఈశ్వరుని పౌరుషంబు గాలశబ్దంబున జెప్పంబడునందురు -”;

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - )

  1. “రసోహమప్సు కౌంతేయ - - - పౌరుషం నృషు”. (శ్రీమద్భగవద్గీత - 7 - 8)

(నరులలోని పౌరుషము - పురుష శక్తి సామర్థ్యములు - పురుషత్వము నేనే (భగవంతుడే), నరులకు శక్తి సామర్థ్యములు వారిలో భగవంతుడుండి వారికి తన చిచ్ఛక్తి - చైతన్య శక్తి - నిచ్చుటవలననే కలుగుచున్నవి).

(“సర్వమేవహి సదా సంసారే రఘునందన |

సమ్యక్ ప్రయత్నాత్సర్వేణ పౌరుషా త్సమ వాప్యతే ||“.

(ఈ సంసారమందు అన్నియు ఎల్లపుడు మంచి ప్రయత్నమువలననే పొంద బడుచున్నవి).

Transliteration
  1. puruṣasya karma pauruṣaṃ puruṣakāraḥ, udyōgaṃ -

(puruṣuḍu cēsina pani pauruṣamu; puruṣakāramu; udyōgamu, puruṣa prayatnamu, vyāpāramu).

  1. “puruṣakāraṃ -” śaknōmi idaṃ karma samāpayituṃ “ityēvaṃ ātma sāmarthyaṃ” (śrīśaṃkaraḥ)

(puruṣakāramu - ī panini nēnu pūrtigā cēyagalanu, cēyuśakti galavāḍanu - ani telupunaṭṭi ātmayokka sāmarthyamu).

  1. puruṣa saṃbaṃdhi kriyā śaktirūpaṃ. (puruṣuniyokka kriyā śaktirūpamu).

  2. puruṣaḥ vairājaḥ tatkṛtaḥ pauruṣaḥ.

(puruṣuḍu - anagāvirāṭpuruṣuḍu - anēkavidhamulugā prakāśiṃcuvāḍu - atanucēsinadi pauruṣamu).

  1. puruṣarūpēṇa bhagavatākṛtaṃ. (puruṣarūpamutō bhagavaṃtuḍu cēsina pani).

  2. parama puruṣa saṃbaṃdhinaṃ, prabhāvaṃ; puruṣasya īśvarasya prabhāvaṃ vikramaṃ kālaṃ.

(parama puruṣuniki saṃbaṃdhiṃcinadi; atani prabhāvamu. īśvaruni vikramamu, parākramamu, kālamu).

  1. bhagavadīyaṃ. (bhagavatuniki saṃbaṃdhiṃcinadi).

  2. udyamaḥ (udyamamu; prayatnamu).

  3. parama puruṣatva sūcakaṃ. (parama puruṣuni śaktini sūciṃcunadi).

  4. puruṣasya bhāvaḥ, yataḥ puruṣa buddhiḥ ityēkē; saṃtāna paraṃparā hētu bhūtaṃ, rētaḥ ityaparē; yadvā pauruṣaṃ sāmarthyaṃ kartṛtva śaktiḥ ityarthaḥ - tadhaiva hi karturātmanaḥ kārakāṃtarēbhyaḥ prādhānyaṃ; yadvā, pauruṣaṃ puṃstvaṃ strīnapuṃsaka vyāvṛttaḥ, satvādi svabhāva viśēṣaḥ “.

(puruṣuni bhāvamu pauruṣamu. anagā puruṣuni buddhi yani yokari abhiprāyamu. saṃtānamu paraṃparagā - okarinuṃḍi iṃkokaru - kaluguṭaku kāraṇamaina rētassu ani maṟiyokaru, lēkasāmarthyamu - anagā kartṛtvaśakti - anagā - panulanu cēyuṭalō kāvalasina śakti; lēka, pauruṣamanagā puṃstvamu - strītvamu napunsakatvamu kānidi; sattvamu modalagu svabhāva viśēṣamu kaligiyuṃḍuṭa).

  1. “koṃdaṟu puruṣa śabdavācyuṃḍaina īśvaruni pauruṣaṃbu gālaśabdaṃbuna jeppaṃbaḍunaṃduru -”;

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - )

  1. “rasōhamapsu kauṃtēya - - - pauruṣaṃ nṛṣu”. (śrīmadbhagavadgīta - 7 - 8)

(narulalōni pauruṣamu - puruṣa śakti sāmarthyamulu - puruṣatvamu nēnē (bhagavaṃtuḍē), narulaku śakti sāmarthyamulu vārilō bhagavaṃtuḍuṃḍi vāriki tana cicchakti - caitanya śakti - niccuṭavalananē kalugucunnavi).

(“sarvamēvahi sadā saṃsārē raghunaṃdana |

samyak prayatnātsarvēṇa pauruṣā tsama vāpyatē ||“.

(ī saṃsāramaṃdu anniyu ellapuḍu maṃci prayatnamuvalananē poṃda baḍucunnavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.