← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పావనం pāvanaṃ

Original — తెలుగు
  1. “పావ యతీతి పావనః” - (శ్రీశంకరః)

(పవిత్రతను కలుగచేయువాడు, కలుగచేయునది).

  1. విశుద్ధి కరాణి, పాపక్షయ కరాణి; ప్రాచీన కర్మ వినాశనాని.

(పవిత్రతను - చిత్తశుద్ధిని - కలుగచేయునది; పాపము క్షీణించునట్లు చేయునవి, పూర్వ జన్మలలో చేసిన కర్మలను ఫలము నీయకుండునట్లు చేయునవి).

  1. “స్మృతి మాత్రేణ పునాతి ఇతి పావనః” (శ్రీశంకరః)

(తలచినంత మాత్రమున పావనము చేయువాడు - పాపములను పోగొట్టువాడు - భగవంతుడు)

  1. “యజ్ఞో దానః తపశ్చైవ పావనాని మనీషిణాం ||” (శ్రీమద్భగవద్గీత - 15 - 5)

(యజ్ఞము, దానము, తపస్సు - ఇవి బుద్ధిమంతులను పావనము చేయునవి).

  1. స్వసంబంధా దస్యే పా మపి శుద్ధి హేతుః -

(తనతో సంబంధమాత్రమున ఇతరులను శుద్ధి చేయుటకు (పావనముగా చేయుటకు) కారణమైనది).

  1. “నరేంద్రా స్సత్రిణా గంగా సూర్యా చంద్ర మసౌ శిఖీ |

దృష్టమాత్రాం పునంత్యేతే, కిం పునః పరిసేవితాః ||“. (మనుః)

(రాజు, గంగ, సూర్యుడు, చంద్రుడు, అగ్ని - ఇవి చూచినమాత్రము పావనము చేయునవి - అట్టి యెడ వాటిని సేవించిన ఫలము చెప్పనక్కరలేదు).

  1. “ఉదకమయంబులైన తీర్థంబులును, మృచ్ఛిలామయంబులైన దేవగణంబులును తీర్థ దేవతా రూపములుగాకుండుట లేదు. ఐననవి చిరకాల సేవార్చనలంగాని పావనంబులు సేయవు. సత్పురుషులు దర్శనమాత్రంబునం బావనంబు సేయుదురు.”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా.- 1120)

  1. “సీ. ఆదిత్య చంద్రాగ్ని మేదినీ తారాంబు మారుతాకాశవాఙ్మనములోకి

పరికింప దత్తదుపాసనంబుల బునీతములు సేయగ సమర్థములు గావు

సకలార్థ గోచర జ్ఞానంబుగల మహాత్మకులు దారు ముహూర్తాత్రసేవ

జేసి పావనములు సేయుదురు - - - ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1121)

  1. “మ. పర తత్వజ్ఞులు, శాంత చిత్తులు, తపః పారీణులుద్య ద్ఘనుల్

బురుష శ్రేష్టులు వచ్చి, తల్లి, భవదంభోగానాముల్ సేయగా

నరసం ఘాఘము నిన్ను బొందెనె? జగన్నాధుండు నానాఘ సం

హారుడా విష్ణుడు వారి చిత్తముల దానైయుంట, మందాకినీ“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 -)

  1. “సీ. క్షాళితాఖిల కల్మష వ్రజా మర నదీ జనక కోమల పగాబ్జముల వాని - - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - 231)

  2. “- - గౌతమపత్ని శాపదళన శ్రీపాదరేణుంశుభం” (శ్రీరామకర్ణామృతం - 3 - 42)

  3. పావనము చేయునది, జలము, గోమయము, రుద్రాక్షము, ప్రాయశ్చిత్తము).

  4. “క. కులహీనుడు నారాయణ

విలసత్కథనములు గడక వినిపించిన ద

త్కులహీనత బాసి మహో

జ్వల కులజత్వమును బొందు, సన్మునులారా” (శ్రీమదాంధ్రమహాభాగవతము -1 - 18 - 413)

Transliteration
  1. “pāva yatīti pāvanaḥ” - (śrīśaṃkaraḥ)

(pavitratanu kalugacēyuvāḍu, kalugacēyunadi).

  1. viśuddhi karāṇi, pāpakṣaya karāṇi; prācīna karma vināśanāni.

(pavitratanu - cittaśuddhini - kalugacēyunadi; pāpamu kṣīṇiṃcunaṭlu cēyunavi, pūrva janmalalō cēsina karmalanu phalamu nīyakuṃḍunaṭlu cēyunavi).

  1. “smṛti mātrēṇa punāti iti pāvanaḥ” (śrīśaṃkaraḥ)

(talacinaṃta mātramuna pāvanamu cēyuvāḍu - pāpamulanu pōgoṭṭuvāḍu - bhagavaṃtuḍu)

  1. “yajñō dānaḥ tapaścaiva pāvanāni manīṣiṇāṃ ||” (śrīmadbhagavadgīta - 15 - 5)

(yajñamu, dānamu, tapassu - ivi buddhimaṃtulanu pāvanamu cēyunavi).

  1. svasaṃbaṃdhā dasyē pā mapi śuddhi hētuḥ -

(tanatō saṃbaṃdhamātramuna itarulanu śuddhi cēyuṭaku (pāvanamugā cēyuṭaku) kāraṇamainadi).

  1. “narēṃdrā ssatriṇā gaṃgā sūryā caṃdra masau śikhī |

dṛṣṭamātrāṃ punaṃtyētē, kiṃ punaḥ parisēvitāḥ ||“. (manuḥ)

(rāju, gaṃga, sūryuḍu, caṃdruḍu, agni - ivi cūcinamātramu pāvanamu cēyunavi - aṭṭi yeḍa vāṭini sēviṃcina phalamu ceppanakkaralēdu).

  1. “udakamayaṃbulaina tīrthaṃbulunu, mṛcchilāmayaṃbulaina dēvagaṇaṃbulunu tīrtha dēvatā rūpamulugākuṃḍuṭa lēdu. ainanavi cirakāla sēvārcanalaṃgāni pāvanaṃbulu sēyavu. satpuruṣulu darśanamātraṃbunaṃ bāvanaṃbu sēyuduru.”

(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā.- 1120)

  1. “sī. āditya caṃdrāgni mēdinī tārāṃbu mārutākāśavāṅmanamulōki

parikiṃpa dattadupāsanaṃbula bunītamulu sēyaga samarthamulu gāvu

sakalārtha gōcara jñānaṃbugala mahātmakulu dāru muhūrtātrasēva

jēsi pāvanamulu sēyuduru - - - ” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1121)

  1. “ma. para tatvajñulu, śāṃta cittulu, tapaḥ pārīṇuludya dghanul

buruṣa śrēṣṭulu vacci, talli, bhavadaṃbhōgānāmul sēyagā

narasaṃ ghāghamu ninnu boṃdene? jagannādhuṃḍu nānāgha saṃ

hāruḍā viṣṇuḍu vāri cittamula dānaiyuṃṭa, maṃdākinī”. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 -)

  1. “sī. kṣāḷitākhila kalmaṣa vrajā mara nadī janaka kōmala pagābjamula vāni - - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - 231)

  2. “- - gautamapatni śāpadaḷana śrīpādarēṇuṃśubhaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 42)

  3. pāvanamu cēyunadi, jalamu, gōmayamu, rudrākṣamu, prāyaścittamu).

  4. “ka. kulahīnuḍu nārāyaṇa

vilasatkathanamulu gaḍaka vinipiṃcina da

tkulahīnata bāsi mahō

jvala kulajatvamunu boṃdu, sanmunulārā” (śrīmadāṃdhramahābhāgavatamu -1 - 18 - 413)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.