“ప్రజాపతిస్త్వం ప్రపితా మహశ్చ” (శ్రీమద్భగవద్గీత - 11 - 29)
(ప్రజాపతివి, ప్రపితామహుడు నీవే).
(ఈశ్వరుడు - శాసించువాడు - అగుటవలన సమస్త ప్రజలకు పతి, ప్రభువు అయినవాడు).
(హిరణ్యగర్భుడు; చతుర్ముఖబ్రహ్మ, సమస్త ప్రజలను సృష్టించువాడు).
(విరాట్ స్వరూపుడు - అనేక విధములుగా నుండువాడు - అనేక రూపములతో రాజిల్లువాడు - మూడు లోకములు - స్వర్గ, మర్త్య, పాతాళములు, తనరూపమైన వాడు). (తన శరీరమైనవాడు).
(ఎవని ముఖము మొదలగువానిని భేదించుకొని అగ్ని మొదలగు లోకపాలకులు పుట్టిరో, అతను ప్రజాపతి).
నిరుపాధికః ప్రజాపతిశబ్దః సర్వేశ్వరం విశ్వస్య స్రష్టారం “విశ్వాత్మానం పరాయణం” - నారాయణం ఆహా -
(శ్రుతిలో - మంత్రపుష్పములో - ‘విశ్వమునకు పతి అయినవాడు’, “విశ్వమునకు ఆత్మ అయినవాడు, పరమప్రాప్యస్థానమైనవాడు” అని నారాయణుని గుఱించియే చెప్పబడినది. అందుచేత ప్రజాపతి యనగా విశ్వపతియైన పరబ్రహ్మయే).
(కర్మ జ్ఞానములను అధికరించియుండుటవలన ప్రజాపతి యొక్క రేతస్సు వలన సృష్టియగుచున్నది యని చెప్పబడుచున్నది. అది యెట్లనగా - భూతములు మొదలగు ప్రజలపతి యొక్క (ప్రజాపతి యొక్క) రేతస్సు (కార్యము) వాక్కు మొదలగు వాటి అభిమాన దేవతలగు - అగ్ని మొదలగు దేవతలు - ఇవి ప్రజాపతివలన కలిగినవి (పుట్టినవి). దేవతుల రేతస్సు (కార్యము) వర్షము; వర్షము యొక్క రేతస్సు (కార్యము) వ్రీహి మొదలగు ఓషధులు; ఓషధుల రేతస్సు అందఱికీ తెలిసినదగు అన్నము - పురుషుడు తినిని అన్నము యొక్క రేతస్సు నరబీజము, ఈ బీజము స్త్రీ యోనియందుంచిన కలుగు రేతస్సు ప్రజలు - ఈ క్రమముగా ప్రజలను సృష్టి చేయుటవలన పురుషుడు ప్రజాపతి యని చెప్పబడినాడు - (పురుషుడనగా పరబ్రహ్మయే).
(బ్రహ్మ విష్ణు మహేశ్వరులగు త్రిమూర్తులు నీవే; ప్రజాపతివి నీవే).
“prajāpatistvaṃ prapitā mahaśca” (śrīmadbhagavadgīta - 11 - 29)
(prajāpativi, prapitāmahuḍu nīvē).
(īśvaruḍu - śāsiṃcuvāḍu - aguṭavalana samasta prajalaku pati, prabhuvu ayinavāḍu).
(hiraṇyagarbhuḍu; caturmukhabrahma, samasta prajalanu sṛṣṭiṃcuvāḍu).
(virāṭ svarūpuḍu - anēka vidhamulugā nuṃḍuvāḍu - anēka rūpamulatō rājilluvāḍu - mūḍu lōkamulu - svarga, martya, pātāḷamulu, tanarūpamaina vāḍu). (tana śarīramainavāḍu).
(evani mukhamu modalaguvānini bhēdiṃcukoni agni modalagu lōkapālakulu puṭṭirō, atanu prajāpati).
nirupādhikaḥ prajāpatiśabdaḥ sarvēśvaraṃ viśvasya sraṣṭāraṃ “viśvātmānaṃ parāyaṇaṃ” - nārāyaṇaṃ āhā -
(śrutilō - maṃtrapuṣpamulō - ‘viśvamunaku pati ayinavāḍu’, “viśvamunaku ātma ayinavāḍu, paramaprāpyasthānamainavāḍu” ani nārāyaṇuni guṟiṃciyē ceppabaḍinadi. aṃducēta prajāpati yanagā viśvapatiyaina parabrahmayē).
(karma jñānamulanu adhikariṃciyuṃḍuṭavalana prajāpati yokka rētassu valana sṛṣṭiyagucunnadi yani ceppabaḍucunnadi. adi yeṭlanagā - bhūtamulu modalagu prajalapati yokka (prajāpati yokka) rētassu (kāryamu) vākku modalagu vāṭi abhimāna dēvatalagu - agni modalagu dēvatalu - ivi prajāpativalana kaliginavi (puṭṭinavi). dēvatula rētassu (kāryamu) varṣamu; varṣamu yokka rētassu (kāryamu) vrīhi modalagu ōṣadhulu; ōṣadhula rētassu aṃdaṟikī telisinadagu annamu - puruṣuḍu tinini annamu yokka rētassu narabījamu, ī bījamu strī yōniyaṃduṃcina kalugu rētassu prajalu - ī kramamugā prajalanu sṛṣṭi cēyuṭavalana puruṣuḍu prajāpati yani ceppabaḍināḍu - (puruṣuḍanagā parabrahmayē).
(brahma viṣṇu mahēśvarulagu trimūrtulu nīvē; prajāpativi nīvē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.