← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రజ్ఞానం బ్రహ్మ prajñānaṃ brahma

Original — తెలుగు
  1. “యేనేక్షితే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతిచ |

స్వాద్వస్వాదు విజానాతి తత్ప్రజ్ఞానముదీరితం ||“.

(ప్రజ్ఞానమే బ్రహ్మ స్వరూపము - ఏ వస్తువుచేత సకలమును చూడబడు చున్నదో, దేనిచే వినబడుచున్నదో, దేనిచే ఆఘ్రాణించబడుచున్నదోఈ, దేనిచే వాక్కు ఉచ్ఛరింపబడుచున్నదో స్వాద్వస్వాదములు తెలియబడు చున్నవో ఆ వస్తువు ప్రజ్ఞానమని చెప్పబడుచున్నది).

  1. “చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వ గజాదిషు |

చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మ మయ్యపి ||“.

(బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతులందును, మనుష్యులు, ఏనుగులు, గుఱ్ఱములు మొదలగు వాటియందును, చైతన్య స్వరూపమైన బ్రహ్మ వస్తువు ఒకటే - ఒకే స్వరూపములో నున్నది. ఇందుచేత ఉత్తమరూపులగు బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలందును, మధ్యమరూపములగు మానవులందును, అధమరూపములగు ఏనుగు, గుఱ్ఱములందును, ఆకాశాదిభూతములందును గల చైతన్యము, జగత్తునకు సుష్టిస్థితి లయములకు కారణమైన చైతన్యము ఏదిగలదో అదియే పరబ్రహ్మ స్వరూపము - అని ఈ వాక్యార్థము).

Transliteration
  1. “yēnēkṣitē śṛṇōtīdaṃ jighrati vyākarōtica |

svādvasvādu vijānāti tatprajñānamudīritaṃ ||“.

(prajñānamē brahma svarūpamu - ē vastuvucēta sakalamunu cūḍabaḍu cunnadō, dēnicē vinabaḍucunnadō, dēnicē āghrāṇiṃcabaḍucunnadōī, dēnicē vākku ucchariṃpabaḍucunnadō svādvasvādamulu teliyabaḍu cunnavō ā vastuvu prajñānamani ceppabaḍucunnadi).

  1. “caturmukhēṃdra dēvēṣu manuṣyāśva gajādiṣu |

caitanyamēkaṃ brahmātaḥ prajñānaṃ brahma mayyapi ||“.

(brahma, iṃdruḍu modalagu dēvatulaṃdunu, manuṣyulu, ēnugulu, guṟṟamulu modalagu vāṭiyaṃdunu, caitanya svarūpamaina brahma vastuvu okaṭē - okē svarūpamulō nunnadi. iṃducēta uttamarūpulagu brahma, iṃdruḍu modalagu dēvatalaṃdunu, madhyamarūpamulagu mānavulaṃdunu, adhamarūpamulagu ēnugu, guṟṟamulaṃdunu, ākāśādibhūtamulaṃdunu gala caitanyamu, jagattunaku suṣṭisthiti layamulaku kāraṇamaina caitanyamu ēdigaladō adiyē parabrahma svarūpamu - ani ī vākyārthamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.