“ప్రణవరూపం అక్షరం బ్రఘ్మస్వరూపమేవ తాదృశప్రణవ స్వరూపః బ్రహ్మ అహమేవ ఇతి నైరంతర్యేణ అనవరతం ధ్యాయేత్. అత్ర అధికారీ సన్యాసీ ఏవ. ఉపనిషత్సు ప్రణవోపాసనం ద్విధావర్ణితం - పరబ్రహ్మ రూపేణ ప్రణవస్యోపాసనం అపరబ్రహ్మరూపేణ ప్రణవస్యోపాసనం ఇతి నిర్గుణం బ్రహ్మ పరబ్రహ్మ ఇత్యుచ్యతే. సగుణం బ్రహ్మ అపరం బ్రహ్మ ఇతి కీర్త్యతే”.
కారణ కార్యరూపం సర్వం వస్తు ఓంకారస్వరూపమేవ అతః సర్వోపి రూప ప్రపంచః ఓంకార ఏవ. సర్వేషు అపి పదార్థేషు నామరూపం చ ఇత్యంశద్వయమస్తి. తత్ర రూపాత్మకో అంశః. తత్తన్నామాత్మకాం శాత్ న అతిరిచ్యతే. కింతు నామ స్వరూపమేవ రూపాం శోపి. తథాహి పదార్థానాం రూపాత్మకోయః ఆకార విశేషః తదభిదాయకనామ పదైరేవ సర్వే పదార్థాః నిరూపితాః సంతో గృహ్యంతే, త్యజంతే వా. తత్తదభిదాన జ్ఞానమంతరా కేవలా కార్యమాత్రేణ వ్యవహారోన సిద్ధ్యతి. అతః నామైవ సారభూతం ఆకారనాశే అపి నామ అవశిష్యతే - యథా నష్టేపి ఘటేమృత్ అవశిష్యతే ఇతి మృద్వ్యతిరేకేణ ఘటోనాస్తి, కింతు మృత్ స్వరూపమేవ భవతి. తథా ఆకారే నష్టే అపి మృద్వత్ అవశిష్య మాణ నామ్నో న భిద్యతే ఆకారః, కింతు నామ స్వరూపమేవ భవతి ఆకారోపి.
సర్వో అయం నామ ప్రపంచః ఓంకార వ్యతిరేకేణ నాస్తి కింతు ఓంకారస్వరూపమేవ సర్వం నామ తథాహి వాచక శబ్దః ఏవనామ ఇతి కథ్యతే. లోకే, వేదేచ ప్రయుక్తః సర్వః శబ్దః ఓంకారాత్ ఏవ ఉత్పన్నః ఇతి శ్రుతిషు ఉచ్యతే - “ఓంకార ఏవ ఇదం సర్వం” ఇతి కార్యం సర్వం కారణస్య రూపమేవ భవతి. తస్మాత్ ఓంకారకార్యభూతాని వాచక శబ్దాత్మకాని నామాని ఓంకారస్వరూపాణి. ఇత్థః రూపాం శోయః పదార్థాకారః స నామస్వరూపః. నామచ సర్వం ఓంకారస్వరూపం తస్మాత్ సర్వస్వరూపః ఓంకారః..
“యథా సర్వస్య రూపః ఓంకారః తథా సర్వస్వరూపం బ్రహ్మ. తస్మాత్ ఓంకారో బ్రహ్మ రూపః అధవా ఓంకారో బ్రహ్మణః వాచకః - బ్రహ్మ ఓంకారస్య వాచ, బ్రహ్మ ఓంకారస్య వాచ్యం. వాచ్యావాచకయోః అభేదో అస్తి తస్మాదపి ఓంకారో బ్రహ్మ రూపః, కించ విచార్యమాణే యదక్షరం బ్రహ్మణి స అధ్యస్తం తస్య బ్రహ్మాధి ష్టానం భవతి. అధ్యస్తస్య స్వరూపం అధిష్టానాత్ న అతిరిచ్యతే. తస్మాత్ అపి ఓంకారో బ్రహ్మైవ తస్మాత్ ఓంకారం బ్రహ్మరూపేణ చింతయేత్”.
“ఇదంచ ఓంకార చింతనం పరమహంసా నామేవ గోప్యం ధనం. బహిర్ముఖస్య నాస్తి అత్ర అధికారః అత్యంతార్ముఖస్యైవ అత్ర అధికారః గృహస్థానాం నాస్తి అత్ర అధికారః దారాపత్య విత్తాది పరిగ్రహ రహితః పరమహంసః ఏవ అత్ర అధికారీ” (విచారసాగరము)
(“ప్రణవరూపమైన అక్షరము - ఓంకారము - బ్రహ్మ స్వరూపము - అటువంటి ప్రణవరూపమైన బ్రహ్మ నేనే.” అని నిరంతరము - ఎల్లపుడు - ధ్యానించవలెను - ఇట్లు ప్రణవధ్యానమునకు, - ప్రణవోపాసనకు అధికారి సన్యాశియే)
(ఉపనిషత్తులలో ప్రణవోపాసన రెండు విధములుగా చెప్పబడినది - ప్రణవము పరబ్రహ్మరూపమని ఉపాసించుట; అపరబ్రహ్మరూపమని ఉపాసించుట. నిర్గుణబ్రహ్మ పరబ్రహ్మమని చెప్పబడుచున్నది. సగుణ బ్రహ్మ అపరబ్రహ్మయని చెప్పబడుచున్నది. (కారణములు, వాటిలోనుండిపుట్టిన కార్యవస్తువులన్నియు ప్రణవమే. అందుచేత రూపముతోనున్న యీ ప్రపంచమంతయు ఓంకారమే. అన్ని పదార్థములందు, నామము రూపము అను రెండు అంశలు (భాగములు) ఉన్నవి. వాటిలో రూపమగు అంశ ఆ వస్తువుయొక్క నామాంశకంటె వేఱుకాదు, దాని నామస్వరూ పమే. రూపాంశకూడా. ఆ ప్రకారమే నామాంశకంటె వేఱుకాదు, కాని రూపాంశవలన కలిగిన ఆకార విశేషముచేతనే వస్తువు అయినను అన్నిపదార్థములు వాటి వాటి విశేషమును బట్టియే నామములతో నిరూపించ బడుచున్నవి. ఇట్లు వ్యవహరింపబడుట కేవలము ఆకారమాత్రముచేతనే కాదు - అందుచేత నామమే సారము - ముఖ్యమైనది - ఆకారము (రూపము) నశించినను దాని పేరు మిగిలియుండును - అది యట్లనగా - మట్టితో చేసిన కుండ (కుండాకారముగా నుండుట) నశించినను మట్టి మిగిలియుండును. మట్టికానికుండ ఉండదు - దాని మట్టిరూపమే యగును - ఆకారము నష్టమైపోయినను మట్టివలె మిగిలియుండును. అందుచేత కుండయను ఆకారము పోయినను మట్టియను నామమే మిగిలియుండును).
(నామరూపములయిన ఈ ప్రపంచమంతయు ఓంకారము కంటె వేఱుకాదు - (వాటి వాటి రూపములు పోయినను ఓంకారమను పేరు మిగిలి యుండును). కనుక ఈ ప్రపంచములోని వస్తువులన్నియు ఓంకార స్వరూపమే - అదియే సర్వము అను పేరుగలది. అయినను వస్తువునకు వాచకశబ్దమే పేరు అని చెప్పబడు చున్నది. అన్ని శబ్దములు ఓంకారమునుండి పుట్టినవే అని శ్రుతి చెప్పచున్నది - “ఓంకార ఏవ ఇదం సర్వం” - ఈ ప్రపంచమంతయు ఓంకారమే అని శ్రుతి చెప్పచున్నది. ఎందుచేతననగా కారణవస్తువులోనుండి పుట్టినకార్య వస్తువులన్నియు వాటి వాటి కారణ స్వరూపములే. అందుచేత ఓంకారము వలన కలిగిన కార్య వస్తువులన్నియు - వాటి వాచకములన్నియు - వాటి పేర్లు అన్నియు - ఓంకార స్వరూపములే. ఈ ప్రకారము వస్తువుల ఆకారరూపమైన రూపాంశ అదియే నామస్వరూపము - సర్వము ఓంకారస్వరూపము – అందు చేత ఓంకారము సర్వ స్వరూపము).
(ఓంకారము సర్వ స్వరూపమైనట్లే బ్రహ్మ కూడ సర్వస్వరూపమే - అందుచేత ఓంకారము బ్రహ్మస్వరూపము, లేక, ఓంకారము బ్రహ్మ యొక్క వాచకము, బ్రహ్మ ఓంకారము యొక్క వాచ్యము - వాచ్యమునకు వాచకమునకు భేదము లేదు - అందుచేత ఓంకారము బ్రహ్మరూపము).
(ఓంకారమను అక్షరము బ్రహ్మయందు అధ్యస్తము, దానిని అధిష్టించియున్నవాడు బ్రహ్మ. అధ్యస్త స్వరూపము అధిష్టానము కన్న వేఱుకాదు - అందుచేతనైనను ఓంకారము బ్రహ్మమే. అందుచేత ఓంకారము బ్రహ్మరూపమని చింతింపవలయును - ఉపాసించవలయును).
(ఈ చెప్పిన ఓంకారధ్యానము - ఓంకారోపాసన - పరమహంసులకే - (సన్యాసులకే) - గోప్యమైన ధనము - వారు అంతర్ముఖులు కనుక, బహిర్ముఖులైన వారికి ఈ విషయములో అధికారములేదు - వారు ఈ విషయములో అధికారులు కారు, గృహస్థులు ప్రణవోపాసనకు అధికారులుకారు. భార్య, పుత్రులు, ధనము మొదలగునవి లేనివారే దీనికి అధికారులు).
“praṇavarūpaṃ akṣaraṃ braghmasvarūpamēva tādṛśapraṇava svarūpaḥ brahma ahamēva iti nairaṃtaryēṇa anavarataṃ dhyāyēt. atra adhikārī sanyāsī ēva. upaniṣatsu praṇavōpāsanaṃ dvidhāvarṇitaṃ - parabrahma rūpēṇa praṇavasyōpāsanaṃ aparabrahmarūpēṇa praṇavasyōpāsanaṃ iti nirguṇaṃ brahma parabrahma ityucyatē. saguṇaṃ brahma aparaṃ brahma iti kīrtyatē”.
kāraṇa kāryarūpaṃ sarvaṃ vastu ōṃkārasvarūpamēva ataḥ sarvōpi rūpa prapaṃcaḥ ōṃkāra ēva. sarvēṣu api padārthēṣu nāmarūpaṃ ca ityaṃśadvayamasti. tatra rūpātmakō aṃśaḥ. tattannāmātmakāṃ śāt na atiricyatē. kiṃtu nāma svarūpamēva rūpāṃ śōpi. tathāhi padārthānāṃ rūpātmakōyaḥ ākāra viśēṣaḥ tadabhidāyakanāma padairēva sarvē padārthāḥ nirūpitāḥ saṃtō gṛhyaṃtē, tyajaṃtē vā. tattadabhidāna jñānamaṃtarā kēvalā kāryamātrēṇa vyavahārōna siddhyati. ataḥ nāmaiva sārabhūtaṃ ākāranāśē api nāma avaśiṣyatē - yathā naṣṭēpi ghaṭēmṛt avaśiṣyatē iti mṛdvyatirēkēṇa ghaṭōnāsti, kiṃtu mṛt svarūpamēva bhavati. tathā ākārē naṣṭē api mṛdvat avaśiṣya māṇa nāmnō na bhidyatē ākāraḥ, kiṃtu nāma svarūpamēva bhavati ākārōpi.
sarvō ayaṃ nāma prapaṃcaḥ ōṃkāra vyatirēkēṇa nāsti kiṃtu ōṃkārasvarūpamēva sarvaṃ nāma tathāhi vācaka śabdaḥ ēvanāma iti kathyatē. lōkē, vēdēca prayuktaḥ sarvaḥ śabdaḥ ōṃkārāt ēva utpannaḥ iti śrutiṣu ucyatē - “ōṃkāra ēva idaṃ sarvaṃ” iti kāryaṃ sarvaṃ kāraṇasya rūpamēva bhavati. tasmāt ōṃkārakāryabhūtāni vācaka śabdātmakāni nāmāni ōṃkārasvarūpāṇi. itthaḥ rūpāṃ śōyaḥ padārthākāraḥ sa nāmasvarūpaḥ. nāmaca sarvaṃ ōṃkārasvarūpaṃ tasmāt sarvasvarūpaḥ ōṃkāraḥ..
“yathā sarvasya rūpaḥ ōṃkāraḥ tathā sarvasvarūpaṃ brahma. tasmāt ōṃkārō brahma rūpaḥ adhavā ōṃkārō brahmaṇaḥ vācakaḥ - brahma ōṃkārasya vāca, brahma ōṃkārasya vācyaṃ. vācyāvācakayōḥ abhēdō asti tasmādapi ōṃkārō brahma rūpaḥ, kiṃca vicāryamāṇē yadakṣaraṃ brahmaṇi sa adhyastaṃ tasya brahmādhi ṣṭānaṃ bhavati. adhyastasya svarūpaṃ adhiṣṭānāt na atiricyatē. tasmāt api ōṃkārō brahmaiva tasmāt ōṃkāraṃ brahmarūpēṇa ciṃtayēt”.
“idaṃca ōṃkāra ciṃtanaṃ paramahaṃsā nāmēva gōpyaṃ dhanaṃ. bahirmukhasya nāsti atra adhikāraḥ atyaṃtārmukhasyaiva atra adhikāraḥ gṛhasthānāṃ nāsti atra adhikāraḥ dārāpatya vittādi parigraha rahitaḥ paramahaṃsaḥ ēva atra adhikārī” (vicārasāgaramu)
(“praṇavarūpamaina akṣaramu - ōṃkāramu - brahma svarūpamu - aṭuvaṃṭi praṇavarūpamaina brahma nēnē.” ani niraṃtaramu - ellapuḍu - dhyāniṃcavalenu - iṭlu praṇavadhyānamunaku, - praṇavōpāsanaku adhikāri sanyāśiyē)
(upaniṣattulalō praṇavōpāsana reṃḍu vidhamulugā ceppabaḍinadi - praṇavamu parabrahmarūpamani upāsiṃcuṭa; aparabrahmarūpamani upāsiṃcuṭa. nirguṇabrahma parabrahmamani ceppabaḍucunnadi. saguṇa brahma aparabrahmayani ceppabaḍucunnadi. (kāraṇamulu, vāṭilōnuṃḍipuṭṭina kāryavastuvulanniyu praṇavamē. aṃducēta rūpamutōnunna yī prapaṃcamaṃtayu ōṃkāramē. anni padārthamulaṃdu, nāmamu rūpamu anu reṃḍu aṃśalu (bhāgamulu) unnavi. vāṭilō rūpamagu aṃśa ā vastuvuyokka nāmāṃśakaṃṭe vēṟukādu, dāni nāmasvarū pamē. rūpāṃśakūḍā. ā prakāramē nāmāṃśakaṃṭe vēṟukādu, kāni rūpāṃśavalana kaligina ākāra viśēṣamucētanē vastuvu ayinanu annipadārthamulu vāṭi vāṭi viśēṣamunu baṭṭiyē nāmamulatō nirūpiṃca baḍucunnavi. iṭlu vyavahariṃpabaḍuṭa kēvalamu ākāramātramucētanē kādu - aṃducēta nāmamē sāramu - mukhyamainadi - ākāramu (rūpamu) naśiṃcinanu dāni pēru migiliyuṃḍunu - adi yaṭlanagā - maṭṭitō cēsina kuṃḍa (kuṃḍākāramugā nuṃḍuṭa) naśiṃcinanu maṭṭi migiliyuṃḍunu. maṭṭikānikuṃḍa uṃḍadu - dāni maṭṭirūpamē yagunu - ākāramu naṣṭamaipōyinanu maṭṭivale migiliyuṃḍunu. aṃducēta kuṃḍayanu ākāramu pōyinanu maṭṭiyanu nāmamē migiliyuṃḍunu).
(nāmarūpamulayina ī prapaṃcamaṃtayu ōṃkāramu kaṃṭe vēṟukādu - (vāṭi vāṭi rūpamulu pōyinanu ōṃkāramanu pēru migili yuṃḍunu). kanuka ī prapaṃcamulōni vastuvulanniyu ōṃkāra svarūpamē - adiyē sarvamu anu pērugaladi. ayinanu vastuvunaku vācakaśabdamē pēru ani ceppabaḍu cunnadi. anni śabdamulu ōṃkāramunuṃḍi puṭṭinavē ani śruti ceppacunnadi - “ōṃkāra ēva idaṃ sarvaṃ” - ī prapaṃcamaṃtayu ōṃkāramē ani śruti ceppacunnadi. eṃducētananagā kāraṇavastuvulōnuṃḍi puṭṭinakārya vastuvulanniyu vāṭi vāṭi kāraṇa svarūpamulē. aṃducēta ōṃkāramu valana kaligina kārya vastuvulanniyu - vāṭi vācakamulanniyu - vāṭi pērlu anniyu - ōṃkāra svarūpamulē. ī prakāramu vastuvula ākārarūpamaina rūpāṃśa adiyē nāmasvarūpamu - sarvamu ōṃkārasvarūpamu – aṃdu cēta ōṃkāramu sarva svarūpamu).
(ōṃkāramu sarva svarūpamainaṭlē brahma kūḍa sarvasvarūpamē - aṃducēta ōṃkāramu brahmasvarūpamu, lēka, ōṃkāramu brahma yokka vācakamu, brahma ōṃkāramu yokka vācyamu - vācyamunaku vācakamunaku bhēdamu lēdu - aṃducēta ōṃkāramu brahmarūpamu).
(ōṃkāramanu akṣaramu brahmayaṃdu adhyastamu, dānini adhiṣṭiṃciyunnavāḍu brahma. adhyasta svarūpamu adhiṣṭānamu kanna vēṟukādu - aṃducētanainanu ōṃkāramu brahmamē. aṃducēta ōṃkāramu brahmarūpamani ciṃtiṃpavalayunu - upāsiṃcavalayunu).
(ī ceppina ōṃkāradhyānamu - ōṃkārōpāsana - paramahaṃsulakē - (sanyāsulakē) - gōpyamaina dhanamu - vāru aṃtarmukhulu kanuka, bahirmukhulaina vāriki ī viṣayamulō adhikāramulēdu - vāru ī viṣayamulō adhikārulu kāru, gṛhasthulu praṇavōpāsanaku adhikārulukāru. bhārya, putrulu, dhanamu modalagunavi lēnivārē dīniki adhikārulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.