భగవత్తత్వమును యధార్థముగ తెలుసుకొనుటలో కలుగు ప్రతి బంధకములు - అడ్డులు - ఇవి మూడు విధములు : - సంశయభావన, అసంభావన, విపరీత భావన. ఆత్మ ఒకటియేనా లేక ఆత్మలు అనేకములా ? అను సంశయము కలుగు భావన సంశయభావన. ఇట్టి సంశయము సద్గురు ముఖమున, వేదాంత వాక్యములు మొదలగు వాటి అర్థము తెలుసుకొనుటవలన తీరును - వేదాంతములన్నియు ఒకే ఒక ఆత్మ గుఱించి చెప్పచున్నవి. ఆత్మ, జీవుడు, జగత్తు వేఱు వేఱుగా కనబడుచున్నవి కనుక ఉన్నదంతా ఒక్కటే యెట్లగును. ఇది అసంభవము అను భావన అసంభావన. అజ్ఞానము వలన ఇట్లు అసంభావన కలిగినను, మననము మొదలగునవి చేసినను ఇంకను జగత్తు వేఱుగనే తోచును - ఇది విపరీత భావన. ఇది నిధిధ్యాసనము వలనను - నిరంతర ధ్యానమువలనను - తొలగి పోవును - అజ్ఞానమువలన కలుగునవి విజ్ఞానమువలన తొలగిపోవును - కాని, కొన్ని సమయములలో పూర్తి ఫలము లభించదు. అగ్ని అన్నింటిని భస్మము చేయునదైనను కొన్ని సమయములందు అట్లు చేయలేకపోవును).
bhagavattatvamunu yadhārthamuga telusukonuṭalō kalugu prati baṃdhakamulu - aḍḍulu - ivi mūḍu vidhamulu : - saṃśayabhāvana, asaṃbhāvana, viparīta bhāvana. ātma okaṭiyēnā lēka ātmalu anēkamulā ? anu saṃśayamu kalugu bhāvana saṃśayabhāvana. iṭṭi saṃśayamu sadguru mukhamuna, vēdāṃta vākyamulu modalagu vāṭi arthamu telusukonuṭavalana tīrunu - vēdāṃtamulanniyu okē oka ātma guṟiṃci ceppacunnavi. ātma, jīvuḍu, jagattu vēṟu vēṟugā kanabaḍucunnavi kanuka unnadaṃtā okkaṭē yeṭlagunu. idi asaṃbhavamu anu bhāvana asaṃbhāvana. ajñānamu valana iṭlu asaṃbhāvana kaliginanu, mananamu modalagunavi cēsinanu iṃkanu jagattu vēṟuganē tōcunu - idi viparīta bhāvana. idi nidhidhyāsanamu valananu - niraṃtara dhyānamuvalananu - tolagi pōvunu - ajñānamuvalana kalugunavi vijñānamuvalana tolagipōvunu - kāni, konni samayamulalō pūrti phalamu labhiṃcadu. agni anniṃṭini bhasmamu cēyunadainanu konni samayamulaṃdu aṭlu cēyalēkapōvunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.