← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రతిబింబము pratibiṃbamu

Original — తెలుగు

యధా దీపః ఏకః సన్నపి ఉపాధి యోగాత్ అనేకథా భవతి, తథా మాయా తత్కార్యోపాధి భేదాత్ ఆత్మైకోపి ద్విధా అనే దృశ్యా దృశ్య కోటి భేదేన ద్విధా భవతి. యథాముఖం ఏకమపి ఉపాధిదర్పణ భేదాత్ ప్రతిబింబ రూపేణ బహుథా భవతి, యథా వా పురుషస్య ఛాయా ఉపాధి భేదాత్ అనేకధా భవతి, తధైవ ఆవయోః ప్రతిబింబం మాయా కార్యాంతః కరణ రూపోపాధిషు అనేకథా భవతి.

(దీపము ఒకటే అయినను ఉపాధులనుబట్టి అనేకములుగా ఉన్నట్లు కనబడును - ఆ ప్రకారముగానే ఆత్మ ఒకటే అయినను మాయ, దాని కార్యములైన ఉపాధి భేదమువలన రెండుగాను, అనేక దృశ్యా దృశ్యము లను ఉపాధుల భేదమువలన అనేకముగా నున్నట్లు కనబడు చున్నది. ముఖము ఒకటే అయినను అద్దము అను ఉపాధిభేదమువలన అనేకముగా ప్రతిబింబరూపముగా కనబడును. పురుషుని నీడ ఉపాధి భేదమువలన అనేకముగా కనబడును - అట్లే మనయొక్క ప్రతిబింబము మాయా కార్యమైన అంతఃకరణమను ఉపాధులందు అనేకముగా కనబడును).

Transliteration

yadhā dīpaḥ ēkaḥ sannapi upādhi yōgāt anēkathā bhavati, tathā māyā tatkāryōpādhi bhēdāt ātmaikōpi dvidhā anē dṛśyā dṛśya kōṭi bhēdēna dvidhā bhavati. yathāmukhaṃ ēkamapi upādhidarpaṇa bhēdāt pratibiṃba rūpēṇa bahuthā bhavati, yathā vā puruṣasya chāyā upādhi bhēdāt anēkadhā bhavati, tadhaiva āvayōḥ pratibiṃbaṃ māyā kāryāṃtaḥ karaṇa rūpōpādhiṣu anēkathā bhavati.

(dīpamu okaṭē ayinanu upādhulanubaṭṭi anēkamulugā unnaṭlu kanabaḍunu - ā prakāramugānē ātma okaṭē ayinanu māya, dāni kāryamulaina upādhi bhēdamuvalana reṃḍugānu, anēka dṛśyā dṛśyamu lanu upādhula bhēdamuvalana anēkamugā nunnaṭlu kanabaḍu cunnadi. mukhamu okaṭē ayinanu addamu anu upādhibhēdamuvalana anēkamugā pratibiṃbarūpamugā kanabaḍunu. puruṣuni nīḍa upādhi bhēdamuvalana anēkamugā kanabaḍunu - aṭlē manayokka pratibiṃbamu māyā kāryamaina aṃtaḥkaraṇamanu upādhulaṃdu anēkamugā kanabaḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.