← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రతీకోపాసన pratīkōpāsana

Original — తెలుగు
  1. ప్రతీకమనగా ఆధారము, ప్రతినిధి - ఒక వస్తువునకు బదులుగా వాడిన ఇంకొక వస్తువు (దానికి ప్రతిగా, బదులుగా, దాని స్థానములో వాడబడినది) - (instead of that, in place of that, in lieu of that). పరబ్రహ్మ కంటికి కానరాదు, చెప్పుటకు నలవికాదు, మనసులో ఊహించుటకు కూడ నలవికానిది. సృష్టిలోనున్న వస్తువులన్నియు పరబ్రహ్మ రూపములే కనుక పరబ్రహ్మకు బదులుగా ఏ వస్తువునైనను, అదియే పరబ్రహ్మ మని భావన ఉంచి ఉపాసించుట ప్రతీకోపాసన - బంగారముతో చేసిన బొమ్మగాని, వెండితోచేసిన బొమ్మగాని, కర్రతోచేసిన బొమ్మగాని, రాతితోఈ చేసిన బొమ్మగాని, కాగితము మీద వ్రాసిన బొమ్మగాని ఎదుట నుంచుకొని అదియే పరబ్రహ్మ అని భావించి ఉపాసించుట - అట్లు ఉపాసించుటలో అది బంగారపుబొమ్మయనిగాని, వెండిబొమ్మయనిగాని, కర్రబొమ్మయనిగాని, రాతిబొమ్మయనికాని అభిప్రాయముండకూడదు -.

  2. “ప్రతీకేష్యపి బ్రహ్మ వికారతయా జీవాభిన్న బ్రహ్మ భిన్నత్వాత్ జీవా భేద సత్వే నాహం గ్రహః కార్యః -”. (బ్రహ్మతత్వ ప్రకాశిక)

(ప్రతీకములు బ్రహ్మకంటె వేరుకావు - బ్రహ్మవికారములే - కనుక అవి బ్రహ్మకంటె వేరైనవని తలంచరాదు).

  1. “నార్మదచాణానాం శివరూపేణ, సాలగ్రామ శిలానాం విష్ణురూపేణ చ ధ్యానంతు ప్రతీక ధ్యాసమేవ న అహంగ్రహ ధ్యానం - ఏవమేవ ఆదిత్యో బ్రహ్మ”ఇత్యాదేశః” ఇత్యాది శ్రుత్యుక్తోపాసనమపి ప్రతీక ధ్యానమేవ, న అహం గ్రహధ్యానం“.

(లింగము శివరూపమని, సాలగ్రామ శిల విష్ణురూపమని ధ్యానించుట ప్రతీకోపాసనయే, అహం గ్రహ ధ్యానముకాదు - ఇట్లే ఆదిత్యుడే - సూర్యుడే, ప్రకాశరూపుడే - పరబ్రహ్మయని శ్రుతిలో చెప్పబడిన ఆదేశము ప్రతీకధ్యానమే - అహంగ్రహోపాసనకాదు).

  1. “మనోబ్రహ్మ” ఇత్యుపాసీత” - (మనస్సే పరబ్రహ్మము అని ఉపాసించవనెను - ఇది ప్రతీకోపాసనయే).

  2. “అశ్నోపి యాతి దేవత్వం శిల్పి భిస్సు ప్రతిష్టితః”

(ఱాతి బొమ్మ అయినను శిల్పిచేత బాగుగ తయారు చేయబడి ప్రతిష్ఠింపబడిన అది దేవత్వమును పొందును).

Transliteration
  1. pratīkamanagā ādhāramu, pratinidhi - oka vastuvunaku badulugā vāḍina iṃkoka vastuvu (dāniki pratigā, badulugā, dāni sthānamulō vāḍabaḍinadi) - (instead of that, in place of that, in lieu of that). parabrahma kaṃṭiki kānarādu, ceppuṭaku nalavikādu, manasulō ūhiṃcuṭaku kūḍa nalavikānidi. sṛṣṭilōnunna vastuvulanniyu parabrahma rūpamulē kanuka parabrahmaku badulugā ē vastuvunainanu, adiyē parabrahma mani bhāvana uṃci upāsiṃcuṭa pratīkōpāsana - baṃgāramutō cēsina bommagāni, veṃḍitōcēsina bommagāni, karratōcēsina bommagāni, rātitōī cēsina bommagāni, kāgitamu mīda vrāsina bommagāni eduṭa nuṃcukoni adiyē parabrahma ani bhāviṃci upāsiṃcuṭa - aṭlu upāsiṃcuṭalō adi baṃgārapubommayanigāni, veṃḍibommayanigāni, karrabommayanigāni, rātibommayanikāni abhiprāyamuṃḍakūḍadu -.

  2. “pratīkēṣyapi brahma vikāratayā jīvābhinna brahma bhinnatvāt jīvā bhēda satvē nāhaṃ grahaḥ kāryaḥ -”. (brahmatatva prakāśika)

(pratīkamulu brahmakaṃṭe vērukāvu - brahmavikāramulē - kanuka avi brahmakaṃṭe vērainavani talaṃcarādu).

  1. “nārmadacāṇānāṃ śivarūpēṇa, sālagrāma śilānāṃ viṣṇurūpēṇa ca dhyānaṃtu pratīka dhyāsamēva na ahaṃgraha dhyānaṃ - ēvamēva ādityō brahma”ityādēśaḥ” ityādi śrutyuktōpāsanamapi pratīka dhyānamēva, na ahaṃ grahadhyānaṃ”.

(liṃgamu śivarūpamani, sālagrāma śila viṣṇurūpamani dhyāniṃcuṭa pratīkōpāsanayē, ahaṃ graha dhyānamukādu - iṭlē ādityuḍē - sūryuḍē, prakāśarūpuḍē - parabrahmayani śrutilō ceppabaḍina ādēśamu pratīkadhyānamē - ahaṃgrahōpāsanakādu).

  1. “manōbrahma” ityupāsīta” - (manassē parabrahmamu ani upāsiṃcavanenu - idi pratīkōpāsanayē).

  2. “aśnōpi yāti dēvatvaṃ śilpi bhissu pratiṣṭitaḥ”

(ṟāti bomma ayinanu śilpicēta bāguga tayāru cēyabaḍi pratiṣṭhiṃpabaḍina adi dēvatvamunu poṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.