← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రత్యక్షజ్ఞానం pratyakṣajñānaṃ

Original — తెలుగు
  1. ఇంద్రియం చక్షురాదికం, అర్థో ఘటాదిః, తయోస్సనికర్షస్థం యోగాదిః, తజ్జన్యం జ్ఞానమిత్యర్థః - ఇదం ఘటః ఇత్యాకారకం జ్ఞానం.

(ఇంద్రియములనగా కండ్లు మొదలగునవి; అర్థములనగా విషయములు - ఘటము మొదలగునవి. ఈ రెండింటికీ కలిగిన సం యోగము (కన్ను ఘటమును చూచినందువలన కలిగిన జ్ఞానము - ప్రత్యక్షజ్ఞానము - ఇది ఘటము అని దాని ఆకారమును తెలియునది).

  1. యత్ర వృత్యాసహ విషయస్య సంబంధో భవతి తత్ర ప్రత్యక్ష జ్ఞానం భవతి.

(ఇంద్రియముల వృత్తులకు వాటి విషయములతో సంబంధము కలుగునపుడు కలుగు జ్ఞానము ప్రత్యక్షజ్ఞానము - కంటికి రూపము కనబడునపుడు ఆ రూపముగుఱించి కలిగిన జ్ఞానము).

  1. “ఆత్మా మనసా సం యుజ్యతే, మనః ఇంద్రియేణ, ఇంద్రియమర్థేన, తతః ప్రత్యక్షజ్ఞానముత్పద్యతే -” (తర్కసంగ్రహ దీపిక)

(ఆత్మ మనసుతో సం యోగమును పొందును - కలియును, మనస్సు ఇంద్రియములతో సం యోగము చెందును, ఇంద్రియములు విషయములతో యోగము చెందును. అప్పుడు కలిగిన జ్ఞానము ప్రత్యక్షజ్ఞానము).

  1. “ఇంద్రియార్థ సన్నికర్ష జన్యం జ్ఞానం ప్రత్యక్షం. తత్ ద్వివిధం - నిర్వికల్పకం, సవికల్పకం చేతి”. (తర్కసంగ్రహే)

(ఇంద్రియములు విషయములు కలియుటవలన కలిగిన జ్ఞానము ప్రత్యక్షజ్ఞానము - అది రెండు విధములు - నిర్వికల్పకము, సవికల్పకము).

  1. ప్రత్యక్షం ద్వివిధం - సవికల్పక, నిర్వికల్పక భేదాత్. తత్ర సవికల్పకం వైశిష్ట్యా వగ్రాహి జ్ఞానం - యథా, ఘటమహం జానామీత్యాది జ్ఞానం. నిర్వికల్పంతు సంసారానవగాహి జ్ఞానం - యథా,“సోయం దేవదత్తః,”తత్వ మసీత్యాది వాక్యజన్యం జ్ఞానం“.”ప్రత్యక్షం పునర్ద్వివిధం - జీవసాక్షీశ్వర సాక్షీచేతి. తత్ర జీవోనామ అంతఃకరణావచ్ఛిన్నం చైతన్యం తత్సాక్షితు అంతఃకరణోపహితం చైతన్యం. అంతఃకరణస్య విశేషణత్వోపాధిత్వాభ్యాం అనయోర్భేదః“. (వేదాంత పరిభాషా)

(ప్రత్యక్షజ్ఞానము రెండు విధములు - సవికల్పకము, నిర్వికల్పకము - ‘ఇది ఘటమని నాకు తెలుసు అనునది సవికల్పకజ్ఞానము’ - ‘ఆ దేవదత్తుడు ఇతడే’ అనియు, ‘ఆ పరబ్రహ్మనేనే అయితిబిని’ అను వాక్యములవలన కలుగు జ్ఞానము నిర్వికల్పకజ్ఞానము).

(ప్రత్యక్షజ్ఞానము మఱి రెండు విధములు : - జీవసాక్షి, ఈశ్వరసాక్షి అని - జీవుడనగా అంతఃకరణావచ్ఛిన్న చైతన్యము దానికి సాక్షి అయినవాడు అని, అంతఃకరణోపహిత చైతన్యము - ఈ రెండింటికీ భేదమేమనగా అంతఃకరణము విశేషణముగా కలిగియుండుట, అంతఃకరణము ఉపాధిగా కలిగియుండుట).

ప్రత్యక్షజ్ఞానస్య సాక్షి ద్వెవిధ్యం - సంసారావ గాహిత్వ నావగాహిత్వ భేదే(అ)పి జ్ఞానం చైతన్యరూపమేకమేవ. తచ్చ, జీవసాక్షీశ్వరసాక్షిభేదేన ద్వివిధమిత్యర్థః - - - అంతఃకరణస్య విశేషణత్వే చైతన్యస్య జీవత్వం, తస్యోపాధిత్వే తస్య తత్సాక్షిత్వమితి తయోర్భేదః - (శివదత్తః).. రూప విశిష్టో ఘటో(అ)నిత్యః ఇత్యత్ర రూపం విశేషణం.

(ప్రత్యక్షజ్ఞానమునకు సాక్షి రెండు విధములు - సంసారావ గాహిత్వ అనవగాహిత్వ భేదమైన జ్ఞానము - చైతన్యరూపము ఒకటే. అదే జీవసాక్షి, ఈశ్వరసాక్షి అని రెండు విధములు - అంతఃకరణము విశేషణముగా గలది జీవసాక్షి, అంతఃకరణము ఉపాధిగాగలది ఈశ్వరసాక్షి - ఘటము అను రూపము గలది అనిత్యము - రూపము కలిగియుండుట విషేషణము).

  1. ప్రత్యక్షం ప్రాకారాంతరేణ ద్వివిధం - ఇంద్రియజన్యం, తదజన్యంచేతి. తత్రేంద్రియజన్యం, సుఖాది ప్రత్యక్షం. మనసః ఇంద్రియత్వ నిరాకరణాత్ ఇంద్రియాణి పంచఘ్రాణ, రసన, చక్షుశ్రోత్రత్వగాత్మకాని సర్వాణి చేంద్రియాణి స్వ స్వ విషయ సం యుక్తాన్యేవ ప్రత్యక్షజ్ఞానం జనయంతి. తత్ర ఘ్రాణ రసన త్వగింద్రియాణిస్వస్థాన స్థితిన్యేవ గంధరస స్పర్శోవలంభాన్ జనయంతి, చక్షు శ్రోత్రేతు స్వతః ఏవ విషయ దేశంగత్వా స్వస్వవిషయం గృహీతః, శ్రోత్రస్యాపి చక్షురాదివత్ పరిచ్ఛిన్నతయా భేర్యాది దేశగమన సంభవాత్ - అత ఏవ అనుభవో “మయంశ్రుతః” ఇతి.

“వచీతరంగన్యాయేన కర్ణ శుష్కలీ ప్రదేశే అనంత శబ్దోత్పత్తి కల్పనా గౌరవం భేరీశబ్దో”మయా శ్రుతః” ఇతి ప్రత్యక్షస్య భ్రమత్వకల్పనా గౌరవం చ స్యాత్ -” (వేదాంతపరిభాషా)

“యథావీచేస్తరంగః తతోపి వీచ్యంతరం, తతోపి తరంగాంతరమితి న్యాయః - తథా భేరీ దండ సం యోగాన్నభస్యుత్పన్నాచ్ఛబ్దాత్ అసమవాయకారణాత్ శబ్దాంతస్యోత్పత్తిః, తతో అన్యస్యేతి పరంపరయా అంత్య శబ్దస్య శ్రోత్ర శబ్దస్య శ్రోత్ర సంబంధ కల్పనా గౌరవం”

(శివదత్తః) (వేదాంతపరిభాషార్థ దీపికా)

(ప్రత్యక్షజ్ఞానము ఇంకొక రీత్యా రెండు విధములుగా నున్నది - ఇంద్రియములవలన కలుగునది, ఇంద్రియములవలన కలుగనిది. సుఖము మొదలగునవి, ఇంద్రియములవలన కలుగునవి. మనసు ఇంద్రియములక్రింద లెక్క చేయకున్నయడల ఇంద్రియములు అయిదు - ఘ్రాణ రసన చక్షు శ్రోత్ర త్వక్కులు - ఇంద్రియములన్నియు వాటి వాటి విషయములతో కూడుట వలననే (ఈ రెండింటి సం యోగము కలుగుటవలననే) ప్రత్యక్ష జ్ఞానమును కలిగించుచున్నవి).

(ఈ అయిదు ఇంద్రియములలోను ఘ్రాణము, రసనము, త్వక్కు వాటి దగ్గరకు వచ్చిన విషయములైన గంధము, రసనము, స్పర్శములను గైకొనుచున్నవి. కండ్లు, చెవులు మాత్రము వాటి విషయములైన రూపము, శబ్దము ఉన్న ప్రదేశములవఱకు వ్యాపించి వాటిని గ్రహించుచున్నవి).(కండ్లు వలనేచెవులుకూడా పరిచ్ఛిన్నములగుటవలన భేరీ మొదలగునవి మ్రోయుచున్న స్థానమునకు వెళ్ళి ఆ విషయమును (శబ్దమును) గ్రహించుచున్నవి. ఇట్లు చేయుటవలననే ‘నేను (శబ్దమును) విన్నాను’ అను అనుభవము కలుగుచున్నది).

(నీటిలో ఒక బెడ్డ పడవేసిన ఆ చోటనుండి తరంగములు (చిన్నకెరటములు) అన్ని దిక్కులకు పోవుచుండును. అట్లే, శబ్దము ప్రారంభమైనచోటనుండి - భేరీ మ్రెఊగిన శబ్దము ప్రారంభమైన చోటునుండి - గాలిలో తరంగములు ఒకదాని తర్వాత మరొకటి బయలుదేరి చెవులకు తాకును - అప్పుడు ’ శబ్దము నేనువింటిని ’ యను అనుభవమగును).

Transliteration
  1. iṃdriyaṃ cakṣurādikaṃ, arthō ghaṭādiḥ, tayōssanikarṣasthaṃ yōgādiḥ, tajjanyaṃ jñānamityarthaḥ - idaṃ ghaṭaḥ ityākārakaṃ jñānaṃ.

(iṃdriyamulanagā kaṃḍlu modalagunavi; arthamulanagā viṣayamulu - ghaṭamu modalagunavi. ī reṃḍiṃṭikī kaligina saṃ yōgamu (kannu ghaṭamunu cūcinaṃduvalana kaligina jñānamu - pratyakṣajñānamu - idi ghaṭamu ani dāni ākāramunu teliyunadi).

  1. yatra vṛtyāsaha viṣayasya saṃbaṃdhō bhavati tatra pratyakṣa jñānaṃ bhavati.

(iṃdriyamula vṛttulaku vāṭi viṣayamulatō saṃbaṃdhamu kalugunapuḍu kalugu jñānamu pratyakṣajñānamu - kaṃṭiki rūpamu kanabaḍunapuḍu ā rūpamuguṟiṃci kaligina jñānamu).

  1. “ātmā manasā saṃ yujyatē, manaḥ iṃdriyēṇa, iṃdriyamarthēna, tataḥ pratyakṣajñānamutpadyatē -” (tarkasaṃgraha dīpika)

(ātma manasutō saṃ yōgamunu poṃdunu - kaliyunu, manassu iṃdriyamulatō saṃ yōgamu ceṃdunu, iṃdriyamulu viṣayamulatō yōgamu ceṃdunu. appuḍu kaligina jñānamu pratyakṣajñānamu).

  1. “iṃdriyārtha sannikarṣa janyaṃ jñānaṃ pratyakṣaṃ. tat dvividhaṃ - nirvikalpakaṃ, savikalpakaṃ cēti”. (tarkasaṃgrahē)

(iṃdriyamulu viṣayamulu kaliyuṭavalana kaligina jñānamu pratyakṣajñānamu - adi reṃḍu vidhamulu - nirvikalpakamu, savikalpakamu).

  1. pratyakṣaṃ dvividhaṃ - savikalpaka, nirvikalpaka bhēdāt. tatra savikalpakaṃ vaiśiṣṭyā vagrāhi jñānaṃ - yathā, ghaṭamahaṃ jānāmītyādi jñānaṃ. nirvikalpaṃtu saṃsārānavagāhi jñānaṃ - yathā,“sōyaṃ dēvadattaḥ,”tatva masītyādi vākyajanyaṃ jñānaṃ”. “pratyakṣaṃ punardvividhaṃ - jīvasākṣīśvara sākṣīcēti. tatra jīvōnāma aṃtaḥkaraṇāvacchinnaṃ caitanyaṃ tatsākṣitu aṃtaḥkaraṇōpahitaṃ caitanyaṃ. aṃtaḥkaraṇasya viśēṣaṇatvōpādhitvābhyāṃ anayōrbhēdaḥ”. (vēdāṃta paribhāṣā)

(pratyakṣajñānamu reṃḍu vidhamulu - savikalpakamu, nirvikalpakamu - ‘idi ghaṭamani nāku telusu anunadi savikalpakajñānamu’ - ‘ā dēvadattuḍu itaḍē’ aniyu, ‘ā parabrahmanēnē ayitibini’ anu vākyamulavalana kalugu jñānamu nirvikalpakajñānamu).

(pratyakṣajñānamu maṟi reṃḍu vidhamulu : - jīvasākṣi, īśvarasākṣi ani - jīvuḍanagā aṃtaḥkaraṇāvacchinna caitanyamu dāniki sākṣi ayinavāḍu ani, aṃtaḥkaraṇōpahita caitanyamu - ī reṃḍiṃṭikī bhēdamēmanagā aṃtaḥkaraṇamu viśēṣaṇamugā kaligiyuṃḍuṭa, aṃtaḥkaraṇamu upādhigā kaligiyuṃḍuṭa).

pratyakṣajñānasya sākṣi dvevidhyaṃ - saṃsārāva gāhitva nāvagāhitva bhēdē(a)pi jñānaṃ caitanyarūpamēkamēva. tacca, jīvasākṣīśvarasākṣibhēdēna dvividhamityarthaḥ - - - aṃtaḥkaraṇasya viśēṣaṇatvē caitanyasya jīvatvaṃ, tasyōpādhitvē tasya tatsākṣitvamiti tayōrbhēdaḥ - (śivadattaḥ).. rūpa viśiṣṭō ghaṭō(a)nityaḥ ityatra rūpaṃ viśēṣaṇaṃ.

(pratyakṣajñānamunaku sākṣi reṃḍu vidhamulu - saṃsārāva gāhitva anavagāhitva bhēdamaina jñānamu - caitanyarūpamu okaṭē. adē jīvasākṣi, īśvarasākṣi ani reṃḍu vidhamulu - aṃtaḥkaraṇamu viśēṣaṇamugā galadi jīvasākṣi, aṃtaḥkaraṇamu upādhigāgaladi īśvarasākṣi - ghaṭamu anu rūpamu galadi anityamu - rūpamu kaligiyuṃḍuṭa viṣēṣaṇamu).

  1. pratyakṣaṃ prākārāṃtarēṇa dvividhaṃ - iṃdriyajanyaṃ, tadajanyaṃcēti. tatrēṃdriyajanyaṃ, sukhādi pratyakṣaṃ. manasaḥ iṃdriyatva nirākaraṇāt iṃdriyāṇi paṃcaghrāṇa, rasana, cakṣuśrōtratvagātmakāni sarvāṇi cēṃdriyāṇi sva sva viṣaya saṃ yuktānyēva pratyakṣajñānaṃ janayaṃti. tatra ghrāṇa rasana tvagiṃdriyāṇisvasthāna sthitinyēva gaṃdharasa sparśōvalaṃbhān janayaṃti, cakṣu śrōtrētu svataḥ ēva viṣaya dēśaṃgatvā svasvaviṣayaṃ gṛhītaḥ, śrōtrasyāpi cakṣurādivat paricchinnatayā bhēryādi dēśagamana saṃbhavāt - ata ēva anubhavō “mayaṃśrutaḥ” iti.

“vacītaraṃganyāyēna karṇa śuṣkalī pradēśē anaṃta śabdōtpatti kalpanā gauravaṃ bhērīśabdō”mayā śrutaḥ” iti pratyakṣasya bhramatvakalpanā gauravaṃ ca syāt -” (vēdāṃtaparibhāṣā)

“yathāvīcēstaraṃgaḥ tatōpi vīcyaṃtaraṃ, tatōpi taraṃgāṃtaramiti nyāyaḥ - tathā bhērī daṃḍa saṃ yōgānnabhasyutpannācchabdāt asamavāyakāraṇāt śabdāṃtasyōtpattiḥ, tatō anyasyēti paraṃparayā aṃtya śabdasya śrōtra śabdasya śrōtra saṃbaṃdha kalpanā gauravaṃ”

(śivadattaḥ) (vēdāṃtaparibhāṣārtha dīpikā)

(pratyakṣajñānamu iṃkoka rītyā reṃḍu vidhamulugā nunnadi - iṃdriyamulavalana kalugunadi, iṃdriyamulavalana kaluganidi. sukhamu modalagunavi, iṃdriyamulavalana kalugunavi. manasu iṃdriyamulakriṃda lekka cēyakunnayaḍala iṃdriyamulu ayidu - ghrāṇa rasana cakṣu śrōtra tvakkulu - iṃdriyamulanniyu vāṭi vāṭi viṣayamulatō kūḍuṭa valananē (ī reṃḍiṃṭi saṃ yōgamu kaluguṭavalananē) pratyakṣa jñānamunu kaligiṃcucunnavi).

(ī ayidu iṃdriyamulalōnu ghrāṇamu, rasanamu, tvakku vāṭi daggaraku vaccina viṣayamulaina gaṃdhamu, rasanamu, sparśamulanu gaikonucunnavi. kaṃḍlu, cevulu mātramu vāṭi viṣayamulaina rūpamu, śabdamu unna pradēśamulavaṟaku vyāpiṃci vāṭini grahiṃcucunnavi).(kaṃḍlu valanēcevulukūḍā paricchinnamulaguṭavalana bhērī modalagunavi mrōyucunna sthānamunaku veḷḷi ā viṣayamunu (śabdamunu) grahiṃcucunnavi. iṭlu cēyuṭavalananē ‘nēnu (śabdamunu) vinnānu’ anu anubhavamu kalugucunnadi).

(nīṭilō oka beḍḍa paḍavēsina ā cōṭanuṃḍi taraṃgamulu (cinnakeraṭamulu) anni dikkulaku pōvucuṃḍunu. aṭlē, śabdamu prāraṃbhamainacōṭanuṃḍi - bhērī mreūgina śabdamu prāraṃbhamaina cōṭunuṃḍi - gālilō taraṃgamulu okadāni tarvāta marokaṭi bayaludēri cevulaku tākunu - appuḍu ’ śabdamu nēnuviṃṭini ’ yanu anubhavamagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.