“రజ్జు వందు సర్పమనే భ్రమ తోచును - విచారంపుట్టుకమునుపు అది వివేకం చేత చూస్తే రజ్జుదే సత్యము. అది విచారింపకుంటె భయకంపం తీరదు. అది యెలాగంటె స్వప్నమందుకన్న పులిని మరొకరు చంపలేరు. తాను మేలుకొని కన్నులు తెరిస్తే ఆ పులికి నాశము - అటువలెనే మాయావర్తనగల ప్రపంచమనెడిమిధ్యాభ్రాంతిని స్వరూపంబున వివేకించి చూడగా ఈ జగద్భ్రాంతి సకలమున్నూ నాశమేను - అది అవివేకపురుషుండు దేహాది ప్రపంచంతో గూడియుండగానే సకల ప్రపంచమున్నూ లేని దైపోవును. అది యేలాగంటే - మృగి జలం ఉండగానే దబ్బరైనట్టు, ఆకాశమందు నీలత్వముండగనే దబ్బరైనట్టు - ఈ ప్రపంచము విచారిస్తే మిధ్య, బ్రహ్మమే సత్యము - సకలమున్నూ కలిగి లేకుండును - కేవల బ్రహ్మ చైతన్యము సత్యము - ఈ ప్రకారాన సకల జీవకృతియైన సకల ప్రపంచమున్నూ వివేకప్రళయుడు సంహారం చేసును - ఇది ప్రత్యక్షప్రళయము - ఇదే ఆత్యంతికప్రళయము -”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 2)
“rajju vaṃdu sarpamanē bhrama tōcunu - vicāraṃpuṭṭukamunupu adi vivēkaṃ cēta cūstē rajjudē satyamu. adi vicāriṃpakuṃṭe bhayakaṃpaṃ tīradu. adi yelāgaṃṭe svapnamaṃdukanna pulini marokaru caṃpalēru. tānu mēlukoni kannulu teristē ā puliki nāśamu - aṭuvalenē māyāvartanagala prapaṃcamaneḍimidhyābhrāṃtini svarūpaṃbuna vivēkiṃci cūḍagā ī jagadbhrāṃti sakalamunnū nāśamēnu - adi avivēkapuruṣuṃḍu dēhādi prapaṃcaṃtō gūḍiyuṃḍagānē sakala prapaṃcamunnū lēni daipōvunu. adi yēlāgaṃṭē - mṛgi jalaṃ uṃḍagānē dabbarainaṭṭu, ākāśamaṃdu nīlatvamuṃḍaganē dabbarainaṭṭu - ī prapaṃcamu vicāristē midhya, brahmamē satyamu - sakalamunnū kaligi lēkuṃḍunu - kēvala brahma caitanyamu satyamu - ī prakārāna sakala jīvakṛtiyaina sakala prapaṃcamunnū vivēkapraḷayuḍu saṃhāraṃ cēsunu - idi pratyakṣapraḷayamu - idē ātyaṃtikapraḷayamu -”. (brahmavidyāsudhārṇavamu - 2)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.