← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రత్యక్షప్రమాణం pratyakṣapramāṇaṃ

Original — తెలుగు
  1. ప్రత్యక్షస్య చక్షురాదేః ప్రమాణం. (చక్షురాది ఇంద్రియములకు గోచరమగుట).

  2. “సన్న కర్ష షట్కజన్యం జ్ఞానం ప్రత్యక్షం, తత్కరణ మింద్రియం, తస్మాత్ ఇంద్రియం ప్రత్యక్ష ప్రమాణమితి సిద్ధం -” (తర్కసంగ్రహే)

(దగ్గరగానుండు విషయములగుఱించి - అనగా, ఇంద్రియములకు గోచరమగు విషయములగుఱించి కలుగుజ్ఞానము ప్రత్యక్షజ్ఞానము. దానిని కలుగచేయునవి ఇంద్రియములు. అందుచేత ఇంద్రియములు ప్రత్యక్షప్రమాణము - జ్ఞానేంద్రియములచేత వాటి వాటి విషయములను గ్రహించి స్వయముగా అనుభవించుట).

  1. “ప్రత్యక్షప్రమాయాః కరణం ప్రత్యక్షప్రమాణం - ప్రత్యక్షప్రమా చాత్ర చైతన్యమేవ -”యత్సాక్షాదపరోక్షాద్బ్రహ్మ”.

(బృహదారణ్యకోపనిషత్ - 3 - 4 -1)

- ఇతి శ్రుతేః -“.

(ప్రత్యక్షప్రమాణము కలుగహేయునది ఇంద్రియము - అందుచేత ఇంద్రియము ప్రత్యక్షప్రమాణము - అది బహిరింద్రియమును దాని వృత్తిని చేయునట్లు పురికొల్పునది లోనున్న చైతన్యము - సాక్షాత్తుగాను, అపరోక్షముగాను చేయునవి - చేయించునది బ్రహ్మయే - బ్రహ్మ చైతన్యమే - అని శ్రుతి చెప్పుచున్నది).

  1. ఘటపటాది దర్శనంబె ప్రత్యక్షప్రమాణము - ప్రత్యక్షప్రమాణమనగా యెదుటనున్న విషయమును చూచిగాని, వినిగాని, స్పృశించిగాని, మూర్కొనిగాని, ఆస్వాదించిగాని యెఱుంగుట.

  2. ఇద్దరు మనుష్యులు దెబ్బలాడుచుండగ మూడవవాడు దానిని చూచుట ప్రత్యక్షప్రమాణము - ఆ ప్రకారముగానే ఒకడు ఇంకొకరిని తిట్టిన అది మూడవవాడు వినిన అది ప్రత్యక్షప్రమాణము - (Direct evidence).

Transliteration
  1. pratyakṣasya cakṣurādēḥ pramāṇaṃ. (cakṣurādi iṃdriyamulaku gōcaramaguṭa).

  2. “sanna karṣa ṣaṭkajanyaṃ jñānaṃ pratyakṣaṃ, tatkaraṇa miṃdriyaṃ, tasmāt iṃdriyaṃ pratyakṣa pramāṇamiti siddhaṃ -” (tarkasaṃgrahē)

(daggaragānuṃḍu viṣayamulaguṟiṃci - anagā, iṃdriyamulaku gōcaramagu viṣayamulaguṟiṃci kalugujñānamu pratyakṣajñānamu. dānini kalugacēyunavi iṃdriyamulu. aṃducēta iṃdriyamulu pratyakṣapramāṇamu - jñānēṃdriyamulacēta vāṭi vāṭi viṣayamulanu grahiṃci svayamugā anubhaviṃcuṭa).

  1. “pratyakṣapramāyāḥ karaṇaṃ pratyakṣapramāṇaṃ - pratyakṣapramā cātra caitanyamēva -”yatsākṣādaparōkṣādbrahma”.

(bṛhadāraṇyakōpaniṣat - 3 - 4 -1)

- iti śrutēḥ -“.

(pratyakṣapramāṇamu kalugahēyunadi iṃdriyamu - aṃducēta iṃdriyamu pratyakṣapramāṇamu - adi bahiriṃdriyamunu dāni vṛttini cēyunaṭlu purikolpunadi lōnunna caitanyamu - sākṣāttugānu, aparōkṣamugānu cēyunavi - cēyiṃcunadi brahmayē - brahma caitanyamē - ani śruti ceppucunnadi).

  1. ghaṭapaṭādi darśanaṃbe pratyakṣapramāṇamu - pratyakṣapramāṇamanagā yeduṭanunna viṣayamunu cūcigāni, vinigāni, spṛśiṃcigāni, mūrkonigāni, āsvādiṃcigāni yeṟuṃguṭa.

  2. iddaru manuṣyulu debbalāḍucuṃḍaga mūḍavavāḍu dānini cūcuṭa pratyakṣapramāṇamu - ā prakāramugānē okaḍu iṃkokarini tiṭṭina adi mūḍavavāḍu vinina adi pratyakṣapramāṇamu - (Direct evidence).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.