(తిరిగి పుట్టుట - సంసారము - పుట్టుట, చనిపోవుట, మరల పుట్టుట మరల చనిపోవుట).
(ఈ నరుడు ఈ లోకములో ఏ చిన్న కర్మ అయినను చేయునో, వాడు చనిపోయినతర్వాత దాని ఫలము పరలోకమునుపొంది మరల కర్మ చేయుటకు ఈ లోకమునకు వచ్చును).
యథావా మరణం ప్రాప్య ఆత్మాభవతి గౌతమ యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః |
స్థాణుమన్యే (అ)ను సం యంతి యథా కర్మ యథా శ్రుతం ||. (కఠోపనిషత్ - 2 - 6 - 7)
(పరమ రహస్యమైన విషయము చెప్పుచున్నాను - మరణము తర్వాత ఆత్మ యేమగును? వారి వారి కర్మలననుసరించి మఱియొక శరీరమును పొందుదురు - మరల జన్మించెదరు. కొందఱు స్థాణువు మొదలగువాటిని పొందెదరు. వారు చేసిన కర్మను అనుసరించియే జన్మ కలుగును).
(ఈ ప్రపంచమంతయు పరబ్రహ్మమే - ఈ ప్రపంచమునకు సృష్టి స్థితి లయములు ఆ పరబ్రహ్మవలననే కలుగుచున్నవి - కర్మ చేయువాడు, చేసిన ఫలమనుభవించువాడు. కర్మానురూపమగు శరీరమును కుదుర్చుకొనువాడు - అందుచేత ఏ నిశ్చయముతో ఏ కర్మ చేయునో, చనిపోయిన తర్వాత ఆ నిశ్చయమునకనుకూలమైన జన్మను పొందును) -
(జీవుడు ప్రాణముతోను, ఇంద్రియములతోను, మనస్సుతోను, అనాదియగు అవిద్యా ప్రభావమువలన కలిగిన పూర్వజన్మ వాసనలతో పూర్వదేహమును విడిచి కర్మానుగుణమగు మఱియొక దేహమును పొందును).
(జీవుడు ఒక శరీరమును విడుచునపుడు అతని ప్రాణములు అతనితోకూడ వెళ్ళును - మఱియొక దేహమును ఏర్పరచుకొనును).
తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ ||
తేతం భిక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ||. (శ్రీమద్భగవద్గీత - 9 - 20, 21)
(వేదములోని కర్మకాండ నభ్యసించి, యజ్ఞములుచేసి, సోమపానముచేసి, పాపములను పోగొట్టుకొనినవారు స్వర్గమును పొందుదురు. వారు ఇంద్రలోకములోని దేవభోగముల ననుభవించి, దానితో వారుచేసిన పుణ్యములు క్షీణించగనే మరల మానవలోకమునకు వచ్చెదరు - మానవులై పుట్టెదరు - వారికిట్లు పునర్జన్మ కలుగును).
(చేసిన కర్మయెట్టిదో, ఏట్లు ప్రవర్తించునో, ఆ ప్రకారముగనే అగును - మంచి పనులు చేసినవాడు మంచివాడగును, సాధువగును, సన్మార్గుడగును. పాపము చేసినవాడు పాపి యగును - పుణ్యకర్మ చేయుటవలన పుణ్యాత్ముడగును - పాపకర్మ చేయుటవలన పాపాత్ముడగును. “యథా కారీ యథా చారీ” అనగా, తన స్వభా వమునుబట్టి ఏట్లు ఆచరించునో. ఏట్లుచేయునో - అనగా, అగ్నిహోత్రము, సంధ్యావందనము మొదలగునవి ఆచరించుట - సాధుకర్మయనగా సత్కర్మ చేయువాడు బ్రాహ్మణుడు మొదలగు రమణీయమైన శరీరము కల వాడగును. పాపకర్మ చేయువాడు చండాలుడు మొదలగు కుత్సిత శరీరము కలవాడగును - ఇట్లగుట పూర్వ జన్మలో చేసిన పుణ్యపాపకర్మల వలననే జరుగును - అని “పుణ్యః పుణ్యేన” అను వాక్యముచే చెప్పబడినది).
తథా దేహాంతర ప్రాప్తిః - - ||” (శ్రీమద్భగవద్గీత - 2 -1 3)
(ఆత్మ ఈ సృష్టిలోని సమస్త వస్తువులలో నున్నాడు - ఆ వస్తువులన్నియు అతనికి దేహములే. ఏదో ఒక వస్తువులో నున్నపుడు దానికి వికారములు (మార్పులు) వచ్చుచునే యుండును - మానవ శరీరములో జీవుడు ఉన్నపుడు బాల్యము, కౌమారము, యౌవనము, వార్థక్యము (ముసలితనము) అను మార్పులు వచ్చుచున్నవి - ఒక దేహములోనే యిట్లు మార్పులుగలుగుచున్నట్లు ఆత్మకు దేహములుకూడా మారుచుండును - ఒక దేహమునుండి ఇంకొక దేహమునకు ఆత్మ మారుచుండును - ఇదియే జన్మాంతరము - పునర్జన్మ అని చెప్పబడినది).
తథా శరీరాణి విహాయ జీర్ణా స్యన్యాని సం యాతి నవాని దేహీ ||” (శ్రీమద్భగవద్గీత - 2 - 22)
(చినిగిపోయిన బట్టలను వదలి కొత్తబట్టలను నరుడు ఏ ప్రకారముగా ధరించునో ఆ ప్రకారముగానే దేహి (దేహము గలవాడు - ఆత్మ -) (జీవుడు, జీవాత్మ) జీర్ణించిపోయిన దేహమును (రోగము మొదలగువాటి వలన జీవుడు అంటిపెట్టుకొని ఉండుటకు తగిన స్థితిలో లేని దేహమును) విడిచి కొత్త శరీరమును - ఇంకొక శరీరమును - పొందును. ఇదియే పునర్జన్మ).
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ |
అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం |
త్తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః |
ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం |
తత్ర చాంధ్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే ||
శుక్ల కృష్ణే గతీహ్యే తే జగతః శాశ్వతే మతే |
ఏకయా యాత్యనావృత్తి మన్యయా వర్తతే పునః ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 23, 24, 25. 26)
(ఉపాసనలు చేయువారు చనిపోయినతర్వాత ఏమగుదురో చెప్పబడినది - ఎట్లంటే - భగవంతు నుపా సించువారు అర్చిరాదిమార్గముద్వారా పరబ్రహ్మమును చేరి ముక్తి నొందుదురు. ఇతర దేవతలనుపాసించువారు ధూమాది మార్గమున చంద్రలోకమునకు పోయి, తిరిగి భూమిమీద జనించెదరు).
సంప్రీతులగుచు దత్సాధనానుష్ఠాన నిరతులై, వేద నిర్ణీత భూరి
భగవత్సుధర్మ తద్భక్తి పరాఙ్ముఖులై దేవగణముల ననుదినంబు
భజియించుచును భక్తి బైతృక కర్మముల్ సేయుచు నెప్పుడు శిష్ట చరితు
లగుచు, దగ దేవ పితృ సువృతాథ్యులయిన కామ్య చిత్తులు ధూమాదిగతుల
జంద్రలోకమును జెంది; పుణ్యంబు లుప్తమయిన
మరలి వత్తురు భువికి జన్మంబు నొంద”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 32)
నంగీకరించుచునవి విసర్జించుచు సుఖ దుఃఖ భయ మోహ శోకములను
బొలుపొందు తద్దేహములనె పొందుచునుండు; నది యెట్టులన్నను నగ్రభాగ
తృణమాది మఱి పూర్వ తృణ పరిత్యాగంబు గావించు తృణజలూకయును బోలె
ఆ. జీవుడవని గొంత జీవించి మ్రియమాణు
డగుచునొండు దేహమర్ధి జెంది
కాని పూర్వమైన కాయంబు విడువడు
గాన మనమె జన్మ కారణంబు “. (శ్రీమహాభాగవతము - 4 - 29 - 890)
(పుష్పములనుండి గంధమును (వాసనను) గాలి యే విధముగా తనతో తీసుకొనిపోవునో, ఆ ప్రకారముగానే ఇంద్రియములు మొదలగు వాటితోకూడియున్న దేహములో నున్న జీవుడు ఆ శరీరమునుండి ఇంకొక శరీరములోనికి పోవునపుడు తనతో ఇంద్రియములు మొదలగువాటిని (సూక్ష్మరూపములోనున్నవాటిని) తీసుకొనిపోవును).
“విసర్గకాలే శుక్లస్య జీవః కరణ సం యుతః |
ప్రీత్యా ప్రవేశతే యోనిం కర్మ భిన్నైర్ని యోజితః ||“. (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 5)
(శుక్లము విసర్జించునపుడు దానిలోనున్న జీవుడు ఇంద్రియములతో తన పూర్వ జన్మలలో చేసిన కర్మఫలమునకు అనుకూలమైన యోనిని ప్రవేశించును - మఱియొక జన్మమునొందును).
పునర్జన్మంబునకు కారణములు -
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 60)
(కులశేఖరమహీపాల చరిత్ర - 2 - 122)
వ. ఈ స్థూలరూపంబుకంటె నదృష్టగుణంబయి, యశ్రుతంబయిన వస్తువగుటం జేసి వ్యక్తంబుగాక, సూక్ష్మంబై కరచరణాదులు లేక జీవునికి నొండొక రూపంబు విరచితంబై యుండు - సూక్ష్ముడయిన జీవునివలన నుత్క్రాంతి గమనా గమనంబుల బునర్జన్మంబు దోచును. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 30)
“లింగ దేహమజ్ఞాన గర్భమందు చెడకుండును. అదే పునర్జన్మ బీజము - ఆ లింగదేహం యే పర్యంతం చెడకయుండునో ఆ పర్యంతమున్నూ జననమరణాదులు జీవులకు కలుగుచునుండును - వివేక ప్రళయునిచేత గాని లింగదేహ భంగంకాదు; అప్పుడుగాని మోక్షం లేదు” (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 2)
“వ. దేహి కర్మంబు లాచరించి కర్మ బద్దుండయి క్రమ్మఱం గర్మానుకూలంబయిన దేహంబు దాల్చు”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 7 - 241)
(ధూమాది మార్గమున చంద్ర లోకమునకు పోయి తిరిగి జన్మ పొందవలసినవారు ఆహార పదార్థములలో ప్రవేశించి ఆ ఆహారమును తినువారిలో అది రేతస్సుగా మారి అది స్త్రీ రూపమైన అగ్నిలో హోమము చేయబది తిరిగి జన్మ పొందెదరు) - (చూడుము - ’ పంచాగ్ని విద్య ’ - స్త్రీ పంచాగ్నులలఓ నొకటి).
(చనిపోవుటకు ముందు దేనినైతే ధ్యానించునో ఆ రూపముతోనే జనించును).
తం త్వమేవైతి కౌంతేయ సదా తద్భావ బావితః ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 6)
- ఇతి స్మృత్యనురోధేన యథా దేహాంతరప్రాప్తి కారణం భావనైవ, తథా అస్మిన్ లోకే యే యే సవిశేషేణ నిర్విశేషేణవా భావేన మాం భజంతి తే తే పురుషాః సవిశేషం నిర్విశేషం వా బ్రహ్మ భవంతి ఇతి - అత్ర ” యథా యథోపాసతే తధైవ భవతీతి శ్రుతేః -
(మరణకాలమందు ఏ భావమును మనసులో తలచు చుండునో ఆ భావమునే పొందును - దీనివలన పునర్జన్మ కలదని, అది యెటువంటి జన్మయో వాని అవసాన కాలమందలి భావమును బట్టి యుండును అని తెలియుచున్నది. అవసాన కాలమందుండు భావము కర్మ వాసనలనుబట్టి యుండును - జన్మ కలుగవలెననిన కలుగును, భగవంతునే స్మరించిన - సగుణబ్రహ్మ గుఱించికాని, నిర్గుణబ్రహ్మ గుఱించికాని భావించినాట్టి వారా బ్రహ్మమే యగుదురు - అప్పుడు పునర్జన్మ లేదు. ఎప్పుడు చనిపోయెదమో తెలియదు కనుక ఎల్లపుడు భగవత్ ధ్యానము చేయుచుండిన అవసాన దశయందు అదే భావముండును - అట్లుగాకున్న మనస్సు విషయములమీదికి పోవును. భగవంతుని సగుణడనికాని నిర్గుణుడనికాని ఉపాసించిన భేదము లేదు
తాస్యహం వేద సర్వాణి న త్వం వేత్ధ పరంతప ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 5)
(నాకు అనేక జన్మలు కలిగినవి, నీకు కూడ (అర్జనునకు కూడ) అనేక జన్మలు కలిగినవి. అవి అన్నియు నాకు తెలుసును - నీకు తెలియవు).
“అతిక్రాంతాని జన్మాని స్వేచ్ఛోపాత్తవ పూమ్షిమే |
బహూని పరమేశస్య వాసుదేవస్య సద్విభోః |
తవచాజ్ఞాధినః కర్మ నిర్మితాని తథా అర్జున |
తాని జన్మాని సర్వాణి సర్వజ్ఞో (అ)హం మహేశ్వరః |
విజానామి, త్వదీయాని మదీయాని త్య లుప్త దృక్|
సత్వంవేత్థ తిరోభూత జ్ఞాన శక్తి త యాజ్ఞకః ||“. (గీతాభావప్రకాశము - 4 - 28 to 31)
(నా ఇష్టప్రకారము నేను ఎత్తిన జన్మలు - శరీరములు - అనేకములు గడిచిపోయినవి - నీవు చేసినకర్మలు కారణముగా నీకు అనేక జన్మలు కలిగినవి. నేను సర్వజ్ఞడనగుతవలన నీ జన్మలన్నింటిని, నా జన్మలన్నింటిని నాకు తెలుసును. నీ జ్ఞానశక్తి తిరోహతమైనది - పోయినది. అందుచేత నీవు నీకు పూర్వము కలిగిన జన్మలను తెలుసుకొనలేవు).
(దీనివలన పూర్వజన్మలుండునని, పూర్వజన్మ జ్ఞానము జన్మించిన తర్వాత ఉండదని తెలియుచున్నది. అట్లు కాకున్న పుట్టినవాడు ఎక్కడనుండి వచ్చెను - చనిపోయినవాడు ఎక్కడికి పోయెను? “జన్మాంతరాను భూతంచ న స్మర్యత్” (ఇదివరకు జరిగిన జన్మలోని అనుభవము స్మరణకు రాదు - జ్ఞాపకమునకు రాదు).
“అహం నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వజావత్వాదనావరణ జ్ఞాన శక్తిరితి” వేదాహం “- త్వం హే అర్జున, నవేత్థ ధర్మాధర్మాది ప్రతిబద్ధ జ్ఞాన శక్తిత్వాత్” (శ్రీశంకరః - గీతాభాష్యే - 4 - 5)
(భగవంతుడు నిత్య శుద్ధబుద్ధ ముక్త స్వభావముగలవాడగుటచేత నా జ్ఞానము ఏ విధమైనావరణచేత కప్పబడియుండదు - అందుచేత నాకు గతించిన జన్మలు, నీకు గతించిన జన్మలు నాకు తెలుసును - పాపపుణ్యములచేత నీ జ్ఞానశక్తి కప్పబడియుండుటచేత ఆ జన్మలు నీకు తెలియవు).
“ఆ బ్రహ్మ భువనా ల్లోకాః పునరావర్తినో (అ) ర్జున” (శ్రీమద్భగవద్గీత - 8 -16)
(బ్రహ్మలోకము మొదలుగాగల లోకములన్నియు మరల మరల జన్మించుచుండునవియే - కలుగు చుండునవియే).
పురాణములలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన పునర్జన్మలు - (ఉదాహరణకు).
“తే. అమ్మహాత్ముని (శివుని) అంక పీఠమ్మునందు
నాదరంబుననుండు దేహంబు దక్షు
వలని దోషంబునను విడువంగ దలచి
తాల్చె తనువున ననిలాగ్ని దారుణములు.
వ. ధరించి గత కల్మషంబైన దేహంబుగల సతీదేవి నిజయోగసమాధి జనితంబయిన వహ్నిచే దత్షణంబ దగ్ధమ య్యె”
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 4 - 98)
సతీసతీ యోగవిసృష్ట దేహా తాం జన్మనే శైలవధూం ప్రపేదే (కుమారసంభవము -)
ఇట్లు సతియగు శివుని భార్య అయిన సతీదేవి యోగాగ్నిచే తన శరీరమును దగ్ధము చేసుకొని మారు జన్మ కొఱకు హిమవంతుని భార్యను మేనకను పొందెను - పొంది పార్వతిగా జన్మించి శివుని వివాహము చేసుకొనెను).
మన్మధుడు - “నీవు నారాయణ నందనుండవైన కందర్పుండవు. పూర్వకాలంబున నేను నీకు భార్య నైన రతిని; నీవు శిశువై యుండునెడ నిర్దయుండవై దొంగిలి తల్లిం దొఱంగజేసి శంబరుండు కొని వచ్చి నిన్ను నీరధిలో వైచిన నొక్క మీనంబు మ్రింగె. మీనోదరంబు వెడలితీవు” (రతీ దేవి శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నునితో) - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 13)
జయ విజయులు - “శాపాపహతులై హరి పార్శ్వచరులైన పురుషులిరువురు (జయ, విజయులు) హిరణ్యకశిపు హిరణ్యాక్షులన దితికి జన్మించిరి. రెండవ భవంబున గైకసి యను రాక్షసికి రావణ కుంభకర్ణులయి సంభవించి - - - తృతీయ మన్మబున మీ తల్లి చెరియలికి శిశుపాల దంతవక్త్రులన నుద్భవించి - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 1 - 24)
నారదుడు : - “పోయిన మహాకల్పంబునందు గంధర్వులలోన నుపబర్హణుండను పేరుగల గంధర్వుండ - - - విశ్వస్రష్ట శపించిన నొక్క బ్రాహ్మణ దానికి బుత్రుండనై జన్మించి యందు బ్రహ్మవాదులైన పెద్దలకు శుశ్రూష చేసిన భాగ్యంబున నిమ్మహాకల్పంబునందు బ్రహ్మపుత్రుండనై జన్మించి - - -)”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 472)
దేవకీ వసుదేవులు : -
వ. “ఈశ్వరుండిట్లనియె - అవ్వా నీవు దొల్లి స్వాయంభువమన్వంతరంబున బృశ్నియను మహా పతివ్రతవు, వసుదేవుండును సుతపుండను ప్రజాపతి. మీ రిరువురును - - -పండ్రెండువేల దివ్యవర్షంబులు తపంబు సేసిన - - - మీకేను బృశ్నిగర్భుండను నర్భకుండనయితి. మఱియును –
క. అదితియు గశ్యపుడనగా
విదితులరగుమీకు గుఱుచ వేషంబుననే
నుదయించితి వామనుడన
ద్రిదశేంద్రానుజుడనై ద్వితీయ భవమునన్
క. ఇప్పుడు మూడవ భవమున
దప్పక మీకిరువురకును దనయుడ నైతిన్“. (శ్రీకృష్ణుడు దేవకితో)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 131, 132, 133)
“మ. భరతుండల్లన యంత్యకాలము వెసం బ్రాపింపగా నప్పుడా
హరిణంబుం గడుభక్తి బుత్రగతి సత్యాసక్తి వీక్షింప, నా
హరిణంబుం దన యాత్మలోనిలిపి దేహంబంతటంబాసి, తా
హరిణీగర్భమునన్ జనించి హరిణంబై యొప్పె బూర్వస్మృతిన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 114)
“క. మునిపతి నవమానించిన
ఘనుడింద్రద్యుమ్నవిభుడు గౌంజరయోనిం
జనంబందెను - - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 4 - 124)
(పుట్టినవానికి చావు తప్పదు, చనిపోయినవానికి మరల జన్మ తప్పదు - పుట్టినది గిట్టక తప్పదు).
పునర్జన్మ ఏట్లు లేకుండుననగా : -
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి, మామేతి సో(అ)ర్జున ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 9)
“జన్మైవం నిత్య సిద్ధస్య చిదానంద ఘనస్య మే |
లీలయా (అ)మోఘయా శక్త్యా తథానుకరణం క్షితౌ |
ధర్మ సంస్థాపనే నైవ జగతః పరిపాలనం |
కర్మ మే వాసుదేవస్య నిత్య సిద్ధేశ్వరస్య చ |
అక్రియస్వాతి శుద్ధస్య దివ్య మప్రాకృతం పరం |
అన్యైః కర్తు మశక్యం యద సాధారణ మైశ్వరం |
యో వేత్తి తత్వతో భ్రాంతిం త్యక్త్వై వం మూఢ ధీగతాం |
సచ్చిదానంద రూపస్యా జస్యాపి స్వాత్మ మాయయా |
జన్మానుకరణం చైవ మ కర్తురపి సర్వథా |
కర్మానుకలణం లోకానుగ్రహామేతి వేత్తి యః |
స ఆత్మ తత్వ విజ్ఞానత్త్యక్త్వా దేహమిమం బుధః |
ప్రాప్నోతి న పునర్జన్మ మామేవైతి చిద ద్వయం |
జీవన్ముక్తో మునిర్భూత్వా సంసారా న్ముచ్యతే (అ)ర్జున ||“. (గీతాభావప్రకాశము - 4 - 58 to 64)
(“పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం |
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 8)
(సాధు జనులను రక్షించుటకును, దుర్మార్గులను నశింపచేయుటకు, ధర్మమును స్థాపించుటకును ప్రతియుగమందు నేను అవతరించుచున్నాను - జన్మించుచున్నాను - నేను నిత్య సిద్ధుడను - అనగా, ఎల్లపుడూ, అవసరమైనపుడు ఉద్భవించుటకు సిద్ధమైన స్థితిలోనుండువాడను -, చిదానంద ఘనుడను. అట్టి నా జన్మ ఈ ప్రకారముగా అవతారమెత్తుట లీలామాత్రము, నా అమోఘ శక్తిచేత భూమి మీద మిగిలిన ప్రాణులవలె అనుకరించడమే - వాటిలో ఒకడుగా మెలగుటయే. నేను సృష్టించిన ఈ జగత్తుయొక్క పరిపాలన (స్థితి) ధర్మ సంస్థాపన వలననే జరుగును - వాసుదేవుడు (అన్ని భూతములలోను నివసించు దేవుడు), నిత్యసిద్ధుడు, ఈశ్వరుడు, అతిశుద్ధుడు,అవిక్రియుడు (మార్పు లేనివాడు) అయిన నా యీ అవతారములలోని కర్మ దివ్యమైనటువంటిది, ప్రకృతికి సంబంధించనది, ఉత్కృష్టమైనది, నా ఈశ్వరత్వ శక్తివలన కలుగునది, ఇతరులు చేయుటకు శక్యముకానిది. స్వతః జన్మ లేనటువంటిన్నీ సచ్చిదా నందరూపుడైనటువంటిన్నీ నేను ఈ ప్రకారము నా మాయచేత జన్మించినట్లుగా నగుటయు, ఏ కర్మకును నేను కర్తను కానప్పటికీ యీ నా అవతారములలో నేను చేసిన కర్మ లోకానుగ్రహముకొఱకే అనియు ఎవడు మూఢబుద్ధివలన కలిగిన భ్రాంతిని వదలి వాటి తత్వమును - యథార్థముగా - తెలుసుకొనునో అట్టి విద్వాంసుడు ఆత్మ తత్వమును తెలుసుకొని యుండుటవలన ఈ దేహమును విడిచిపెట్టి తిరిగి జన్మ పొందడు - చిద్రూపుడను, అద్వయుడను అయిన నన్నే పొందును. ఇట్టి ముని జీవన్ముక్తుడై సంసారమును - అనగా, మరల మరల జన్మించుటను - పొందడు - పునర్జన్మ లేనివాడగును).
నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 15)
(బ్రతికి యున్నంతకాలము, ఎల్లవేళలందు నన్నే (భగవంతునే) ధ్యానించుచు, ఇతర విషయము తలంచక యుండువానికి నేను సులువుగా లభ్యమగుదును. కనుక ఇతర విషయమును మాని నా యందే సమాహితమైన మనస్సుకలవాడు నా విష్ణు తత్వమును పొందును. అట్టివాడు గర్భవాసము, భగముద్వారా నిర్గమము - జన్మము - మొదలగు కష్టములకు ఆకరమై, భ్రమకు స్థానమై, దుఃఖమునకు నివాసము అయిన పునర్జన్మను పొందడు).
ముని ననఘ ననంతు, నీశు, పురుషోత్తము స
న్మనమున భజియింపుము, ముద
మున బునరావృత్తిలేని ముక్తి లభించున్|“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 32 -)
మల్లికార్జునకో రాజన్! యత్ర తిష్టతి నిత్యశః |
తత్రైవ శిఖరం రమ్యం పర్వతో పరిశోభితం |
శృంగదర్శనమాత్రేణ ముక్తిరేవన సంశయః |
అత్ర గంగా మహారమ్యా పాతాళేతి సమాశ్రితా |
తత్ర చ స్నానమాత్రేణ మహాపాపైః ప్రముచ్యతే |
శ్రీశైల శిఖరం దృష్ట్వా వారణాస్యాం మృతో ధ్రువం |
కేదారే హ్యుదకం పీత్వా పునర్జన్మ న విద్యతే ||“. (పద్మపురాణము ఉత్తరఖండము)
(శ్రీశైల పర్వతము అన్నింటికన్న బాగుగా కనబడును, అన్ని చోట్లనుండి కనబడును. మల్లికార్జునుడు ఎల్లపుడూ అక్కడ ఉండును - ఆ పర్వత శిఖరము రమ్యమైనది. ఆ శిఖరమును చూచినంతమాత్రమున ముక్తి కలుగును. ఇందుకు సంశయములేదు. ఇచ్చట పాతాళగంగ కలదు - అందులో స్నానము చేసిన మహాపాతకములు నశించును - శ్రీశైల శిఖరమును చూచినను, కాశిలో చనిపోయినను, కేదారమందు నీటిని త్రాగినను పునర్జన్మ కలుగదు).
దార జలంబులర్థిమెయి ద్రావి శరీరము కోరవోవగా |
నారడి నొందనేల యొక్క యప్పుడు జన్మలేక యుంటకై |
యారయ శ్రీనగంబు శిఖరాగ్రము చూచిన జాలు నెమ్మదిన్ ||“. (విక్రమార్క చరిత్ర -)
(tirigi puṭṭuṭa - saṃsāramu - puṭṭuṭa, canipōvuṭa, marala puṭṭuṭa marala canipōvuṭa).
(ī naruḍu ī lōkamulō ē cinna karma ayinanu cēyunō, vāḍu canipōyinatarvāta dāni phalamu paralōkamunupoṃdi marala karma cēyuṭaku ī lōkamunaku vaccunu).
yathāvā maraṇaṃ prāpya ātmābhavati gautama yōnimanyē prapadyaṃtē śarīratvāya dēhinaḥ |
sthāṇumanyē (a)nu saṃ yaṃti yathā karma yathā śrutaṃ ||. (kaṭhōpaniṣat - 2 - 6 - 7)
(parama rahasyamaina viṣayamu ceppucunnānu - maraṇamu tarvāta ātma yēmagunu? vāri vāri karmalananusariṃci maṟiyoka śarīramunu poṃduduru - marala janmiṃcedaru. koṃdaṟu sthāṇuvu modalaguvāṭini poṃdedaru. vāru cēsina karmanu anusariṃciyē janma kalugunu).
(ī prapaṃcamaṃtayu parabrahmamē - ī prapaṃcamunaku sṛṣṭi sthiti layamulu ā parabrahmavalananē kalugucunnavi - karma cēyuvāḍu, cēsina phalamanubhaviṃcuvāḍu. karmānurūpamagu śarīramunu kudurcukonuvāḍu - aṃducēta ē niścayamutō ē karma cēyunō, canipōyina tarvāta ā niścayamunakanukūlamaina janmanu poṃdunu) -
(jīvuḍu prāṇamutōnu, iṃdriyamulatōnu, manassutōnu, anādiyagu avidyā prabhāvamuvalana kaligina pūrvajanma vāsanalatō pūrvadēhamunu viḍici karmānuguṇamagu maṟiyoka dēhamunu poṃdunu).
(jīvuḍu oka śarīramunu viḍucunapuḍu atani prāṇamulu atanitōkūḍa veḷḷunu - maṟiyoka dēhamunu ērparacukonunu).
tē puṇyamāsādya surēṃdralōkamaśnaṃti divyān divi dēvabhōgān ||
tētaṃ bhiktvā svargalōkaṃ viśālaṃ kṣīṇē puṇyē martyalōkaṃ viśaṃti ||. (śrīmadbhagavadgīta - 9 - 20, 21)
(vēdamulōni karmakāṃḍa nabhyasiṃci, yajñamulucēsi, sōmapānamucēsi, pāpamulanu pōgoṭṭukoninavāru svargamunu poṃduduru. vāru iṃdralōkamulōni dēvabhōgamula nanubhaviṃci, dānitō vārucēsina puṇyamulu kṣīṇiṃcaganē marala mānavalōkamunaku vaccedaru - mānavulai puṭṭedaru - vārikiṭlu punarjanma kalugunu).
(cēsina karmayeṭṭidō, ēṭlu pravartiṃcunō, ā prakāramuganē agunu - maṃci panulu cēsinavāḍu maṃcivāḍagunu, sādhuvagunu, sanmārguḍagunu. pāpamu cēsinavāḍu pāpi yagunu - puṇyakarma cēyuṭavalana puṇyātmuḍagunu - pāpakarma cēyuṭavalana pāpātmuḍagunu. “yathā kārī yathā cārī” anagā, tana svabhā vamunubaṭṭi ēṭlu ācariṃcunō. ēṭlucēyunō - anagā, agnihōtramu, saṃdhyāvaṃdanamu modalagunavi ācariṃcuṭa - sādhukarmayanagā satkarma cēyuvāḍu brāhmaṇuḍu modalagu ramaṇīyamaina śarīramu kala vāḍagunu. pāpakarma cēyuvāḍu caṃḍāluḍu modalagu kutsita śarīramu kalavāḍagunu - iṭlaguṭa pūrva janmalō cēsina puṇyapāpakarmala valananē jarugunu - ani “puṇyaḥ puṇyēna” anu vākyamucē ceppabaḍinadi).
tathā dēhāṃtara prāptiḥ - - ||” (śrīmadbhagavadgīta - 2 -1 3)
(ātma ī sṛṣṭilōni samasta vastuvulalō nunnāḍu - ā vastuvulanniyu ataniki dēhamulē. ēdō oka vastuvulō nunnapuḍu dāniki vikāramulu (mārpulu) vaccucunē yuṃḍunu - mānava śarīramulō jīvuḍu unnapuḍu bālyamu, kaumāramu, yauvanamu, vārthakyamu (musalitanamu) anu mārpulu vaccucunnavi - oka dēhamulōnē yiṭlu mārpulugalugucunnaṭlu ātmaku dēhamulukūḍā mārucuṃḍunu - oka dēhamunuṃḍi iṃkoka dēhamunaku ātma mārucuṃḍunu - idiyē janmāṃtaramu - punarjanma ani ceppabaḍinadi).
tathā śarīrāṇi vihāya jīrṇā syanyāni saṃ yāti navāni dēhī ||” (śrīmadbhagavadgīta - 2 - 22)
(cinigipōyina baṭṭalanu vadali kottabaṭṭalanu naruḍu ē prakāramugā dhariṃcunō ā prakāramugānē dēhi (dēhamu galavāḍu - ātma -) (jīvuḍu, jīvātma) jīrṇiṃcipōyina dēhamunu (rōgamu modalaguvāṭi valana jīvuḍu aṃṭipeṭṭukoni uṃḍuṭaku tagina sthitilō lēni dēhamunu) viḍici kotta śarīramunu - iṃkoka śarīramunu - poṃdunu. idiyē punarjanma).
prayātā yāṃti taṃ kālaṃ vakṣyāmi bharatarṣabha |
agnirjyōtirahaḥ śuklaḥ ṣaṇmāsā uttarāyaṇaṃ |
ttatra prayātā gacchaṃti brahma brahmavidō janāḥ |
dhūmō rātristathā kṛṣṇaḥ ṣaṇmāsā dakṣiṇāyanaṃ |
tatra cāṃdhramasaṃ jyōtiryōgī prāpya nivartatē ||
śukla kṛṣṇē gatīhyē tē jagataḥ śāśvatē matē |
ēkayā yātyanāvṛtti manyayā vartatē punaḥ ||“. (śrīmadbhagavadgīta - 8 - 23, 24, 25. 26)
(upāsanalu cēyuvāru canipōyinatarvāta ēmagudurō ceppabaḍinadi - eṭlaṃṭē - bhagavaṃtu nupā siṃcuvāru arcirādimārgamudvārā parabrahmamunu cēri mukti noṃduduru. itara dēvatalanupāsiṃcuvāru dhūmādi mārgamuna caṃdralōkamunaku pōyi, tirigi bhūmimīda janiṃcedaru).
saṃprītulagucu datsādhanānuṣṭhāna niratulai, vēda nirṇīta bhūri
bhagavatsudharma tadbhakti parāṅmukhulai dēvagaṇamula nanudinaṃbu
bhajiyiṃcucunu bhakti baitṛka karmamul sēyucu neppuḍu śiṣṭa caritu
lagucu, daga dēva pitṛ suvṛtāthyulayina kāmya cittulu dhūmādigatula
jaṃdralōkamunu jeṃdi; puṇyaṃbu luptamayina
marali vatturu bhuviki janmaṃbu noṃda”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 32)
naṃgīkariṃcucunavi visarjiṃcucu sukha duḥkha bhaya mōha śōkamulanu
bolupoṃdu taddēhamulane poṃducunuṃḍu; nadi yeṭṭulannanu nagrabhāga
tṛṇamādi maṟi pūrva tṛṇa parityāgaṃbu gāviṃcu tṛṇajalūkayunu bōle
ā. jīvuḍavani goṃta jīviṃci mriyamāṇu
ḍagucunoṃḍu dēhamardhi jeṃdi
kāni pūrvamaina kāyaṃbu viḍuvaḍu
gāna maname janma kāraṇaṃbu “. (śrīmahābhāgavatamu - 4 - 29 - 890)
(puṣpamulanuṃḍi gaṃdhamunu (vāsananu) gāli yē vidhamugā tanatō tīsukonipōvunō, ā prakāramugānē iṃdriyamulu modalagu vāṭitōkūḍiyunna dēhamulō nunna jīvuḍu ā śarīramunuṃḍi iṃkoka śarīramulōniki pōvunapuḍu tanatō iṃdriyamulu modalaguvāṭini (sūkṣmarūpamulōnunnavāṭini) tīsukonipōvunu).
“visargakālē śuklasya jīvaḥ karaṇa saṃ yutaḥ |
prītyā pravēśatē yōniṃ karma bhinnairni yōjitaḥ ||“. (brahmavidyā sudhārṇavamu - 5)
(śuklamu visarjiṃcunapuḍu dānilōnunna jīvuḍu iṃdriyamulatō tana pūrva janmalalō cēsina karmaphalamunaku anukūlamaina yōnini pravēśiṃcunu - maṟiyoka janmamunoṃdunu).
punarjanmaṃbunaku kāraṇamulu -
(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 60)
(kulaśēkharamahīpāla caritra - 2 - 122)
va. ī sthūlarūpaṃbukaṃṭe nadṛṣṭaguṇaṃbayi, yaśrutaṃbayina vastuvaguṭaṃ jēsi vyaktaṃbugāka, sūkṣmaṃbai karacaraṇādulu lēka jīvuniki noṃḍoka rūpaṃbu viracitaṃbai yuṃḍu - sūkṣmuḍayina jīvunivalana nutkrāṃti gamanā gamanaṃbula bunarjanmaṃbu dōcunu. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 30)
“liṃga dēhamajñāna garbhamaṃdu ceḍakuṃḍunu. adē punarjanma bījamu - ā liṃgadēhaṃ yē paryaṃtaṃ ceḍakayuṃḍunō ā paryaṃtamunnū jananamaraṇādulu jīvulaku kalugucunuṃḍunu - vivēka praḷayunicēta gāni liṃgadēha bhaṃgaṃkādu; appuḍugāni mōkṣaṃ lēdu” (brahmavidyāsudhārṇavamu - 2)
“va. dēhi karmaṃbu lācariṃci karma badduṃḍayi krammaṟaṃ garmānukūlaṃbayina dēhaṃbu dālcu”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 7 - 241)
(dhūmādi mārgamuna caṃdra lōkamunaku pōyi tirigi janma poṃdavalasinavāru āhāra padārthamulalō pravēśiṃci ā āhāramunu tinuvārilō adi rētassugā māri adi strī rūpamaina agnilō hōmamu cēyabadi tirigi janma poṃdedaru) - (cūḍumu - ’ paṃcāgni vidya ’ - strī paṃcāgnulalaō nokaṭi).
(canipōvuṭaku muṃdu dēninaitē dhyāniṃcunō ā rūpamutōnē janiṃcunu).
taṃ tvamēvaiti kauṃtēya sadā tadbhāva bāvitaḥ ||“. (śrīmadbhagavadgīta - 8 - 6)
- iti smṛtyanurōdhēna yathā dēhāṃtaraprāpti kāraṇaṃ bhāvanaiva, tathā asmin lōkē yē yē saviśēṣēṇa nirviśēṣēṇavā bhāvēna māṃ bhajaṃti tē tē puruṣāḥ saviśēṣaṃ nirviśēṣaṃ vā brahma bhavaṃti iti - atra ” yathā yathōpāsatē tadhaiva bhavatīti śrutēḥ -
(maraṇakālamaṃdu ē bhāvamunu manasulō talacu cuṃḍunō ā bhāvamunē poṃdunu - dīnivalana punarjanma kaladani, adi yeṭuvaṃṭi janmayō vāni avasāna kālamaṃdali bhāvamunu baṭṭi yuṃḍunu ani teliyucunnadi. avasāna kālamaṃduṃḍu bhāvamu karma vāsanalanubaṭṭi yuṃḍunu - janma kalugavalenanina kalugunu, bhagavaṃtunē smariṃcina - saguṇabrahma guṟiṃcikāni, nirguṇabrahma guṟiṃcikāni bhāviṃcināṭṭi vārā brahmamē yaguduru - appuḍu punarjanma lēdu. eppuḍu canipōyedamō teliyadu kanuka ellapuḍu bhagavat dhyānamu cēyucuṃḍina avasāna daśayaṃdu adē bhāvamuṃḍunu - aṭlugākunna manassu viṣayamulamīdiki pōvunu. bhagavaṃtuni saguṇaḍanikāni nirguṇuḍanikāni upāsiṃcina bhēdamu lēdu
tāsyahaṃ vēda sarvāṇi na tvaṃ vētdha paraṃtapa ||“. (śrīmadbhagavadgīta - 4 - 5)
(nāku anēka janmalu kaliginavi, nīku kūḍa (arjanunaku kūḍa) anēka janmalu kaliginavi. avi anniyu nāku telusunu - nīku teliyavu).
“atikrāṃtāni janmāni svēcchōpāttava pūmṣimē |
bahūni paramēśasya vāsudēvasya sadvibhōḥ |
tavacājñādhinaḥ karma nirmitāni tathā arjuna |
tāni janmāni sarvāṇi sarvajñō (a)haṃ mahēśvaraḥ |
vijānāmi, tvadīyāni madīyāni tya lupta dṛk|
satvaṃvēttha tirōbhūta jñāna śakti ta yājñakaḥ ||“. (gītābhāvaprakāśamu - 4 - 28 to 31)
(nā iṣṭaprakāramu nēnu ettina janmalu - śarīramulu - anēkamulu gaḍicipōyinavi - nīvu cēsinakarmalu kāraṇamugā nīku anēka janmalu kaliginavi. nēnu sarvajñaḍanagutavalana nī janmalanniṃṭini, nā janmalanniṃṭini nāku telusunu. nī jñānaśakti tirōhatamainadi - pōyinadi. aṃducēta nīvu nīku pūrvamu kaligina janmalanu telusukonalēvu).
(dīnivalana pūrvajanmaluṃḍunani, pūrvajanma jñānamu janmiṃcina tarvāta uṃḍadani teliyucunnadi. aṭlu kākunna puṭṭinavāḍu ekkaḍanuṃḍi vaccenu - canipōyinavāḍu ekkaḍiki pōyenu? “janmāṃtarānu bhūtaṃca na smaryat” (idivaraku jarigina janmalōni anubhavamu smaraṇaku rādu - jñāpakamunaku rādu).
“ahaṃ nitya śuddha buddha mukta svajāvatvādanāvaraṇa jñāna śaktiriti” vēdāhaṃ “- tvaṃ hē arjuna, navēttha dharmādharmādi pratibaddha jñāna śaktitvāt” (śrīśaṃkaraḥ - gītābhāṣyē - 4 - 5)
(bhagavaṃtuḍu nitya śuddhabuddha mukta svabhāvamugalavāḍaguṭacēta nā jñānamu ē vidhamaināvaraṇacēta kappabaḍiyuṃḍadu - aṃducēta nāku gatiṃcina janmalu, nīku gatiṃcina janmalu nāku telusunu - pāpapuṇyamulacēta nī jñānaśakti kappabaḍiyuṃḍuṭacēta ā janmalu nīku teliyavu).
“ā brahma bhuvanā llōkāḥ punarāvartinō (a) rjuna” (śrīmadbhagavadgīta - 8 -16)
(brahmalōkamu modalugāgala lōkamulanniyu marala marala janmiṃcucuṃḍunaviyē - kalugu cuṃḍunaviyē).
purāṇamulalō ceppabaḍina konni mukhyamaina punarjanmalu - (udāharaṇaku).
“tē. ammahātmuni (śivuni) aṃka pīṭhammunaṃdu
nādaraṃbunanuṃḍu dēhaṃbu dakṣu
valani dōṣaṃbunanu viḍuvaṃga dalaci
tālce tanuvuna nanilāgni dāruṇamulu.
va. dhariṃci gata kalmaṣaṃbaina dēhaṃbugala satīdēvi nijayōgasamādhi janitaṃbayina vahnicē datṣaṇaṃba dagdhama yye”
(śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 4 - 98)
satīsatī yōgavisṛṣṭa dēhā tāṃ janmanē śailavadhūṃ prapēdē (kumārasaṃbhavamu -)
iṭlu satiyagu śivuni bhārya ayina satīdēvi yōgāgnicē tana śarīramunu dagdhamu cēsukoni māru janma koṟaku himavaṃtuni bhāryanu mēnakanu poṃdenu - poṃdi pārvatigā janmiṃci śivuni vivāhamu cēsukonenu).
manmadhuḍu - “nīvu nārāyaṇa naṃdanuṃḍavaina kaṃdarpuṃḍavu. pūrvakālaṃbuna nēnu nīku bhārya naina ratini; nīvu śiśuvai yuṃḍuneḍa nirdayuṃḍavai doṃgili talliṃ doṟaṃgajēsi śaṃbaruṃḍu koni vacci ninnu nīradhilō vaicina nokka mīnaṃbu mriṃge. mīnōdaraṃbu veḍalitīvu” (ratī dēvi śrīkṛṣṇuni kumāruḍaina pradyumnunitō) - (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 13)
jaya vijayulu - “śāpāpahatulai hari pārśvacarulaina puruṣuliruvuru (jaya, vijayulu) hiraṇyakaśipu hiraṇyākṣulana ditiki janmiṃciri. reṃḍava bhavaṃbuna gaikasi yanu rākṣasiki rāvaṇa kuṃbhakarṇulayi saṃbhaviṃci - - - tṛtīya manmabuna mī talli ceriyaliki śiśupāla daṃtavaktrulana nudbhaviṃci - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 1 - 24)
nāraduḍu : - “pōyina mahākalpaṃbunaṃdu gaṃdharvulalōna nupabarhaṇuṃḍanu pērugala gaṃdharvuṃḍa - - - viśvasraṣṭa śapiṃcina nokka brāhmaṇa dāniki butruṃḍanai janmiṃci yaṃdu brahmavādulaina peddalaku śuśrūṣa cēsina bhāgyaṃbuna nimmahākalpaṃbunaṃdu brahmaputruṃḍanai janmiṃci - - -)”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 472)
dēvakī vasudēvulu : -
va. “īśvaruṃḍiṭlaniye - avvā nīvu dolli svāyaṃbhuvamanvaṃtaraṃbuna bṛśniyanu mahā pativratavu, vasudēvuṃḍunu sutapuṃḍanu prajāpati. mī riruvurunu - - -paṃḍreṃḍuvēla divyavarṣaṃbulu tapaṃbu sēsina - - - mīkēnu bṛśnigarbhuṃḍanu narbhakuṃḍanayiti. maṟiyunu –
ka. aditiyu gaśyapuḍanagā
viditularagumīku guṟuca vēṣaṃbunanē
nudayiṃciti vāmanuḍana
dridaśēṃdrānujuḍanai dvitīya bhavamunan
ka. ippuḍu mūḍava bhavamuna
dappaka mīkiruvurakunu danayuḍa naitin”. (śrīkṛṣṇuḍu dēvakitō)
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 131, 132, 133)
“ma. bharatuṃḍallana yaṃtyakālamu vesaṃ brāpiṃpagā nappuḍā
hariṇaṃbuṃ gaḍubhakti butragati satyāsakti vīkṣiṃpa, nā
hariṇaṃbuṃ dana yātmalōnilipi dēhaṃbaṃtaṭaṃbāsi, tā
hariṇīgarbhamunan janiṃci hariṇaṃbai yoppe būrvasmṛtin”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 114)
“ka. munipati navamāniṃcina
ghanuḍiṃdradyumnavibhuḍu gauṃjarayōniṃ
janaṃbaṃdenu - - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 4 - 124)
(puṭṭinavāniki cāvu tappadu, canipōyinavāniki marala janma tappadu - puṭṭinadi giṭṭaka tappadu).
punarjanma ēṭlu lēkuṃḍunanagā : -
tyaktvā dēhaṃ punarjanma naiti, māmēti sō(a)rjuna ||“. (śrīmadbhagavadgīta - 4 - 9)
“janmaivaṃ nitya siddhasya cidānaṃda ghanasya mē |
līlayā (a)mōghayā śaktyā tathānukaraṇaṃ kṣitau |
dharma saṃsthāpanē naiva jagataḥ paripālanaṃ |
karma mē vāsudēvasya nitya siddhēśvarasya ca |
akriyasvāti śuddhasya divya maprākṛtaṃ paraṃ |
anyaiḥ kartu maśakyaṃ yada sādhāraṇa maiśvaraṃ |
yō vētti tatvatō bhrāṃtiṃ tyaktvai vaṃ mūḍha dhīgatāṃ |
saccidānaṃda rūpasyā jasyāpi svātma māyayā |
janmānukaraṇaṃ caiva ma karturapi sarvathā |
karmānukalaṇaṃ lōkānugrahāmēti vētti yaḥ |
sa ātma tatva vijñānattyaktvā dēhamimaṃ budhaḥ |
prāpnōti na punarjanma māmēvaiti cida dvayaṃ |
jīvanmuktō munirbhūtvā saṃsārā nmucyatē (a)rjuna ||“. (gītābhāvaprakāśamu - 4 - 58 to 64)
(“paritrāṇāya sādhūnāṃ vināśāya caduṣkṛtāṃ |
dharma saṃsthāpanārthāya saṃbhavāmi yugē yugē ||“. (śrīmadbhagavadgīta - 4 - 8)
(sādhu janulanu rakṣiṃcuṭakunu, durmārgulanu naśiṃpacēyuṭaku, dharmamunu sthāpiṃcuṭakunu pratiyugamaṃdu nēnu avatariṃcucunnānu - janmiṃcucunnānu - nēnu nitya siddhuḍanu - anagā, ellapuḍū, avasaramainapuḍu udbhaviṃcuṭaku siddhamaina sthitilōnuṃḍuvāḍanu -, cidānaṃda ghanuḍanu. aṭṭi nā janma ī prakāramugā avatāramettuṭa līlāmātramu, nā amōgha śakticēta bhūmi mīda migilina prāṇulavale anukariṃcaḍamē - vāṭilō okaḍugā melaguṭayē. nēnu sṛṣṭiṃcina ī jagattuyokka paripālana (sthiti) dharma saṃsthāpana valananē jarugunu - vāsudēvuḍu (anni bhūtamulalōnu nivasiṃcu dēvuḍu), nityasiddhuḍu, īśvaruḍu, atiśuddhuḍu,avikriyuḍu (mārpu lēnivāḍu) ayina nā yī avatāramulalōni karma divyamainaṭuvaṃṭidi, prakṛtiki saṃbaṃdhiṃcanadi, utkṛṣṭamainadi, nā īśvaratva śaktivalana kalugunadi, itarulu cēyuṭaku śakyamukānidi. svataḥ janma lēnaṭuvaṃṭinnī saccidā naṃdarūpuḍainaṭuvaṃṭinnī nēnu ī prakāramu nā māyacēta janmiṃcinaṭlugā naguṭayu, ē karmakunu nēnu kartanu kānappaṭikī yī nā avatāramulalō nēnu cēsina karma lōkānugrahamukoṟakē aniyu evaḍu mūḍhabuddhivalana kaligina bhrāṃtini vadali vāṭi tatvamunu - yathārthamugā - telusukonunō aṭṭi vidvāṃsuḍu ātma tatvamunu telusukoni yuṃḍuṭavalana ī dēhamunu viḍicipeṭṭi tirigi janma poṃdaḍu - cidrūpuḍanu, advayuḍanu ayina nannē poṃdunu. iṭṭi muni jīvanmuktuḍai saṃsāramunu - anagā, marala marala janmiṃcuṭanu - poṃdaḍu - punarjanma lēnivāḍagunu).
nāpnuvaṃti mahātmānaḥ saṃsiddhiṃ paramāṃ gatāḥ ||“. (śrīmadbhagavadgīta - 8 - 15)
(bratiki yunnaṃtakālamu, ellavēḷalaṃdu nannē (bhagavaṃtunē) dhyāniṃcucu, itara viṣayamu talaṃcaka yuṃḍuvāniki nēnu suluvugā labhyamagudunu. kanuka itara viṣayamunu māni nā yaṃdē samāhitamaina manassukalavāḍu nā viṣṇu tatvamunu poṃdunu. aṭṭivāḍu garbhavāsamu, bhagamudvārā nirgamamu - janmamu - modalagu kaṣṭamulaku ākaramai, bhramaku sthānamai, duḥkhamunaku nivāsamu ayina punarjanmanu poṃdaḍu).
muni nanagha nanaṃtu, nīśu, puruṣōttamu sa
nmanamuna bhajiyiṃpumu, muda
muna bunarāvṛttilēni mukti labhiṃcun|“. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 32 -)
mallikārjunakō rājan! yatra tiṣṭati nityaśaḥ |
tatraiva śikharaṃ ramyaṃ parvatō pariśōbhitaṃ |
śṛṃgadarśanamātrēṇa muktirēvana saṃśayaḥ |
atra gaṃgā mahāramyā pātāḷēti samāśritā |
tatra ca snānamātrēṇa mahāpāpaiḥ pramucyatē |
śrīśaila śikharaṃ dṛṣṭvā vāraṇāsyāṃ mṛtō dhruvaṃ |
kēdārē hyudakaṃ pītvā punarjanma na vidyatē ||“. (padmapurāṇamu uttarakhaṃḍamu)
(śrīśaila parvatamu anniṃṭikanna bāgugā kanabaḍunu, anni cōṭlanuṃḍi kanabaḍunu. mallikārjunuḍu ellapuḍū akkaḍa uṃḍunu - ā parvata śikharamu ramyamainadi. ā śikharamunu cūcinaṃtamātramuna mukti kalugunu. iṃduku saṃśayamulēdu. iccaṭa pātāḷagaṃga kaladu - aṃdulō snānamu cēsina mahāpātakamulu naśiṃcunu - śrīśaila śikharamunu cūcinanu, kāśilō canipōyinanu, kēdāramaṃdu nīṭini trāginanu punarjanma kalugadu).
dāra jalaṃbularthimeyi drāvi śarīramu kōravōvagā |
nāraḍi noṃdanēla yokka yappuḍu janmalēka yuṃṭakai |
yāraya śrīnagaṃbu śikharāgramu cūcina jālu nemmadin ||“. (vikramārka caritra -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.