← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పుణ్యదేశములు puṇyadēśamulu

Original — తెలుగు
  1. “మ. వినుమేదేశములన్ దయాగుణ తపో విద్యాన్వితంబైనవి

ప్రనికాయంబు వసించు,నేస్థలములన్ భాగీరథీ ముఖ్యవా

హినులుండున్, హరిపూజ లెయ్యడల భూయిష్ట ప్రకారంబులన్

దనరున్, భూవర, యట్టి చోటుల తగున్ ధర్మంబులం జేయగన్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 7 - 14)

  1. “అధి దేశాన్ ప్రవక్ష్యామి ధర్మాది శ్రేయ ఆవహాన్ |

స వైపుణ్య తమో దేశాః సత్పాత్రం యత్ర లభ్యతే |

బింబిం భగవతో యత్ర సర్వవేతచ్చరాచరం |

యత్రహి బ్రాహ్మణకులం తపో విద్యా దయాన్వితం |

యత్ర యత్ర హరేరర్చా సదేశః శ్రేయసాం పదం |

యత్ర గంగాదయోనద్యః పురాణేషు చ విశ్రుతాః |

సరాంసి, పుష్కరాదీని క్షేత్రాణ్యర్హాశ్రితాన్యుత |

కురుక్షేత్రం, హయశిరః, ప్రయాగః, పులహాశ్రమః |

నైమిశం ఫల్గుణం శేతుః ప్రభాసోధ కుశస్థలీ |

వారణాసీ మధుపురో పంపా బిందు సరస్తథా |

నారాయణాశ్రమోనందా, సీతారామాశ్రమా దయః |

ఏతే పుణ్యతమో దేశాః హరేరర్చాశ్రితాశ్చయే ||“. (శ్రీమద్భాగవతం - 7 -)

“క. హరియందు జగములుండును

హరిరూపము సాధు పాత్రమందుండు, శివం

కరయగు పాత్రము కలిగిన

నరయగ నది పుణ్యదేశమనఘ చరిత్రా “.

“వ. మఱియు గురుక్షేత్రంబును, గయా శీర్షంబును, బ్రయాగంబును, బులహాశ్ర మంబును, నైమిశంబును, ఫాల్గునంబును, సేతువును, బ్రభాసంబును, గుశస్థలియును, వారణాసియు, మధురాపురియును, బంపాబిందు సరోవరంబులును, నారాయణాశ్రమంబును, సీతారామశ్రమంబును, మహేంద్రమలయాదులైన కులాచలంబులును, హరిప్రతిమార్చన ప్రదేశంబులును, హరి సేవాపరులైన పరమ భాగవతులు వసించెడు పుణ్యక్షేత్రంబులును, శుభికాముండైనవాడు సేవింపవలయును”.

ఆ. భూవరేంద్ర యిట్టి పుణ్య ప్రదేశంబు

లందు నరుడు సేయునట్టి ధర్మ

మల్పమైన నది సహస్ర గుణాధిక

ఫలమినిచ్చు హరి కృపా వశమున”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 14 - 450,451,452)

Transliteration
  1. “ma. vinumēdēśamulan dayāguṇa tapō vidyānvitaṃbainavi

pranikāyaṃbu vasiṃcu,nēsthalamulan bhāgīrathī mukhyavā

hinuluṃḍun, haripūja leyyaḍala bhūyiṣṭa prakāraṃbulan

danarun, bhūvara, yaṭṭi cōṭula tagun dharmaṃbulaṃ jēyagan “. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 7 - 14)

  1. “adhi dēśān pravakṣyāmi dharmādi śrēya āvahān |

sa vaipuṇya tamō dēśāḥ satpātraṃ yatra labhyatē |

biṃbiṃ bhagavatō yatra sarvavētaccarācaraṃ |

yatrahi brāhmaṇakulaṃ tapō vidyā dayānvitaṃ |

yatra yatra harērarcā sadēśaḥ śrēyasāṃ padaṃ |

yatra gaṃgādayōnadyaḥ purāṇēṣu ca viśrutāḥ |

sarāṃsi, puṣkarādīni kṣētrāṇyarhāśritānyuta |

kurukṣētraṃ, hayaśiraḥ, prayāgaḥ, pulahāśramaḥ |

naimiśaṃ phalguṇaṃ śētuḥ prabhāsōdha kuśasthalī |

vāraṇāsī madhupurō paṃpā biṃdu sarastathā |

nārāyaṇāśramōnaṃdā, sītārāmāśramā dayaḥ |

ētē puṇyatamō dēśāḥ harērarcāśritāścayē ||“. (śrīmadbhāgavataṃ - 7 -)

“ka. hariyaṃdu jagamuluṃḍunu

harirūpamu sādhu pātramaṃduṃḍu, śivaṃ

karayagu pātramu kaligina

narayaga nadi puṇyadēśamanagha caritrā “.

“va. maṟiyu gurukṣētraṃbunu, gayā śīrṣaṃbunu, brayāgaṃbunu, bulahāśra maṃbunu, naimiśaṃbunu, phālgunaṃbunu, sētuvunu, brabhāsaṃbunu, guśasthaliyunu, vāraṇāsiyu, madhurāpuriyunu, baṃpābiṃdu sarōvaraṃbulunu, nārāyaṇāśramaṃbunu, sītārāmaśramaṃbunu, mahēṃdramalayādulaina kulācalaṃbulunu, haripratimārcana pradēśaṃbulunu, hari sēvāparulaina parama bhāgavatulu vasiṃceḍu puṇyakṣētraṃbulunu, śubhikāmuṃḍainavāḍu sēviṃpavalayunu”.

ā. bhūvarēṃdra yiṭṭi puṇya pradēśaṃbu

laṃdu naruḍu sēyunaṭṭi dharma

malpamaina nadi sahasra guṇādhika

phalaminiccu hari kṛpā vaśamuna”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 14 - 450,451,452)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.