(చేతులు,కాళ్ళు, మొదలగు సర్వావయవములతో పూర్తిగా నిండియున్నది - కావలసిన అంగములన్నియు కలది - పురము; శరీరము; విషయభోగములకు ఆశ్రయమైనది).
(తాను నివసించుటకు భగవంతుడు చేసుకొనిన దేహము; లేక, జీవుడు తాను చేసిన కర్మవలన చేసుకొనిన దేహము).
(పురమువలె నుండునది - ద్వారములు, ద్వారపాలకులు, యజమాని మొదలగునవి - ఇంటికి కావలసిన ఉపకరణములు - గల పురమువలె నుండు శరీరము ఒక పురము, - ఏడు శీర్షములు, మొదలగు ఏడు ద్వారములుగల పురము.
(జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు, ప్రాణములు అయిదు, ఆకాశము మొదలగు భూతములు అయిదు,అంతఃకరణము (చిత్తము, బుద్ధి, మనస్సు, అహంకారము అనునవి నాలుగు) అవిద్యాకామము, కర్మము, తమస్సు - ఇవన్నియు కలిసిన శరీరము పురము).
(జన్మ మొదలగు కర్మలు లేని ఆత్మకు ఏకాదశేంద్రియములతో కూడియుండి, అందులోనుండి పైకిపోవుటకు - దానిని విడిచిపెట్టుటకు - ద్వారముగల శరీరమే పురము - ఇంటి యజమానునకు ఇల్లు ఏ విధముగా పూర్తిగా తెలిసి యుండునో ఆ విధముగానే శరీరమను పురమును దాని యజమాని అయిన ఆత్మకు తెలిసియుండును - ఆత్మజ్ఞానము లేనివానికి యీ దేహమే ఆత్మ యనిపించును).
(cētulu,kāḷḷu, modalagu sarvāvayavamulatō pūrtigā niṃḍiyunnadi - kāvalasina aṃgamulanniyu kaladi - puramu; śarīramu; viṣayabhōgamulaku āśrayamainadi).
(tānu nivasiṃcuṭaku bhagavaṃtuḍu cēsukonina dēhamu; lēka, jīvuḍu tānu cēsina karmavalana cēsukonina dēhamu).
(puramuvale nuṃḍunadi - dvāramulu, dvārapālakulu, yajamāni modalagunavi - iṃṭiki kāvalasina upakaraṇamulu - gala puramuvale nuṃḍu śarīramu oka puramu, - ēḍu śīrṣamulu, modalagu ēḍu dvāramulugala puramu.
(jñānēṃdriyamulaidu, karmēṃdriyamulaidu, prāṇamulu ayidu, ākāśamu modalagu bhūtamulu ayidu,aṃtaḥkaraṇamu (cittamu, buddhi, manassu, ahaṃkāramu anunavi nālugu) avidyākāmamu, karmamu, tamassu - ivanniyu kalisina śarīramu puramu).
(janma modalagu karmalu lēni ātmaku ēkādaśēṃdriyamulatō kūḍiyuṃḍi, aṃdulōnuṃḍi paikipōvuṭaku - dānini viḍicipeṭṭuṭaku - dvāramugala śarīramē puramu - iṃṭi yajamānunaku illu ē vidhamugā pūrtigā telisi yuṃḍunō ā vidhamugānē śarīramanu puramunu dāni yajamāni ayina ātmaku telisiyuṃḍunu - ātmajñānamu lēnivāniki yī dēhamē ātma yanipiṃcunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.