(పురమనగా శరీరము, పురములో శయనించువాడు కనుక పురుషుడు) (ప్రత్యగాత్మ).
(పురములు అనగా శరీరములు, పురము అనగా హృదయము. హృదయములో శయనించువాడు).
(స్థూలశరీరము, సూక్ష్మశరీరము, కారణశరీరము అను శరీర త్రయమందుండువాడు).
(శరీరములను పురములందు అంతర్యామి రూపముతో వర్తించువాడు).
వ్యాప్య శేతే మహాత్మా యస్తస్మాత్ పురుష ఉచ్యతే ||“. (మహాభారతము - శాంతిపర్వము)
(నవద్వారములు కలిగి పుణ్యమైన శరీరమను పురమందు వ్యాపించి అందులో శయనించియుండువాడు కనుక పరమాత్మ పురుషుడు).
(ఈ పరమాత్మయే సమస్త పురములను శరీరములందుండువాడు - శయనించువాడు –
“క. ఇందుగల డందులేడని
సందేహమువలదు; చక్రి సర్వోపగతుండు - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 8 - 275)
“పురాణ్యనేన సృష్టాని నృతిర్య గృషి దేవతాః |
శేతే జీవేన రూపేణ పురేణ పురుషోహ్యసౌ ||“. (శ్రీమద్భాగవతం -)
“తేషు అంతర్యామి రూపేణ ప్రత్యగంశేన చ, యతః శేతే అతః పురుషః ఇతిప్రసిద్ధః”.
(ఎవడు చరాచర రూపమైన జగత్తు అంతటను - దానిలోనుండు సమస్త వస్తువులలోను, వ్యాపించి వాటిలో తాను పూర్తిగా నిండియుండునో వాడు పురుషుడు).
“శ్లో||. పూః సంజ్ఞే వై శరీరే స్మిన్ శయనాత్పురుషో హరిః |
శకారస్య షకారో యం వ్యత్య యేనైతి కథ్యతే |“.
(పూః అనగా శరీరము - దానిలో శయనించు వాడు - ‘శ’ కారము షకారముగా మారినది).
(ప్రవృత్తిరూపమగు తనశక్తిచేత భగవంతుడు దేవతులు, మనుష్యులు, పశువులు, స్థావరములు అను నాలుగు విధములుగ ఈ జగత్తు అను పురమును - శరీరమును సృష్టించి, దానిలో తన అంశ అయిన జీవాత్మగా ప్రవేశించి దానిలోనుండువాడుకనుక పురుషుడు అని విజ్ఞులు చెప్పుదురు).
ప్రాణాది పంచక మధో వియదాదికంచ, కామశ్చ, కర్మశ్చ తమః పునరష్టథా పూః ||”
పూర్షు అష్టాసు వనతీతి పురుషః –
(జ్ఞానేంద్రియములయిదు, కర్మేంద్రియములైదు, అంతఃకరణచతుష్టయము, పంచప్రాణములు, పంచభూతములు, కామము కర్మము, అజ్ఞానము - ఈ ఎనిమిది అష్ట పురములు, వీటిలో నివిసించువాడు పురుషుడు).
స్వాంశేన విష్టః పురుషాభిధానం అనాప నారాయణః ఆది దేవః ||“. (శ్రీమద్భాగవతము - 4)
(తనచేతనే సృష్టింపబడిన పంచభూతముల సమ్మేళనమువలన కలిగిన, అనేకములుగా ప్రకాశించుచున్న పురమును సృష్టించి దానిలో తన అంశ (కళ, శక్తి) తో ప్రవేశించియుండుటవలన ఆదిదేవుడు (ప్రకాశ రూపములుగలవారిలో మొదటివాడు) అయిన శ్రీమన్నారాయణుడు పురుషుడని చెప్పబడుచున్నాడు).
(తమ కర్మలచేత నార్జింపబడిన పురములను నరులు మొదలగు దేహములందు భోక్తవలె వర్తించు పురుషుడు సమస్త శక్తులుగల భగవంతుని అంశవలన కలిగినవాడు అని కవులు చెప్పుదురు).
ఇత్యుచ్యమానేపి తత్తు పూర్షు ఇంద్రియేషు శేతే స పురుషః ఇత్యుక్త్యా పురుష శబ్దస్తు పరమాత్మన్యేవ తాత్పర్యం భవతి.
(ప్రకృతి సంబంధమైన - ప్రకృతి దాని కార్యములు మొదలగువాటి వలన కలుగు ఈ అనిత్యశరీరమును పొందినటువంటి జీవుడు పురుషుడని చెప్పుట ప్రసిద్ధిగా నున్నప్పటికీ ఇంద్రియములను పురములలో శయనించువాడు అని చెప్పుటవలన పురుషుడనగా పరమాత్మయనియే అర్థము).
(పురమందు శయనించువాడు - సమస్త ప్రాణులహృదయమను గుహయందు ఎవరికిని తెలియబడకుండ శయనించువాడు - అని చెప్పబడియుండుటచేత అందఱిలోను అంతరాత్మగా నుండువాడు పురుషుడు. అతనే భగవంతుడైన శ్రీమన్నారాయణుడు).
(హృదయమను ఆకాశమందు శయనించువాడు - అనగా జీవుడు).
(శ్వేతదీపము, శేషుడు, (అనంతాసనము), వైకుంఠము, అవ్యాకృతాకాశము, సత్యలోకము, అందఱిలోనుండు హృదయకమలము అను ఆరు పురములు, - నివాసస్థానములుగా కలవాడు).
వశమున నొకవేళ వర్తించు, దీపించు, దఱియైన నొకవేళ దలగిపోవు - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 2 - 51)
పురము నాత్మాంశమునజెందు పురుషుడింద్రి
యములచే విషయసుఖములననుభవించు
- - యతని బురవర్తియగు జీవుడండ్రు - -“.
(పరిపూర్ణుడు - వెల్తిలేనివాడు - జగత్తు అంతటిలోను, దానిలోనుండు వస్తువులన్నింటిలోను పూర్తిగా నిండియుండువాడు కనుక పురుషుడు).
(అన్నింటిలోను పూర్తిగా తానే నిండియున్నవాడు - వ్యాపించియున్నవాడు)
“క. - - - సర్వమ యుడవగునీకును
సర్వేశ్వర లేవు లోను సంధులు వెలియున్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా.-120)
(భూలోకము మొదలగు లోకములన్నింటిలోను పూర్తిగా నిండియుండువాడు - అన్ని శరీరములందు శయనించి యుండువాడు).
(ఇది అంతా - అన్నియు - ఈ ప్రపంచమంతా ఇతనిచే - పరబ్రహ్మచే - నిండియున్నది).
(మహాకల్ప సమయమందు అంతయూ నీటిమయముగా (ఏకార్ణవమునాడు) నట్లు ఈ ప్రపంచమంతయు ఆత్మతో పూర్తిగా నిండియున్నది “యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయ తేపివా |
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్స్థితః ||“. (మంత్ర పుష్పము)
(కంటికి కనబడుచున్న యే కొంచెము జగత్తు, ఇంకా ఉన్నది అని తెలిసినవారు చెప్పగా వినినదికాక, ఇంకా జగత్తు ఎంతయున్నదో అట్టి జగత్తు అంతటిని - దాని లోపల, పైన - పూర్తిగా వ్యాపించి నారాయణుడున్నాడు).
(భగవంతుడు ఈ ప్రపంచమును సృష్టించెను కనుక అతను దానికి కారణము, సృష్టించబడిన ప్రపంచము కార్యము. అట్టి కార్యరూపమైన ప్రపంచమును తన రూపముతోనే పూర్తిగా నింపువాడు - ప్రపంచమంతా, ప్రపంచములోని వస్తువులన్ని తనరూపమే అయినవాడు –
“స్వేన రూపేణ అఖిలం పూరణాత్ పురుషః”
(అంతటిని, అన్నింటినీ తనరూపముతో పూర్తిగా నింపువాడు).
“యః సర్వ వ్యాప్త్యా చరాచరం జగత్ పూణాతి పూరయతివా స పురుషః”.
(చరాచర రూపమైన జగత్తు అంతటిను వ్యాపించి దానిని తనతో పూర్తిగా నింపియుండువాడు కనుక పురుషుడు).
(ఎవనికంటె ఉత్కృష్టుడు, ఉత్కృష్టుడుకానివాడు లేడో, ఎవనికంటె చిన్నవాడుకానీ, పెద్దవాడు కాని - సూక్ష్ముడుకాని, అధికుడుకాని లేడో, ఇట్లు ఎవనితో సమానుడుకాని, అధికుడుకాని లేడో, ఏవిధమైన కోరికలు లేనివాడగుటచేత ఎవడు ఇతరులైన బ్రహ్మ, రుద్రుడు మొదలగువారిని, ప్రపంచమును తృణీకరించునో అట్టివాడు పరమపదమందు గలడు - (“తద్విష్ణోః పరమం పదం”) (పరబ్రహ్మ అగు శ్రీమహావిష్ణుని పరమపదమందు గలడు). అతడే పురుషుడని చెప్పబడు వాసుదేవుడు (అందరియందు నివసించియుండువాడు వాసుదేవుడు - అతనే ఈ జగత్తు అంతటిలోను వ్యాపించియున్నవాడు).
“ఇత్యాదౌ శ్రూయమాణః పురుషః పరమపురుషః పరమాత్మైవ”. (ఛాందోగ్యోపనిషత్)
(సూర్యమండల మధ్యమందుండు హిరణ్మయుడు, శక్తిమయుడు, చిన్మయుడు, పురుషుడు అను మొదలగు వాక్యములచేత చెప్పబడిన పురుషుడే పరమపురుషుడు, పరమాత్మ).
(పురములో శయనించువాడు, జీవుడు, సంకర్షణుడు, లేక బ్రహ్మ -, సమస్త దేవతలకు పతి అయినవాడు - అధిదైవతము).
(సూర్యమండలములో నుండు హిరణ్యగర్భుడు - సూర్యుని లోపల అంతరాత్మగానుండి, సూర్యుని తేజస్సునకు చైతన్యకారకత్వమునకు కారణమైనవాడు - సమస్త ప్రాణుల ఇంద్రియములను ప్రేరేపించువాడు). (అతనే అధి దైవతము).
పురుషాకారత్వాత్, పూర్ణం వానేన ప్రాణబుద్ధ్యాత్మవా జగత్సమస్తమితి పురుషః “. (శ్రీశంకరః)
(వ్యాహృత్యవయవః - తస్యయాంతి శిరో, భువ ఇతి బాహూ, సువరితి ప్రతిష్టే పాదాదిత్యర్థః).
(భూలోకము శిరస్సు, భువర్లోకము బాహువులు, సువర్లోకము శిరస్సు అనునవి అవయవములను గలవాడని చెప్పబడు సూర్యమండలమందుండు పురుషుడు - పురుషుని ఆకారము కలిగియుండుటవలన పురుషుడు. ప్రాణము, బుద్ధి, ఆత్మ అను మూడు రూపములతో జగత్తునంతటను పూర్తిగా నిండియుండు వాడు, ” ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణః “.
విరాట్పురుషుడు - (అనేకవిధములుగా రాజిల్లువాడు - అనేకరూపములతో నుండువాడు, సూర్యమండలమందుండువాడు, తనయొక్క అంశలే అయిన సమస్త దేవతలకు అధిపతి అయినవాడు. అందుచేతనే అధి దైవతము అని చెప్పబడువాడు)
“అధిభూతం క్షరో భావః పురుషశ్చాది దైవతం -” (శ్రీమద్భగవద్గీత - 8 - 4)
(భూలోకము, భువర్లోకము, సువర్లోకము అను వ్యాహౄతులు అవయవములుగా గలిగి పురుషాకారముగా నుండుటవలన, సూర్యమండలమధ్యమందుండు పురుషుడు అని చెప్పబడియుండుటవలనను, ప్రపంచరూపము (విశ్వరూపము) కలిగియుండుటవలన నిశ్వుడని చెప్పబడుచుండుటవలనను, విరాడ్రూపము కలిగియుండుటవలనను తుర్యరూపము గలవాడగుటచేతను, ఈ రూపముతో పూర్తిగా అంతటను నిండియుండుటచేతను పురుషుడు అని చెప్పబడుచున్నాడు).
“ఏష సర్వేషు భూతేషు గూఢో ఆత్మా న ప్రకాశతే |
దృశ్యతే అగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః “.
(ఆత్మ మొదలగు పదములతో పురుషుడే చెప్పబడుచున్నాడు (సమస్తమైన భూతములందు ఈ ఆత్మ గూఢముగా - ఉన్నట్లు పైకి తెలియబడకుండా - ఉన్నాడు. సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువులను చూడగల శక్తి గలవారిచేత దర్భ చివరంత - కుశాగ్రమంత - తీక్ష్ణముగానున్న బుద్ధిగలవారు ఈ ఆత్మను చూచుచున్నారు).
పురుషాన్నపరం కించిత్ సా కాష్టా సావరా గతిః ||“. (కఠోపనిషత్ - 1 - 3 -10)
అవ్యక్తాత్ పరః సూక్ష్మతరం సర్వకారణ భూతః |
ప్రత్యగాత్మా, అత ఏవ పురుషః సర్వాతరత్వాత్, తతో అన్యస్య, సూక్ష్మస్య, ప్రసంగం వారయన్నాహ - “పురుషాదితి”, పురుషాత్ సర్వాంతరాత్ చిద్ఘనరూపాత్ ప్రత్యగాత్మనః పరం కా చిదపి వస్తునాస్తి. ఏవం సూక్ష్మత్వ మహత్వ ప్రత్యకాత్మానాం తతైవ పరిసమాపనాత్ సైవ పరమా కాష్టా, పర్యవసానభూమిః సైవ గంతృఊణాం సాంసారిణాం పరా ప్రకృష్టా గతిః గంతవ్యం ప్రాప్తవ్యం వస్తు. అన్యాస్తు గతయః అపరాః. ఇయంతు పునరావృత్తిరాహిత్యేన పరా. అత ఏవ భగవతోక్తం –
“యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ||”. (శ్రీమద్భగవద్గీత - 15 - 6)
(అవ్యక్తముకంటె - ప్రకృతికంటె ఉత్కృష్టమైనవాడు, దానికంటె సూక్ష్మమైనవాడు, అందుచేత అన్నింటికి కారణమైనవాడు ప్రత్యగాత్మ - అన్నింటిలోను అంతరాత్మగానుండువాడు. అందుచేత పురుషుడు అని చెప్పబడుచున్నాడు - ఇట్లు చెప్పుటచేత ఇతనికంటె సూక్ష్మమైనవాడు - ఉత్కృష్టమైనవాడు లేడని నిర్థారణచేయబడినది. పురుషుడు సర్వాంతరాత్మ, చిద్ఘనుడు, ప్రత్యగాత్మ అయినవానికంటె ఉత్కృష్టమైన వస్తువేదియు లేదు - పైన చెప్పిన ప్రకారము సూక్ష్మత్వము, మహత్వము, ప్రత్యగాత్మత్వము అనువాటికి పర్యసానము - అవధి - ఆఖరిమెట్టు - అగుటవలన పురుషుడే పరాకాష్ట, పర్యవసానస్థ్జానము - సంసారములోనుండి పరమగతిని పొంద దలచినవారికి అదియే ఉత్కృష్టమైన గతి, పొందవలసిన స్థానము - పరమపదము. ఇతర గతులు, గమ్యమగు స్థానములు అపరములు - ఉత్కృష్టమైనవి కావు. దీనిని - పురుషుని - పొందినట్లైన మరల జన్మకలుగదు - కనుక పరమగతి - “ఏ పరమగతిని పొందిన మరల జన్మించరో ఆ పరమపదమే నా స్థానము - అది నేనే” అని శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతలో చెప్పెను).
(అధ్యానాయ = తత్పరత్వ జ్ఞాన పూర్వకం పురుష దర్శనాయ).
(కఠవల్లిలో “ఇంద్రియములకంటె అర్థములు ప్రకృష్టములు” అని మొదలుకొని ” పురుషునికంటె ఉత్కృష్ట మైనది లేదు, పురుషుడే పరమగతి - కాష్ట” అనువరకు చెప్పుట అని చెప్పుటచేత జ్ఞానయోగముచేత సాధించతగిన బ్రహ్మ సాక్షాత్కారము పురుషుడే - అర్థములు మొదలగువాటి అన్నింటికంటె ఉత్కృష్టమైనవాడు).
(అక్షరమను చెప్పబడు ప్రకృతికంటె ఉత్కృష్టమైనవాడు, తేజోమూర్తి అయినవాడు పురుషుడు అని చెప్పబడుచున్నాడు).
క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే |
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదా హృతః |
యో లోకత్రయమావిశ్య బి భర్త్యవ్యయ ఈశ్వరః ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 16, 17)
“ద్వౌ పురుషౌ క్షరః వినాశీ, అక్షరః తద్విపరీతః భగవతః మాయా శక్తిః క్షరాఖ్యస్య పురుషస్య ఉత్పత్తి బీజం, అనేక సంసారి జంతు కామకర్మాది సంస్కారాశ్రయః అక్షరః పురుషః”. (శ్రీశంకరః)
“క్షరః సర్వాణి భూతాని - సమస్త వికారజాతం ఇత్యర్థః అక్షరః కూటస్థః”.
(పురుషుడు రెండు విధములు - క్షరపురుషుడు - నశించు స్వభావము కలవాడు, అక్షరపురుషుడు క్షరపురుషునికంటె విపరీతమైనవాడు, నశించనివాడు, క్షరపురుషుని యొక్క ఉత్పత్తికి భగవంతుని యొక్క మాయాశక్తి బీజము - అనేక సంసారులయిన - అనేక జననమరణములుగల - ప్రాణ కామ కర్మాది సంసారమునకు ఆశ్రయమైనవాడు అక్షరపురుషుడు).
ఏ విధమైన ఉపాధి లేకుండనుండు పురుషుడు శ్రీమన్నారాయణుడే - ఎందుచేతననగా –
“సహస్ర శీర్షందేవం విశ్వాక్షం విశ్వ శంభువం |
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదం |
విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణం హరిం |
విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముప జీవతి |
పతిం విశ్వస్తా త్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం |
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం |
నారాయణ పరోజ్యోతిరాత్మా నారాయణః పరః |
నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణః పరః |
నారాయణ పరోధ్యాతా ధ్యానం నారాయణః పరః ||“. (మంత్రపుష్పము)
(నారాయణుడు అనగా తాను సృష్టించిన వస్తువులలోనే నివసించువాడు, వాటికి మోక్షస్థానమైనవాడు - అనగా సృష్టి స్థితి లయములు చేయువాడు - అట్టి నారాయణుడే ప్రపంచరూపము, ప్రపంచములోనున్న రూపములన్నియు తానే అయినవాడు - పరమపదమను మోక్షస్థానము తానే అయినవాడు - ప్రపంచమునకు ఆత్మ అయినవాడు (విశ్వాత్మ) పరబ్రహ్మ - నిరాకార, నిర్గుణ, నిర్విశేష పరబ్రహ్మ - ప్రపంచమంతటిలోను, దానిలోని ప్రతివస్తువులోనున్న ఒకే తత్వము తానే అయినవాడు - అతనే పురుషుడు - ప్రపంచమను పురమందు శయనించువాడు - ప్రపంచములోనున్న సమస్త వస్తువులు అను పురములందుండువాడు - అందుచేత తానే ఈ ప్రపంచమైనవాడు - అందుచేత నారాయణుడే పురుషుడని చెప్పబడుచున్నాడు)
(పురుష సూక్తములో వర్ణింపబడిన “సహస్ర శీర్షా పురుషః” అను మొదలగు వాక్యములచే చెప్పబడిన వైభవము గలవాడు - “సహస్ర శీర్షా పురుషః, సహస్రాక్షః సహస్ర పాద్” - (వేలకొలది, లక్షలకొలది శిరస్సులు, కండ్లు, పాదములు గలవాడు - ప్రపంచములోనున్న జీవులన్నియు భగవంతుని రూపములే కనుక లెక్కలేనన్ని జీవుల అవయవములన్నియు తనవే అయినవాడు)).
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్ |
పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే |
పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ |
కారణం గుణసంగో (అ)స్య సద సద్యోని జన్మసు |
ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః |
పరమాత్మా చేతి చా ప్యుక్తో దేహే(అ)స్మిన్ పురుషః పరః |
య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ |
సర్వథా వర్తమానోపి న స భూయో(అ)పి జాయతే ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 19 to 23)
(పురుషుడు, ప్రకృతి - ఈ రెండు అనాదికాలమునుండి యున్నవి - జన్మలేనివి అనగా ఎప్పటినుండి యున్నవో తెలియదు. ప్రకృతి ఎప్పుడునూ పురుషుని విడువకుండ ఆశ్రయించుకొనియే యుండును - ప్రకృతితో కలియక వేరుగా పురుషుడు సృష్టిలో ఎక్కడను లేడు - పురుషునితో కలియక వేరుగా ప్రకృతిగాని దాని అంశగా నిసృష్టిలో ఎక్కడను లేదు –
“క. - - -
హరిమయముగాని ద్రవ్యము
పరమాణువులేదు, వంశపావన వింటే” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 17)
సత్వరజస్తమములు ప్రకృతి గుణములు. ప్రకృతియే పురుషునితో కలియుటవలన అనేక రూపములుగా మారును. ఇవి ప్రకృతి వికారములు - మార్పులు. పురుషుడు ప్రకృతితో కలిసియుండుటవలన ప్రకృతి గుణములననుభవించును - అందుచేత దుఃఖములకు కారణము. సదసత్ జన్మలు ఈ పురుషుడు - జీవరూపములో - ప్రకృతితో సంగమించుటచేతనే కలుగుచున్నవి. ప్రకృతివికారమైన దేహమందు ఈ పురుషుడుండి సుఖదుఃఖముల ననుభవించుచున్నాడు. ఈ ప్రకారముగా ప్రకృతిని, పురుషుని తెలుసుకొనినవాడు తిరిగి జన్మించడు).
పురుషుడు రెండు విధములుగా చెప్పబడుచున్నాడు - అధ్యాత్మము, అధి దైవతము – కంటిలో నుండువాడు అధ్యాత్మము - సూర్యమండలమందుండువాడు అధిదైవతము.
“ఆత్మై వేదమగ్ర ఆసీత్పురుషవిధః - - - సవై శరీరీ ప్రధమః, సవై పురుష ఉచ్యతే, ఆదికర్తా స భూతానాం, బ్రహ్మాగ్రే సమవర్తత”.
(మొట్టమొదట - సృష్టి ప్రారంభములో - ఈ ప్రపంచమంతయు - పురుషుడుగా ఆత్మగా యుండెను - అతనే మొదటి శరీరి - శరీరముగలవాటిలో - పురము అను ఉపాధిగల వారలలో మొదటివాడి - అతనే పురుషుడని చెప్పబడు చున్నాడు - మొదట సృష్టి ప్రారంభము చేసినవాడు. పరమాత్మ – పర బ్రహ్మ తన అపరాశక్తి - (అపరా ప్రకృతి) లో ప్రవేశించెను - అది అతనికి పురము ఆయెను. ఆ పురములో శయనించువాడు కనుక పురుషుడు అని చెప్పబడు చున్నాడు. పరబ్రహ్మ తన పరాశక్తి - చిచ్ఛక్తి - తో ప్రకృతిలో ప్రవే శించగా ప్రకృతి అనేక రూపములుగా మారెను - వాటి అన్నింటిలో భగవంతుడు తన చిచ్ఛక్తితో నున్నాడు. అవన్నియు అతనికి పురములనియు, అందులోనున్న భగవదంశ పురుషుడు - జీవుడనియు చెప్పబడుచున్నాడు - మొట్టమొదట (సృష్టి ప్రారంభములో) పరబ్రహ్మ ప్రకృతి అను పురములో ప్రకాశించుటచేత - శయనించుటచేత - ఆది పురుషుడనియు, తర్వాత ప్రకృతి యొక్క వికారములలో - మార్పులలోనున్న తన అంశ యైన జీవునికన్న ఉత్తముడు - ఉత్తమ పురుషుడనియు చెప్పబడుచున్నాడు).
(పురుషుడు - పరబ్రహ్మ - దేనికి కారణముకాడు, దేనికిని - ఏ కారణ వస్తువునకు కార్యవస్తువు కాడు - దేనిని తనంతట తాను సృష్టించుటలేదు - తనను ఇతర వస్తువేదియు సృష్టించ లేదు - అయిన సృష్టి ఎట్లు జరుగుచున్నదనగా - పరబ్రహ్మ ప్రకృతిలో ప్రవేశించుటవలన, తన చిచ్ఛక్తివలన ప్రకృతియే ఈ చరాచరవస్తువులన్నింటిని పుట్టించుచున్నది. –
“మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే స చరాచరం”
(నేను ప్రకృతిని అధిష్టించి యుండుటచేత ప్రకృతియే అన్నింటిని సృష్టించుచున్నది). (శ్రీమద్భగవద్గీత - 9 -10)
“న చ మాం తాని కర్మాణి నిబద్నంతి ధనంజయ | ఉదాసీనవదాసీన మసక్తం తేషు కర్మసు -” (శ్రీమద్భగవద్గీత - 9 -9)
ప్రకృతి సృష్టించుచున్నది - ఈ కర్మయందు నేను ఆసక్తి లేనివాడనై ఉదాసీనుడువలె నుందును - అందుచేతా కర్మ ఫలము నన్ను అంటదు).
“పురుషుడు అనగా ఇంకను ఈ క్రింద విధముగా అర్థము చెప్పబడినది : -
(ఈ పురుషుడే ఉత్కృష్టమైన జ్యోతి స్వరూపుడు - స్వయం ప్రకాశుడు - “తేజో మ యం”).
(ఈ ప్రంచమంతయు పురుషుడే, భగవంతుడే - “విశ్వమే వేదం పురుషః” (మంత్ర పుష్పము)
(ప్రతి వస్తువులోనుండి ఇంకొక వస్తువును పుట్టించుటకు కారణరూపుడై దానిలో ప్రవేశించి యుండువాడు).
(సంహారకాలమందు లోకములను అంతమునొందించువాడు).
(ఉత్కర్షశాలురందుండి వారి ఉత్కర్షతను పైకి యేదో యొకవిధముగ ప్రకాశింపచేయువాడు).
పురములలోనుండి పురుష భావంబున దీపించునెప్పుడు ధీరవృత్తి
పంచభూతములను పదునొకండింద్రియముల బ్రకాశింపించి భూరి మహిమ
షోడశాత్మకుండన శోభిల్లి జీవత్వ నృత్త వినోదంబు నెఱపుచుండు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 4 - 68)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - )
(పురుషుడు జీవుడని ఈశ్వరుడని (పరమాత్మయని) రెండు రూపములతో నున్నాడు - ప్రకృతితో కలిసియుండుటచేత సంసారములో పడియుండువాడు జీవుడు - ప్రకృతి వశములోనుండక, ప్రకృతిని తనవశములో నుంచుకొని దాని మూలముగా ప్రపంచ సుష్టిస్థితిలయములు చేయువాడు ఈశ్వరుడు -.)
(ప్రకృతిని అధిష్టించియుండి, తనకు ఉపాధిగా చేసుకొని దానిచేత సృష్టి మొదలగు పనులు చేయించువాడు).
జీవ శరీరకః, జీవః - (జీవుడు - జీవ శరీరము గలవాడు).
భోక్తా (కర్మఫలమనుభవించువాడు - జీవుడుగానుండి).
శరీరాభిమానీ (శరీరమందభిమానము కలవాడు).
చిన్మాత్ర ఘనః (ఘనీభవించిన చైతన్యము - జ్ఞానము - కలవాడు). (ఘనీభవించిన చైతన్యమే, జ్ఞానమే రూపముగా గలవాడు).
ప్రత్యగాత్మ (వేరు వేరు శరీరములలోనుండు జీవాత్మ).
“పురుషోనామ సంపూర్ణ శివస్సత్యాది లక్షణః”
(సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ “.” సచ్చిదానందం బ్రహ్మ ” అను లక్షణములుగల సంపూర్ణుడై యుండుశివుడు - పురుషుడు).
అన్యేషు తారతమ్యేన స్థితేషు పురుషోత్తమః |
వ్యోమాత్సర్వదా వ్యాప్త స్సర్వ సంబంధి వర్జితః |
ఏక రూపో మహా దేవః స్థితస్సోహం పరామృతం ||’. (ముక్తిఖండము)
(చండాలుని శరీరమునందు, పశువు మొదలగువాటి శరీరమందు, బ్రాహ్మణుని శరీరమందు - ఇట్లు హెచ్చు తగ్గులుగా (గొప్పవి, చిన్నవిగాను) ఉన్న ఇతర శరీరములలోను ఆకాశమువలె ఎల్లపుడు వ్యాపించియుండి, వాటి వేటితోను ఏ విధమైన సంబంధము లేక ఒకడే అయిన (ఒకే రూపముగల) మహా దేవుడున్నాడు. పైన చెప్పబడిన ఉచ్ఛ, నీచ శరీరములు పురములు. వీటి అన్నింటిలోను ఒకడే అయిన పరమాత్మయున్నాడు. ఆ పురములలో నుండుటచేత పురుషుడని చెప్పబడుచున్నాడు - ఏ శరీరములో నున్నను, ఏ పదార్థములోనున్నను అది పరమాత్మకు పురము - అందులో నుండుటచేత పరమాత్మ పురుషుడు).
అగ్నేరాపః అప్ భ్యః పృధివీ, పృధివ్యాః, ఔషధయః, ఔషదేభ్యో అన్నం, అన్నాత్ పురుషః “నవా ఏష పురుషో అన్నరసమయః” (తైతిరీయోపనిషత్)
(“సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” అనిన్నీ, “ఆత్మవలన ఆకాశము పుట్టినది, ఆకాశమువలన వాయువు, వాయువు వలన అగ్ని, అగ్నివలన నీరు, నీటివలన భూమి, భూమినుండి ఔషధులు, ఔషధులనుండి అన్నము, అన్నమువలన పురుషుడు” అని చెప్పి యుండుటచేత ఆ ఆత్మయే ఇన్ని రూపములుగా - ఇన్ని వస్తువులుగా - మారి పురుషుడు ఆయెను - అందుచేత పురుషుడు - జీవుడు - అన్నమయుడు - (అత్తి ఇతి ఆత్మా) - అన్నము యొక్క పరిణామమే శరీరముగా గలవాడు – (జీవాత్మ).
సంభూతం షోడశకలామాదౌ లోకసిసృక్షయా |
యస్యాం భసి శయానస్య యోగనిద్రాం వితన్వితః |
నాభి హృదం బుజాదానీద్బ్రహ్మ విశ్వనృజాం పతిః |
యస్యావ యవ సంస్థానైః కల్పితో లోక విస్తరః |
తద్వై భగవతో రూపం విశుద్ధం సత్యమూర్జితం ||.
పశ్యంత్యదో రూపమదభ్ర చక్షుషా సహస్ర పాదోరు భుజాన నాద్భుతః |
సహస్ర మూర్థ్న శ్రవణాక్షి నాసికం సహస్ర మాల్యంబర కుండలోల్లసత్ |
ఏత న్నానావతారాణాం నిథానం బీజమవ్యయం |
యస్యాం శ్యాంశేన నృజ్యంతే దేవ తిర్య ఙ్నరాదయః ||“. (శ్రీమద్భాగవతం - 1 - 3 - 1 to 5)
(పైన వ్రాసిన భాగవతములోని శ్లోకమునకు ఆంధ్రీకరణము ఈ క్రింద విధముగా నున్నది : -
“సీ. మహదహంకార తన్మాత్ర సం యుక్తుడై చారు షోడశకళా సహితుడగుచు
పంచమహాభూత భాసితుండైశుద్ధసత్వుడై సర్వాతిశాయి యగుచు
జరణోరు భుజముఖశ్రవణాక్షి నానా శిఖరములు నానా సహస్రములు వెలుగ
నంబర కేయూరహారకుండల కిరీటాదులు పెక్కువేలమరుచుండ
తే. బురుష రూపంబు ధరియించి పరుడనంతు
డఖిల భువనైక వర్తన యత్నమమర
మానితోదార జలరాశి మధ్యమునను
యోగ నిద్రా విలాసియై యొప్పుచుండు“.
“వ. అది సకలావతారంబులకు మొదలిగని యైన శ్రీమన్నారాయణ దేవుని విరాజమానంబయిన దివ్యరూపంబు” – (శ్రీమహాభాగవతము - 1 - 3 - 60)
“శుక్లాధిక్యే భవేత్పుంసః, నారీరక్తాధి కేనతు శుక్ల రక్త సమత్వేన నపుంసక ఇతీరితః |”.
దుష్కృతకర్మ విశేషం వల్ల అంధకబధిరమూక, కుబ్జసౌందర్య హీన, షండ మొదలైన అవలక్షణ గుణాలుగలవాడౌను. సుకృత కర్మ విశేషం వల్ల సర్వ సులక్షణ సంపన్న శరీరి అగును “.
1. అసూయకాః పరేషాం గుణేషు దోషానేవ గృహ్ణంతి, నతుగుణాన్.
2. కేచిన్మధ్యస్థాః పరగుణేషు దోషాన్ న గృహ్ణంతి, కింతు యథాస్థితాన్ గుణాన్ దోషాన్ వివేకేన గృహ్ణంతి. తా తు మహాంతః ఉచ్యంతే.
3. సాధివస్తు కేవలం గుణానేవ గృహ్ణంతి, న దోషాన్. తే తు మహత్తరాః ఉచ్యంతే. మహత్తమాస్తు దోషాన్ న గృహ్ణంత్యేవ, ప్రత్యుత ఫల్గూన్ తుచ్ఛాన్ అపి గుణాన్ బహుళీ కరిష్ణవో భవంతి“.
(పురుషులు నాలుగు విధములు –
(1). అసూయాపరులు, ఇతరుల దోషములనే తీసుకొనువారు, మంచి గుణములను లెక్కచేయని వారు,
(2). కొందఱు మధ్యస్థులు - ఇతరుల గుణములలోని దోషములను వదలి కాని గుణములు దోషములు ఎట్లున్నవో అట్లు ఆలోచన చేసి తీసుకొనెదరు.
(3) సాధువులు మాత్రము మంచి గుణ ములనే తీసుకొనెదరు, దోషములను వదలివేతురు - అట్టివారు మహత్తరులు.
(4) మఱి కొందఱు దోషములను గణించరు, కాని, చిన్నవైనను గుణములను ఎంతో గొప్పగాచేసి చెప్పుదురు. అట్టివారు మహత్తమములు.
“చ. పురుష భవంబునొందుట యపూర్వము జన్మములందు - - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 213)
“ఇహైవాంతశ్శరీరే, సోమ్య ! సపురుషో యస్మిన్నేతాః షోడశకలాః ప్రభవంతి. స ఈక్షాం చక్రే -”. కస్మిన్నహ ముత్క్రాంత ఉత్క్రాంతో భవిష్యామి? కస్మిన్వా ప్రతిష్ఠతే? ప్రతీష్టా స్యామీత? సప్రాణమసృజత, ప్రాణాచ్ఛ్రద్ధాం, ఖం, వాయుర్జ్యోతి రాపః పృధివీంద్రియం మనః, అన్నమన్నా ద్వీర్యం తపోమాత్రాః కర్మలోకాః లోకేషు చ, నామ చ, స యధేమా నద్యః స్యందమానాః సముద్రాయణాః సముద్రం ప్రాప్యాతం గచ్ఛంతి భిద్యతే తాసాం నామరూపే విహాయ సముద్ర ఇత్యేవం ప్రోచ్యతే ఏవమే వాస్య పరిద్రష్టురిమాః షోడశ కలాః పురుషాయణాః పురుషం ప్రాప్తా (అ)స్తం గచ్ఛంతి భిద్యతే తానాం నామరూపే పురుష ఇత్యేవం ప్రోచ్యతే. స ఏషో (అ)కలో (అ)మృతో భవతి||“. (ప్రశ్నోపనిషత్ - 2)
(పదహారు కళలు గలిగినటువంటి పురుషుడు అనువాడు ఇక్కడే ఈ శరీరము లోనే ఉన్నాడు. ఆ పురుషుడు ఈ ప్రకారముగా నాలోచించెను – “ఈ శరీరము నుండి ఏది వెళ్ళిపోయిన నేను వెళ్ళి పోయెదను, ఏది యుండిన నేనుండెదను.” అని. అప్పుడు పురుషుడు ప్రాణమును సృజించెను. ప్రాణమునుండి శ్రద్ధ, ఆకాశము, గాలి, అగ్ని, నీరు, పృధివి, జ్ఞానేంద్రియములు, మనస్సు, అన్నము, అన్నమునుండి వీర్యము, తపస్సు, మాత్రలు, కర్మ, లోకములు, ఈ రూపములన్నింటికి నామములు సృజించెను - సముద్రములో కలిసిపోవుటకు సముద్రమువైపు ప్రవహించుచున్న నదులు, వాటికి అదివఱకున్న నామరూపములు వదలి సముద్రములో కలిసిపోయి అంతా సముద్రమే అని యెట్లు అనిపించుకుంటున్నవో, అట్లే పురుషుని ఈ పదహారు కళలు పురుషుని పొంది వాటి నామరూపములు వదలుకొని పురుషునిలో కలిసిపోయి అంతా పురుషుడే అనిపించుకొనుచున్నవి. ఆ పురుషుడు స్వతః కళలు లేనివాడు, మృతిలేనివాడు - అనగా, నదులవలె ఇంకొక దానిలో కలిసిపోయి తాను లేకుండ పోవువాడు కాడు).
(puramanagā śarīramu, puramulō śayaniṃcuvāḍu kanuka puruṣuḍu) (pratyagātma).
(puramulu anagā śarīramulu, puramu anagā hṛdayamu. hṛdayamulō śayaniṃcuvāḍu).
(sthūlaśarīramu, sūkṣmaśarīramu, kāraṇaśarīramu anu śarīra trayamaṃduṃḍuvāḍu).
(śarīramulanu puramulaṃdu aṃtaryāmi rūpamutō vartiṃcuvāḍu).
vyāpya śētē mahātmā yastasmāt puruṣa ucyatē ||“. (mahābhāratamu - śāṃtiparvamu)
(navadvāramulu kaligi puṇyamaina śarīramanu puramaṃdu vyāpiṃci aṃdulō śayaniṃciyuṃḍuvāḍu kanuka paramātma puruṣuḍu).
(ī paramātmayē samasta puramulanu śarīramulaṃduṃḍuvāḍu - śayaniṃcuvāḍu –
“ka. iṃdugala ḍaṃdulēḍani
saṃdēhamuvaladu; cakri sarvōpagatuṃḍu - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 8 - 275)
“purāṇyanēna sṛṣṭāni nṛtirya gṛṣi dēvatāḥ |
śētē jīvēna rūpēṇa purēṇa puruṣōhyasau ||“. (śrīmadbhāgavataṃ -)
“tēṣu aṃtaryāmi rūpēṇa pratyagaṃśēna ca, yataḥ śētē ataḥ puruṣaḥ itiprasiddhaḥ”.
(evaḍu carācara rūpamaina jagattu aṃtaṭanu - dānilōnuṃḍu samasta vastuvulalōnu, vyāpiṃci vāṭilō tānu pūrtigā niṃḍiyuṃḍunō vāḍu puruṣuḍu).
“ślō||. pūḥ saṃjñē vai śarīrē smin śayanātpuruṣō hariḥ |
śakārasya ṣakārō yaṃ vyatya yēnaiti kathyatē |“.
(pūḥ anagā śarīramu - dānilō śayaniṃcu vāḍu - ‘śa’ kāramu ṣakāramugā mārinadi).
(pravṛttirūpamagu tanaśakticēta bhagavaṃtuḍu dēvatulu, manuṣyulu, paśuvulu, sthāvaramulu anu nālugu vidhamuluga ī jagattu anu puramunu - śarīramunu sṛṣṭiṃci, dānilō tana aṃśa ayina jīvātmagā pravēśiṃci dānilōnuṃḍuvāḍukanuka puruṣuḍu ani vijñulu ceppuduru).
prāṇādi paṃcaka madhō viyadādikaṃca, kāmaśca, karmaśca tamaḥ punaraṣṭathā pūḥ ||”
pūrṣu aṣṭāsu vanatīti puruṣaḥ –
(jñānēṃdriyamulayidu, karmēṃdriyamulaidu, aṃtaḥkaraṇacatuṣṭayamu, paṃcaprāṇamulu, paṃcabhūtamulu, kāmamu karmamu, ajñānamu - ī enimidi aṣṭa puramulu, vīṭilō nivisiṃcuvāḍu puruṣuḍu).
svāṃśēna viṣṭaḥ puruṣābhidhānaṃ anāpa nārāyaṇaḥ ādi dēvaḥ ||“. (śrīmadbhāgavatamu - 4)
(tanacētanē sṛṣṭiṃpabaḍina paṃcabhūtamula sammēḷanamuvalana kaligina, anēkamulugā prakāśiṃcucunna puramunu sṛṣṭiṃci dānilō tana aṃśa (kaḷa, śakti) tō pravēśiṃciyuṃḍuṭavalana ādidēvuḍu (prakāśa rūpamulugalavārilō modaṭivāḍu) ayina śrīmannārāyaṇuḍu puruṣuḍani ceppabaḍucunnāḍu).
(tama karmalacēta nārjiṃpabaḍina puramulanu narulu modalagu dēhamulaṃdu bhōktavale vartiṃcu puruṣuḍu samasta śaktulugala bhagavaṃtuni aṃśavalana kaliginavāḍu ani kavulu ceppuduru).
ityucyamānēpi tattu pūrṣu iṃdriyēṣu śētē sa puruṣaḥ ityuktyā puruṣa śabdastu paramātmanyēva tātparyaṃ bhavati.
(prakṛti saṃbaṃdhamaina - prakṛti dāni kāryamulu modalaguvāṭi valana kalugu ī anityaśarīramunu poṃdinaṭuvaṃṭi jīvuḍu puruṣuḍani ceppuṭa prasiddhigā nunnappaṭikī iṃdriyamulanu puramulalō śayaniṃcuvāḍu ani ceppuṭavalana puruṣuḍanagā paramātmayaniyē arthamu).
(puramaṃdu śayaniṃcuvāḍu - samasta prāṇulahṛdayamanu guhayaṃdu evarikini teliyabaḍakuṃḍa śayaniṃcuvāḍu - ani ceppabaḍiyuṃḍuṭacēta aṃdaṟilōnu aṃtarātmagā nuṃḍuvāḍu puruṣuḍu. atanē bhagavaṃtuḍaina śrīmannārāyaṇuḍu).
(hṛdayamanu ākāśamaṃdu śayaniṃcuvāḍu - anagā jīvuḍu).
(śvētadīpamu, śēṣuḍu, (anaṃtāsanamu), vaikuṃṭhamu, avyākṛtākāśamu, satyalōkamu, aṃdaṟilōnuṃḍu hṛdayakamalamu anu āru puramulu, - nivāsasthānamulugā kalavāḍu).
vaśamuna nokavēḷa vartiṃcu, dīpiṃcu, daṟiyaina nokavēḷa dalagipōvu - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 2 - 51)
puramu nātmāṃśamunajeṃdu puruṣuḍiṃdri
yamulacē viṣayasukhamulananubhaviṃcu
- - yatani buravartiyagu jīvuḍaṃḍru - -“.
(paripūrṇuḍu - veltilēnivāḍu - jagattu aṃtaṭilōnu, dānilōnuṃḍu vastuvulanniṃṭilōnu pūrtigā niṃḍiyuṃḍuvāḍu kanuka puruṣuḍu).
(anniṃṭilōnu pūrtigā tānē niṃḍiyunnavāḍu - vyāpiṃciyunnavāḍu)
“ka. - - - sarvama yuḍavagunīkunu
sarvēśvara lēvu lōnu saṃdhulu veliyun “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā.-120)
(bhūlōkamu modalagu lōkamulanniṃṭilōnu pūrtigā niṃḍiyuṃḍuvāḍu - anni śarīramulaṃdu śayaniṃci yuṃḍuvāḍu).
(idi aṃtā - anniyu - ī prapaṃcamaṃtā itanicē - parabrahmacē - niṃḍiyunnadi).
(mahākalpa samayamaṃdu aṃtayū nīṭimayamugā (ēkārṇavamunāḍu) naṭlu ī prapaṃcamaṃtayu ātmatō pūrtigā niṃḍiyunnadi “yacca kiṃcit jagatsarvaṃ dṛśyatē śrūya tēpivā |
aṃtarbahiśca tatsarvaṃ vyāpyanārāyaṇa ssthitaḥ ||“. (maṃtra puṣpamu)
(kaṃṭiki kanabaḍucunna yē koṃcemu jagattu, iṃkā unnadi ani telisinavāru ceppagā vininadikāka, iṃkā jagattu eṃtayunnadō aṭṭi jagattu aṃtaṭini - dāni lōpala, paina - pūrtigā vyāpiṃci nārāyaṇuḍunnāḍu).
(bhagavaṃtuḍu ī prapaṃcamunu sṛṣṭiṃcenu kanuka atanu dāniki kāraṇamu, sṛṣṭiṃcabaḍina prapaṃcamu kāryamu. aṭṭi kāryarūpamaina prapaṃcamunu tana rūpamutōnē pūrtigā niṃpuvāḍu - prapaṃcamaṃtā, prapaṃcamulōni vastuvulanni tanarūpamē ayinavāḍu –
“svēna rūpēṇa akhilaṃ pūraṇāt puruṣaḥ”
(aṃtaṭini, anniṃṭinī tanarūpamutō pūrtigā niṃpuvāḍu).
“yaḥ sarva vyāptyā carācaraṃ jagat pūṇāti pūrayativā sa puruṣaḥ”.
(carācara rūpamaina jagattu aṃtaṭinu vyāpiṃci dānini tanatō pūrtigā niṃpiyuṃḍuvāḍu kanuka puruṣuḍu).
(evanikaṃṭe utkṛṣṭuḍu, utkṛṣṭuḍukānivāḍu lēḍō, evanikaṃṭe cinnavāḍukānī, peddavāḍu kāni - sūkṣmuḍukāni, adhikuḍukāni lēḍō, iṭlu evanitō samānuḍukāni, adhikuḍukāni lēḍō, ēvidhamaina kōrikalu lēnivāḍaguṭacēta evaḍu itarulaina brahma, rudruḍu modalaguvārini, prapaṃcamunu tṛṇīkariṃcunō aṭṭivāḍu paramapadamaṃdu galaḍu - (“tadviṣṇōḥ paramaṃ padaṃ”) (parabrahma agu śrīmahāviṣṇuni paramapadamaṃdu galaḍu). ataḍē puruṣuḍani ceppabaḍu vāsudēvuḍu (aṃdariyaṃdu nivasiṃciyuṃḍuvāḍu vāsudēvuḍu - atanē ī jagattu aṃtaṭilōnu vyāpiṃciyunnavāḍu).
“ityādau śrūyamāṇaḥ puruṣaḥ paramapuruṣaḥ paramātmaiva”. (chāṃdōgyōpaniṣat)
(sūryamaṃḍala madhyamaṃduṃḍu hiraṇmayuḍu, śaktimayuḍu, cinmayuḍu, puruṣuḍu anu modalagu vākyamulacēta ceppabaḍina puruṣuḍē paramapuruṣuḍu, paramātma).
(puramulō śayaniṃcuvāḍu, jīvuḍu, saṃkarṣaṇuḍu, lēka brahma -, samasta dēvatalaku pati ayinavāḍu - adhidaivatamu).
(sūryamaṃḍalamulō nuṃḍu hiraṇyagarbhuḍu - sūryuni lōpala aṃtarātmagānuṃḍi, sūryuni tējassunaku caitanyakārakatvamunaku kāraṇamainavāḍu - samasta prāṇula iṃdriyamulanu prērēpiṃcuvāḍu). (atanē adhi daivatamu).
puruṣākāratvāt, pūrṇaṃ vānēna prāṇabuddhyātmavā jagatsamastamiti puruṣaḥ “. (śrīśaṃkaraḥ)
(vyāhṛtyavayavaḥ - tasyayāṃti śirō, bhuva iti bāhū, suvariti pratiṣṭē pādādityarthaḥ).
(bhūlōkamu śirassu, bhuvarlōkamu bāhuvulu, suvarlōkamu śirassu anunavi avayavamulanu galavāḍani ceppabaḍu sūryamaṃḍalamaṃduṃḍu puruṣuḍu - puruṣuni ākāramu kaligiyuṃḍuṭavalana puruṣuḍu. prāṇamu, buddhi, ātma anu mūḍu rūpamulatō jagattunaṃtaṭanu pūrtigā niṃḍiyuṃḍu vāḍu, ” dhyēyassadā savitṛmaṃḍala madhyavartī nārāyaṇaḥ “.
virāṭpuruṣuḍu - (anēkavidhamulugā rājilluvāḍu - anēkarūpamulatō nuṃḍuvāḍu, sūryamaṃḍalamaṃduṃḍuvāḍu, tanayokka aṃśalē ayina samasta dēvatalaku adhipati ayinavāḍu. aṃducētanē adhi daivatamu ani ceppabaḍuvāḍu)
“adhibhūtaṃ kṣarō bhāvaḥ puruṣaścādi daivataṃ -” (śrīmadbhagavadgīta - 8 - 4)
(bhūlōkamu, bhuvarlōkamu, suvarlōkamu anu vyāhṝtulu avayavamulugā galigi puruṣākāramugā nuṃḍuṭavalana, sūryamaṃḍalamadhyamaṃduṃḍu puruṣuḍu ani ceppabaḍiyuṃḍuṭavalananu, prapaṃcarūpamu (viśvarūpamu) kaligiyuṃḍuṭavalana niśvuḍani ceppabaḍucuṃḍuṭavalananu, virāḍrūpamu kaligiyuṃḍuṭavalananu turyarūpamu galavāḍaguṭacētanu, ī rūpamutō pūrtigā aṃtaṭanu niṃḍiyuṃḍuṭacētanu puruṣuḍu ani ceppabaḍucunnāḍu).
“ēṣa sarvēṣu bhūtēṣu gūḍhō ātmā na prakāśatē |
dṛśyatē agryayā buddhyā sūkṣmayā sūkṣma darśibhiḥ “.
(ātma modalagu padamulatō puruṣuḍē ceppabaḍucunnāḍu (samastamaina bhūtamulaṃdu ī ātma gūḍhamugā - unnaṭlu paiki teliyabaḍakuṃḍā - unnāḍu. sūkṣmāti sūkṣmamaina vastuvulanu cūḍagala śakti galavāricēta darbha civaraṃta - kuśāgramaṃta - tīkṣṇamugānunna buddhigalavāru ī ātmanu cūcucunnāru).
puruṣānnaparaṃ kiṃcit sā kāṣṭā sāvarā gatiḥ ||“. (kaṭhōpaniṣat - 1 - 3 -10)
avyaktāt paraḥ sūkṣmataraṃ sarvakāraṇa bhūtaḥ |
pratyagātmā, ata ēva puruṣaḥ sarvātaratvāt, tatō anyasya, sūkṣmasya, prasaṃgaṃ vārayannāha - “puruṣāditi”, puruṣāt sarvāṃtarāt cidghanarūpāt pratyagātmanaḥ paraṃ kā cidapi vastunāsti. ēvaṃ sūkṣmatva mahatva pratyakātmānāṃ tataiva parisamāpanāt saiva paramā kāṣṭā, paryavasānabhūmiḥ saiva gaṃtṛūṇāṃ sāṃsāriṇāṃ parā prakṛṣṭā gatiḥ gaṃtavyaṃ prāptavyaṃ vastu. anyāstu gatayaḥ aparāḥ. iyaṃtu punarāvṛttirāhityēna parā. ata ēva bhagavatōktaṃ –
“yadgatvā na nivartaṃtē taddhāma paramaṃ mama ||”. (śrīmadbhagavadgīta - 15 - 6)
(avyaktamukaṃṭe - prakṛtikaṃṭe utkṛṣṭamainavāḍu, dānikaṃṭe sūkṣmamainavāḍu, aṃducēta anniṃṭiki kāraṇamainavāḍu pratyagātma - anniṃṭilōnu aṃtarātmagānuṃḍuvāḍu. aṃducēta puruṣuḍu ani ceppabaḍucunnāḍu - iṭlu ceppuṭacēta itanikaṃṭe sūkṣmamainavāḍu - utkṛṣṭamainavāḍu lēḍani nirthāraṇacēyabaḍinadi. puruṣuḍu sarvāṃtarātma, cidghanuḍu, pratyagātma ayinavānikaṃṭe utkṛṣṭamaina vastuvēdiyu lēdu - paina ceppina prakāramu sūkṣmatvamu, mahatvamu, pratyagātmatvamu anuvāṭiki paryasānamu - avadhi - ākharimeṭṭu - aguṭavalana puruṣuḍē parākāṣṭa, paryavasānasthjānamu - saṃsāramulōnuṃḍi paramagatini poṃda dalacinavāriki adiyē utkṛṣṭamaina gati, poṃdavalasina sthānamu - paramapadamu. itara gatulu, gamyamagu sthānamulu aparamulu - utkṛṣṭamainavi kāvu. dīnini - puruṣuni - poṃdinaṭlaina marala janmakalugadu - kanuka paramagati - “ē paramagatini poṃdina marala janmiṃcarō ā paramapadamē nā sthānamu - adi nēnē” ani śrīkṛṣṇa bhagavānuḍu śrīmadbhagavadgītalō ceppenu).
(adhyānāya = tatparatva jñāna pūrvakaṃ puruṣa darśanāya).
(kaṭhavallilō “iṃdriyamulakaṃṭe arthamulu prakṛṣṭamulu” ani modalukoni ” puruṣunikaṃṭe utkṛṣṭa mainadi lēdu, puruṣuḍē paramagati - kāṣṭa” anuvaraku ceppuṭa ani ceppuṭacēta jñānayōgamucēta sādhiṃcatagina brahma sākṣātkāramu puruṣuḍē - arthamulu modalaguvāṭi anniṃṭikaṃṭe utkṛṣṭamainavāḍu).
(akṣaramanu ceppabaḍu prakṛtikaṃṭe utkṛṣṭamainavāḍu, tējōmūrti ayinavāḍu puruṣuḍu ani ceppabaḍucunnāḍu).
kṣaraḥ sarvāṇi bhūtāni kūṭasthō akṣara ucyatē |
uttamaḥ puruṣastvanyaḥ paramātmētyudā hṛtaḥ |
yō lōkatrayamāviśya bi bhartyavyaya īśvaraḥ ||“. (śrīmadbhagavadgīta - 15 - 16, 17)
“dvau puruṣau kṣaraḥ vināśī, akṣaraḥ tadviparītaḥ bhagavataḥ māyā śaktiḥ kṣarākhyasya puruṣasya utpatti bījaṃ, anēka saṃsāri jaṃtu kāmakarmādi saṃskārāśrayaḥ akṣaraḥ puruṣaḥ”. (śrīśaṃkaraḥ)
“kṣaraḥ sarvāṇi bhūtāni - samasta vikārajātaṃ ityarthaḥ akṣaraḥ kūṭasthaḥ”.
(puruṣuḍu reṃḍu vidhamulu - kṣarapuruṣuḍu - naśiṃcu svabhāvamu kalavāḍu, akṣarapuruṣuḍu kṣarapuruṣunikaṃṭe viparītamainavāḍu, naśiṃcanivāḍu, kṣarapuruṣuni yokka utpattiki bhagavaṃtuni yokka māyāśakti bījamu - anēka saṃsārulayina - anēka jananamaraṇamulugala - prāṇa kāma karmādi saṃsāramunaku āśrayamainavāḍu akṣarapuruṣuḍu).
ē vidhamaina upādhi lēkuṃḍanuṃḍu puruṣuḍu śrīmannārāyaṇuḍē - eṃducētananagā –
“sahasra śīrṣaṃdēvaṃ viśvākṣaṃ viśva śaṃbhuvaṃ |
viśvaṃ nārāyaṇaṃ dēva makṣaraṃ paramaṃ padaṃ |
viśvataḥ paramān nityaṃ viśvaṃ nārāyaṇaṃ hariṃ |
viśvamē vēdaṃ puruṣastadviśvamupa jīvati |
patiṃ viśvastā tmēśvaraṃ śāśvataṃ śivamacyutaṃ |
nārāyaṇaṃ mahājñēyaṃ viśvātmānaṃ parāyaṇaṃ |
nārāyaṇa parōjyōtirātmā nārāyaṇaḥ paraḥ |
nārāyaṇa parabrahma tatvaṃ nārāyaṇaḥ paraḥ |
nārāyaṇa parōdhyātā dhyānaṃ nārāyaṇaḥ paraḥ ||“. (maṃtrapuṣpamu)
(nārāyaṇuḍu anagā tānu sṛṣṭiṃcina vastuvulalōnē nivasiṃcuvāḍu, vāṭiki mōkṣasthānamainavāḍu - anagā sṛṣṭi sthiti layamulu cēyuvāḍu - aṭṭi nārāyaṇuḍē prapaṃcarūpamu, prapaṃcamulōnunna rūpamulanniyu tānē ayinavāḍu - paramapadamanu mōkṣasthānamu tānē ayinavāḍu - prapaṃcamunaku ātma ayinavāḍu (viśvātma) parabrahma - nirākāra, nirguṇa, nirviśēṣa parabrahma - prapaṃcamaṃtaṭilōnu, dānilōni prativastuvulōnunna okē tatvamu tānē ayinavāḍu - atanē puruṣuḍu - prapaṃcamanu puramaṃdu śayaniṃcuvāḍu - prapaṃcamulōnunna samasta vastuvulu anu puramulaṃduṃḍuvāḍu - aṃducēta tānē ī prapaṃcamainavāḍu - aṃducēta nārāyaṇuḍē puruṣuḍani ceppabaḍucunnāḍu)
(puruṣa sūktamulō varṇiṃpabaḍina “sahasra śīrṣā puruṣaḥ” anu modalagu vākyamulacē ceppabaḍina vaibhavamu galavāḍu - “sahasra śīrṣā puruṣaḥ, sahasrākṣaḥ sahasra pād” - (vēlakoladi, lakṣalakoladi śirassulu, kaṃḍlu, pādamulu galavāḍu - prapaṃcamulōnunna jīvulanniyu bhagavaṃtuni rūpamulē kanuka lekkalēnanni jīvula avayavamulanniyu tanavē ayinavāḍu)).
vikārāṃśca guṇāṃścaiva viddhi prakṛtisaṃbhavān |
puruṣaḥ sukha duḥkhānāṃ bhōktṛtvē hēturucyatē |
puruṣaḥ prakṛtisthō hi bhuṃktē prakṛtijān guṇān |
kāraṇaṃ guṇasaṃgō (a)sya sada sadyōni janmasu |
upadraṣṭānumaṃtā ca bhartā bhōktā mahēśvaraḥ |
paramātmā cēti cā pyuktō dēhē(a)smin puruṣaḥ paraḥ |
ya ēvaṃ vētti puruṣaṃ prakṛtiṃ ca guṇaiḥ saha |
sarvathā vartamānōpi na sa bhūyō(a)pi jāyatē ||“. (śrīmadbhagavadgīta - 13 - 19 to 23)
(puruṣuḍu, prakṛti - ī reṃḍu anādikālamunuṃḍi yunnavi - janmalēnivi anagā eppaṭinuṃḍi yunnavō teliyadu. prakṛti eppuḍunū puruṣuni viḍuvakuṃḍa āśrayiṃcukoniyē yuṃḍunu - prakṛtitō kaliyaka vērugā puruṣuḍu sṛṣṭilō ekkaḍanu lēḍu - puruṣunitō kaliyaka vērugā prakṛtigāni dāni aṃśagā nisṛṣṭilō ekkaḍanu lēdu –
“ka. - - -
harimayamugāni dravyamu
paramāṇuvulēdu, vaṃśapāvana viṃṭē” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 17)
satvarajastamamulu prakṛti guṇamulu. prakṛtiyē puruṣunitō kaliyuṭavalana anēka rūpamulugā mārunu. ivi prakṛti vikāramulu - mārpulu. puruṣuḍu prakṛtitō kalisiyuṃḍuṭavalana prakṛti guṇamulananubhaviṃcunu - aṃducēta duḥkhamulaku kāraṇamu. sadasat janmalu ī puruṣuḍu - jīvarūpamulō - prakṛtitō saṃgamiṃcuṭacētanē kalugucunnavi. prakṛtivikāramaina dēhamaṃdu ī puruṣuḍuṃḍi sukhaduḥkhamula nanubhaviṃcucunnāḍu. ī prakāramugā prakṛtini, puruṣuni telusukoninavāḍu tirigi janmiṃcaḍu).
puruṣuḍu reṃḍu vidhamulugā ceppabaḍucunnāḍu - adhyātmamu, adhi daivatamu – kaṃṭilō nuṃḍuvāḍu adhyātmamu - sūryamaṃḍalamaṃduṃḍuvāḍu adhidaivatamu.
“ātmai vēdamagra āsītpuruṣavidhaḥ - - - savai śarīrī pradhamaḥ, savai puruṣa ucyatē, ādikartā sa bhūtānāṃ, brahmāgrē samavartata”.
(moṭṭamodaṭa - sṛṣṭi prāraṃbhamulō - ī prapaṃcamaṃtayu - puruṣuḍugā ātmagā yuṃḍenu - atanē modaṭi śarīri - śarīramugalavāṭilō - puramu anu upādhigala vāralalō modaṭivāḍi - atanē puruṣuḍani ceppabaḍu cunnāḍu - modaṭa sṛṣṭi prāraṃbhamu cēsinavāḍu. paramātma – para brahma tana aparāśakti - (aparā prakṛti) lō pravēśiṃcenu - adi ataniki puramu āyenu. ā puramulō śayaniṃcuvāḍu kanuka puruṣuḍu ani ceppabaḍu cunnāḍu. parabrahma tana parāśakti - cicchakti - tō prakṛtilō pravē śiṃcagā prakṛti anēka rūpamulugā mārenu - vāṭi anniṃṭilō bhagavaṃtuḍu tana cicchaktitō nunnāḍu. avanniyu ataniki puramulaniyu, aṃdulōnunna bhagavadaṃśa puruṣuḍu - jīvuḍaniyu ceppabaḍucunnāḍu - moṭṭamodaṭa (sṛṣṭi prāraṃbhamulō) parabrahma prakṛti anu puramulō prakāśiṃcuṭacēta - śayaniṃcuṭacēta - ādi puruṣuḍaniyu, tarvāta prakṛti yokka vikāramulalō - mārpulalōnunna tana aṃśa yaina jīvunikanna uttamuḍu - uttama puruṣuḍaniyu ceppabaḍucunnāḍu).
(puruṣuḍu - parabrahma - dēniki kāraṇamukāḍu, dēnikini - ē kāraṇa vastuvunaku kāryavastuvu kāḍu - dēnini tanaṃtaṭa tānu sṛṣṭiṃcuṭalēdu - tananu itara vastuvēdiyu sṛṣṭiṃca lēdu - ayina sṛṣṭi eṭlu jarugucunnadanagā - parabrahma prakṛtilō pravēśiṃcuṭavalana, tana cicchaktivalana prakṛtiyē ī carācaravastuvulanniṃṭini puṭṭiṃcucunnadi. –
“mayādhyakṣēṇa prakṛtiḥ sūyatē sa carācaraṃ”
(nēnu prakṛtini adhiṣṭiṃci yuṃḍuṭacēta prakṛtiyē anniṃṭini sṛṣṭiṃcucunnadi). (śrīmadbhagavadgīta - 9 -10)
“na ca māṃ tāni karmāṇi nibadnaṃti dhanaṃjaya | udāsīnavadāsīna masaktaṃ tēṣu karmasu -” (śrīmadbhagavadgīta - 9 -9)
prakṛti sṛṣṭiṃcucunnadi - ī karmayaṃdu nēnu āsakti lēnivāḍanai udāsīnuḍuvale nuṃdunu - aṃducētā karma phalamu nannu aṃṭadu).
“puruṣuḍu anagā iṃkanu ī kriṃda vidhamugā arthamu ceppabaḍinadi : -
(ī puruṣuḍē utkṛṣṭamaina jyōti svarūpuḍu - svayaṃ prakāśuḍu - “tējō ma yaṃ”).
(ī praṃcamaṃtayu puruṣuḍē, bhagavaṃtuḍē - “viśvamē vēdaṃ puruṣaḥ” (maṃtra puṣpamu)
(prati vastuvulōnuṃḍi iṃkoka vastuvunu puṭṭiṃcuṭaku kāraṇarūpuḍai dānilō pravēśiṃci yuṃḍuvāḍu).
(saṃhārakālamaṃdu lōkamulanu aṃtamunoṃdiṃcuvāḍu).
(utkarṣaśāluraṃduṃḍi vāri utkarṣatanu paiki yēdō yokavidhamuga prakāśiṃpacēyuvāḍu).
puramulalōnuṃḍi puruṣa bhāvaṃbuna dīpiṃcuneppuḍu dhīravṛtti
paṃcabhūtamulanu padunokaṃḍiṃdriyamula brakāśiṃpiṃci bhūri mahima
ṣōḍaśātmakuṃḍana śōbhilli jīvatva nṛtta vinōdaṃbu neṟapucuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 4 - 68)
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - )
(puruṣuḍu jīvuḍani īśvaruḍani (paramātmayani) reṃḍu rūpamulatō nunnāḍu - prakṛtitō kalisiyuṃḍuṭacēta saṃsāramulō paḍiyuṃḍuvāḍu jīvuḍu - prakṛti vaśamulōnuṃḍaka, prakṛtini tanavaśamulō nuṃcukoni dāni mūlamugā prapaṃca suṣṭisthitilayamulu cēyuvāḍu īśvaruḍu -.)
(prakṛtini adhiṣṭiṃciyuṃḍi, tanaku upādhigā cēsukoni dānicēta sṛṣṭi modalagu panulu cēyiṃcuvāḍu).
jīva śarīrakaḥ, jīvaḥ - (jīvuḍu - jīva śarīramu galavāḍu).
bhōktā (karmaphalamanubhaviṃcuvāḍu - jīvuḍugānuṃḍi).
śarīrābhimānī (śarīramaṃdabhimānamu kalavāḍu).
cinmātra ghanaḥ (ghanībhaviṃcina caitanyamu - jñānamu - kalavāḍu). (ghanībhaviṃcina caitanyamē, jñānamē rūpamugā galavāḍu).
pratyagātma (vēru vēru śarīramulalōnuṃḍu jīvātma).
“puruṣōnāma saṃpūrṇa śivassatyādi lakṣaṇaḥ”
(satyaṃ jñānamanaṃtaṃ brahma “.” saccidānaṃdaṃ brahma ” anu lakṣaṇamulugala saṃpūrṇuḍai yuṃḍuśivuḍu - puruṣuḍu).
anyēṣu tāratamyēna sthitēṣu puruṣōttamaḥ |
vyōmātsarvadā vyāpta ssarva saṃbaṃdhi varjitaḥ |
ēka rūpō mahā dēvaḥ sthitassōhaṃ parāmṛtaṃ ||’. (muktikhaṃḍamu)
(caṃḍāluni śarīramunaṃdu, paśuvu modalaguvāṭi śarīramaṃdu, brāhmaṇuni śarīramaṃdu - iṭlu heccu taggulugā (goppavi, cinnavigānu) unna itara śarīramulalōnu ākāśamuvale ellapuḍu vyāpiṃciyuṃḍi, vāṭi vēṭitōnu ē vidhamaina saṃbaṃdhamu lēka okaḍē ayina (okē rūpamugala) mahā dēvuḍunnāḍu. paina ceppabaḍina uccha, nīca śarīramulu puramulu. vīṭi anniṃṭilōnu okaḍē ayina paramātmayunnāḍu. ā puramulalō nuṃḍuṭacēta puruṣuḍani ceppabaḍucunnāḍu - ē śarīramulō nunnanu, ē padārthamulōnunnanu adi paramātmaku puramu - aṃdulō nuṃḍuṭacēta paramātma puruṣuḍu).
agnērāpaḥ ap bhyaḥ pṛdhivī, pṛdhivyāḥ, auṣadhayaḥ, auṣadēbhyō annaṃ, annāt puruṣaḥ “navā ēṣa puruṣō annarasamayaḥ” (taitirīyōpaniṣat)
(“satyaṃ jñānamanaṃtaṃ brahma” aninnī, “ātmavalana ākāśamu puṭṭinadi, ākāśamuvalana vāyuvu, vāyuvu valana agni, agnivalana nīru, nīṭivalana bhūmi, bhūminuṃḍi auṣadhulu, auṣadhulanuṃḍi annamu, annamuvalana puruṣuḍu” ani ceppi yuṃḍuṭacēta ā ātmayē inni rūpamulugā - inni vastuvulugā - māri puruṣuḍu āyenu - aṃducēta puruṣuḍu - jīvuḍu - annamayuḍu - (atti iti ātmā) - annamu yokka pariṇāmamē śarīramugā galavāḍu – (jīvātma).
saṃbhūtaṃ ṣōḍaśakalāmādau lōkasisṛkṣayā |
yasyāṃ bhasi śayānasya yōganidrāṃ vitanvitaḥ |
nābhi hṛdaṃ bujādānīdbrahma viśvanṛjāṃ patiḥ |
yasyāva yava saṃsthānaiḥ kalpitō lōka vistaraḥ |
tadvai bhagavatō rūpaṃ viśuddhaṃ satyamūrjitaṃ ||.
paśyaṃtyadō rūpamadabhra cakṣuṣā sahasra pādōru bhujāna nādbhutaḥ |
sahasra mūrthna śravaṇākṣi nāsikaṃ sahasra mālyaṃbara kuṃḍalōllasat |
ēta nnānāvatārāṇāṃ nithānaṃ bījamavyayaṃ |
yasyāṃ śyāṃśēna nṛjyaṃtē dēva tirya ṅnarādayaḥ ||“. (śrīmadbhāgavataṃ - 1 - 3 - 1 to 5)
(paina vrāsina bhāgavatamulōni ślōkamunaku āṃdhrīkaraṇamu ī kriṃda vidhamugā nunnadi : -
“sī. mahadahaṃkāra tanmātra saṃ yuktuḍai cāru ṣōḍaśakaḷā sahituḍagucu
paṃcamahābhūta bhāsituṃḍaiśuddhasatvuḍai sarvātiśāyi yagucu
jaraṇōru bhujamukhaśravaṇākṣi nānā śikharamulu nānā sahasramulu veluga
naṃbara kēyūrahārakuṃḍala kirīṭādulu pekkuvēlamarucuṃḍa
tē. buruṣa rūpaṃbu dhariyiṃci paruḍanaṃtu
ḍakhila bhuvanaika vartana yatnamamara
mānitōdāra jalarāśi madhyamunanu
yōga nidrā vilāsiyai yoppucuṃḍu”.
“va. adi sakalāvatāraṃbulaku modaligani yaina śrīmannārāyaṇa dēvuni virājamānaṃbayina divyarūpaṃbu” – (śrīmahābhāgavatamu - 1 - 3 - 60)
“śuklādhikyē bhavētpuṃsaḥ, nārīraktādhi kēnatu śukla rakta samatvēna napuṃsaka itīritaḥ |”.
duṣkṛtakarma viśēṣaṃ valla aṃdhakabadhiramūka, kubjasauṃdarya hīna, ṣaṃḍa modalaina avalakṣaṇa guṇālugalavāḍaunu. sukṛta karma viśēṣaṃ valla sarva sulakṣaṇa saṃpanna śarīri agunu “.
1. asūyakāḥ parēṣāṃ guṇēṣu dōṣānēva gṛhṇaṃti, natuguṇān.
2. kēcinmadhyasthāḥ paraguṇēṣu dōṣān na gṛhṇaṃti, kiṃtu yathāsthitān guṇān dōṣān vivēkēna gṛhṇaṃti. tā tu mahāṃtaḥ ucyaṃtē.
3. sādhivastu kēvalaṃ guṇānēva gṛhṇaṃti, na dōṣān. tē tu mahattarāḥ ucyaṃtē. mahattamāstu dōṣān na gṛhṇaṃtyēva, pratyuta phalgūn tucchān api guṇān bahuḷī kariṣṇavō bhavaṃti”.
(puruṣulu nālugu vidhamulu –
(1). asūyāparulu, itarula dōṣamulanē tīsukonuvāru, maṃci guṇamulanu lekkacēyani vāru,
(2). koṃdaṟu madhyasthulu - itarula guṇamulalōni dōṣamulanu vadali kāni guṇamulu dōṣamulu eṭlunnavō aṭlu ālōcana cēsi tīsukonedaru.
(3) sādhuvulu mātramu maṃci guṇa mulanē tīsukonedaru, dōṣamulanu vadalivēturu - aṭṭivāru mahattarulu.
(4) maṟi koṃdaṟu dōṣamulanu gaṇiṃcaru, kāni, cinnavainanu guṇamulanu eṃtō goppagācēsi ceppuduru. aṭṭivāru mahattamamulu.
“ca. puruṣa bhavaṃbunoṃduṭa yapūrvamu janmamulaṃdu - - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 213)
“ihaivāṃtaśśarīrē, sōmya ! sapuruṣō yasminnētāḥ ṣōḍaśakalāḥ prabhavaṃti. sa īkṣāṃ cakrē -”. kasminnaha mutkrāṃta utkrāṃtō bhaviṣyāmi? kasminvā pratiṣṭhatē? pratīṣṭā syāmīta? saprāṇamasṛjata, prāṇācchraddhāṃ, khaṃ, vāyurjyōti rāpaḥ pṛdhivīṃdriyaṃ manaḥ, annamannā dvīryaṃ tapōmātrāḥ karmalōkāḥ lōkēṣu ca, nāma ca, sa yadhēmā nadyaḥ syaṃdamānāḥ samudrāyaṇāḥ samudraṃ prāpyātaṃ gacchaṃti bhidyatē tāsāṃ nāmarūpē vihāya samudra ityēvaṃ prōcyatē ēvamē vāsya paridraṣṭurimāḥ ṣōḍaśa kalāḥ puruṣāyaṇāḥ puruṣaṃ prāptā (a)staṃ gacchaṃti bhidyatē tānāṃ nāmarūpē puruṣa ityēvaṃ prōcyatē. sa ēṣō (a)kalō (a)mṛtō bhavati||“. (praśnōpaniṣat - 2)
(padahāru kaḷalu galiginaṭuvaṃṭi puruṣuḍu anuvāḍu ikkaḍē ī śarīramu lōnē unnāḍu. ā puruṣuḍu ī prakāramugā nālōciṃcenu – “ī śarīramu nuṃḍi ēdi veḷḷipōyina nēnu veḷḷi pōyedanu, ēdi yuṃḍina nēnuṃḍedanu.” ani. appuḍu puruṣuḍu prāṇamunu sṛjiṃcenu. prāṇamunuṃḍi śraddha, ākāśamu, gāli, agni, nīru, pṛdhivi, jñānēṃdriyamulu, manassu, annamu, annamunuṃḍi vīryamu, tapassu, mātralu, karma, lōkamulu, ī rūpamulanniṃṭiki nāmamulu sṛjiṃcenu - samudramulō kalisipōvuṭaku samudramuvaipu pravahiṃcucunna nadulu, vāṭiki adivaṟakunna nāmarūpamulu vadali samudramulō kalisipōyi aṃtā samudramē ani yeṭlu anipiṃcukuṃṭunnavō, aṭlē puruṣuni ī padahāru kaḷalu puruṣuni poṃdi vāṭi nāmarūpamulu vadalukoni puruṣunilō kalisipōyi aṃtā puruṣuḍē anipiṃcukonucunnavi. ā puruṣuḍu svataḥ kaḷalu lēnivāḍu, mṛtilēnivāḍu - anagā, nadulavale iṃkoka dānilō kalisipōyi tānu lēkuṃḍa pōvuvāḍu kāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.