పుత్రేతి నామ సార్థంస్యాత్ తేన తస్య మునీశ్వరాః ||; (దేవీభాగవతం)
- పున్నామో నరకాత్ యస్మాత్ పితరం త్రాయతే సుతః |
తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్తః స్వయమేవ స్వయంభువ ||”
ఇతి పుత్రపద వ్యుత్పత్తిః.
(పున్నామ నరకమునుండి - పుత్ అను నరకమునుండి తండ్రిని రక్షించువాడుకనుక పుత్రుడని పేరుకొడుకునకు కలిగినది. నరకము అనగా దుఃఖము - ” తన సంతోషమె తన స్వర్గము, తన దుఃఖమేనరకమండ్రు తథ్యము సుమతీ ||“.
(తండ్రి చేయవలసిన పని చేయక చనిపోయిన మిగిలిపోయిన పనిని పుత్రుడు చేసిన - పూర్తిచేసిన - యడల పరలోకములు ప్రాప్తించుటకు ప్రతి బంధకమైన (అడ్డు అయిన) వాటినుండి తండ్రిని విముక్తి చేయును - అందుచేత పుత్రుడు అని చెప్పబడు చున్నాడు).
“జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్థ భూరి భోజనాత్ |
గయాం పండ దానేన త్రిభిః పుత్రస్య పుత్రతా ||“.
(తనకు పుట్టినంత మాత్రమున పుత్రుడు అని చెప్పబడడు - తండ్రి జీవించి యున్నపుడు అతని వాక్యమును పాటించుట - తండ్రి చనిపోయిన పిమ్మట ప్రతి సంవత్సరము శ్రాద్ధము పెట్టుట, గయలో పిండము వేయుట అను నీ మూడు కార్యములు చేయుట వలన పుత్రుడగును).
మునికొని తా బుత్రరూపమున నుదయించున్
విను దీపమందు ముట్టిం
చిన దీపము రెండుగావె శిఖి యొకటయ్యున్.
క. కావున నీ యర్ధమ యా
త్మావై పుత్ర యని వేద తతులం గోలిన్
వావిరి బలుకగ వినవే - - - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 14 - 455, 456)
(తండ్రియే కొడుకై పుట్టును - అంశజుడు - తన వీర్యమువలన పుట్టినవాడు).
“క. మనుజేంద్ర నీకతంబున
ననుపమ ఘన బ్రహ్మదండ హతుడత్యఘ వ
ర్తనడు నగు నట్టి వేనుం
డన యము నరకంబువలన నర్థి దరించెన్
వ. కావునం “బుత్రేణ లోకాన్ జయతి” యను వేద వచనంబు నిశ్చయంబు. అదియునుంగాక –
చ. పురుషవరేణ్య! హేమకశిపుండు రమాలలనేశు నిందచే
నరకము నొందగోరియు గుణజ్ఞుడు భగవంతుడనైన యా
వరతనయ ప్రభావమున వాసికి నెక్కి విధూత పాపుడై
నిరయము బొందడయ్యె నతి నిర్మలకీర్తి దనర్చె గావునన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 22 - 593 to 595)
(దుర్మార్గుడైన వేనుడు తనయుడైన పృధుచక్రవర్తివలన సద్గతి పొందెను. అట్లే దుర్మార్గుడైన హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని బట్టి ఉత్తమగతిని పొందెను)..
శీలేన ప్రమదా జవేన తురగో నిత్యోత్సువైర్మందిరం |
వాణీ వ్యాకరణేన హంస మిధునైర్నన్యః, సభా పండితైః |
సత్పుత్రేణ కులం, త్వయా వసుమతీ, లోకత్రయం భానునా ||“. (భోజరాజ చరిత్ర)
(ఏనుగు మదముగలదై ప్రకాశించును - ఆకాశము మేఘములచే ప్రకాశించును - - - - పూర్ణచంద్రుడుతోరాత్రి శోభిల్లును - మంచి శీలముగల స్త్రీ శోభించును, వేగముగా పరుగెత్తు గుఱ్ఱము శోభించును - ఎల్లపుడు ఉత్సవములచే గృహము శోభిల్లును - వ్యాకరణయుక్తమగు వాక్కు శోభిల్లును - రాజహంస మిధునములతో నదులు శోభావంతములగును - మంచి పండితులుగల సభ శోభిల్లును - మంచి కుమారునితో వంశము శోభిల్లును - (రఘువంశము రాఘవునిచే శోభిల్లినట్లు). నీవంటి రాజుగల రాజ్యము - దేశము. భూమి - శోభించును - సూర్యునిచే మూడులోకములు ప్రకాశించును).
పున్నామో నరకాత్ పుత్రః త్రాయతే స్వకులం క్షణాత్ |
కన్యా స్వీయ దూరావారాత్ క్షణాన్ని జ పితుః కులం |
తథాభర్తుః కులంచాపి నరకే పాతయేచ్ఛసా |
తస్మాన్నరైశ్చ పుత్రార్థం యత్నః కార్యస్త్వహర్నిశం ||“. (ఆనందరామాయణం)
(ఒకడైనను పుత్రుడే శ్రేష్టము, పదిమంది పుత్రికలు పుట్టిననేమి ప్రయోజనము - పుత్రుడు తన వంశమును పున్నామనరకమునుండి క్షణములో రక్షించును - పుత్రిక తన దురాచారమువలన ఒక్క క్షణములో తన తండ్రి కులమును తన భర్త కులమును నరకములో పడవేయగలదు, అందుచేత నరులు రాత్రింబవలు పుత్రునికొఱకు యత్నము చేయవలెను).
సుతులకై నిష్టుర ప్రతినిష్ఠ పూనడే బుధులెన్న యువనాశ్వభూమి భర్త
సంతతికై యుగ్ర శపథముల్ పలుకడే జలదీంద్రుతో హరిశ్చంద్ర నృపుడు
ఘన పుత్రకాముడై క్రత వాచరింపడే బహు దక్షిణలుమీఱ బంక్తిరధుడు
నందనా వాప్తికై కాదె నాభికశ్యపాత్రి
దక్షాది పుణ్యు లాయాసపడుట
తలచి చూడడు వారికి గలవొ లేవొ
వర తటాకాది సంతానవైభవములు“. (కులశేఖరమహీపాల చరిత్ర - 1 - 29)
నిర్భాగ్యస్యాన పత్యస్య కిమతో జీవితేనమే ||
ధిగ్జీవితం ప్రజాహీనం, ధిక్ గృహం సంతతిం వినా |
దిగ్జననం చానపత్యస్య, థిక్కులం సంతతింవినా ||
పాల్యతేయా మయా ధేనుః సావంధ్యా సర్వదా భవేత్ |
యా మ యారోపితో వృక్షో సోపి వంధ్యత్వమాశ్రయేత్ ||“. (పద్మపురాణోత్తర ఖండము - 6 - 4 - 29, 30, 31)
(నా ఇంటికి ఏ ఫలమును తెచ్చినను అది శీఘ్రముగానే నశించును - పుత్రుడు లేనందువలన. అందుచేత పుత్రుడులేని నా నిర్భాగ్యజీవితము వలన నాకేమి ప్రయోజనము) సంతతి లేని జీవితము వ్యర్థము; సంతతిలేని యి ల్లు వ్యర్థము; పుత్రుడులేని జన్మ వ్యర్థము, వాని కులము కూడ వ్యర్థము. (సంతానము లేని నేను పెంచి పోషించిన ఆవు పెయ్యలను కనదు, నేను భూమిలో నాటిన విత్తనము చిగురించదు - సంతానము లేనివాడు చేయు పనులన్నియు నీ ప్రకారముగానే ఫలింపవు).
పనిచిన మధ్యములు పొందు పఱతురు. తండ్రుల్
పనిచెప్పి కోరి పనిచిన
ననిశము మాఱాడు పుత్రులధములు, తండ్రీ“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 18 - 557, 558)
పుత్రమిత్రాదులు పూర్వ జన్మంబున నెవ్వనివారలో యెఱుగగలవె
మొదల నదీవేగమున నాడకాడకు సికతంబు గూడుచు జెదరుచుండు
నారీతి బ్రాణుల కతి కాలగతిచేత బుట్టుట జచ్చుట పొశగుచుండు
గాన భూతములకు గలుగు భూతంబులు | మమత తోడ విష్ణుమాయ జేసి - - - ||“.
మును, మనో వ్యధయునుమునుకొని ప్రాప్తించు, నట్టి కుపుత్ర మోహంబు విడువ
జాలక, బహుమానసంగతిగను నెవ్వడెతని గేహంబు దుఃఖాలయంబు
నగునని, మఱియు నిట్లను - మనుజుండు శోకస్థానమగు పుతుకతనజేసి
తే. యనుపక్లేశభాజనంబయిన గృహము
విడుచు - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 13 - 406)
(అంగరాజునకు దుర్మార్గుడైన వేనుడు పుత్రుడుగా పుట్టుటవలన ఆ రాజు రాజ్యమువదలి వెళ్ళిపోయెను).
దత్తః కేనాపి శక్తౌ ధనగ్రాహి సుతా స్మృతాః ||“.
ఉత్తరోత్తరతః పుత్రాః నికృష్టా ఇతి నిశ్చయః ||“.
(అంశజః= స్వవీర్యజః; పుత్రికా పుత్రః= కన్యా పుత్రః; - అస్యాం జాయ మానో పుత్రోమమ ఇతి సంకేతితః; క్షేత్రజ్ఞః= : యస్తల్పజః ప్రమీతస్య, క్లీబస్య వాధితస్యవా స్యధర్మేణ నియుక్తాయాం సపుత్రః క్షేత్రదః స్మృతః || “ఇతి మనుః. గోలకః= స్వక్షేత్రే స్వస్త్రియాం మృతే భర్తరిజాయ మానో గోలకః, అమృతే జారజః; కుండః= సహోడజస్తు గర్భే స్థితో గర్భిణ్యాం పరిణీతాయాం యః పరిణీతః స వోఢుః కానీనః= పితృవేశ్మని కన్యాతం యం పుత్రం జన యేత్ గ్రహః, తం కానీనం పదేన్నామ్నేతి; క్రీతో= మౌల్యేన గృహీతః వనేప్రాప్తశ్చ; దత్తః= అసక్తౌ కేనాపి పుత్రపాలనా సామర్థ్యే కేనాపి దత్తః. ఏతే ధనగ్రాహి సుతాః భవంతి”.
(పుత్రులు అనేక విధములుగా చెప్పబడుచున్నారు : - అంశజుడు= తన వీర్యమువలన పుట్టినవాడు; పుత్రికాపుత్రుడు= కన్యా పుత్రుడు (ఈ కన్య యందు పుట్టినవాడు నాపుత్రుడు అను సంకేతమువలన పుత్రుడైనవాడు); క్షేత్రజుడు= భర్త చనిపోయినతర్వాత అతని భార్యయందు పుట్టినవాడు; కుందకుడు= గర్భిణిగా యుండగా పెండ్లి అయినదాని కొడుకు; కానీనుడు=తండ్రి ఇంటిలో కన్యగానుండగా కన్న కొడుకు, క్రీతః= ప్రాప్తుడు - విక్రయించగా కొనబడినవాడు - ధనముకొఱకు అమ్మబడినవాడు; దత్తుడు= పుత్రుని పోషించుటకసమర్థుడైన వానిచే దత్తత ఇవ్వబడినవాడు -).
putrēti nāma sārthaṃsyāt tēna tasya munīśvarāḥ ||; (dēvībhāgavataṃ)
- punnāmō narakāt yasmāt pitaraṃ trāyatē sutaḥ |
tasmāt putra iti prōktaḥ svayamēva svayaṃbhuva ||”
iti putrapada vyutpattiḥ.
(punnāma narakamunuṃḍi - put anu narakamunuṃḍi taṃḍrini rakṣiṃcuvāḍukanuka putruḍani pērukoḍukunaku kaliginadi. narakamu anagā duḥkhamu - ” tana saṃtōṣame tana svargamu, tana duḥkhamēnarakamaṃḍru tathyamu sumatī ||“.
(taṃḍri cēyavalasina pani cēyaka canipōyina migilipōyina panini putruḍu cēsina - pūrticēsina - yaḍala paralōkamulu prāptiṃcuṭaku prati baṃdhakamaina (aḍḍu ayina) vāṭinuṃḍi taṃḍrini vimukti cēyunu - aṃducēta putruḍu ani ceppabaḍu cunnāḍu).
“jīvatō vākyakaraṇāt pratyabtha bhūri bhōjanāt |
gayāṃ paṃḍa dānēna tribhiḥ putrasya putratā ||“.
(tanaku puṭṭinaṃta mātramuna putruḍu ani ceppabaḍaḍu - taṃḍri jīviṃci yunnapuḍu atani vākyamunu pāṭiṃcuṭa - taṃḍri canipōyina pimmaṭa prati saṃvatsaramu śrāddhamu peṭṭuṭa, gayalō piṃḍamu vēyuṭa anu nī mūḍu kāryamulu cēyuṭa valana putruḍagunu).
munikoni tā butrarūpamuna nudayiṃcun
vinu dīpamaṃdu muṭṭiṃ
cina dīpamu reṃḍugāve śikhi yokaṭayyun.
ka. kāvuna nī yardhama yā
tmāvai putra yani vēda tatulaṃ gōlin
vāviri balukaga vinavē - - - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 14 - 455, 456)
(taṃḍriyē koḍukai puṭṭunu - aṃśajuḍu - tana vīryamuvalana puṭṭinavāḍu).
“ka. manujēṃdra nīkataṃbuna
nanupama ghana brahmadaṃḍa hatuḍatyagha va
rtanaḍu nagu naṭṭi vēnuṃ
ḍana yamu narakaṃbuvalana narthi dariṃcen
va. kāvunaṃ “butrēṇa lōkān jayati” yanu vēda vacanaṃbu niścayaṃbu. adiyunuṃgāka –
ca. puruṣavarēṇya! hēmakaśipuṃḍu ramālalanēśu niṃdacē
narakamu noṃdagōriyu guṇajñuḍu bhagavaṃtuḍanaina yā
varatanaya prabhāvamuna vāsiki nekki vidhūta pāpuḍai
nirayamu boṃdaḍayye nati nirmalakīrti danarce gāvunan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 22 - 593 to 595)
(durmārguḍaina vēnuḍu tanayuḍaina pṛdhucakravartivalana sadgati poṃdenu. aṭlē durmārguḍaina hiraṇyakaśipuḍu tana kumāruḍaina prahlāduni baṭṭi uttamagatini poṃdenu)..
śīlēna pramadā javēna turagō nityōtsuvairmaṃdiraṃ |
vāṇī vyākaraṇēna haṃsa midhunairnanyaḥ, sabhā paṃḍitaiḥ |
satputrēṇa kulaṃ, tvayā vasumatī, lōkatrayaṃ bhānunā ||“. (bhōjarāja caritra)
(ēnugu madamugaladai prakāśiṃcunu - ākāśamu mēghamulacē prakāśiṃcunu - - - - pūrṇacaṃdruḍutōrātri śōbhillunu - maṃci śīlamugala strī śōbhiṃcunu, vēgamugā parugettu guṟṟamu śōbhiṃcunu - ellapuḍu utsavamulacē gṛhamu śōbhillunu - vyākaraṇayuktamagu vākku śōbhillunu - rājahaṃsa midhunamulatō nadulu śōbhāvaṃtamulagunu - maṃci paṃḍitulugala sabha śōbhillunu - maṃci kumārunitō vaṃśamu śōbhillunu - (raghuvaṃśamu rāghavunicē śōbhillinaṭlu). nīvaṃṭi rājugala rājyamu - dēśamu. bhūmi - śōbhiṃcunu - sūryunicē mūḍulōkamulu prakāśiṃcunu).
punnāmō narakāt putraḥ trāyatē svakulaṃ kṣaṇāt |
kanyā svīya dūrāvārāt kṣaṇānni ja pituḥ kulaṃ |
tathābhartuḥ kulaṃcāpi narakē pātayēcchasā |
tasmānnaraiśca putrārthaṃ yatnaḥ kāryastvaharniśaṃ ||“. (ānaṃdarāmāyaṇaṃ)
(okaḍainanu putruḍē śrēṣṭamu, padimaṃdi putrikalu puṭṭinanēmi prayōjanamu - putruḍu tana vaṃśamunu punnāmanarakamunuṃḍi kṣaṇamulō rakṣiṃcunu - putrika tana durācāramuvalana okka kṣaṇamulō tana taṃḍri kulamunu tana bharta kulamunu narakamulō paḍavēyagaladu, aṃducēta narulu rātriṃbavalu putrunikoṟaku yatnamu cēyavalenu).
sutulakai niṣṭura pratiniṣṭha pūnaḍē budhulenna yuvanāśvabhūmi bharta
saṃtatikai yugra śapathamul palukaḍē jaladīṃdrutō hariścaṃdra nṛpuḍu
ghana putrakāmuḍai krata vācariṃpaḍē bahu dakṣiṇalumīṟa baṃktiradhuḍu
naṃdanā vāptikai kāde nābhikaśyapātri
dakṣādi puṇyu lāyāsapaḍuṭa
talaci cūḍaḍu vāriki galavo lēvo
vara taṭākādi saṃtānavaibhavamulu”. (kulaśēkharamahīpāla caritra - 1 - 29)
nirbhāgyasyāna patyasya kimatō jīvitēnamē ||
dhigjīvitaṃ prajāhīnaṃ, dhik gṛhaṃ saṃtatiṃ vinā |
digjananaṃ cānapatyasya, thikkulaṃ saṃtatiṃvinā ||
pālyatēyā mayā dhēnuḥ sāvaṃdhyā sarvadā bhavēt |
yā ma yārōpitō vṛkṣō sōpi vaṃdhyatvamāśrayēt ||“. (padmapurāṇōttara khaṃḍamu - 6 - 4 - 29, 30, 31)
(nā iṃṭiki ē phalamunu teccinanu adi śīghramugānē naśiṃcunu - putruḍu lēnaṃduvalana. aṃducēta putruḍulēni nā nirbhāgyajīvitamu valana nākēmi prayōjanamu) saṃtati lēni jīvitamu vyarthamu; saṃtatilēni yi llu vyarthamu; putruḍulēni janma vyarthamu, vāni kulamu kūḍa vyarthamu. (saṃtānamu lēni nēnu peṃci pōṣiṃcina āvu peyyalanu kanadu, nēnu bhūmilō nāṭina vittanamu ciguriṃcadu - saṃtānamu lēnivāḍu cēyu panulanniyu nī prakāramugānē phaliṃpavu).
panicina madhyamulu poṃdu paṟaturu. taṃḍrul
paniceppi kōri panicina
naniśamu māṟāḍu putruladhamulu, taṃḍrī”. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 18 - 557, 558)
putramitrādulu pūrva janmaṃbuna nevvanivāralō yeṟugagalave
modala nadīvēgamuna nāḍakāḍaku sikataṃbu gūḍucu jedarucuṃḍu
nārīti brāṇula kati kālagaticēta buṭṭuṭa jaccuṭa pośagucuṃḍu
gāna bhūtamulaku galugu bhūtaṃbulu | mamata tōḍa viṣṇumāya jēsi - - - ||“.
munu, manō vyadhayunumunukoni prāptiṃcu, naṭṭi kuputra mōhaṃbu viḍuva
jālaka, bahumānasaṃgatiganu nevvaḍetani gēhaṃbu duḥkhālayaṃbu
nagunani, maṟiyu niṭlanu - manujuṃḍu śōkasthānamagu putukatanajēsi
tē. yanupaklēśabhājanaṃbayina gṛhamu
viḍucu - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 13 - 406)
(aṃgarājunaku durmārguḍaina vēnuḍu putruḍugā puṭṭuṭavalana ā rāju rājyamuvadali veḷḷipōyenu).
dattaḥ kēnāpi śaktau dhanagrāhi sutā smṛtāḥ ||“.
uttarōttarataḥ putrāḥ nikṛṣṭā iti niścayaḥ ||“.
(aṃśajaḥ= svavīryajaḥ; putrikā putraḥ= kanyā putraḥ; - asyāṃ jāya mānō putrōmama iti saṃkētitaḥ; kṣētrajñaḥ= : yastalpajaḥ pramītasya, klībasya vādhitasyavā syadharmēṇa niyuktāyāṃ saputraḥ kṣētradaḥ smṛtaḥ || “iti manuḥ. gōlakaḥ= svakṣētrē svastriyāṃ mṛtē bhartarijāya mānō gōlakaḥ, amṛtē jārajaḥ; kuṃḍaḥ= sahōḍajastu garbhē sthitō garbhiṇyāṃ pariṇītāyāṃ yaḥ pariṇītaḥ sa vōḍhuḥ kānīnaḥ= pitṛvēśmani kanyātaṃ yaṃ putraṃ jana yēt grahaḥ, taṃ kānīnaṃ padēnnāmnēti; krītō= maulyēna gṛhītaḥ vanēprāptaśca; dattaḥ= asaktau kēnāpi putrapālanā sāmarthyē kēnāpi dattaḥ. ētē dhanagrāhi sutāḥ bhavaṃti”.
(putrulu anēka vidhamulugā ceppabaḍucunnāru : - aṃśajuḍu= tana vīryamuvalana puṭṭinavāḍu; putrikāputruḍu= kanyā putruḍu (ī kanya yaṃdu puṭṭinavāḍu nāputruḍu anu saṃkētamuvalana putruḍainavāḍu); kṣētrajuḍu= bharta canipōyinatarvāta atani bhāryayaṃdu puṭṭinavāḍu; kuṃdakuḍu= garbhiṇigā yuṃḍagā peṃḍli ayinadāni koḍuku; kānīnuḍu=taṃḍri iṃṭilō kanyagānuṃḍagā kanna koḍuku, krītaḥ= prāptuḍu - vikrayiṃcagā konabaḍinavāḍu - dhanamukoṟaku ammabaḍinavāḍu; dattuḍu= putruni pōṣiṃcuṭakasamarthuḍaina vānicē dattata ivvabaḍinavāḍu -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.