పాత్రలోని తైలమునంతను వంచివేసినను, దానినంటుకొని కొంతనూనె మిగిలియుండునట్లుకర్మఫలమెంత అనుభవించినను కొంతకర్మఫలము మిగిలియేయుండును.
“వర్ణా ఆశ్రమాశ్చ స్వకర్మ నిష్టితాః ప్రేత్య, కర్మఫలమనుభూయ తతశ్శేషేణ దేశ జాతి కుల రూపాయుః శ్రుత విత్త వృత్త సుఖ మేథసో జన్మ ప్రతి పద్యంతే” (గౌతమ ధర్మసూత్రములు)
(బ్రాహ్మణాది వర్ణములవారును, బ్రహ్మచర్యాది ఆశ్రమములవారును తమ తమ విహితకర్మలను నిష్టతో నాచరించి, చనిపోయినతర్వాత స్వర్గము మొదలగు లోకములందు ఆయా కర్మలకు అనుగుణమగు ఫలములననుభచించి, మిగిలిన కర్మచే నుత్తమమగు దేశ, జాతి, కుల, రూప, వయశ్రుత, విత్త, సుఖ, శీల. బుద్ధి యుక్తమగు జన్మములను పొందుదురు. దీనిని బట్టికర్మఫలమెంత అనుభవించినను, ఇంకను కొంతమిగిలియే యుండును కనుక దాని ననుభవించుటకు భూలోకములో మరల జన్ముంచెదరు అనుట నిశ్చయము).
pātralōni tailamunaṃtanu vaṃcivēsinanu, dāninaṃṭukoni koṃtanūne migiliyuṃḍunaṭlukarmaphalameṃta anubhaviṃcinanu koṃtakarmaphalamu migiliyēyuṃḍunu.
“varṇā āśramāśca svakarma niṣṭitāḥ prētya, karmaphalamanubhūya tataśśēṣēṇa dēśa jāti kula rūpāyuḥ śruta vitta vṛtta sukha mēthasō janma prati padyaṃtē” (gautama dharmasūtramulu)
(brāhmaṇādi varṇamulavārunu, brahmacaryādi āśramamulavārunu tama tama vihitakarmalanu niṣṭatō nācariṃci, canipōyinatarvāta svargamu modalagu lōkamulaṃdu āyā karmalaku anuguṇamagu phalamulananubhaciṃci, migilina karmacē nuttamamagu dēśa, jāti, kula, rūpa, vayaśruta, vitta, sukha, śīla. buddhi yuktamagu janmamulanu poṃduduru. dīnini baṭṭikarmaphalameṃta anubhaviṃcinanu, iṃkanu koṃtamigiliyē yuṃḍunu kanuka dāni nanubhaviṃcuṭaku bhūlōkamulō marala janmuṃcedaru anuṭa niścayamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.