చీకటి, శోకము, తమోగుణము
తమః ఇతి అంధకారస్య అజ్ఞానస్యచ నామ, తత్ర అంధకారః ఉపమానం, అజ్ఞానం ఉపమేయం. తమము అనునది అంధకారమునకు (చీకటికి) అజ్ఞానమునకు పేరు. అంధకారము ఉపమానము, అజ్ఞానము ఉపమేయము).
సంసారం; సంసారాఖ్యం తమః. (సంసారము, సంసారమను పేరుగల చీకటి).
తమః జడం, మోహాత్మకం లోష్ట శిలాదివత్.
(జడస్వభావముగలది. లోష్టము, శిల మొదలగువాటి వంటిది, మోహాత్మకము (మోహము) మోహింపచేయునది).
(జీవాత్మల జ్ఞానము సంకోచించునట్లు చేయునది, తమోగుణము, ఆత్మయొక్క స్వప్నావస్థ).
క్రోధము, నరకము.
“చక్షుర్వృత్తి నిరోధకం - శార్వరాధికం తమ ఉచ్యతే. (శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే)
“శార్వర్యాం రాత్రౌ భవం శార్వరం - నీలమితి యావత్”
(చక్షుర్వృత్తిని - చూపును - నిరోధించునది - అమావాస్యరాత్రినాటి చీకటి-).
(తమము అనగా ఆచ్ఛాదించునది -కను దృష్టిని కప్పిపుచ్చునది - జ్ఞానమును ఆచ్ఛాదించునది, కప్పిపుచ్చునది).
అనాత్మయగు దేహాదులందు ఆత్మాభిమానము తమస్సు -
“ఆవరణమనియెడిది వివేకించినాను నిశ్చయించనివ్వదు కనుక అవిద్య యనిపించుకొనును. నిబిడాంధకారమువలెనే ముందు వెనుకలనుపించనియ్యదు కనుక తమస్సనే పేరాయెను. లేని ప్రపంచమును కలుగచేస్తుంది కనుక మాయయను పేరాయెను”.
(బ్రహ్మవిద్యా సుధావర్ణము - 7)
“రామే ణైవహృతం మహత్తరతమో” (శ్రీరామకర్ణామృతం - 3 - 77)
తమః ప్రాయము - (తమోగుణప్రధానము).
cīkaṭi, śōkamu, tamōguṇamu
tamaḥ iti aṃdhakārasya ajñānasyaca nāma, tatra aṃdhakāraḥ upamānaṃ, ajñānaṃ upamēyaṃ. tamamu anunadi aṃdhakāramunaku (cīkaṭiki) ajñānamunaku pēru. aṃdhakāramu upamānamu, ajñānamu upamēyamu).
saṃsāraṃ; saṃsārākhyaṃ tamaḥ. (saṃsāramu, saṃsāramanu pērugala cīkaṭi).
tamaḥ jaḍaṃ, mōhātmakaṃ lōṣṭa śilādivat.
(jaḍasvabhāvamugaladi. lōṣṭamu, śila modalaguvāṭi vaṃṭidi, mōhātmakamu (mōhamu) mōhiṃpacēyunadi).
(jīvātmala jñānamu saṃkōciṃcunaṭlu cēyunadi, tamōguṇamu, ātmayokka svapnāvastha).
krōdhamu, narakamu.
“cakṣurvṛtti nirōdhakaṃ - śārvarādhikaṃ tama ucyatē. (śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē)
“śārvaryāṃ rātrau bhavaṃ śārvaraṃ - nīlamiti yāvat”
(cakṣurvṛttini - cūpunu - nirōdhiṃcunadi - amāvāsyarātrināṭi cīkaṭi-).
(tamamu anagā ācchādiṃcunadi -kanu dṛṣṭini kappipuccunadi - jñānamunu ācchādiṃcunadi, kappipuccunadi).
anātmayagu dēhādulaṃdu ātmābhimānamu tamassu -
“āvaraṇamaniyeḍidi vivēkiṃcinānu niścayiṃcanivvadu kanuka avidya yanipiṃcukonunu. nibiḍāṃdhakāramuvalenē muṃdu venukalanupiṃcaniyyadu kanuka tamassanē pērāyenu. lēni prapaṃcamunu kalugacēstuṃdi kanuka māyayanu pērāyenu”.
(brahmavidyā sudhāvarṇamu - 7)
“rāmē ṇaivahṛtaṃ mahattaratamō” (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 77)
tamaḥ prāyamu - (tamōguṇapradhānamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.