(తమస్సు అనగా అజ్ఞానము - అజ్ఞానమునంటనిది, అజ్ఞానము కన్న వేరుగానున్నది, ఉత్కృష్టమైనది - జ్ఞానరూపమని యర్ధము).
అజ్ఞానాత్ పృథక్ వర్తతే (అజ్ఞానముకన్న వేరైనది).
“అజ్ఞానలక్షణాత్ మోహాంధకారాత్ పరం” (శ్రీశంకరః)
(అజ్ఞానలక్షణమైన మోహాంధకారముకన్న ఉత్కృష్టమైనది).
(అవిద్యకన్న ఉత్కృష్టమైనది, మాయకు అతీతమైనది, మాయను మించినది, మాయకు లొంగనిది).
“తమసః అవిద్యాతః పరస్తాత్, అవిద్యారహిత బ్రహ్మత్వ స్వరూపం”.
(తమస్సు అనగా అవిద్య - అవిద్యకన్న పరమైనది, ఉత్కృష్టమైనది - అనగా, అవిద్యతోకలియని బ్రహ్మస్వరూపము)
(తమస్సు అనగా అవ్యక్తము - స్పష్టముగా కనబడనిది - అవ్యక్తముకంటె మీద నున్నది - అవ్యక్తముకంటె ఉత్కృష్టముగా ఉండునది).
“తమసః ప్రకృతేః పరః”. (తమస్సు అనగా ప్రకృతి - దానికన్న ఉత్కృష్టమైనవాడు).
(తమస్సు అనగా సూక్ష్మావస్థలోనున్న ప్రకృతి. అందుచేత ప్రకృతి కన్న ఉత్కృష్టమైనవాడు).
(తమస్సున కావలనుండువాడు, లేక ప్రళయకాలమందు ఒకటే అయిన అవస్థగలది - అవ్యక్తమనునది).
(పాలసముద్రములోని శ్రీమహావిష్ణువుయొక్క నివాసస్థానము. అదియే తమస్సు కన్న ఉత్కృష్టమైన స్థానము,లేక, లోకా లోకపర్వతములకు (లోకములకు అలోకములకు మధ్యను సరిహద్ధువలెనుండు పర్వతములకు ఆవల (మీద) నుండు అంధకారముకన్న అవతల యుండునది).
(మూలప్రకృతి కన్న వేరైనవాడు, ఉత్కృష్టమైనవాడు, వానితో కలిసియుండకపోవుటవలన వానికన్న వేరైనవాడు. తమస్సు అనగా అజ్ఞానము, దానికన్న ఉత్కృష్టమైనవాడు - ఆప్రకారముగా ఉన్న శ్రీమహావిష్ణువుయొక్క “తద్విష్ణోః పరమం పదం” అని ప్రసిద్ధికెక్కిన పరమపదమగు వైకుంఠము).
(తమస్సు అనగా ప్రకృతికి సంబంధించిన సమస్త లోకములు - వాటికన్న పరమందు (ఉత్తరమందు) (మీదను) ఉన్న పరబ్రహ్మయొక్క అసాధారణమైన పరమపదమను వైకుంఠమునందుండువాడు).
(అవిద్యాలక్షణముగల తమస్సు కన్న పరుడు, ఉత్కృష్టుడు, అనగా, అవిద్య అంటనివాడు పరమార్ధమైన, పరమపురుషార్ధమైన మోక్షరూపమగు తత్వముగలవాడు, ప్రత్యగభిన్నుడు - ప్రత్యగాత్మకన్న వేరుగానివాడు).
అస్తి సర్వాంతరః కశ్చిత్ చిన్మాత్రః తమసః పరః“.
(ఆత్మ కేవలుడు, శుద్ధుడు, శాంతుడు, సూక్ష్ముడు, సనాతనుడు, చిన్మాత్రుడు, అన్నింటిలోను ఉన్నవాడు. తమస్సు కన్న పరుడు).
ప్రకాశో యస్యతం తస్మాన్మోహాంధ తమసః పరం“.|| (గీతాభావప్రకాశము - 8 - 69 to 71)
(సూర్యుడు ఏ ప్రకారము తనకాంతిచేత ప్రకాశింపచేయునో ఆ ప్రకారముగానే ప్రపంచమునంతను ప్రకాశింపచేయువాడు భగవంతుడు. అట్లుప్రకాశింపచేయుటవలన మోహమను అంధకారమును తొలగించి దానికంటె పరముడై యుండువాడు).
(tamassu anagā ajñānamu - ajñānamunaṃṭanidi, ajñānamu kanna vērugānunnadi, utkṛṣṭamainadi - jñānarūpamani yardhamu).
ajñānāt pṛthak vartatē (ajñānamukanna vērainadi).
“ajñānalakṣaṇāt mōhāṃdhakārāt paraṃ” (śrīśaṃkaraḥ)
(ajñānalakṣaṇamaina mōhāṃdhakāramukanna utkṛṣṭamainadi).
(avidyakanna utkṛṣṭamainadi, māyaku atītamainadi, māyanu miṃcinadi, māyaku loṃganidi).
“tamasaḥ avidyātaḥ parastāt, avidyārahita brahmatva svarūpaṃ”.
(tamassu anagā avidya - avidyakanna paramainadi, utkṛṣṭamainadi - anagā, avidyatōkaliyani brahmasvarūpamu)
(tamassu anagā avyaktamu - spaṣṭamugā kanabaḍanidi - avyaktamukaṃṭe mīda nunnadi - avyaktamukaṃṭe utkṛṣṭamugā uṃḍunadi).
“tamasaḥ prakṛtēḥ paraḥ”. (tamassu anagā prakṛti - dānikanna utkṛṣṭamainavāḍu).
(tamassu anagā sūkṣmāvasthalōnunna prakṛti. aṃducēta prakṛti kanna utkṛṣṭamainavāḍu).
(tamassuna kāvalanuṃḍuvāḍu, lēka praḷayakālamaṃdu okaṭē ayina avasthagaladi - avyaktamanunadi).
(pālasamudramulōni śrīmahāviṣṇuvuyokka nivāsasthānamu. adiyē tamassu kanna utkṛṣṭamaina sthānamu,lēka, lōkā lōkaparvatamulaku (lōkamulaku alōkamulaku madhyanu sarihaddhuvalenuṃḍu parvatamulaku āvala (mīda) nuṃḍu aṃdhakāramukanna avatala yuṃḍunadi).
(mūlaprakṛti kanna vērainavāḍu, utkṛṣṭamainavāḍu, vānitō kalisiyuṃḍakapōvuṭavalana vānikanna vērainavāḍu. tamassu anagā ajñānamu, dānikanna utkṛṣṭamainavāḍu - āprakāramugā unna śrīmahāviṣṇuvuyokka “tadviṣṇōḥ paramaṃ padaṃ” ani prasiddhikekkina paramapadamagu vaikuṃṭhamu).
(tamassu anagā prakṛtiki saṃbaṃdhiṃcina samasta lōkamulu - vāṭikanna paramaṃdu (uttaramaṃdu) (mīdanu) unna parabrahmayokka asādhāraṇamaina paramapadamanu vaikuṃṭhamunaṃduṃḍuvāḍu).
(avidyālakṣaṇamugala tamassu kanna paruḍu, utkṛṣṭuḍu, anagā, avidya aṃṭanivāḍu paramārdhamaina, paramapuruṣārdhamaina mōkṣarūpamagu tatvamugalavāḍu, pratyagabhinnuḍu - pratyagātmakanna vērugānivāḍu).
asti sarvāṃtaraḥ kaścit cinmātraḥ tamasaḥ paraḥ”.
(ātma kēvaluḍu, śuddhuḍu, śāṃtuḍu, sūkṣmuḍu, sanātanuḍu, cinmātruḍu, anniṃṭilōnu unnavāḍu. tamassu kanna paruḍu).
prakāśō yasyataṃ tasmānmōhāṃdha tamasaḥ paraṃ”.|| (gītābhāvaprakāśamu - 8 - 69 to 71)
(sūryuḍu ē prakāramu tanakāṃticēta prakāśiṃpacēyunō ā prakāramugānē prapaṃcamunaṃtanu prakāśiṃpacēyuvāḍu bhagavaṃtuḍu. aṭluprakāśiṃpacēyuṭavalana mōhamanu aṃdhakāramunu tolagiṃci dānikaṃṭe paramuḍai yuṃḍuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.