“తనోతి, త్రాణం కురుతే ఇతి తంత్రం”. (అర్థమును విశదీకరించునది; రక్షించునది)
తంత్ర్యం తే వ్యుత్పద్యంతే తత్వాని అనేన ఇతి తంత్రం శాస్త్రం.
(తత్వములు దీనిచేత పుట్టించబడుచున్నవి. కనుక తంత్రము - శాస్త్రము).
అనుష్టాన ప్రకారము.
నిగమము, ఆగమము, పూర్వ మీమాంస , పాంచరాత్రాగమము -
(పాపాత్ములకు వేదములో చెప్పబడిన ధర్మములనాచరించుటలో సద్గతి చేకూరగలదనిన్నీ, కర్మలు అనేక విధములుగా నుండకపోయిన యడల ప్రపంచముకూడా అనేక విధములుగా ఉండదనిన్నీ (కర్మ వైచిత్ర్యము వలననే ప్రపంచములో భేదము - వైచిత్ర్యము కనబడుచున్నదనిన్నీ) ఆ కర్మలు అనేక విధములుగా ఫలములనిచ్చుచున్నందున ఆ కర్మలు మోహార్థమనియు, వేదమందు శ్రద్ధ (నమ్మకము) తగ్గిపోవుచున్నదనిన్నీ, తంత్రములు ప్రణీతములైనవి (చెప్పబడినవి) - కాని శాస్త్రగ్రస్తులైనవారికిన్నీ, వేదమునభ్యసించుట వలనుపడని వారికిన్నీ, మెట్లెక్కినట్లు ఇంకొక జన్మలోనైనను వేదాధ్యయమునకు అర్హత కలిగియుండుటకని కొంచెముగానైనను పరమేశ్వరోపాసనము చెప్పవలసిన అవసరమున్నది - అందుచేత అట్టివారిని అనుగ్రహించుటకు తంత్రములు ప్రణీతములైనవి (చెప్పబడినవి).
“శైవాగమోపి ద్వివిధః - శ్రౌతా శ్రేతిశ్చ తన్మయః |
శ్రుతిసారమయశ్శౌతః, స్వతంత్రయితరోమతః ||” –
“శ్రౌతో గ్రాహ్యస్తు వైదికైః” ఇతి వాయుసమ్హితాయాం“-
(తంత్రములు రెండు విధములుగా నున్నవి - ఒకటి వేదములో చెప్పిన విషయములకు విరుద్ధముగానున్నవి. రెండవది వేదములో విరోధములేనివి. వైదికులు (వేదబోధననుసరించువారు) వేదములకువిరుద్ధముగానున్న విడిచిపెట్టవలెను, వేదముతో విరుద్ధముగాలేని తంత్రములను గ్రహించవచ్చును - శైవాగమములు రెండు విధములు - శ్రౌతములు (శ్రుతిననుసరించునవి),అశ్రౌతములు (శ్రుతులకు విరుద్ధముగా నున్నవి) శ్రౌతములయిన తంత్రములు శ్రుతులలోని సారమునే బోధించును - మిగిలినవి స్వతంత్రములు. (శ్రుతులలో చెప్పని విషయములను చెప్పునవి - శ్రుతి విషయములను చెప్పు తంత్రములను వైదికులు గ్రహింపవచ్చును).
“tanōti, trāṇaṃ kurutē iti taṃtraṃ”. (arthamunu viśadīkariṃcunadi; rakṣiṃcunadi)
taṃtryaṃ tē vyutpadyaṃtē tatvāni anēna iti taṃtraṃ śāstraṃ.
(tatvamulu dīnicēta puṭṭiṃcabaḍucunnavi. kanuka taṃtramu - śāstramu).
anuṣṭāna prakāramu.
nigamamu, āgamamu, pūrva mīmāṃsa , pāṃcarātrāgamamu -
(pāpātmulaku vēdamulō ceppabaḍina dharmamulanācariṃcuṭalō sadgati cēkūragaladaninnī, karmalu anēka vidhamulugā nuṃḍakapōyina yaḍala prapaṃcamukūḍā anēka vidhamulugā uṃḍadaninnī (karma vaicitryamu valananē prapaṃcamulō bhēdamu - vaicitryamu kanabaḍucunnadaninnī) ā karmalu anēka vidhamulugā phalamulaniccucunnaṃduna ā karmalu mōhārthamaniyu, vēdamaṃdu śraddha (nammakamu) taggipōvucunnadaninnī, taṃtramulu praṇītamulainavi (ceppabaḍinavi) - kāni śāstragrastulainavārikinnī, vēdamunabhyasiṃcuṭa valanupaḍani vārikinnī, meṭlekkinaṭlu iṃkoka janmalōnainanu vēdādhyayamunaku arhata kaligiyuṃḍuṭakani koṃcemugānainanu paramēśvarōpāsanamu ceppavalasina avasaramunnadi - aṃducēta aṭṭivārini anugrahiṃcuṭaku taṃtramulu praṇītamulainavi (ceppabaḍinavi).
“śaivāgamōpi dvividhaḥ - śrautā śrētiśca tanmayaḥ |
śrutisāramayaśśautaḥ, svataṃtrayitarōmataḥ ||” –
“śrautō grāhyastu vaidikaiḥ” iti vāyusamhitāyāṃ”-
(taṃtramulu reṃḍu vidhamulugā nunnavi - okaṭi vēdamulō ceppina viṣayamulaku viruddhamugānunnavi. reṃḍavadi vēdamulō virōdhamulēnivi. vaidikulu (vēdabōdhananusariṃcuvāru) vēdamulakuviruddhamugānunna viḍicipeṭṭavalenu, vēdamutō viruddhamugālēni taṃtramulanu grahiṃcavaccunu - śaivāgamamulu reṃḍu vidhamulu - śrautamulu (śrutinanusariṃcunavi),aśrautamulu (śrutulaku viruddhamugā nunnavi) śrautamulayina taṃtramulu śrutulalōni sāramunē bōdhiṃcunu - migilinavi svataṃtramulu. (śrutulalō ceppani viṣayamulanu ceppunavi - śruti viṣayamulanu ceppu taṃtramulanu vaidikulu grahiṃpavaccunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.