ఆధ్యాత్మికము, ఆధి దైవికము, ఆధిభౌతికము అని తాపములు మూడు విధములు - (వీటిని వేఱు వేఱుగా చూడము).
“మానసికమైన కామక్రోధాదులవల్లను, దైహికములైన జ్వరాదుల వలనను కలిగెడి దుఃఖములు (తాపము) ఆధ్యాత్మికములు. పాములు, తేళ్ళు, భార్యా పుత్ర మిత్రాదులు అనెడి భూతములవలన కలుగునది ఆధి భౌతికము - వాన,వరద,గాలి, భూకంపము, అగ్ని మొదలగువాటివలన కలుగునది ఆధి దైవికము”-
“ఈశ్వరునియందు సమర్పితంబైన కర్మంబు తాపత్రయంబు మాన్ప నౌషధంబగు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 - )
“వ. గుణాఢ్యుండగువాని జూచి సంతోషించుచు, నాభాసుండగు వానిం జూచి కరుణించుచు, సమానుని యెడ మైత్రి సలుపుచు వర్తించుచున్నవాడు తాపత్రయాది కంబులం దొఱంగు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 8 - 241)
“సహనశీలురు, సమస్త శరీరధారులకు సుహృత్తులును, బరమ శాంతులును, గారుణికులునునై పరిత్యక్త కర్మఫల స్వభావులును, విసృష్టస్వజ బందుజనులునై, మత్పదాశ్రయులును, మద్గుణ ధ్యాన పారీణులును, మత్కథా ప్రసంగసంభరిత శ్రవణానందులును నగుచు, మదీయ కధల నొడువుచు, వినుచు నుండు పరమభాగవతోత్తముల నాధ్యాత్మికాది తాపత్రయంబు తపింపజేయం జాలదు”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 25 - )
ādhyātmikamu, ādhi daivikamu, ādhibhautikamu ani tāpamulu mūḍu vidhamulu - (vīṭini vēṟu vēṟugā cūḍamu).
“mānasikamaina kāmakrōdhādulavallanu, daihikamulaina jvarādula valananu kaligeḍi duḥkhamulu (tāpamu) ādhyātmikamulu. pāmulu, tēḷḷu, bhāryā putra mitrādulu aneḍi bhūtamulavalana kalugunadi ādhi bhautikamu - vāna,varada,gāli, bhūkaṃpamu, agni modalaguvāṭivalana kalugunadi ādhi daivikamu”-
“īśvaruniyaṃdu samarpitaṃbaina karmaṃbu tāpatrayaṃbu mānpa nauṣadhaṃbagu” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 - )
“va. guṇāḍhyuṃḍaguvāni jūci saṃtōṣiṃcucu, nābhāsuṃḍagu vāniṃ jūci karuṇiṃcucu, samānuni yeḍa maitri salupucu vartiṃcucunnavāḍu tāpatrayādi kaṃbulaṃ doṟaṃgu” (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 8 - 241)
“sahanaśīluru, samasta śarīradhārulaku suhṛttulunu, barama śāṃtulunu, gāruṇikulununai parityakta karmaphala svabhāvulunu, visṛṣṭasvaja baṃdujanulunai, matpadāśrayulunu, madguṇa dhyāna pārīṇulunu, matkathā prasaṃgasaṃbharita śravaṇānaṃdulunu nagucu, madīya kadhala noḍuvucu, vinucu nuṃḍu paramabhāgavatōttamula nādhyātmikādi tāpatrayaṃbu tapiṃpajēyaṃ jāladu”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 25 - )
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.