← Back to త · Booklets 21–30 (digitized file 3)

తారకమంత్రమహాత్మ్యము tārakamaṃtramahātmyamu

Original — తెలుగు
  1. “శ్లో||. బ్రహ్మహత్యా సహస్రాణి జ్ఞానా జ్ఞాన కృతానిచ |

స్వర్ణస్తేయ సురాపాన గురుతల్పాయుతాని చ |

కోటికోటి సహస్రాణి ఉపపాతక జాన్యపి |

సర్వాణ్యపి ప్రణశ్యంతి రామమంత్రానుకీర్తనాత్||“.

(వేయి బ్రహ్మ హత్యలు, తెలిసికాని, తెలియక చేసినవికాని, బంగారము దొంగలించుట, కల్లు ద్రావుట, గురువు తల్ప మును పొందుట, కోట్లకొలది ఉపపాతకములు - ఇవన్నియు శ్రీరామమంత్రమును కీర్తించుటచేత నశించిపోవును).

  1. షడక్షరస్యమాహాత్మ్యం శివోజానాతి తత్పరః |

ప్రణవత్వా త్సదిం ధ్యేయో యతీనాం చ విశేష తః |

రామ మంత్రార్ధ విజ్ఞానీ జీవన్ముక్తో నసంసయః ||”

ఇతి శృతిః -

(శ్రీరామ తారక షడక్షరమంత్ర మహాత్మ్యము ఆమంత్ర తత్పరుడగు శివునకు మాత్రమే తెలియును- “జానాతి, రామ, తవనామ రుచిం మహేశో” - ఇది ప్రణవస్వరూపము గావున సన్యాసాశ్రమస్థులును సదా ధ్యానింపవలయును. రామమంత్రమహాత్మ్యమును తెలుసుకొనినవాడు తప్పక జీవన్ముక్తుడగును).

“అత ఏవ ఉక్తః శ్రీరామః ఆదిత్యాంబికా విష్ణుగణనాధా మహేశ్వరస్వరూప ఇతి. తేషాంసర్వేషాం మంత్రాదపి శ్రీరామమంత్రమేవ కోటి కోట్యధికఫలదాయకమితి చోక్తం”.

(కావుననే శ్రీరాముడు, ఆదిత్య, అంబికా, విష్ణు, గణనాధ, మహేశ్వర స్వరూపుడనియు, ఆయామంత్రములకంటెను శ్రీరామమంత్రము కోటి కోట్యధికఫలదాయకము అని చెప్పబడినది).

  1. “నజానే జానకీ జానే, రామ, త్వన్నామ వైభవం |

సర్వేశో భగవాన్ శంభుర్వాల్మీకి ర్వేత్తినా నవా ||” (శ్రీరామకర్ణామృతం - 3 - 89)

(రామా !నీ నామ వైభవము నాకు తెలియదు. భగవంతుడైన శివునకుగాని, వాల్మీకికిగాని తెలుసునో లేదో).

  1. “శ్లో||. కిం మంత్రైర్బహు భిశ్చ దుష్కర ఫలైరా యా సదైస్త ద్విదాం |

కించిల్లోప విధానమాత్ర విఫలైస్సంసారదుఃఖావహైః |

ఏకస్సన్నపి సర్వమంత్ర ఫలదో దోషి జ్ఘిత సర్వదా |

శ్రీరామశ్శరణం మమేతి పరమో మంత్రోయ వష్టాక్షరః || ” (శ్రీరామకర్ణా మృతం - 4 - 74)

(చేయుటకు అతికష్టతరమైనవిన్నీ, ఫలమునిచ్చుటలో దుష్కరములైనవిన్నీ, బహుప్రయాసతోచేయబడినవిన్నీ, చేయుటలో ఏమాత్రము లోపమున్నను విఫలములగునవియు, సంసారమను దుఃఖము కలుగచేయునవియు అయిన అనేకమైన మంత్రములతో ఏమి ప్రయోజనము - దోషములేనిదియు, ఒకటే అయినప్పటికీ అన్నిమంత్రముల ఫలమునిచ్చునదియునగు “శ్రీరామశ్శరణం మమ” (శ్రీరాముడు నాకు శరణము) అను అష్టాక్షరమంత్రము - ఎనిమిది అక్షరములుగల మంత్రము - పరమమంత్రము - ఉత్కృష్టమైన మంత్రము - తారకమంత్రము).

Transliteration
  1. “ślō||. brahmahatyā sahasrāṇi jñānā jñāna kṛtānica |

svarṇastēya surāpāna gurutalpāyutāni ca |

kōṭikōṭi sahasrāṇi upapātaka jānyapi |

sarvāṇyapi praṇaśyaṃti rāmamaṃtrānukīrtanāt||“.

(vēyi brahma hatyalu, telisikāni, teliyaka cēsinavikāni, baṃgāramu doṃgaliṃcuṭa, kallu drāvuṭa, guruvu talpa munu poṃduṭa, kōṭlakoladi upapātakamulu - ivanniyu śrīrāmamaṃtramunu kīrtiṃcuṭacēta naśiṃcipōvunu).

  1. ṣaḍakṣarasyamāhātmyaṃ śivōjānāti tatparaḥ |

praṇavatvā tsadiṃ dhyēyō yatīnāṃ ca viśēṣa taḥ |

rāma maṃtrārdha vijñānī jīvanmuktō nasaṃsayaḥ ||”

iti śṛtiḥ -

(śrīrāma tāraka ṣaḍakṣaramaṃtra mahātmyamu āmaṃtra tatparuḍagu śivunaku mātramē teliyunu- “jānāti, rāma, tavanāma ruciṃ mahēśō” - idi praṇavasvarūpamu gāvuna sanyāsāśramasthulunu sadā dhyāniṃpavalayunu. rāmamaṃtramahātmyamunu telusukoninavāḍu tappaka jīvanmuktuḍagunu).

“ata ēva uktaḥ śrīrāmaḥ ādityāṃbikā viṣṇugaṇanādhā mahēśvarasvarūpa iti. tēṣāṃsarvēṣāṃ maṃtrādapi śrīrāmamaṃtramēva kōṭi kōṭyadhikaphaladāyakamiti cōktaṃ”.

(kāvunanē śrīrāmuḍu, āditya, aṃbikā, viṣṇu, gaṇanādha, mahēśvara svarūpuḍaniyu, āyāmaṃtramulakaṃṭenu śrīrāmamaṃtramu kōṭi kōṭyadhikaphaladāyakamu ani ceppabaḍinadi).

  1. “najānē jānakī jānē, rāma, tvannāma vaibhavaṃ |

sarvēśō bhagavān śaṃbhurvālmīki rvēttinā navā ||” (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 89)

(rāmā !nī nāma vaibhavamu nāku teliyadu. bhagavaṃtuḍaina śivunakugāni, vālmīkikigāni telusunō lēdō).

  1. “ślō||. kiṃ maṃtrairbahu bhiśca duṣkara phalairā yā sadaista dvidāṃ |

kiṃcillōpa vidhānamātra viphalaissaṃsāraduḥkhāvahaiḥ |

ēkassannapi sarvamaṃtra phaladō dōṣi jghita sarvadā |

śrīrāmaśśaraṇaṃ mamēti paramō maṃtrōya vaṣṭākṣaraḥ || ” (śrīrāmakarṇā mṛtaṃ - 4 - 74)

(cēyuṭaku atikaṣṭataramainavinnī, phalamuniccuṭalō duṣkaramulainavinnī, bahuprayāsatōcēyabaḍinavinnī, cēyuṭalō ēmātramu lōpamunnanu viphalamulagunaviyu, saṃsāramanu duḥkhamu kalugacēyunaviyu ayina anēkamaina maṃtramulatō ēmi prayōjanamu - dōṣamulēnidiyu, okaṭē ayinappaṭikī annimaṃtramula phalamuniccunadiyunagu “śrīrāmaśśaraṇaṃ mama” (śrīrāmuḍu nāku śaraṇamu) anu aṣṭākṣaramaṃtramu - enimidi akṣaramulugala maṃtramu - paramamaṃtramu - utkṛṣṭamaina maṃtramu - tārakamaṃtramu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.