‘ఓం రామాయనమః’
“శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||” (శివుడు పార్వతితో).
“తే. శ్రీమనో రామ శ్రీరామరామ రామ
యంచు రమి యింతు రాముని యంద, రామ
నామము, వరానన, సహస్రనామ తుల్య
మట్లుగావున దీని నీవవధరింపు” (సీతారామాంజనేయ సంవాదము)
(శ్రీరామనామము పరబ్రహ్మ నామములు వేయితో సమానము - పరబ్రహ్మనామములు వేయి ఉచ్చరించిన ఫలము ఒక్కమారు ‘రామ’ అనుటవలన కలుగును - అందుచేత నేను (శివుడు) శ్రీరామ నామమును జపించుచు అతనియందే రమించును. ‘రామ’ అనునది పరబ్రహ్మనామమే - (చూడుము -).
ముమూర్షుమాణస్య విముక్తయే (అ)హందిశామిమంత్రం తవ రామనామ ||”
ఇతి శ్రీమద్రామయణే శివవాక్యం.
(శ్రీరామా ! కాశీ క్షేత్రములో నీ నామము జపించుచు నేను పార్వతితో కలిసి యున్నాను. చనిపోవ సిద్ధముగానున్న ముముక్షువులకు నేను నీ నామమును వారు ముక్తిని పొందుటకు ఉపదేశించుచున్నాను - వారి చెవిలో ఈ మంత్రమును ఉపదేశించుచున్నాను).
ధ్యేయం ధ్యేయం మనసి సతతం తారకం బ్రహ్మరూపం ||
జల్పన్ జల్పన్ ప్రకృతి వికృతౌ ప్రాణినాం కర్ణమూలే వధ్యాం వధ్యాం అటతి జటిలః కోపికాశీనివాసే ||” ఇతికాశీఖండే.
(అత్యంతమధురమైన శ్రీరామనామము చెవులారవినుచు, ఎల్లవేళలందు తారకబ్రహ్మమైన శ్రీరామరూపము మనసులో ధ్యానము చేయుచు ప్రాణుల చెవులలో వీధి వీధులలోను నీనామము మారుమ్రోగుచుండగా ఈ కాశీ క్షేత్రములో జటిలుడగువాడు ఒక్కడైనను ఉండడు). (3,4 లో శివుడు ఇట్లు చెప్పుటకు కారణమేమనగా - “జానాతి రామ తవనామ రుచిం మహేశో” (శ్రీరామకర్ణామౄతం -1 - 36)
(శ్రీరామ నామముయొక్క రుచి -(శక్తి) -శివునికి తెలుసును - అందుచేతనే అతను ఆ శ్రీరామనామమునుచ్చరించుచు శ్రీరామునియందే రమించుచుండును - చూడుము - 2).
పైన - 2 - లో చెప్పినట్లు శ్రీరామనామ తారకమంత్రములో రామనామము మూడు పర్యాయములు ఉచ్చరించుటలో అర్ధమేమనగా - స్థూల, సూక్ష్మ, కారణ శరీరములను మూడు శరీరములను, వాటినభిమానించు విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అను మూడు విధములుగానున్న జవుని, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి యను మూడు అవస్తలను, ఆధ్యాత్మకము, ఆధి భౌతికము, ఆధిదైవికము అను మూడు విధములగు తాపములను - (వాటి శాంతి యనియు) సూచించును -.
“హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే |
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ||”
ఇతిషోడశకం నామ్నాం కలికల్మష నాశనీం |
నాతః పరతరోపాయః సర్వ వేదేషు దృశ్యతే ||”
షోడశకలావృతస్య జీవస్యావరణ వినాశనం |
తతః ప్రకాశతే పరం బ్రహ్మ మేఘాపాయే రవిరశ్మ మండలేవేతి ||. (కలిసంతరణోపనిషత్)
(ప్రాణాది నామాంత షోడశకలాభిః ఆవౄతస్య జీవస్య ఏతత్ షోడశకం నామ జీవావరణ వినాశకం భవతి).
(ఈ పదియారు అక్షరములు కలికాలపు దోషములను పోగొట్టునవి. కలి కల్మషములను పోగొట్టునది ఇంకొక ఉపాయము వేదములందు ఎందును లేదు - పదియారు కళలచేత ఆవరించబడిన జీవుని ఆవరణమును ఇది నశింప చేయును. అట్లు ఆవరణమునశించిన, మేఘము విడిపోయినంతనే సూర్యుడు కనబడినట్లు, పరబ్రహ్మసాక్షాత్కారమగును).
(“ఓం నమోనారాయణా యే త్యత్ర నమశ్శబ్దవాచ్య జీవతాగ్రాస ప్రత్యక్ చైతన్యం త్వం పదలక్ష్య ముచ్యతే. నారాయణ శబ్ద వాచ్యేశ్వరతాగ్రాస పర చైతన్యం తత్ పద లక్ష్యముచ్యతే| ‘అయ’ ఇతి చతుర్ధీ లక్ష్య ద్వయ స్యైకత్వ భావనార్థా |”.
“నమ ఇతి ప్రకృతి స్వరూపం జీవ ప్రకృతి గత హేయాం వాదాభిష్టానం ప్రత్యక్ చైతన్య మిత్యర్ధః”.
(“ఓం నమో నారాయణాయ” నారాయణునికొఱకు నమస్కారము - అని చిదాత్మరూపుడైన - చైతన్యశక్తి రూపుడైన పరబ్రహ్మను తారకమని ఉపాసింపవలెను. ‘ఓం’ అను ఒకే అక్షరము ఆత్మ స్వరూపము. ‘నమ’ అను రెండక్షరములు ప్రకృతి స్వరూపము - “నారాయణాయ” అను అయిదు అక్షరములు పరబ్రహ్మ స్వరూపము).
(“ఓం నమో నారాయణాయ” అనుదానిలో నమః అనునది జీవరూపమైన ప్రత్యక్ చైతన్యము - ఇది “తత్వమసి” అను మహావాక్యమందు ‘త్వం’ - నీవు - అనుపదమునకు లక్ష్యార్ధము, ‘నారాయణః’ అనుమాటచే చెప్పబడు ఈశ్వరుడైన పరచైతన్యము - పరాప్రకృతి - ఆమహావాక్యములోని ‘తత్’ పదమునకు లక్ష్యార్ధము - ‘అయ’ అనుపదము ఈ రెండు లక్ష్యార్ధములు ఒకటే యని చెప్పునది. ‘నమ’ అనునది ప్రకృతి స్వరూపము, జీవ ప్రకృతిలయందు గల హేయాంసకు అధిష్టానము అను ప్రత్యక్ చైతన్యము).
‘ōṃ rāmāyanamaḥ’
“śrīrāma rāma rāmēti ramē rāmē manōramē |
sahasranāma tattulyaṃ rāma nāma varānanē ||” (śivuḍu pārvatitō).
“tē. śrīmanō rāma śrīrāmarāma rāma
yaṃcu rami yiṃtu rāmuni yaṃda, rāma
nāmamu, varānana, sahasranāma tulya
maṭlugāvuna dīni nīvavadhariṃpu” (sītārāmāṃjanēya saṃvādamu)
(śrīrāmanāmamu parabrahma nāmamulu vēyitō samānamu - parabrahmanāmamulu vēyi uccariṃcina phalamu okkamāru ‘rāma’ anuṭavalana kalugunu - aṃducēta nēnu (śivuḍu) śrīrāma nāmamunu japiṃcucu ataniyaṃdē ramiṃcunu. ‘rāma’ anunadi parabrahmanāmamē - (cūḍumu -).
mumūrṣumāṇasya vimuktayē (a)haṃdiśāmimaṃtraṃ tava rāmanāma ||”
iti śrīmadrāmayaṇē śivavākyaṃ.
(śrīrāmā ! kāśī kṣētramulō nī nāmamu japiṃcucu nēnu pārvatitō kalisi yunnānu. canipōva siddhamugānunna mumukṣuvulaku nēnu nī nāmamunu vāru muktini poṃduṭaku upadēśiṃcucunnānu - vāri cevilō ī maṃtramunu upadēśiṃcucunnānu).
dhyēyaṃ dhyēyaṃ manasi satataṃ tārakaṃ brahmarūpaṃ ||
jalpan jalpan prakṛti vikṛtau prāṇināṃ karṇamūlē vadhyāṃ vadhyāṃ aṭati jaṭilaḥ kōpikāśīnivāsē ||” itikāśīkhaṃḍē.
(atyaṃtamadhuramaina śrīrāmanāmamu cevulāravinucu, ellavēḷalaṃdu tārakabrahmamaina śrīrāmarūpamu manasulō dhyānamu cēyucu prāṇula cevulalō vīdhi vīdhulalōnu nīnāmamu mārumrōgucuṃḍagā ī kāśī kṣētramulō jaṭiluḍaguvāḍu okkaḍainanu uṃḍaḍu). (3,4 lō śivuḍu iṭlu ceppuṭaku kāraṇamēmanagā - “jānāti rāma tavanāma ruciṃ mahēśō” (śrīrāmakarṇāmṝtaṃ -1 - 36)
(śrīrāma nāmamuyokka ruci -(śakti) -śivuniki telusunu - aṃducētanē atanu ā śrīrāmanāmamunuccariṃcucu śrīrāmuniyaṃdē ramiṃcucuṃḍunu - cūḍumu - 2).
paina - 2 - lō ceppinaṭlu śrīrāmanāma tārakamaṃtramulō rāmanāmamu mūḍu paryāyamulu uccariṃcuṭalō ardhamēmanagā - sthūla, sūkṣma, kāraṇa śarīramulanu mūḍu śarīramulanu, vāṭinabhimāniṃcu viśvuḍu, taijasuḍu, prājñuḍu anu mūḍu vidhamulugānunna javuni, jāgratta, svapnamu, suṣupti yanu mūḍu avastalanu, ādhyātmakamu, ādhi bhautikamu, ādhidaivikamu anu mūḍu vidhamulagu tāpamulanu - (vāṭi śāṃti yaniyu) sūciṃcunu -.
“harē rāma, harē rāma, rāma rāma harē harē |
harē kṛṣṇa harē kṛṣṇa, kṛṣṇa kṛṣṇa harē harē ||”
itiṣōḍaśakaṃ nāmnāṃ kalikalmaṣa nāśanīṃ |
nātaḥ paratarōpāyaḥ sarva vēdēṣu dṛśyatē ||”
ṣōḍaśakalāvṛtasya jīvasyāvaraṇa vināśanaṃ |
tataḥ prakāśatē paraṃ brahma mēghāpāyē raviraśma maṃḍalēvēti ||. (kalisaṃtaraṇōpaniṣat)
(prāṇādi nāmāṃta ṣōḍaśakalābhiḥ āvṝtasya jīvasya ētat ṣōḍaśakaṃ nāma jīvāvaraṇa vināśakaṃ bhavati).
(ī padiyāru akṣaramulu kalikālapu dōṣamulanu pōgoṭṭunavi. kali kalmaṣamulanu pōgoṭṭunadi iṃkoka upāyamu vēdamulaṃdu eṃdunu lēdu - padiyāru kaḷalacēta āvariṃcabaḍina jīvuni āvaraṇamunu idi naśiṃpa cēyunu. aṭlu āvaraṇamunaśiṃcina, mēghamu viḍipōyinaṃtanē sūryuḍu kanabaḍinaṭlu, parabrahmasākṣātkāramagunu).
(“ōṃ namōnārāyaṇā yē tyatra namaśśabdavācya jīvatāgrāsa pratyak caitanyaṃ tvaṃ padalakṣya mucyatē. nārāyaṇa śabda vācyēśvaratāgrāsa para caitanyaṃ tat pada lakṣyamucyatē| ‘aya’ iti caturdhī lakṣya dvaya syaikatva bhāvanārthā |”.
“nama iti prakṛti svarūpaṃ jīva prakṛti gata hēyāṃ vādābhiṣṭānaṃ pratyak caitanya mityardhaḥ”.
(“ōṃ namō nārāyaṇāya” nārāyaṇunikoṟaku namaskāramu - ani cidātmarūpuḍaina - caitanyaśakti rūpuḍaina parabrahmanu tārakamani upāsiṃpavalenu. ‘ōṃ’ anu okē akṣaramu ātma svarūpamu. ‘nama’ anu reṃḍakṣaramulu prakṛti svarūpamu - “nārāyaṇāya” anu ayidu akṣaramulu parabrahma svarūpamu).
(“ōṃ namō nārāyaṇāya” anudānilō namaḥ anunadi jīvarūpamaina pratyak caitanyamu - idi “tatvamasi” anu mahāvākyamaṃdu ‘tvaṃ’ - nīvu - anupadamunaku lakṣyārdhamu, ‘nārāyaṇaḥ’ anumāṭacē ceppabaḍu īśvaruḍaina paracaitanyamu - parāprakṛti - āmahāvākyamulōni ‘tat’ padamunaku lakṣyārdhamu - ‘aya’ anupadamu ī reṃḍu lakṣyārdhamulu okaṭē yani ceppunadi. ‘nama’ anunadi prakṛti svarūpamu, jīva prakṛtilayaṃdu gala hēyāṃsaku adhiṣṭānamu anu pratyak caitanyamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.