(పొందతగినది, పొందబడునది యని దేనిని గుఱించి చెప్పబడినదో అని - భక్తులచే పొందబడుచున్నది భగవంతుడు, భగవంతుని స్థానము, భగవంతుని లోకము వైకుంఠము).
(భగవంతుని పాదము భక్తులకు ప్రాప్తించు స్థానము, ముక్తులకు ప్రాప్తించుస్థానము - ప్రకౄతితో సంబంధము లేని స్థానము, లేక అతని స్వరూపము)
పరమాత్మ పదం, దివ్యాత్మ స్వరూపం. (పరమాత్మయొక్క స్థానము, దివ్యమైన ఆత్మ స్వరూపము).
తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః -
(తత్ అనగా పరబ్రహ్మ అయినవి విష్ణువుయొక్క ఉత్కృష్టమైన పదమును స్థానమును, భగవంతుని స్వస్వరూపమును ఎల్లపుడు సూరిజనులు (బ్రహ్మజ్ఞానులు) చూచు చుందురు -
సతు తత్పదమాప్నోతి యస్మాత్ భూయో నజాయతే||“. (కఠోపనిషత్ 1 - 3 - 8)
(ఎవడు, ఎల్లపుడు శుచిగానుండి మనసుని జయించి భగవత్ జ్ఞానము కలిగియుండునో అతడు తత్పదమును, భగవంతుని స్థానమైన పరమపదమును - విష్ణుపదమును పొందును, అక్కడనుండి తిరిగిరాడు, మరల జన్మించడు).
తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మింగతా న నివర్తంతి భూయః |
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవౄత్తిః ప్రసృతా పురాణీ |
నిర్మాన మోహా జిత సంగదోషా అధ్యాత్మ నిత్యా విని వృత్తికామా |
ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞత్గచ్చంత్య మూఢాః పరమవ్యయం తత్ ||“.
- - “న తద్భాసయతే సూర్యో, న శశాంకో నపావకః |
యద్గత్వా న నివర్తంతే తద్థామ పరమం మమ ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 3 to 6)
(అనాదికాలమునుండి ప్రవాహరూపమువలె జరుగుచుండి, వేళ్ళు తన్నుకొని యున్న అశ్వత్ధమను పేరు గల ఈ జననమరన రూపమైన సంసారమును - వృక్షరూపముగానున్న దానిని దేనియందును ఆసక్తి లేక యుండుటయను ఖడ్గముచే నరికివేసి అటు తర్వాత ఆ పరమపదమైన వైకుంఠమును - ముక్తిస్థాన మును - లేక ఆ ముక్తిస్థానరూపమైన భగవంతుని గుఱించి అన్వేషింపవలయును - మోక్షమార్గముకొఱకు అన్వేషింపవలయును, ప్రయత్నించవలెను. ఆ పరమపదమును పొందినవారు మరల తిరిగిరారు - తిరిగి జన్మించరు - అట్టి పరమపదమే - మోక్షస్థానమే, మోక్షరూపమే అయిన ఆ ఆది పురుషును నుండి ఆ సంసారమను సృష్టి ఎప్పుడో కలిగి జరుగుచున్నది. అట్టి పరమ పురుషుని (భగవంతుని) నేను ఆశ్రయించుచున్నాను. మానాభిమానములేని వారున్నూ, మోహములేనివారు, సంగదోషములేనివారు, బ్రహ్మజ్ఞానమునందే నిష్ట కలిగియుండువారు, కోరికలు లేనివారు, సుఖదుఃఖములు, శీతోష్ణములు, మొదలగు ద్వంద్వముల ప్రభావము తమమీద లేనివారు, జ్ఞానులు అయినవారు, అట్టి అద్వయమైన పదమును, - నాశములేక ఎల్లకాలము ఉండునది అని చెప్పబడు భగవంతుని పొందుదురు - ఆ పదము స్వప్రాకాశము - దానికి సూర్యుడు మొదలగు తేజోరాశులు ప్రకాశింపచేయవలసిన అవసరములేదు - అక్కడికి వెళ్ళినవారు తిరిగిరారు, మరల జన్మించరు - సంసారములో పడరు. అదియే నా స్థానము, ఉత్కృష్టమైన నాపదము, నా స్వస్వరూపము).
(విజ్ఞానము లేనివాడు, - బ్రహ్మజ్ఞానము లేనివాడు - చిత్తస్థైర్యము లేనివాడు, బాహ్యశౌసము, అంతశ్శౌచము లేనివాడు, భగవంతునియొక్క పదమును పొందలేడు).
(poṃdataginadi, poṃdabaḍunadi yani dēnini guṟiṃci ceppabaḍinadō ani - bhaktulacē poṃdabaḍucunnadi bhagavaṃtuḍu, bhagavaṃtuni sthānamu, bhagavaṃtuni lōkamu vaikuṃṭhamu).
(bhagavaṃtuni pādamu bhaktulaku prāptiṃcu sthānamu, muktulaku prāptiṃcusthānamu - prakṝtitō saṃbaṃdhamu lēni sthānamu, lēka atani svarūpamu)
paramātma padaṃ, divyātma svarūpaṃ. (paramātmayokka sthānamu, divyamaina ātma svarūpamu).
tadviṣṇōḥ paramaṃ padaṃ sadā paśyaṃti sūrayaḥ -
(tat anagā parabrahma ayinavi viṣṇuvuyokka utkṛṣṭamaina padamunu sthānamunu, bhagavaṃtuni svasvarūpamunu ellapuḍu sūrijanulu (brahmajñānulu) cūcu cuṃduru -
satu tatpadamāpnōti yasmāt bhūyō najāyatē||“. (kaṭhōpaniṣat 1 - 3 - 8)
(evaḍu, ellapuḍu śucigānuṃḍi manasuni jayiṃci bhagavat jñānamu kaligiyuṃḍunō ataḍu tatpadamunu, bhagavaṃtuni sthānamaina paramapadamunu - viṣṇupadamunu poṃdunu, akkaḍanuṃḍi tirigirāḍu, marala janmiṃcaḍu).
tataḥ padaṃ tatparimārgitavyaṃ yasmiṃgatā na nivartaṃti bhūyaḥ |
tamēva cādyaṃ puruṣaṃ prapadyē yataḥ pravṝttiḥ prasṛtā purāṇī |
nirmāna mōhā jita saṃgadōṣā adhyātma nityā vini vṛttikāmā |
dvaṃdvairvimuktāḥ sukha duḥkha saṃjñatgaccaṃtya mūḍhāḥ paramavyayaṃ tat ||“.
- - “na tadbhāsayatē sūryō, na śaśāṃkō napāvakaḥ |
yadgatvā na nivartaṃtē tadthāma paramaṃ mama ||“. (śrīmadbhagavadgīta - 15 - 3 to 6)
(anādikālamunuṃḍi pravāharūpamuvale jarugucuṃḍi, vēḷḷu tannukoni yunna aśvatdhamanu pēru gala ī jananamarana rūpamaina saṃsāramunu - vṛkṣarūpamugānunna dānini dēniyaṃdunu āsakti lēka yuṃḍuṭayanu khaḍgamucē narikivēsi aṭu tarvāta ā paramapadamaina vaikuṃṭhamunu - muktisthāna munu - lēka ā muktisthānarūpamaina bhagavaṃtuni guṟiṃci anvēṣiṃpavalayunu - mōkṣamārgamukoṟaku anvēṣiṃpavalayunu, prayatniṃcavalenu. ā paramapadamunu poṃdinavāru marala tirigirāru - tirigi janmiṃcaru - aṭṭi paramapadamē - mōkṣasthānamē, mōkṣarūpamē ayina ā ādi puruṣunu nuṃḍi ā saṃsāramanu sṛṣṭi eppuḍō kaligi jarugucunnadi. aṭṭi parama puruṣuni (bhagavaṃtuni) nēnu āśrayiṃcucunnānu. mānābhimānamulēni vārunnū, mōhamulēnivāru, saṃgadōṣamulēnivāru, brahmajñānamunaṃdē niṣṭa kaligiyuṃḍuvāru, kōrikalu lēnivāru, sukhaduḥkhamulu, śītōṣṇamulu, modalagu dvaṃdvamula prabhāvamu tamamīda lēnivāru, jñānulu ayinavāru, aṭṭi advayamaina padamunu, - nāśamulēka ellakālamu uṃḍunadi ani ceppabaḍu bhagavaṃtuni poṃduduru - ā padamu svaprākāśamu - dāniki sūryuḍu modalagu tējōrāśulu prakāśiṃpacēyavalasina avasaramulēdu - akkaḍiki veḷḷinavāru tirigirāru, marala janmiṃcaru - saṃsāramulō paḍaru. adiyē nā sthānamu, utkṛṣṭamaina nāpadamu, nā svasvarūpamu).
(vijñānamu lēnivāḍu, - brahmajñānamu lēnivāḍu - cittasthairyamu lēnivāḍu, bāhyaśausamu, aṃtaśśaucamu lēnivāḍu, bhagavaṃtuniyokka padamunu poṃdalēḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.