← Back to త · Booklets 21–30 (digitized file 3)

తాత్పర్యలింగములు tātparyaliṃgamulu

Original — తెలుగు

“ధూమ జ్ఞానేన వహ్ని జ్ఞానస్య జాయ మానత్వాత్ యధా ధూమో వహ్ని నిశ్చయే లింగం, తథా అద్వైత స్వరూపే ప్రత్యగ భిన్న బ్రహ్మణి వేదాంతానాం తాత్పర్యమితి ఉపక్రమాప సంహారాది షడ్విధ తాత్పర్యలింగైః నిర్ణయమానత్వాత్ తాని తాత్పర్య లింగాని ఇత్యుచ్యంతే. యుక్తి శబ్దేన చ ఏతాని లింగాని గృహ్యంతే.తాని చ లింగాని షడ్విధాని : -

శ్లో || ఉపక్రమోప సంహారౌ అభ్యాసో అపూర్వతా ఫలం |

అర్ధవాదోపపత్తీచ లింగం తాత్పర్య నిర్ణయే ||“.

(పొగను చూచిన అచ్చట అగ్ని ఉన్నదను జ్ఞానము కలుగును. అందుచేత అగ్ని ఉన్నదని నిశ్చయించుటకు అగ్ని ఒక లింగము - అగ్నిలేనిదే పొగ ఉండదుకనుక. ఆప్రకారముగానే అద్వైత స్వరూపుడు, ప్రత్యగాత్మకన్న వేఱుగానివాడు అయిన పరబ్రహ్మగుఱించి తెలియచేయుటకు వేదాంతములు (ఉపనిషత్తులు) నిర్ణయించునవి కనుక అవి తాత్పర్యలింగములు - పరబ్రహ్మగుఱించి యుక్తిచే తెలియచేయునవి. ఇట్టి లింగములు ఆరు -1.ఉపక్రమోపసంహారములు. 2. అభ్యాసము, 3. అపూర్వత్వము, 4. ఫలము, 5. అర్ధవాదము, 6. ఉపపత్తి).

Transliteration

“dhūma jñānēna vahni jñānasya jāya mānatvāt yadhā dhūmō vahni niścayē liṃgaṃ, tathā advaita svarūpē pratyaga bhinna brahmaṇi vēdāṃtānāṃ tātparyamiti upakramāpa saṃhārādi ṣaḍvidha tātparyaliṃgaiḥ nirṇayamānatvāt tāni tātparya liṃgāni ityucyaṃtē. yukti śabdēna ca ētāni liṃgāni gṛhyaṃtē.tāni ca liṃgāni ṣaḍvidhāni : -

ślō || upakramōpa saṃhārau abhyāsō apūrvatā phalaṃ |

ardhavādōpapattīca liṃgaṃ tātparya nirṇayē ||“.

(poganu cūcina accaṭa agni unnadanu jñānamu kalugunu. aṃducēta agni unnadani niścayiṃcuṭaku agni oka liṃgamu - agnilēnidē poga uṃḍadukanuka. āprakāramugānē advaita svarūpuḍu, pratyagātmakanna vēṟugānivāḍu ayina parabrahmaguṟiṃci teliyacēyuṭaku vēdāṃtamulu (upaniṣattulu) nirṇayiṃcunavi kanuka avi tātparyaliṃgamulu - parabrahmaguṟiṃci yukticē teliyacēyunavi. iṭṭi liṃgamulu āru -1.upakramōpasaṃhāramulu. 2. abhyāsamu, 3. apūrvatvamu, 4. phalamu, 5. ardhavādamu, 6. upapatti).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.