← Back to త · Booklets 21–30 (digitized file 3)

తత్వ దర్శీ tatva darśī

Original — తెలుగు
  1. అనుభవ వంతః (బ్రహ్మానుభవము గలవారు).

  2. తత్వ సాక్షాత్కార వంతః.

(పరమాత్మ తత్వ,మును ప్రత్యక్షముగా గాంచినవారు - అనిభూతమొనర్చుకొనినవారు).

  1. అపరోక్షానుభవ సంపన్నాః. (అపరోక్షమైన భగవత్తత్వమును ప్రత్యక్షముగా అనుభవించినవారు).

  2. బ్రహ్మ యాధాత్మ్య దర్శీ - సమ్యక్ దర్శీ.

(బ్రహ్మ యాధాత్మ్యమును - బ్రహ్మయొక్క స్వస్వరూపమును ప్రత్యక్షముగా చూచినవాడు - సమ్యక్ జ్ఞానము కలవాడు).

  1. తత్వ వేత్త. (తత్వమును తెలిసినవాడు - చూడుము - ‘తత్వం’).

  2. తత్ ఇతి సర్వనామ, సర్వంచ బ్రహ్మ, తస్యనామ తత్ ఇతి తద్భావః తత్వము - బ్రహ్మణః యధాత్మ్యం; తత్ ద్రష్టుం శీలం యస్య సః తత్వదర్శీ.

(తత్ అనగా అది యని యర్థము. ‘అవి’ యనగా ప్రతివస్తువునకు చెందును - అందుచేత అది ప్రతివస్తువునకు పేరు. (సర్వనామము) సర్వమూ (అన్నియు) బ్రహ్మమే. అందుచేత ‘తత్’ అనునది బ్రహ్మ యొక్క పేరు. ‘తత్’ (బ్రహ్మ) యొక్క భావము తత్వము - బ్రహ్మమై ఉండుట - బ్రహ్మమే అయి యుండుట; అనగా బ్రహ్మ యధాత్మ్యము, బ్రహ్మ స్వరూపము. దానిని చూచు శీలము (స్వభావము, గుణము, శక్తి) గలవాడు, బ్రహ్మ దర్శి).

  1. “తత్వ మేవ దర్శయంతి” (అభినవ గుప్తాచార్యః).

(బ్రహ్మ తత్వమును తెలియచేయువారు, బోధపఱచువారు - ‘తత్’ - అది, ‘త్వం’ = నీవు (ఆ బ్రహ్మవు నీవే) అను మహావాక్యమును బోధపఱచువారు - జీవుడే బ్రహ్మ అగుట ఎట్లో బోధపఱచువారు).

  1. “నా సతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |

ఉభయోరపి దృష్టో అంతస్త్వనయో స్తత్వనయో స్తత్వదర్శాఖః ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 16)

(అసద్వస్తువు ఉండునదికాదు. సద్వస్తువు నశించునదికాదు. చీకటిలో త్రాడును చూచి పాము అనుకొనినప్పుడు ఆ పాము అసద్వస్తువు, అది నిజమైనదికాదు, ‘సత్’ కాదు. అది త్రాడు అని తెలియుటచేతనే పాము అను జ్ఞానము నశించును - అట్లు నశించునది అసత్. అది ఎప్పుడునూ త్రాడే, త్రాడే యగుట సత్యము. ప్రపంచముకూడ నశించునదే, అందుచేత అసద్వస్తువు. మూడు కాలములందును, అన్ని దేశములందును, అన్ని వస్తువులందును (త్రివిధ పరిచ్ఛేదరహితమైనది) ఉండునది పరబ్రహ్మ. అది ఒక్కటియే సత్. ఈ ప్రకారము సత్పదార్థమనునది ఏది, అసత్పదార్థము ఏది యని విషయమును వీటి తత్వమును తెలిసినవారు చెప్పుదురు).

Transliteration
  1. anubhava vaṃtaḥ (brahmānubhavamu galavāru).

  2. tatva sākṣātkāra vaṃtaḥ.

(paramātma tatva,munu pratyakṣamugā gāṃcinavāru - anibhūtamonarcukoninavāru).

  1. aparōkṣānubhava saṃpannāḥ. (aparōkṣamaina bhagavattatvamunu pratyakṣamugā anubhaviṃcinavāru).

  2. brahma yādhātmya darśī - samyak darśī.

(brahma yādhātmyamunu - brahmayokka svasvarūpamunu pratyakṣamugā cūcinavāḍu - samyak jñānamu kalavāḍu).

  1. tatva vētta. (tatvamunu telisinavāḍu - cūḍumu - ‘tatvaṃ’).

  2. tat iti sarvanāma, sarvaṃca brahma, tasyanāma tat iti tadbhāvaḥ tatvamu - brahmaṇaḥ yadhātmyaṃ; tat draṣṭuṃ śīlaṃ yasya saḥ tatvadarśī.

(tat anagā adi yani yarthamu. ‘avi’ yanagā prativastuvunaku ceṃdunu - aṃducēta adi prativastuvunaku pēru. (sarvanāmamu) sarvamū (anniyu) brahmamē. aṃducēta ‘tat’ anunadi brahma yokka pēru. ‘tat’ (brahma) yokka bhāvamu tatvamu - brahmamai uṃḍuṭa - brahmamē ayi yuṃḍuṭa; anagā brahma yadhātmyamu, brahma svarūpamu. dānini cūcu śīlamu (svabhāvamu, guṇamu, śakti) galavāḍu, brahma darśi).

  1. “tatva mēva darśayaṃti” (abhinava guptācāryaḥ).

(brahma tatvamunu teliyacēyuvāru, bōdhapaṟacuvāru - ‘tat’ - adi, ‘tvaṃ’ = nīvu (ā brahmavu nīvē) anu mahāvākyamunu bōdhapaṟacuvāru - jīvuḍē brahma aguṭa eṭlō bōdhapaṟacuvāru).

  1. “nā satō vidyatē bhāvō nābhāvō vidyatē sataḥ |

ubhayōrapi dṛṣṭō aṃtastvanayō statvanayō statvadarśākhaḥ ||“. (śrīmadbhagavadgīta - 2 - 16)

(asadvastuvu uṃḍunadikādu. sadvastuvu naśiṃcunadikādu. cīkaṭilō trāḍunu cūci pāmu anukoninappuḍu ā pāmu asadvastuvu, adi nijamainadikādu, ‘sat’ kādu. adi trāḍu ani teliyuṭacētanē pāmu anu jñānamu naśiṃcunu - aṭlu naśiṃcunadi asat. adi eppuḍunū trāḍē, trāḍē yaguṭa satyamu. prapaṃcamukūḍa naśiṃcunadē, aṃducēta asadvastuvu. mūḍu kālamulaṃdunu, anni dēśamulaṃdunu, anni vastuvulaṃdunu (trividha paricchēdarahitamainadi) uṃḍunadi parabrahma. adi okkaṭiyē sat. ī prakāramu satpadārthamanunadi ēdi, asatpadārthamu ēdi yani viṣayamunu vīṭi tatvamunu telisinavāru ceppuduru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.