← Back to త · Booklets 21–30 (digitized file 3)

తత్వ జిజ్ఞాస tatva jijñāsa

Original — తెలుగు
  1. జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాసా; తత్వం జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాసా తత్వ జిజ్ఞాసా = తత్వమును - బ్రహ్మ తత్వమును తెలుసుకొనుటకు కోరిక. బ్రహ్మ అనగా ఎవరో ఏమిటో అని తెలుసుకొనుటకు కోరిక - బ్రహ్మ ఉన్నాడని కొందఱు లేడని కొందఱు అభిప్రాయపడుచున్నారు. పరబ్రహ్మ నిరాకారుడు అందుచేత కనబడడు - అందుచేత ఎటువంటివాడో తెలియదు. అందుచేత బ్రహ్మనుతెలుసుకొనుట అతని తత్వమును తెలుసుకొనుట ఎంతైనా అవసరము. ఇంతేకాక జ్ఞానాదేవతు కైవల్యం” (జ్ఞానము చేతనే - బ్రహ్మజ్ఞానముచేతనే - మోక్షము కలుగును) అని చెప్పబడియున్నది కనుక బ్రహ్మను, బ్రహ్మతత్వమును తెలుసుకొనవలసిన అవసరమున్నది. కనుక బ్రహ్మగుఱించి - (బ్రహ్మతత్వముగుఱించి) తెలుసుకొనవలసిన అవసరము ఉన్నది కనుక అందు విషయమై కోరిక (బ్రహ్మజిజ్ఞాస - తత్వ జిజ్ఞాస) కలుగవలెను).

  2. “అమృతత్వకామేన అద్వైతాత్మ విచార ఏవ వేదాంత వాక్యైః కర్తవ్యః”

(మోక్షము కోరువాడు వేదాంత వాక్యములచేత - ఉపనిషత్తులలో చెప్పిన ప్రకారము అద్వైత బ్రహ్మవిద్యను అభ్యసించవలసినది).

  1. “అత్రాహారార్థం కర్మ కుర్యాదనింద్యం |

కుర్యాదాహారం ప్రాన సంధారణార్థం |

ప్రాణాః సంధార్యా స్తత్వ జిజ్ఞాసనార్థం |

తత్వం జిజ్ఞాస్యం యేన భూయో న దుఃఖహః||“. (గీతాభావప్రకాశము - 6 - 82)

(ఆహారము కొఱకు నిందింపవీలుకాని కర్మ చేయవలయును - ప్రాణమును ధరించియుండుటకు ఆహారము తినవలయును - తత్వ జిజ్ఞాస కొఱకు ప్రానము ధరించియుండవయును - దుఃఖమనునది యుండదు - జన్మ కలుగదు).

Transliteration
  1. jñātuṃ icchā jijñāsā; tatvaṃ jñātuṃ icchā jijñāsā tatva jijñāsā = tatvamunu - brahma tatvamunu telusukonuṭaku kōrika. brahma anagā evarō ēmiṭō ani telusukonuṭaku kōrika - brahma unnāḍani koṃdaṟu lēḍani koṃdaṟu abhiprāyapaḍucunnāru. parabrahma nirākāruḍu aṃducēta kanabaḍaḍu - aṃducēta eṭuvaṃṭivāḍō teliyadu. aṃducēta brahmanutelusukonuṭa atani tatvamunu telusukonuṭa eṃtainā avasaramu. iṃtēkāka jñānādēvatu kaivalyaṃ” (jñānamu cētanē - brahmajñānamucētanē - mōkṣamu kalugunu) ani ceppabaḍiyunnadi kanuka brahmanu, brahmatatvamunu telusukonavalasina avasaramunnadi. kanuka brahmaguṟiṃci - (brahmatatvamuguṟiṃci) telusukonavalasina avasaramu unnadi kanuka aṃdu viṣayamai kōrika (brahmajijñāsa - tatva jijñāsa) kalugavalenu).

  2. “amṛtatvakāmēna advaitātma vicāra ēva vēdāṃta vākyaiḥ kartavyaḥ”

(mōkṣamu kōruvāḍu vēdāṃta vākyamulacēta - upaniṣattulalō ceppina prakāramu advaita brahmavidyanu abhyasiṃcavalasinadi).

  1. “atrāhārārthaṃ karma kuryādaniṃdyaṃ |

kuryādāhāraṃ prāna saṃdhāraṇārthaṃ |

prāṇāḥ saṃdhāryā statva jijñāsanārthaṃ |

tatvaṃ jijñāsyaṃ yēna bhūyō na duḥkhahaḥ||“. (gītābhāvaprakāśamu - 6 - 82)

(āhāramu koṟaku niṃdiṃpavīlukāni karma cēyavalayunu - prāṇamunu dhariṃciyuṃḍuṭaku āhāramu tinavalayunu - tatva jijñāsa koṟaku prānamu dhariṃciyuṃḍavayunu - duḥkhamanunadi yuṃḍadu - janma kalugadu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.