‘అదియే నీవు అయి యున్నావు’ - ఈ వాక్యము సామవేదములోని ఛాందోగ్యోపనిషత్తు లోనిది - ఉద్దాలకుడు తన పుత్రుడు అయిన శ్వేతకేతువునకు పరబ్రహ్మ గుఱించి బోధించి “ఆ పరబ్రహ్మ నీవే” అని చెప్పెను - ఆ పరబ్రహ్మయే జీవుడు, జీవుడే పరబ్రహ్మ, ఇద్దరు ఒకటే, జీవ బ్రహ్మలకు భేదములేదు. అని వాక్యముయొక్క అర్థము - ఉపనిషత్తులన్నింటిలోను బోధించబడిన అఖండార్థమిదియే - అందుచేత దీనిని మహావాక్యమనిరి).
“యత్పరం బ్రహ్మ సర్వాత్మ్నా విశ్వస్యాయతనం మహత్ |
సూక్ష్మాత్సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్ ||“. (కైవల్యోపనిషత్)
(సమస్తమైన వాటికి ఆత్మయినదిన్నీ, సూక్ష్మాతిసూక్ష్మమైనదిన్నీ, శాశ్వతమైనదిన్నీ అయినది పరబ్రహ్మ. అదియే నీవు, నీవే అది - ” తత్వమసి“).
‘త్వం’ అను పదమునకు నీవు అని భ్రాంతిచేత అర్థము చెప్పబడిచున్నది. ఆ ‘త్వం’ అనుమాటకు అర్థము ఎవరో నిర్ణయించి చెప్పినదికాదు. అందుచేత ‘నీవు’ అనునది త్వం పదమునకు వాచ్యార్థము - ఆ మాటకు ‘నీవు’ అనుమాటలోనున్న పరబ్రహ్మ చైతన్యమే లక్ష్యార్థము - జీవునిలోనున్న పరబ్రహ్మ చైతన్యమే లక్ష్యముగా ఉద్దేశింపబడినది. ఈ ప్రకారముగానే ‘తత్’ అను పదముచేత విరాట్పురుష హిరణ్య గర్భాదులు - వాటిలోనున్న చైతన్యముతో కలిసి యున్నవి - చెప్పబడినవి. అవి దానికి వాచ్యార్థము - ఏ విధమైన ఉపాధిలేక సర్వజ్ఞాత్వాది లక్షణములుగల సత్ పదార్థము - మూడు కాలములందు చెడకుండనుండు పరబ్రహ్మ చైతన్యము లక్ష్యార్థము - అనగా ‘తత్’ అనగా అట్టి పరమార్థ చైతన్యమే లక్ష్యముగా ఉపదేశింపబడినది.
‘తత్వమసి’ అను మహావాక్యము ఒక తండ్రి తన కుమారునకు ఉపదేశించినది కనుక అది ఉపదేశ వాక్యము - అది స్వయముగా అనిభవించి చెప్పీంది కాదు. మిగిలిన మాహావాక్యములు - ‘అహం బ్రహ్మస్మి’ (నేనే బ్రహ్మను అయితిని), ‘అయమాత్మా బ్రహ్మ’ (ఈ ఆత్మయే - ఈ నా ఆత్మయే బ్రహ్మ) అనునవి స్వయముగా బ్రహ్మానుభవమును పొందిన మీదట చెప్పినవి - అందుచేత అనుభవవాక్యములు).
“విరాట్ హిరణ్య గర్భ ఈశ్వరులు బ్రహ్మంబునుగూడి తప్తాయః పిండంబును బోలె నేకాకారంబై కాంచుటయే తత్పదంబునకు వాచ్యార్థము అనియు ముఖ్యార్థమనియు చెప్పబడును. ఆ తనుత్రయ వ్యష్టి రూపంబులగు విశ్వ తైజస ప్రాజ్ఞులను ప్రత్యగాత్మనుగూడి తప్తాయః పిండంబునుం బోలె నొక్కటియన కనునందు త్వం పదం బునకు వాచ్యార్థమనియు, ముఖ్యార్థంబనియు చెప్పంబడును. విరాట్టురుషాదుల వేరు చేసిన నిరుపాధిక బ్రహ్మమే తత్పదంబునకు లక్ష్యార్థంబనియు, మఱియు నా విశ్వాదులపృధక్కరించిన నిరుపాధిక ప్రత్యగాత్మ త్వం వదానకు లక్ష్యార్థమనియు చెప్పబడును”. (వివేకచింతామణి)
“అయంచ అస్య వాచ్యార్థః - ‘తత్’ జగదుత్పత్తికర్తా సర్వ శక్తిమాన్ సర్వజ్ఞత్వాది ధర్మవిశిష్టః,ఈశ్వరః. ‘త్వం’ అల్ప శక్తిమాన్ కించిత్ జ్ఞత్వాది ధర్మ విశిష్టః జీవః. ‘అసి’ వర్తతే. ఈహ ‘తత్వమసి’ ఇత్యుక్తా జీవేశ్వర యోః ఏకత్వం వాచ్యార్థః ప్రతీయతే - తచ్ఛనోప పద్యతే తథాహి - యః సర్వ శక్తిమాన్ సో అల్ప శక్తిమాన్, యః సర్వజ్ఞః సః కించిత్ జ్ఞః, యో వ్యాపకః సః పరిచ్ఛిన్నః,యః స్వతంత్రః సకర్మాధీనః యః పరోక్షః స ప్రత్యక్షః - యః స్వాధీన మాయః సః అవిద్యామోహితః - ఇత్యేవం విరుద్ధ ధర్మవతోః ఏకత్వోక్తిః అగ్నిః శీతలః ఇతివత్ స్యాత్ తస్మాత్ వాచ్యార్థే విరోధ సంభవాత్ లక్షణావృత్యా లక్షార్థం అత్ర విజానీహి. మహావాక్యే జహ లక్షణాయాః అజహల్లక్ష్ణాశ్చ అయుక్తత్వాత్ భాగత్యాగ లక్షణా చోధ్యా. భాగత్యాగ లక్షణాశ్రయణేన విరోధః పరిహృతో భవేత్”.
“తత్పద వాచ్యః ఈశ్వరః, త్వం పదవాచ్యః జీవః, ఏతయోః పరస్పర విరుద్ధాంశం విహాయ శుద్ధాసంగ చైతన్యాం శో లక్షణయా బోధ్యః ఈయమేవ భాగత్యాగ లక్షణా”.
“తత్వమసి” ఇతిమహావాక్యే భాగత్యాగలక్షణా యథా - మాయా, మాయాస్థా భాసః, మాయాభిష్టాన చైతన్యంచ ఇత్యేతత్ త్రయం మిలిత్వా సర్వ శక్తిత్వ సర్వజ్ఞత్వాది ధర్మ విశిష్టః ఈశ్వరః ఇతి కథ్యతే. అయమేవ తత్పద వాచ్యార్థః. వ్యష్ట్య విద్యా తత్రస్థా భాసః తదధిష్టాన చైతన్యం చ ఇత్యేతత్ త్రయం మిలిత్వా సర్వ అల్పశక్తిత్వ కించిత్ జ్ఞత్వాది ధర్మవిశిష్టో జీవః ఇత్యుచ్యతే. అయమేవ త్వం పద వాచ్యార్థః అనయోరేకత్వః ; తత్వమసి ‘ఇతి వాక్యం బోధయతి. ఏ తత్తు నఘటతే తస్మాత్ ఆభాస సహిత మాయాం, మాయాకృత సర్వ శక్తిత్వ సర్వజ్ఞత్వాది ధర్మాంశ్చ తత్పద వాచ్యాంసాన్ విహాయ చైతన్య మాత్ర గ్రహణే తత్పదస్య భాగత్యాగలక్షణా సిద్ధ్యతై. తథా ఆభాససహితా విద్యాంశం అవిద్యా కృతాల్పశక్తిత్వ కించిత్ జ్ఞత్వాది ధర్మాంశ్చ త్వం పద వాచ్యాంశాన్ విహాయ చైతన్యమాత్ర గ్రహణే త్వం పదస్య భాగత్యాగ లక్షణా సిద్ధ్యతి. ఇత్థం భాగ త్యాగలక్షణయా జీవేశ్వర స్వరూపస్థ లక్ష్యార్థ భూత చైతన్యాం శైక్యం ’తత్వమసి’
ఇతి మహావాక్యం బోధయతి“.
(ఈ మహావాక్యమునకు వాచ్యార్థము ఏమనగా : - ‘తత్’ అనగా జగత్తును సృష్టించువాడును, సమస్త శక్తులు గలవాడున్నూ, సర్వజ్ఞుడు మొదలగు ధర్మములు గలవాడున్నూ అయిన ఈశ్వరుడు. ‘త్వం’ అనగా అల్ప శక్తి గలవాడున్నూ, కించిజ్ఞుడు మొదలగు ధర్మములు గలవాడున్నూ అయిన జీవుడు; ‘అసి’ యనగా అయితిని - అయి యున్నావు. దీనిని బట్టి ‘తత్వమసి’ అని చెప్పుటచేత జీవేశ్వరులు ఒకటే యని దీని వాచ్యార్థమని తెలియును - కాని, అది సమంజసముకాదు - ఎందుచేతననగా - ఎవడు సమస్తమైన శక్తులు కలవాడో అతడే అల్పశక్తి గలవాడనియు, ఎబ్వడు సర్వజ్ఞుడో అతడే కించిత్ జ్ఞుడు (కొంచెము తెలిసినవాడు) అనియు, ఎవడు సర్వమును వ్యాపించియున్నాడో అతడే పరిచ్ఛిన్నుడు (ఎక్కడోఒకచోటనే, ఏదో ఒకదానిలోనే, ఎప్పుడో ఒకప్పుడే యుండువాడు) అనియు, ఎవడు స్వతంత్రుడో వాడే కర్మకు (దాని ఫలమునకు) ఆధీనుడై - పరతంత్రుడు అయి యుండువాడు అనియు, ఎవడు పరోక్షముగానుండి సాధారణులకు కనబడడో, అతడే ప్రత్యక్షముగా కనబడుచున్నాడనియు, ఎవడు మాయను తన స్వాధీనములో నుంచుకొనిన్వాడో వాడే అవిద్యచేత మోహము చెందినవాడనియు - ఈ ప్రకారముగా ఒకరికొకరు విరుద్ధధర్మములు గలవారు ఇద్దరి ఒకటే యనుట ‘అగ్ని చల్లగానున్నది’ యనినట్లగును. అందుచేత వాచ్యార్థములో ఒకదానికొకటి విరుద్ధముగా నున్నందున లక్షణావృత్తి వలన ఈ వాక్యముయొక్క లక్ష్యార్థము తెలుసుకోవలెను - ఈ మహావాక్యము నర్థము చేసుకొనుటలోజహలక్షణ అజహలక్షణ పనికిరావు. కనుక భాగత్యాగలక్షణద్వారా (ఒకభాగము వదలివేయుటవలన) ఈ రెండింటికియున్న విరోధము పరిహరింపబడును - అది యెట్లనగా :- తత్పదవాచ్యుడు (‘తత్’ అను పదముచేత చెప్పబడువాడు) ఈశ్వరుడు - ‘త్వం’ పదవాచ్యుడు జీవుడు. వీరిద్దరికి ఉన్న పరస్పర విరోధిలక్షణములను విడిచిపెట్టి శుద్ధచైతన్యాంశమే లక్షణద్వార తెలుసుకొనతగినది. ఇట్లు చేయుటయే భాగత్యాగలక్షణ.
“తత్వమసి” యను మహావాక్యమునకు ఈ భాగత్యాగలక్షణ యెట్లు వర్తింపచేయుట అనగా - మాయ, మాయాభానుడు, మాయను అధిష్టించియున్న పరబ్రహ్మచైతన్యము ఈ మూడును కలిసి సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అనుధర్మములు కలవాడు ఈశ్వరుడు అని చెప్పబడుచున్నాడు. ఇదియే తత్పదమునకు వాచ్యార్థము - వ్యష్టి అవిద్య, దానిలో ఆభాసుడు - దానినధిష్టించియున్న చైతన్యము - ఈ మూడును కలిసి అల్ప శక్తిమంతుడు, కించిత్ జ్ఞడు అను మొదలగు ధర్మములు గలవాడు జీవుడని చెప్పబడుచున్నాడు. ఇదియే త్వం పదమునకు వాచ్యార్థము - ఈ రెండు ఐక్యమగుటే “తత్వమసి” యనునది బోధించును. అందుచేత ఆభాసునితో కూడినమాయ, మాయాకౄతమైన (మాయవలన కలిగిన) సర్వ శక్తిమంతుడు, సర్వజ్ఞుడు అను తత్పరవాచ్యాంశములను వదలివేసి ఒక్క చైతన్యమునే తీసుకొనినయడల తత్పదమునకు భాగత్యాగలక్షణ సిద్ధించును. ఆ ప్రకారముగానే ఆభాసునితోకూడిన అవిద్యను, అవిద్యచేత కల్పింపబడిన అల్పశక్తిత్వము, కించిత్ జ్ఞత్వము అను మొదలగు ‘త్వం’ పదవాచ్యాంశములను విడిచివేసి, చైతన్యమాత్రమునే గ్రహించినయడల ; త్వం ‘పదముయొక్క భావత్యాగలక్షణము సిద్ధించును. ఈ ప్రకారముగ భాగత్యాగలక్షణవలన జీవేశ్వరుల (జీవబ్రహ్మల) స్వరూపములోనున్న లక్ష్యార్థమగు చ్జైతన్యము ఒకటే కనుక ’తత్ త్వం అసి’ ఆ పరబ్రహ్మ (చైతన్యము) నీవే యని ఈ మహావాక్యము బోధించును),
(బ్రహ్మజ్ఞానము కలుగుటకు ‘తత్వమసి’ అను మహావాక్యమును అవ్గాహన చేసుకొనుటయే అంతరంగసాధనము).
‘adiyē nīvu ayi yunnāvu’ - ī vākyamu sāmavēdamulōni chāṃdōgyōpaniṣattu lōnidi - uddālakuḍu tana putruḍu ayina śvētakētuvunaku parabrahma guṟiṃci bōdhiṃci “ā parabrahma nīvē” ani ceppenu - ā parabrahmayē jīvuḍu, jīvuḍē parabrahma, iddaru okaṭē, jīva brahmalaku bhēdamulēdu. ani vākyamuyokka arthamu - upaniṣattulanniṃṭilōnu bōdhiṃcabaḍina akhaṃḍārthamidiyē - aṃducēta dīnini mahāvākyamaniri).
“yatparaṃ brahma sarvātmnā viśvasyāyatanaṃ mahat |
sūkṣmātsūkṣmataraṃ nityaṃ tatvamēva tvamēva tat ||“. (kaivalyōpaniṣat)
(samastamaina vāṭiki ātmayinadinnī, sūkṣmātisūkṣmamainadinnī, śāśvatamainadinnī ayinadi parabrahma. adiyē nīvu, nīvē adi - ” tatvamasi”).
‘tvaṃ’ anu padamunaku nīvu ani bhrāṃticēta arthamu ceppabaḍicunnadi. ā ‘tvaṃ’ anumāṭaku arthamu evarō nirṇayiṃci ceppinadikādu. aṃducēta ‘nīvu’ anunadi tvaṃ padamunaku vācyārthamu - ā māṭaku ‘nīvu’ anumāṭalōnunna parabrahma caitanyamē lakṣyārthamu - jīvunilōnunna parabrahma caitanyamē lakṣyamugā uddēśiṃpabaḍinadi. ī prakāramugānē ‘tat’ anu padamucēta virāṭpuruṣa hiraṇya garbhādulu - vāṭilōnunna caitanyamutō kalisi yunnavi - ceppabaḍinavi. avi dāniki vācyārthamu - ē vidhamaina upādhilēka sarvajñātvādi lakṣaṇamulugala sat padārthamu - mūḍu kālamulaṃdu ceḍakuṃḍanuṃḍu parabrahma caitanyamu lakṣyārthamu - anagā ‘tat’ anagā aṭṭi paramārtha caitanyamē lakṣyamugā upadēśiṃpabaḍinadi.
‘tatvamasi’ anu mahāvākyamu oka taṃḍri tana kumārunaku upadēśiṃcinadi kanuka adi upadēśa vākyamu - adi svayamugā anibhaviṃci ceppīṃdi kādu. migilina māhāvākyamulu - ‘ahaṃ brahmasmi’ (nēnē brahmanu ayitini), ‘ayamātmā brahma’ (ī ātmayē - ī nā ātmayē brahma) anunavi svayamugā brahmānubhavamunu poṃdina mīdaṭa ceppinavi - aṃducēta anubhavavākyamulu).
“virāṭ hiraṇya garbha īśvarulu brahmaṃbunugūḍi taptāyaḥ piṃḍaṃbunu bōle nēkākāraṃbai kāṃcuṭayē tatpadaṃbunaku vācyārthamu aniyu mukhyārthamaniyu ceppabaḍunu. ā tanutraya vyaṣṭi rūpaṃbulagu viśva taijasa prājñulanu pratyagātmanugūḍi taptāyaḥ piṃḍaṃbunuṃ bōle nokkaṭiyana kanunaṃdu tvaṃ padaṃ bunaku vācyārthamaniyu, mukhyārthaṃbaniyu ceppaṃbaḍunu. virāṭṭuruṣādula vēru cēsina nirupādhika brahmamē tatpadaṃbunaku lakṣyārthaṃbaniyu, maṟiyu nā viśvādulapṛdhakkariṃcina nirupādhika pratyagātma tvaṃ vadānaku lakṣyārthamaniyu ceppabaḍunu”. (vivēkaciṃtāmaṇi)
“ayaṃca asya vācyārthaḥ - ‘tat’ jagadutpattikartā sarva śaktimān sarvajñatvādi dharmaviśiṣṭaḥ,īśvaraḥ. ‘tvaṃ’ alpa śaktimān kiṃcit jñatvādi dharma viśiṣṭaḥ jīvaḥ. ‘asi’ vartatē. īha ‘tatvamasi’ ityuktā jīvēśvara yōḥ ēkatvaṃ vācyārthaḥ pratīyatē - tacchanōpa padyatē tathāhi - yaḥ sarva śaktimān sō alpa śaktimān, yaḥ sarvajñaḥ saḥ kiṃcit jñaḥ, yō vyāpakaḥ saḥ paricchinnaḥ,yaḥ svataṃtraḥ sakarmādhīnaḥ yaḥ parōkṣaḥ sa pratyakṣaḥ - yaḥ svādhīna māyaḥ saḥ avidyāmōhitaḥ - ityēvaṃ viruddha dharmavatōḥ ēkatvōktiḥ agniḥ śītalaḥ itivat syāt tasmāt vācyārthē virōdha saṃbhavāt lakṣaṇāvṛtyā lakṣārthaṃ atra vijānīhi. mahāvākyē jaha lakṣaṇāyāḥ ajahallakṣṇāśca ayuktatvāt bhāgatyāga lakṣaṇā cōdhyā. bhāgatyāga lakṣaṇāśrayaṇēna virōdhaḥ parihṛtō bhavēt”.
“tatpada vācyaḥ īśvaraḥ, tvaṃ padavācyaḥ jīvaḥ, ētayōḥ paraspara viruddhāṃśaṃ vihāya śuddhāsaṃga caitanyāṃ śō lakṣaṇayā bōdhyaḥ īyamēva bhāgatyāga lakṣaṇā”.
“tatvamasi” itimahāvākyē bhāgatyāgalakṣaṇā yathā - māyā, māyāsthā bhāsaḥ, māyābhiṣṭāna caitanyaṃca ityētat trayaṃ militvā sarva śaktitva sarvajñatvādi dharma viśiṣṭaḥ īśvaraḥ iti kathyatē. ayamēva tatpada vācyārthaḥ. vyaṣṭya vidyā tatrasthā bhāsaḥ tadadhiṣṭāna caitanyaṃ ca ityētat trayaṃ militvā sarva alpaśaktitva kiṃcit jñatvādi dharmaviśiṣṭō jīvaḥ ityucyatē. ayamēva tvaṃ pada vācyārthaḥ anayōrēkatvaḥ ; tatvamasi ‘iti vākyaṃ bōdhayati. ē tattu naghaṭatē tasmāt ābhāsa sahita māyāṃ, māyākṛta sarva śaktitva sarvajñatvādi dharmāṃśca tatpada vācyāṃsān vihāya caitanya mātra grahaṇē tatpadasya bhāgatyāgalakṣaṇā siddhyatai. tathā ābhāsasahitā vidyāṃśaṃ avidyā kṛtālpaśaktitva kiṃcit jñatvādi dharmāṃśca tvaṃ pada vācyāṃśān vihāya caitanyamātra grahaṇē tvaṃ padasya bhāgatyāga lakṣaṇā siddhyati. itthaṃ bhāga tyāgalakṣaṇayā jīvēśvara svarūpastha lakṣyārtha bhūta caitanyāṃ śaikyaṃ ’tatvamasi’
iti mahāvākyaṃ bōdhayati”.
(ī mahāvākyamunaku vācyārthamu ēmanagā : - ‘tat’ anagā jagattunu sṛṣṭiṃcuvāḍunu, samasta śaktulu galavāḍunnū, sarvajñuḍu modalagu dharmamulu galavāḍunnū ayina īśvaruḍu. ‘tvaṃ’ anagā alpa śakti galavāḍunnū, kiṃcijñuḍu modalagu dharmamulu galavāḍunnū ayina jīvuḍu; ‘asi’ yanagā ayitini - ayi yunnāvu. dīnini baṭṭi ‘tatvamasi’ ani ceppuṭacēta jīvēśvarulu okaṭē yani dīni vācyārthamani teliyunu - kāni, adi samaṃjasamukādu - eṃducētananagā - evaḍu samastamaina śaktulu kalavāḍō ataḍē alpaśakti galavāḍaniyu, ebvaḍu sarvajñuḍō ataḍē kiṃcit jñuḍu (koṃcemu telisinavāḍu) aniyu, evaḍu sarvamunu vyāpiṃciyunnāḍō ataḍē paricchinnuḍu (ekkaḍōokacōṭanē, ēdō okadānilōnē, eppuḍō okappuḍē yuṃḍuvāḍu) aniyu, evaḍu svataṃtruḍō vāḍē karmaku (dāni phalamunaku) ādhīnuḍai - parataṃtruḍu ayi yuṃḍuvāḍu aniyu, evaḍu parōkṣamugānuṃḍi sādhāraṇulaku kanabaḍaḍō, ataḍē pratyakṣamugā kanabaḍucunnāḍaniyu, evaḍu māyanu tana svādhīnamulō nuṃcukoninvāḍō vāḍē avidyacēta mōhamu ceṃdinavāḍaniyu - ī prakāramugā okarikokaru viruddhadharmamulu galavāru iddari okaṭē yanuṭa ‘agni callagānunnadi’ yaninaṭlagunu. aṃducēta vācyārthamulō okadānikokaṭi viruddhamugā nunnaṃduna lakṣaṇāvṛtti valana ī vākyamuyokka lakṣyārthamu telusukōvalenu - ī mahāvākyamu narthamu cēsukonuṭalōjahalakṣaṇa ajahalakṣaṇa panikirāvu. kanuka bhāgatyāgalakṣaṇadvārā (okabhāgamu vadalivēyuṭavalana) ī reṃḍiṃṭikiyunna virōdhamu parihariṃpabaḍunu - adi yeṭlanagā :- tatpadavācyuḍu (‘tat’ anu padamucēta ceppabaḍuvāḍu) īśvaruḍu - ‘tvaṃ’ padavācyuḍu jīvuḍu. vīriddariki unna paraspara virōdhilakṣaṇamulanu viḍicipeṭṭi śuddhacaitanyāṃśamē lakṣaṇadvāra telusukonataginadi. iṭlu cēyuṭayē bhāgatyāgalakṣaṇa.
“tatvamasi” yanu mahāvākyamunaku ī bhāgatyāgalakṣaṇa yeṭlu vartiṃpacēyuṭa anagā - māya, māyābhānuḍu, māyanu adhiṣṭiṃciyunna parabrahmacaitanyamu ī mūḍunu kalisi sarvaśaktimaṃtuḍu, sarvajñuḍu anudharmamulu kalavāḍu īśvaruḍu ani ceppabaḍucunnāḍu. idiyē tatpadamunaku vācyārthamu - vyaṣṭi avidya, dānilō ābhāsuḍu - dāninadhiṣṭiṃciyunna caitanyamu - ī mūḍunu kalisi alpa śaktimaṃtuḍu, kiṃcit jñaḍu anu modalagu dharmamulu galavāḍu jīvuḍani ceppabaḍucunnāḍu. idiyē tvaṃ padamunaku vācyārthamu - ī reṃḍu aikyamaguṭē “tatvamasi” yanunadi bōdhiṃcunu. aṃducēta ābhāsunitō kūḍinamāya, māyākṝtamaina (māyavalana kaligina) sarva śaktimaṃtuḍu, sarvajñuḍu anu tatparavācyāṃśamulanu vadalivēsi okka caitanyamunē tīsukoninayaḍala tatpadamunaku bhāgatyāgalakṣaṇa siddhiṃcunu. ā prakāramugānē ābhāsunitōkūḍina avidyanu, avidyacēta kalpiṃpabaḍina alpaśaktitvamu, kiṃcit jñatvamu anu modalagu ‘tvaṃ’ padavācyāṃśamulanu viḍicivēsi, caitanyamātramunē grahiṃcinayaḍala ; tvaṃ ‘padamuyokka bhāvatyāgalakṣaṇamu siddhiṃcunu. ī prakāramuga bhāgatyāgalakṣaṇavalana jīvēśvarula (jīvabrahmala) svarūpamulōnunna lakṣyārthamagu cjaitanyamu okaṭē kanuka ’tat tvaṃ asi’ ā parabrahma (caitanyamu) nīvē yani ī mahāvākyamu bōdhiṃcunu),
(brahmajñānamu kaluguṭaku ‘tatvamasi’ anu mahāvākyamunu avgāhana cēsukonuṭayē aṃtaraṃgasādhanamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.