సృష్టి క్రమములో భగవంతునిలోనుండి ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టిన వాటిలోముఖ్యమైన పరిణామములు - ఘట్టములు - ఒకబీజమునుండి ఒక మొక్క మొలచి దానినుండి కొమ్మలు, చిగుళ్ళు, ఆకులు, పుష్పములు, ఫలములు మొదల్;అగునవి చెట్టు పెరుగుచున్న కార్యక్రమములో మార్పులువలె సృష్టి క్రమములో జరిగిన ముఖ్యమైనఘట్టములు. చెట్టులోని మార్పులుగలుగుటకు విత్తనములోని శక్తియే కారణమైనట్లు - సృష్టిలోని మార్పులుకలుగుటకు వాటిలోనుండు ఓకే ఒకటి అయిన భగవంతునిచిచ్ఛక్తి (చైతన్యశక్తి) యే కారణము - ఒకమనిషి పుట్టి పెరుగుచున్నపుడు బాల్య, కౌమార, యవ్వన,వార్థక్యములు వలెనే సృష్టిలోనిపరిణామములు కాలము గడిచిన కొలది కలుగుచున్నవి. ఆ ప్రకారముగా పరిణమించుటకు వాటి అన్నింటిలోను వాటి అన్నింటిలోను ఉండి, వాటికి అట్లు పరిణమించు శక్తి, స్వభావము ఇచ్చు నది ఒకే ఒక శక్తి; అదియే భగవచ్ఛక్తి, భగవంతుని తత్వము - వేరు వేరు వస్తువులుగా పరిణమించుటవలన ఆ భగవత్తత్త్వమే ఇట్లు పరినమించిన. అందుచేత ఇవికూడ తత్వములే.
ప్రకృతి, మహత్తత్త్వము, అహంకారము, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, శబ్దాది పంచవిషయములు, పంచప్రాణములు, మనోబుద్ధి, చిత్తాహంకారములు ఇవన్నియు కలిసి 24 తత్వములు. ఈ తత్వములన్నియు సృష్టి క్రమములో కలుగునప్పటికి, ఇవి కలిసిన వస్తువులో భగవంతుడు తన చైతన్యము చేత దానిని చేతనవంతముగా చేసి దానిలోనుండి పరిణామము కలుగచేయును - అట్లు చేతనత్వంబుగల వస్తువు జీవుడని చెప్పబడును. ఈ జీవుడు 25వ తత్వము - పైన చెప్పబడిన తత్వములన్నింటి లోను భగవంతుడుండి ఒక తత్వములోనుండి ఇంకొక తత్వమును పుట్టింపచేయును. అందుచేత అట్టి వస్తువులన్నియు భగవంతుని రూపములే, భగవంతుని తత్వములే. ‘తత్వమసి’ అను మాహావాక్యము ఒక్క భగవత్ జ్ఞానముగల నరునకే కాక పైన చెప్పిన వస్తువులన్నింటికి వర్తించును కనుక అవన్నియు తత్వములే - తత్ + త్వం = ఆ భగవంతుడే యీ పరిణామముచెందిన త్వం పదమునకు ఈ తత్వములు వాచ్యార్థము). (చూడుము - చతుర్వింశతి తత్వములు ; - ‘ప్రకృతి’ ; ‘సృష్టి’).
సృష్టి క్రమములో జరుగు పరిణామములలో ముఖ్యమైన వాటిసంఖ్య అనేక విధములుగా చెప్ప్బడినది: -
తత్వత్రయము (పరమాత్మ, క్రకృతి, జీవుడు); పంచవింశతి తత్వములు (పైన 2 లో చెప్పబడినవి). షట్త్రింశత్ తత్వములు; ఏకపంచశత్తత్త్వములు - వీటిలో మొదటి రెండు విధములలో మిగిలినవన్నియు ఇమిడియున్నవి. అందుచేత అవి తత్వములలో ముఖ్యమైనవి. (భగవంతుడే సృష్టిలోని వస్తువులుగా మారినందున, సృష్టిలోనున్న వస్తువుల తత్వముమొకటే (only one energy pervades and permeates in the entire creation) ఉన్నదంతా భగవంతుడే).
sṛṣṭi kramamulō bhagavaṃtunilōnuṃḍi okadānilōnuṃḍi okaṭigā puṭṭina vāṭilōmukhyamaina pariṇāmamulu - ghaṭṭamulu - okabījamunuṃḍi oka mokka molaci dāninuṃḍi kommalu, ciguḷḷu, ākulu, puṣpamulu, phalamulu modal;agunavi ceṭṭu perugucunna kāryakramamulō mārpuluvale sṛṣṭi kramamulō jarigina mukhyamainaghaṭṭamulu. ceṭṭulōni mārpulugaluguṭaku vittanamulōni śaktiyē kāraṇamainaṭlu - sṛṣṭilōni mārpulukaluguṭaku vāṭilōnuṃḍu ōkē okaṭi ayina bhagavaṃtunicicchakti (caitanyaśakti) yē kāraṇamu - okamaniṣi puṭṭi perugucunnapuḍu bālya, kaumāra, yavvana,vārthakyamulu valenē sṛṣṭilōnipariṇāmamulu kālamu gaḍicina koladi kalugucunnavi. ā prakāramugā pariṇamiṃcuṭaku vāṭi anniṃṭilōnu vāṭi anniṃṭilōnu uṃḍi, vāṭiki aṭlu pariṇamiṃcu śakti, svabhāvamu iccu nadi okē oka śakti; adiyē bhagavacchakti, bhagavaṃtuni tatvamu - vēru vēru vastuvulugā pariṇamiṃcuṭavalana ā bhagavattattvamē iṭlu parinamiṃcina. aṃducēta ivikūḍa tatvamulē.
prakṛti, mahattattvamu, ahaṃkāramu, paṃcajñānēṃdriyamulu, paṃcakarmēṃdriyamulu, śabdādi paṃcaviṣayamulu, paṃcaprāṇamulu, manōbuddhi, cittāhaṃkāramulu ivanniyu kalisi 24 tatvamulu. ī tatvamulanniyu sṛṣṭi kramamulō kalugunappaṭiki, ivi kalisina vastuvulō bhagavaṃtuḍu tana caitanyamu cēta dānini cētanavaṃtamugā cēsi dānilōnuṃḍi pariṇāmamu kalugacēyunu - aṭlu cētanatvaṃbugala vastuvu jīvuḍani ceppabaḍunu. ī jīvuḍu 25va tatvamu - paina ceppabaḍina tatvamulanniṃṭi lōnu bhagavaṃtuḍuṃḍi oka tatvamulōnuṃḍi iṃkoka tatvamunu puṭṭiṃpacēyunu. aṃducēta aṭṭi vastuvulanniyu bhagavaṃtuni rūpamulē, bhagavaṃtuni tatvamulē. ‘tatvamasi’ anu māhāvākyamu okka bhagavat jñānamugala narunakē kāka paina ceppina vastuvulanniṃṭiki vartiṃcunu kanuka avanniyu tatvamulē - tat + tvaṃ = ā bhagavaṃtuḍē yī pariṇāmamuceṃdina tvaṃ padamunaku ī tatvamulu vācyārthamu). (cūḍumu - caturviṃśati tatvamulu ; - ‘prakṛti’ ; ‘sṛṣṭi’).
sṛṣṭi kramamulō jarugu pariṇāmamulalō mukhyamaina vāṭisaṃkhya anēka vidhamulugā ceppbaḍinadi: -
tatvatrayamu (paramātma, krakṛti, jīvuḍu); paṃcaviṃśati tatvamulu (paina 2 lō ceppabaḍinavi). ṣaṭtriṃśat tatvamulu; ēkapaṃcaśattattvamulu - vīṭilō modaṭi reṃḍu vidhamulalō migilinavanniyu imiḍiyunnavi. aṃducēta avi tatvamulalō mukhyamainavi. (bhagavaṃtuḍē sṛṣṭilōni vastuvulugā mārinaṃduna, sṛṣṭilōnunna vastuvula tatvamumokaṭē (only one energy pervades and permeates in the entire creation) unnadaṃtā bhagavaṃtuḍē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.