← Back to త · Booklets 21–30 (digitized file 3)

తత్వత్రయము tatvatrayamu

Original — తెలుగు
  1. మూడు తత్వములు -

  2. “ఆత్మతత్వం, విద్యాతత్వమ్న్, శివతత్వమితి తత్వత్రయమేవ ఆగమ వేదిభిః అంగీకృతం -”

మాయాంతరాత్మతత్వం, విద్యాతత్వం సదాశివాంతం స్యాత్ | శక్తి శిదౌశివతత్వం, తురీయతత్వం సమష్టి రేతామితి - పృధివ్యాది మనస్తత్వాంతాని ఏకమిసతి తత్వాని మిళిత్వా ఆత్మతత్వమితి. అత్రస్థ తురీయస్వరం ప్రకృతి రూపత్వాత్ మాయాతత్వం. తేన తురీయ స్వరేణ ఆత్మతత్వం న సిద్ధం. మాయా శుద్ధ విద్యా ఈశ్వర సదాశివాః అహంకార మహత్తత్వ అవ్యక్త ఆత్మ బిందవః విద్యా తత్వ రూపాః విద్యానామ సంవిద్రూపిణీ, జ్ఞానైకస్య భావః, పరంజ్యోతిః అత్రస్థలే వ ప్రకాస స్వరూపత్వాత్ తేన విద్యా తత్వ సిద్ధిః - - - శక్తి శివౌ శివతత్వం సర్వ సమిష్టి బీజేన తురీయ తత్వముక్తం“.

(ఆత్మతత్వము, విద్యాతత్వ,ము, శివతత్వము అను ఆగమములను తెలిసినవారు అంగీకరించిరి.మాయవరకుగల తత్వము ఆత్మతత్వము. సదాశివునివరకుగల తత్వములు విద్యాతత్వము - శివుడు అతని శక్తిస్వరూపిణియగు దేవి శివతత్వము. ఈ మూడుతత్వముల మేళనము (కలిసినది) తురీయతత్వము).

(పృధివీతత్వము మొదలుకొని మనస్తత్వమువరకుగల ఇరువది యొక్క తత్వములు కలిసి ఆత్మతత్వము. మాయ, శుద్ధ విద్యా ఈశ్వరుడు, సదాశివుడు, అహంకారము, మహత్తత్త్వము, అవ్యక్తము ఆత్మబిందువులు - విద్యాతత్వము. విద్య యనగా సంవిద్రూపిణీ జ్ఞానమొకటే స్వరూపముగా గలది పరంజ్యోతి స్వరూపము. శివుడి, శివుని శక్తి యైన దేవి శివతత్వ,ము. ఇవి అన్నియు కలిసియున్నది తురీయతత్వము -)

  1. “వేదాంతాః చిత్ తత్వం, అచిత్తత్త్వం బ్రహ్మ తత్వంచ ఇతి తత్వత్రయం ముక్త కంఠం నిర్దిశ్య తేషాం తత్వానాం పరస్పర వైలక్షణ్యం, పరస్పర సంబంధంచ విశదయంతి.” క్షరమక్షరమీ శశ్చేతి తత్వత్రయం. అత్ర క్షరనశీలత్వాత్ నామరూప విభాగార్హ స్థూలాత్మనా పరిణామిత్వాచ్చ క్షరమితి వ్యక్తమితిచ అచిత్తత్వముచ్యతే. అక్షరణ శీలత్వాత్ సూక్ష్మరూపత్వాచ్చ అవ్యక్తమితి చిత్ తత్వం జీవ వర్గః ఉచ్యతే. ఈశః పరమాత్మా వ్యక్తరూపం క్షరం అభిద్వర్గం అవ్యక్త మక్షరం చిద్వర్గం చ సమ్యుక్తం పరస్పర మిలితం బిభర్తి కేవలమచిద్వర్గం చిద్వర్గం తథా పరస్పరమిళితంభూతవర్గంచ బిభర్తీత్యర్థః“.

(చిత్ తత్వము, అచిత్ తత్వము, బ్రహ్మతత్వము అని తత్వములు మూడు విధములని వేదాంతములు (ఉపనిషత్తులు) ముక్త కంఠముతో నిర్దేశించుచూ వాటిలో ఒకదానితో ఇంకొక దానికి గలబేధము, సంబంధము తెలియచేయుచున్నవి. అదియేలాగుననగా - క్షరము (నశించునది) అక్షరము (నశించనిది),

ఈశ్వరుడు అని తత్వములు మూడు. క్షీణించు స్వభావముకలిగియుండుటచేతనున్నూ, నామరూపములు గలవిగానుండి స్థూలరూపములుగా మారినదగుటచేత క్షరము (నశించునది), వ్యక్తము (రూపముకలదికనుక కనబడునది) అని అచిత్ తత్వము చెప్పబడినది. నశించని స్వభావము గలదగుటచేతను, సూక్ష్మరూపముగలదగుటచేతను అవ్యక్తమని చిత్ తత్వము (జీవులు) చెప్పబడుచున్నది. ఈశ్వరతత్వమనగా పరమాత్మ. వ్యక్తమైనది (కంటికి కనుపించునది) నశించు స్వభావముకలది యగు అచిత్ తత్వమున్నూ, అవ్యక్తము (కంటికి కనబడనిది), అక్షరము (నశించునది) అయిన చిత్ తత్వము. ఈ రెంటిని ఈశ్వరుడు భరించును).

  1. ప్రకృతిం పురుషం. చైవ ప్రవిశ్యా త్మేచ్ఛయాహరిః |

ప్రవిశ్య క్షోభయామాన సర్గకాలే వ్యయావ్యయే ||“. (ఇతి విష్ణుపురాణే)

(భగవంతుడు సృష్టి చేయునపుడు తన ఇచ్ఛానుసారము ప్రకృతిలోను, పురుషునిలోను, వ్యయమగు వస్తువులలోను, అవ్యయమగు వస్తువులలోను (ప్రకృతి యొక్క వికారములలోను, జీవులలోను) ప్రవేశించి వాటికి క్షోభము కలుగ చేసెను - అట్లు చేయుటవలన కారణవస్తువులోనుండి కార్యవస్తువు పుట్టునట్లు చేసెను. దీనిని బట్టి పరమాత్మ, జీవాత్మ, ప్రకౄతి అను మూడు తత్వములు చెప్పబడినవి).

  1. పరమాత్మ, ప్రకృతి, జీవాత్మ అని తత్వములు మూడు.

  2. “ఈశ్వరుని త్రివిధ తత్వంబులందు దృష్టాంతంబెట్లన్నను ఒకానొక చిత్ర వస్త్రమందు ద్ర్వయాంతర సంబంధము లేకుండుటం జేసి తానే ధౌతమనిపించుకొని, మీద గంజి చరి అను లేపంబువలన పటనంబడి, మీద నీల మయమైన ఆ యాకారంబువలన లాంచితంబునం బడి, ఆమీద యథాయోగ్యంబైన వర్ణ పూరంబులవలన రంజితంబైన చిత్రపటంబనంబడిన చందంబున పరబ్రహ్మము మొదట మాయా తత్కార్యమగునట్టి తానే చిత్తనిపించుకొనును. మఱియు సర్వకారణంబయిన మాయోపాధివలన అంతర్యాము యనంబడు, నామీదట అవ్యక్తంబైన అపంచీకృత భూతకార్యంబగు సూక్ష్మ శరీర సమష్ట్యుపాధివలన సూత్రాత్మకుండనంబడు, నామీద వ్యక్తంబైన పంచీకృత భూతకార్యంబగు స్థూల శరీర సమష్ట్యుపాధివలన విరాట్టనంబడును”. (వివేకచింతామణి - పరమానందతీర్థ)

  3. “తారాకార విమాన మధ్య నిలయం తత్వ త్రయారాధితం” (శ్రీరామకర్ణామృతం - 2 - 35)

(మూడుతత్వములచేత ఆరాధింపబడుచుండు శ్రీరామచంద్రపరబ్రహ్మగుఱించి నమస్కరించుచున్నాను).

  1. శరీరములోని తత్వముక్లగు వాత్త పిత్త శ్లేష్మములు -

  2. “భూమొరాపో (అ)నలో వాయుః మనో బుద్ధి రేవచ |

అహంకార ఇతీయం మే భిన్నా ప్రెకృతిరష్టథా ||“. (శ్రీమద్భగవ్ద్గీత - 7 - 4)

అత్రభూమ్యాదికం అచిత్ తత్వం

“అపరే య మిరస్తన్వ్యాం ప్రకృతిం విద్ధి మేపరాం |

జీవ భూతాం మహాబాహో యమేదం ధార్యతే జగత్ ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 5)

అత్రి జీవాఖ్యం చిత్ తత్త్వం.

“ద్వావిమౌ పురుషౌ లోకే క్షరాక్షర ఏవచ |

క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే ||

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః |

యో లోకత్రయ మాదిశ్యభిభర్త్యవ్యయ ఈశ్వరః |

యస్మాత్ క్షరమతీ తోహ మక్షరాదపి చోత్తమః |

అతో (అ)స్మిన్ లోకేవేదేచ ప్రథితః పురుషోత్తమః ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 16, 17, 18)

(పైన చెప్పిన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంక్జారము ఈ ఎనిమిది ప్రకృతులు (అష్ట ప్రకృతులు).అచిత్ తత్వము - ఈ ప్రకౄతికి వేరైనది పరాప్రకృతి, జీవరూపమైనది - దాని శక్తి చేత - చిచ్ఛక్తిచేత - ఈ పరపంచమంతను ధరించునది - అష్ట ప్రకృతులతో కలిసి ధరించునది. ఇది చిత్ తత్వము - కూటస్థుడు, అక్షరుడు, ఈ అక్షర పురుషునికన్న ఉత్తమమైన పురుషుడు - పురుషోత్తముడు - ఈశ్వరుడు. క్షరపురుషునికన్న, అక్షరపురుషునికన్న ఉత్తమమైన పురుషుడు గనుక ఈశ్వరుడు ఉత్తమపురుషుడని వేదములోను, లోకములోను ప్రసిద్ధము).

Transliteration
  1. mūḍu tatvamulu -

  2. “ātmatatvaṃ, vidyātatvamn, śivatatvamiti tatvatrayamēva āgama vēdibhiḥ aṃgīkṛtaṃ -”

māyāṃtarātmatatvaṃ, vidyātatvaṃ sadāśivāṃtaṃ syāt | śakti śidauśivatatvaṃ, turīyatatvaṃ samaṣṭi rētāmiti - pṛdhivyādi manastatvāṃtāni ēkamisati tatvāni miḷitvā ātmatatvamiti. atrastha turīyasvaraṃ prakṛti rūpatvāt māyātatvaṃ. tēna turīya svarēṇa ātmatatvaṃ na siddhaṃ. māyā śuddha vidyā īśvara sadāśivāḥ ahaṃkāra mahattatva avyakta ātma biṃdavaḥ vidyā tatva rūpāḥ vidyānāma saṃvidrūpiṇī, jñānaikasya bhāvaḥ, paraṃjyōtiḥ atrasthalē va prakāsa svarūpatvāt tēna vidyā tatva siddhiḥ - - - śakti śivau śivatatvaṃ sarva samiṣṭi bījēna turīya tatvamuktaṃ”.

(ātmatatvamu, vidyātatva,mu, śivatatvamu anu āgamamulanu telisinavāru aṃgīkariṃciri.māyavarakugala tatvamu ātmatatvamu. sadāśivunivarakugala tatvamulu vidyātatvamu - śivuḍu atani śaktisvarūpiṇiyagu dēvi śivatatvamu. ī mūḍutatvamula mēḷanamu (kalisinadi) turīyatatvamu).

(pṛdhivītatvamu modalukoni manastatvamuvarakugala iruvadi yokka tatvamulu kalisi ātmatatvamu. māya, śuddha vidyā īśvaruḍu, sadāśivuḍu, ahaṃkāramu, mahattattvamu, avyaktamu ātmabiṃduvulu - vidyātatvamu. vidya yanagā saṃvidrūpiṇī jñānamokaṭē svarūpamugā galadi paraṃjyōti svarūpamu. śivuḍi, śivuni śakti yaina dēvi śivatatva,mu. ivi anniyu kalisiyunnadi turīyatatvamu -)

  1. “vēdāṃtāḥ cit tatvaṃ, acittattvaṃ brahma tatvaṃca iti tatvatrayaṃ mukta kaṃṭhaṃ nirdiśya tēṣāṃ tatvānāṃ paraspara vailakṣaṇyaṃ, paraspara saṃbaṃdhaṃca viśadayaṃti.” kṣaramakṣaramī śaścēti tatvatrayaṃ. atra kṣaranaśīlatvāt nāmarūpa vibhāgārha sthūlātmanā pariṇāmitvācca kṣaramiti vyaktamitica acittatvamucyatē. akṣaraṇa śīlatvāt sūkṣmarūpatvācca avyaktamiti cit tatvaṃ jīva vargaḥ ucyatē. īśaḥ paramātmā vyaktarūpaṃ kṣaraṃ abhidvargaṃ avyakta makṣaraṃ cidvargaṃ ca samyuktaṃ paraspara militaṃ bibharti kēvalamacidvargaṃ cidvargaṃ tathā parasparamiḷitaṃbhūtavargaṃca bibhartītyarthaḥ”.

(cit tatvamu, acit tatvamu, brahmatatvamu ani tatvamulu mūḍu vidhamulani vēdāṃtamulu (upaniṣattulu) mukta kaṃṭhamutō nirdēśiṃcucū vāṭilō okadānitō iṃkoka dāniki galabēdhamu, saṃbaṃdhamu teliyacēyucunnavi. adiyēlāgunanagā - kṣaramu (naśiṃcunadi) akṣaramu (naśiṃcanidi),

īśvaruḍu ani tatvamulu mūḍu. kṣīṇiṃcu svabhāvamukaligiyuṃḍuṭacētanunnū, nāmarūpamulu galavigānuṃḍi sthūlarūpamulugā mārinadaguṭacēta kṣaramu (naśiṃcunadi), vyaktamu (rūpamukaladikanuka kanabaḍunadi) ani acit tatvamu ceppabaḍinadi. naśiṃcani svabhāvamu galadaguṭacētanu, sūkṣmarūpamugaladaguṭacētanu avyaktamani cit tatvamu (jīvulu) ceppabaḍucunnadi. īśvaratatvamanagā paramātma. vyaktamainadi (kaṃṭiki kanupiṃcunadi) naśiṃcu svabhāvamukaladi yagu acit tatvamunnū, avyaktamu (kaṃṭiki kanabaḍanidi), akṣaramu (naśiṃcunadi) ayina cit tatvamu. ī reṃṭini īśvaruḍu bhariṃcunu).

  1. prakṛtiṃ puruṣaṃ. caiva praviśyā tmēcchayāhariḥ |

praviśya kṣōbhayāmāna sargakālē vyayāvyayē ||“. (iti viṣṇupurāṇē)

(bhagavaṃtuḍu sṛṣṭi cēyunapuḍu tana icchānusāramu prakṛtilōnu, puruṣunilōnu, vyayamagu vastuvulalōnu, avyayamagu vastuvulalōnu (prakṛti yokka vikāramulalōnu, jīvulalōnu) pravēśiṃci vāṭiki kṣōbhamu kaluga cēsenu - aṭlu cēyuṭavalana kāraṇavastuvulōnuṃḍi kāryavastuvu puṭṭunaṭlu cēsenu. dīnini baṭṭi paramātma, jīvātma, prakṝti anu mūḍu tatvamulu ceppabaḍinavi).

  1. paramātma, prakṛti, jīvātma ani tatvamulu mūḍu.

  2. “īśvaruni trividha tatvaṃbulaṃdu dṛṣṭāṃtaṃbeṭlannanu okānoka citra vastramaṃdu drvayāṃtara saṃbaṃdhamu lēkuṃḍuṭaṃ jēsi tānē dhautamanipiṃcukoni, mīda gaṃji cari anu lēpaṃbuvalana paṭanaṃbaḍi, mīda nīla mayamaina ā yākāraṃbuvalana lāṃcitaṃbunaṃ baḍi, āmīda yathāyōgyaṃbaina varṇa pūraṃbulavalana raṃjitaṃbaina citrapaṭaṃbanaṃbaḍina caṃdaṃbuna parabrahmamu modaṭa māyā tatkāryamagunaṭṭi tānē cittanipiṃcukonunu. maṟiyu sarvakāraṇaṃbayina māyōpādhivalana aṃtaryāmu yanaṃbaḍu, nāmīdaṭa avyaktaṃbaina apaṃcīkṛta bhūtakāryaṃbagu sūkṣma śarīra samaṣṭyupādhivalana sūtrātmakuṃḍanaṃbaḍu, nāmīda vyaktaṃbaina paṃcīkṛta bhūtakāryaṃbagu sthūla śarīra samaṣṭyupādhivalana virāṭṭanaṃbaḍunu”. (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)

  3. “tārākāra vimāna madhya nilayaṃ tatva trayārādhitaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 35)

(mūḍutatvamulacēta ārādhiṃpabaḍucuṃḍu śrīrāmacaṃdraparabrahmaguṟiṃci namaskariṃcucunnānu).

  1. śarīramulōni tatvamuklagu vātta pitta ślēṣmamulu -

  2. “bhūmorāpō (a)nalō vāyuḥ manō buddhi rēvaca |

ahaṃkāra itīyaṃ mē bhinnā prekṛtiraṣṭathā ||“. (śrīmadbhagavdgīta - 7 - 4)

atrabhūmyādikaṃ acit tatvaṃ

“aparē ya mirastanvyāṃ prakṛtiṃ viddhi mēparāṃ |

jīva bhūtāṃ mahābāhō yamēdaṃ dhāryatē jagat ||“. (śrīmadbhagavadgīta - 7 - 5)

atri jīvākhyaṃ cit tattvaṃ.

“dvāvimau puruṣau lōkē kṣarākṣara ēvaca |

kṣaraḥ sarvāṇi bhūtāni kūṭasthō akṣara ucyatē ||

uttamaḥ puruṣastvanyaḥ paramātmē tyudāhṛtaḥ |

yō lōkatraya mādiśyabhibhartyavyaya īśvaraḥ |

yasmāt kṣaramatī tōha makṣarādapi cōttamaḥ |

atō (a)smin lōkēvēdēca prathitaḥ puruṣōttamaḥ ||“. (śrīmadbhagavadgīta - 15 - 16, 17, 18)

(paina ceppina bhūmi, nīru, agni, vāyuvu, ākāśamu, manassu, buddhi, ahaṃkjāramu ī enimidi prakṛtulu (aṣṭa prakṛtulu).acit tatvamu - ī prakṝtiki vērainadi parāprakṛti, jīvarūpamainadi - dāni śakti cēta - cicchakticēta - ī parapaṃcamaṃtanu dhariṃcunadi - aṣṭa prakṛtulatō kalisi dhariṃcunadi. idi cit tatvamu - kūṭasthuḍu, akṣaruḍu, ī akṣara puruṣunikanna uttamamaina puruṣuḍu - puruṣōttamuḍu - īśvaruḍu. kṣarapuruṣunikanna, akṣarapuruṣunikanna uttamamaina puruṣuḍu ganuka īśvaruḍu uttamapuruṣuḍani vēdamulōnu, lōkamulōnu prasiddhamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.