← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రైగుణ్యవిషయాః traiguṇyaviṣayāḥ

Original — తెలుగు
  1. ” త్రైగుణ్యం సంసారః విషయః ప్రకాశయతవ్యః యేషాం తే తైగుణ్య విషయాః వేదాః ” (శ్రీశంకరః)

(సత్వరజస్తమోగుణములతో కూడినది, త్రిగుణముల వలన కలిగినది, సంసారము. అదే విషయముగా - చెప్పబడిన వస్తువుగా - గలవి, త్రైగుణ్య విషయములు, వేదములు - సంసారమును కలుగచేయు కర్మలను బోధించునవి).

  1. త్రయాదీనాం గుణానాం పుణ్యపాపన్యామిశ్ర కర్మ తత్ఫల సంబంధ లక్షణః సంసారః - త్రైగుణ్యం ” (శ్రీ ఆనందగిరివ్యాఖ్య)

(సత్వరజస్తమములను త్రిగుణముల కారణముగా కలుగు పుణ్య కర్మలు, పాపకర్మలు, మిశ్రకర్మలు, వీటివలన కలుగు పులమైన సంసారము త్రైగుణ్యము. ఆ సంసారము గుఱించి - ఆ కర్మలగుఱించి, వాటి ఫలముల గుఱించి చెప్పునవి త్రైగుణ్య విషయములు).

  1. “త్రైగుణ్యం గుణత్రయ కార్యం. ఊర్థ్వ మధ్య అధోగతి రూపం సంసరణం, తదేవ ప్రకాశ యత్వేన విషయో ఏషాం తాదృశాః, కర్మ కాండ పరాః వేదాః” (శ్రీనీలకంఠవ్యాఖ్యా)

త్రైగుణ్యమనగా సత్వరజస్తమోగుణములయొక్క కార్యము, ఆ గుణములు చేయుపని - ఊర్ధ్వలోకములకుగాని (పుణ్యమువలన), లేక, పాపముచేయుటవలన అధోలోకములకు గాని (ఉత్కృష్టజన్మకాని), నీచజన్మకానిపొందుదురు అనుట - అదే సంసారము. (మరలమరల జన్మించుచు, కష్టసుఖములననుభవింపచేయుటయను సంసారము). అట్టి సంసారము విషయముగా గలవి, సంసారముగుఱించి చెప్పునవి త్రైగుణ్యవిషయములు).

  1. “త్రయాణాం గుణానాం కర్మ త్రైగుణ్యం, కామమూలః సంసారః, స ఏన ప్రకాశ్యత్వేన విషయో యేషాం త్రైగుణ్యవిషయాః, వేదాః, కర్మకాండాత్మకాః”

(సత్వరజస్తమోగుణములు చేయుకర్మ త్రైగుణ్యము, అది కామమూలమైన సంసారము. అట్టి సంసారము విషయముగా చెప్పునది - సంసారమునకు సమంధించిన విషయమును బోధించునదికర్మకాండ అను పేరుగల వేదభాగము - కర్మలను బోధించునది).

  1. “త్రైగుణ్య విషయాః వేదాః” (శ్రీమద్భగవద్గీత - 2 - 45)

(త్రిగుణములు చేసెడు కార్యము గుఱించి బోధపరచునవి వేదములు).

  1. త్రయోగుణాః త్రైగుణ్యం, సత్వరజస్తమాంసి, సత్వరజస్తమ ప్రచురాః పురుషాః త్రైగుణ్యశబ్దేన ఉచ్యంతే, తద్విషయాః వేదాః, తమః ప్రచురాణాం, రజః ప్రచురాణాం, సత్వ ప్రచురాణాం చ వత్సల తరితయై వహితం అవబోధయంతి వేదాః. యద్యేషాం స్వగుణానుగుణ్యేన స్వర్గాది సాధనమేవహితం నాన బోధయంతి. తదైతే రజస్తమ ప్రచుర తయా సాత్వికఫలమోక్ష విముఖాః స్వాపేక్షిత ఫలసాధన మ జానం తః కామప్రావణ్య వివశా అనుపాదేయేషు ఉపదేశ భ్రాంత్యా ప్రవిష్టాః భదేయుః - అతః త్రైగుణవిషయాః వేదాః“.

(త్రైగుణ్యమనగా త్రిగుణములు - సత్వరజస్తమములు - ఈ త్రిగుణములతోనిండియున్నవారు త్రైగుణ్యులు. వారి విషయములు వేదములు. ఈ మూడుగుణములుగలవారికి హితము బోధించునవి వేదములు. ఇవి వారి వారి గుణముల కనుగుణముగ స్వర్గము మొదలగు వాటికి సాధనము చెప్పకపోయినను రాజస తామస గుణములెక్కువగా కలిగియుండుటచేత, సత్వగుణమువలన కలుగు మోక్షమందు ఆసక్తిచూపనివగుటచేత అట్టివారు కోరు ఫలసాధనమును తెలియక ఉపదేశముపొందకూడనివాటియందు ఉపదేశముపొంది భ్రష్టులగుచున్నారు - అందుచేత వేదములు త్రైగుణ్యవిషయములని చెప్పబడుచున్నవి).

  1. “వ. - - - త్రివర్గంబును నాత్మవిద్యయుం దర్క దండనీతి జీవికాదులన్నియు త్రైగుణ్య విషయంబులైన వేదంబువలనం బ్రతిపాద్యంబులు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 6 - 217)
Transliteration
  1. ” traiguṇyaṃ saṃsāraḥ viṣayaḥ prakāśayatavyaḥ yēṣāṃ tē taiguṇya viṣayāḥ vēdāḥ ” (śrīśaṃkaraḥ)

(satvarajastamōguṇamulatō kūḍinadi, triguṇamula valana kaliginadi, saṃsāramu. adē viṣayamugā - ceppabaḍina vastuvugā - galavi, traiguṇya viṣayamulu, vēdamulu - saṃsāramunu kalugacēyu karmalanu bōdhiṃcunavi).

  1. trayādīnāṃ guṇānāṃ puṇyapāpanyāmiśra karma tatphala saṃbaṃdha lakṣaṇaḥ saṃsāraḥ - traiguṇyaṃ ” (śrī ānaṃdagirivyākhya)

(satvarajastamamulanu triguṇamula kāraṇamugā kalugu puṇya karmalu, pāpakarmalu, miśrakarmalu, vīṭivalana kalugu pulamaina saṃsāramu traiguṇyamu. ā saṃsāramu guṟiṃci - ā karmalaguṟiṃci, vāṭi phalamula guṟiṃci ceppunavi traiguṇya viṣayamulu).

  1. “traiguṇyaṃ guṇatraya kāryaṃ. ūrthva madhya adhōgati rūpaṃ saṃsaraṇaṃ, tadēva prakāśa yatvēna viṣayō ēṣāṃ tādṛśāḥ, karma kāṃḍa parāḥ vēdāḥ” (śrīnīlakaṃṭhavyākhyā)

traiguṇyamanagā satvarajastamōguṇamulayokka kāryamu, ā guṇamulu cēyupani - ūrdhvalōkamulakugāni (puṇyamuvalana), lēka, pāpamucēyuṭavalana adhōlōkamulaku gāni (utkṛṣṭajanmakāni), nīcajanmakānipoṃduduru anuṭa - adē saṃsāramu. (maralamarala janmiṃcucu, kaṣṭasukhamulananubhaviṃpacēyuṭayanu saṃsāramu). aṭṭi saṃsāramu viṣayamugā galavi, saṃsāramuguṟiṃci ceppunavi traiguṇyaviṣayamulu).

  1. “trayāṇāṃ guṇānāṃ karma traiguṇyaṃ, kāmamūlaḥ saṃsāraḥ, sa ēna prakāśyatvēna viṣayō yēṣāṃ traiguṇyaviṣayāḥ, vēdāḥ, karmakāṃḍātmakāḥ”

(satvarajastamōguṇamulu cēyukarma traiguṇyamu, adi kāmamūlamaina saṃsāramu. aṭṭi saṃsāramu viṣayamugā ceppunadi - saṃsāramunaku samaṃdhiṃcina viṣayamunu bōdhiṃcunadikarmakāṃḍa anu pērugala vēdabhāgamu - karmalanu bōdhiṃcunadi).

  1. “traiguṇya viṣayāḥ vēdāḥ” (śrīmadbhagavadgīta - 2 - 45)

(triguṇamulu cēseḍu kāryamu guṟiṃci bōdhaparacunavi vēdamulu).

  1. trayōguṇāḥ traiguṇyaṃ, satvarajastamāṃsi, satvarajastama pracurāḥ puruṣāḥ traiguṇyaśabdēna ucyaṃtē, tadviṣayāḥ vēdāḥ, tamaḥ pracurāṇāṃ, rajaḥ pracurāṇāṃ, satva pracurāṇāṃ ca vatsala taritayai vahitaṃ avabōdhayaṃti vēdāḥ. yadyēṣāṃ svaguṇānuguṇyēna svargādi sādhanamēvahitaṃ nāna bōdhayaṃti. tadaitē rajastama pracura tayā sātvikaphalamōkṣa vimukhāḥ svāpēkṣita phalasādhana ma jānaṃ taḥ kāmaprāvaṇya vivaśā anupādēyēṣu upadēśa bhrāṃtyā praviṣṭāḥ bhadēyuḥ - ataḥ traiguṇaviṣayāḥ vēdāḥ”.

(traiguṇyamanagā triguṇamulu - satvarajastamamulu - ī triguṇamulatōniṃḍiyunnavāru traiguṇyulu. vāri viṣayamulu vēdamulu. ī mūḍuguṇamulugalavāriki hitamu bōdhiṃcunavi vēdamulu. ivi vāri vāri guṇamula kanuguṇamuga svargamu modalagu vāṭiki sādhanamu ceppakapōyinanu rājasa tāmasa guṇamulekkuvagā kaligiyuṃḍuṭacēta, satvaguṇamuvalana kalugu mōkṣamaṃdu āsakticūpanivaguṭacēta aṭṭivāru kōru phalasādhanamunu teliyaka upadēśamupoṃdakūḍanivāṭiyaṃdu upadēśamupoṃdi bhraṣṭulagucunnāru - aṃducēta vēdamulu traiguṇyaviṣayamulani ceppabaḍucunnavi).

  1. “va. - - - trivargaṃbunu nātmavidyayuṃ darka daṃḍanīti jīvikādulanniyu traiguṇya viṣayaṃbulaina vēdaṃbuvalanaṃ bratipādyaṃbulu” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 6 - 217)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.