మూడు అను సంఖ్య - మూడు సంఖ్యల సమూహము.
పరబ్రహ్మ (శివుడు), జీవుడు, ప్రకృతి (ప్రపంచరూపము) - ఇవి తత్వ త్రయము - ఈ మూడింటిని పతి, పశువు, పాశము అందురు - పశువు అనగా జీవుడు - పాశము అనగా త్రాడు. ప్రపంచమును త్రాడుతో పశువగు జీవుడు కట్టబడి సంసారమందున్నాడు - జీవుడు ఈ సంసారమను పాశమును వదలించుకొని - ప్రకృతి విడిచి - తన పతి యగు పరబ్రహ్మతో ఐక్యమగుటయే మోక్షము - అందుచేత ఈ మూడు తత్వములు త్రికము - పశువగు జీవుని పతి కనుక శివుడు (పరబ్రహ్మ) పశుపతి).
“ప్రశాంత దివ్యమంగళవిగ్రహుండును, గతవిగ్రహుండును, భగవంతుండును, విశ్వగర్భుండును నైన ఈశ్వరుండు ప్రాప్యంబును, ప్రాపకంబును ప్రాప్తియునను భేదశూన్యుండు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 -15 - 524)
భక్తిః (ప్రేమ లక్షణా), పరేశానుభవః (ప్రేమాస్పద భగవద్రూపస్య స్ఫూర్తిః), తయా నిర్వృతస్య తత్తో న్యత్ర గృహాదిషు విరక్తిః. ఇత్యేషః త్రికః ఏకకాలః భజన సమకాల ఏవస్యాత్.
(భగవంతునియందు భక్తి, బ్రహ్మానుభవః, భగవంతుని యడలకాక వేరువస్తువులగు గృహము మొదలగువాటి యందు విరక్తి అను ఈ మూడును (త్రికము) ఒకే కాలమందు కలుగును).
mūḍu anu saṃkhya - mūḍu saṃkhyala samūhamu.
parabrahma (śivuḍu), jīvuḍu, prakṛti (prapaṃcarūpamu) - ivi tatva trayamu - ī mūḍiṃṭini pati, paśuvu, pāśamu aṃduru - paśuvu anagā jīvuḍu - pāśamu anagā trāḍu. prapaṃcamunu trāḍutō paśuvagu jīvuḍu kaṭṭabaḍi saṃsāramaṃdunnāḍu - jīvuḍu ī saṃsāramanu pāśamunu vadaliṃcukoni - prakṛti viḍici - tana pati yagu parabrahmatō aikyamaguṭayē mōkṣamu - aṃducēta ī mūḍu tatvamulu trikamu - paśuvagu jīvuni pati kanuka śivuḍu (parabrahma) paśupati).
“praśāṃta divyamaṃgaḷavigrahuṃḍunu, gatavigrahuṃḍunu, bhagavaṃtuṃḍunu, viśvagarbhuṃḍunu naina īśvaruṃḍu prāpyaṃbunu, prāpakaṃbunu prāptiyunanu bhēdaśūnyuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 -15 - 524)
bhaktiḥ (prēma lakṣaṇā), parēśānubhavaḥ (prēmāspada bhagavadrūpasya sphūrtiḥ), tayā nirvṛtasya tattō nyatra gṛhādiṣu viraktiḥ. ityēṣaḥ trikaḥ ēkakālaḥ bhajana samakāla ēvasyāt.
(bhagavaṃtuniyaṃdu bhakti, brahmānubhavaḥ, bhagavaṃtuni yaḍalakāka vēruvastuvulagu gṛhamu modalaguvāṭi yaṃdu virakti anu ī mūḍunu (trikamu) okē kālamaṃdu kalugunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.