(మాయాగుణములైన సత్వరజస్తమోగుణములసృష్టి - భూతములను, ఇంద్రియములను, వాటి అధిదేవతలను చేసిన సృష్టి).
(అగ్ని, జలము, భూమి - ఈ మూడు ఒకదానిలోనొకటి కలియకముందు సూక్ష్మరూపములోనుండు వాటిని సృష్టించుట).
(జీవుడు, ఈశ్వరుడు, జడమైన ప్రపంచము - వీటి సృష్టి ‘త్రిసర్గః’. అన్నింటికి కారణమై ఒకటే అయిన తేజస్సు తన కార్యవస్తువులందు - తనలోనుండిపుట్టిన కార్యవస్తువులందు వేరువేరుగా అనేకముగానుండి ప్రవేశించియుండునో, మథనముమొదలగు కార్యములద్వారా బైటపడునో, ఆ ప్రకారముగానే ఈశ్వరుడు ఈ జగత్తునుసృష్టించి అనేక రూపములుగా తానే అయి, భక్తులయందనుగ్రహము కలిగియుండుటవలన, వాసుదేవుడు (శ్రీకృష్ణుడు) మొదలగు రూపములతో - అవతారమూర్తులతో ఆవిర్భవించుచున్నాడు. ఇది ఈశ్వరసర్గము - లేదా, ఒకదీపమునుండి ఇంకొక దీపమును, దానివలన మరియొక దీపమును వెలిగించినట్లు ఈశ్వరునిలోనుండి ప్రకృతి, ప్రకృతిలోనుండి మహత్తత్వము, ఈ ప్రకారముగా ఒకదానిలోనుండి ఇంకొకటి పుట్టుట. ఇది ఈశ్వర సర్గము - జలములో ప్రతిబింబించిన సూర్యుని ప్రతిబింబములు ఒకే సూర్యునివలననే కలుగుచున్నవి. ఆ ప్రకారముగానే స్థూలశరీరము, సూక్ష్మశరీరము అను ఉపాధులలో నుండు కారణమువలన ఒక్కడైన ఈశ్వరుని ప్రతిబింబములు ఈశ్వరునివలన జీవులవలె పుట్టుచున్నవి. ఇది జీవసర్గము - కుమ్మరివాడు మట్టిని ఉపాదానముగా చేసుకొని కుండు మొదలగువాటిని చేయుచున్నాడు - ఆ ప్రకారముగానే ఈశ్వరుడు జడమైన ప్రకృతిని - మాయని - ఉపాదానముగా చేసుకొని మహత్తత్వం అహంకారము మొదలగు ఈ సర్వ జడపదార్ధములను సృష్టించుచున్నాడు. ఇది జడ సర్గము - ఇందువలననే సృష్టి మాయామయము - మాయతోనిండినది. అంతామాయయే, ప్రకృతియే - ఈ మూడువిధములసర్గము త్రిసర్గము).
(māyāguṇamulaina satvarajastamōguṇamulasṛṣṭi - bhūtamulanu, iṃdriyamulanu, vāṭi adhidēvatalanu cēsina sṛṣṭi).
(agni, jalamu, bhūmi - ī mūḍu okadānilōnokaṭi kaliyakamuṃdu sūkṣmarūpamulōnuṃḍu vāṭini sṛṣṭiṃcuṭa).
(jīvuḍu, īśvaruḍu, jaḍamaina prapaṃcamu - vīṭi sṛṣṭi ‘trisargaḥ’. anniṃṭiki kāraṇamai okaṭē ayina tējassu tana kāryavastuvulaṃdu - tanalōnuṃḍipuṭṭina kāryavastuvulaṃdu vēruvērugā anēkamugānuṃḍi pravēśiṃciyuṃḍunō, mathanamumodalagu kāryamuladvārā baiṭapaḍunō, ā prakāramugānē īśvaruḍu ī jagattunusṛṣṭiṃci anēka rūpamulugā tānē ayi, bhaktulayaṃdanugrahamu kaligiyuṃḍuṭavalana, vāsudēvuḍu (śrīkṛṣṇuḍu) modalagu rūpamulatō - avatāramūrtulatō āvirbhaviṃcucunnāḍu. idi īśvarasargamu - lēdā, okadīpamunuṃḍi iṃkoka dīpamunu, dānivalana mariyoka dīpamunu veligiṃcinaṭlu īśvarunilōnuṃḍi prakṛti, prakṛtilōnuṃḍi mahattatvamu, ī prakāramugā okadānilōnuṃḍi iṃkokaṭi puṭṭuṭa. idi īśvara sargamu - jalamulō pratibiṃbiṃcina sūryuni pratibiṃbamulu okē sūryunivalananē kalugucunnavi. ā prakāramugānē sthūlaśarīramu, sūkṣmaśarīramu anu upādhulalō nuṃḍu kāraṇamuvalana okkaḍaina īśvaruni pratibiṃbamulu īśvarunivalana jīvulavale puṭṭucunnavi. idi jīvasargamu - kummarivāḍu maṭṭini upādānamugā cēsukoni kuṃḍu modalaguvāṭini cēyucunnāḍu - ā prakāramugānē īśvaruḍu jaḍamaina prakṛtini - māyani - upādānamugā cēsukoni mahattatvaṃ ahaṃkāramu modalagu ī sarva jaḍapadārdhamulanu sṛṣṭiṃcucunnāḍu. idi jaḍa sargamu - iṃduvalananē sṛṣṭi māyāmayamu - māyatōniṃḍinadi. aṃtāmāyayē, prakṛtiyē - ī mūḍuvidhamulasargamu trisargamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.