← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రిపుర సుందరీ tripura suṃdarī

Original — తెలుగు
  1. “త్రిమూర్తివర్గా త్రిలోకాపురాణా త్రయీమయిత్వాత్, తేజో భిన్నాత్మక ప్రకృతి త్రయా త్ప్రాగవసత్వా చ్చ త్రిపురా, సర్వ యోగిభిః ఉపాస్యత్వేన స్సృహణీయత్వాత్ సుందరీ, ఏవం భూతా దేవతా”.

(త్రిమూర్తులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకంటె, మూడులోకములకంటె, ముందునుండీ ఉన్నది; ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అను మూడు వేదములందు నిండుగ వ్యాపించియున్నది, ప్రకృతి త్రయమునకు ముందు నుండి యున్నది, అగుటచేత త్రిపురా అని చెప్పబడుచున్నది. సమస్త యోగులచేత ఉపాసన చేయుటకు కోరబడుచున్నది కనుకను, దేవతాసుందరి కనుక త్రిపురసుందరి యని చెప్పబడుచున్నది).

  1. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ స్వరూపిణి అయిన దేవి.

  2. బ్రహ్మ, విష్ణు, రుద్రులు అనువారు త్రిపురములు - వారియందున్నవాడు సదాశివుడు. సదాశివుని భార్య త్రిపురసుందరి.

  3. సర్వోత్కృష్ట ప్రకాశత్వాత్ సుందరీ ఏషా. (అందరికంటె హెచ్చుగా ప్రకాశించునది కనుక సుందరి).

  4. సూర్యమండలము, చంద్రమండలము, అగ్నిమండలము అనునవి మూడు పురములు. వీటియందు అధిష్టించియున్న సౌందర్యముగల దేవత.

Transliteration
  1. “trimūrtivargā trilōkāpurāṇā trayīmayitvāt, tējō bhinnātmaka prakṛti trayā tprāgavasatvā cca tripurā, sarva yōgibhiḥ upāsyatvēna ssṛhaṇīyatvāt suṃdarī, ēvaṃ bhūtā dēvatā”.

(trimūrtulagu brahma viṣṇu mahēśvarulakaṃṭe, mūḍulōkamulakaṃṭe, muṃdunuṃḍī unnadi; ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu anu mūḍu vēdamulaṃdu niṃḍuga vyāpiṃciyunnadi, prakṛti trayamunaku muṃdu nuṃḍi yunnadi, aguṭacēta tripurā ani ceppabaḍucunnadi. samasta yōgulacēta upāsana cēyuṭaku kōrabaḍucunnadi kanukanu, dēvatāsuṃdari kanuka tripurasuṃdari yani ceppabaḍucunnadi).

  1. lakṣmī, sarasvati, pārvatī svarūpiṇi ayina dēvi.

  2. brahma, viṣṇu, rudrulu anuvāru tripuramulu - vāriyaṃdunnavāḍu sadāśivuḍu. sadāśivuni bhārya tripurasuṃdari.

  3. sarvōtkṛṣṭa prakāśatvāt suṃdarī ēṣā. (aṃdarikaṃṭe heccugā prakāśiṃcunadi kanuka suṃdari).

  4. sūryamaṃḍalamu, caṃdramaṃḍalamu, agnimaṃḍalamu anunavi mūḍu puramulu. vīṭiyaṃdu adhiṣṭiṃciyunna sauṃdaryamugala dēvata.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.