(దివ్యశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అను మూడుశక్తులు - ద్రవ్యశక్తియనగా భూమి మొదలగు పంచమహాభూతములను పుట్టించు శక్తి. జ్ఞానశక్తియనగా కండ్లు మొదలగు జ్ఞానేంద్రియములను కలిగించుశక్తి, క్రియాశక్తియనగా వాక్కు మొదలగు కర్మేంద్రియములను కలిగించు శక్తి).
సృష్టి స్థితి సంహార శక్తులు.
సత్వరజస్తమో గుణములు - ఈ గుణములుగల ప్రకృతి,
ఉత్సాహ ప్రభు మంత్ర శక్తులు.
ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు -
“రజస్సత్వంబుల చేత నుప బృమ్హితంబై వికారంబునొందినమహత్తత్వంబువలనం తనుః ప్రధానంబై ద్రవ్యజ్ఞాన క్రియాత్మకంబగు నహంకారంబు గలిగె అదియు రూపాంతరంబు లొందుచు ద్రవ్యశక్తియైన రాజసంబును, గ్రియాశక్తీయిన తామసంబును, జ్ఞానశక్తి అయిన సాత్వికంబును నన మూడు విధంబులయ్యె - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 86)
“వాగీశ్వరీ జ్ఞానశక్తిః వాగ్భావే మోక్షరూపిణీ |
కామరాజే క్రియాశక్తిః కామేశౌ కామ రూపిణీ |
శక్తి బీజే పరాశక్తిః ఇచ్ఛైవశివరూపిణీ |
ఏవం దేవీ త్ర్యక్షరీతు మహా త్రిపురసుందరీ||”
(వాగ్భవకూటమందు వాగీశ్వరిజ్ఞానశక్తి,కామరాజకూటమందుక్రియాశక్తి,శివరూపమే అయినశక్తి బీజము ఇచ్ఛాశక్తి).
(భగవంతుడు సర్వజ్ఞుడు. ఆ జ్ఞానము కలిగియుండుటచేత ఒక వస్తువులోనుండి మఱియొక వస్తువును దానినుండి పుట్టింపచేయుట క్రియాశక్తి).
వి తతముగాగ సృజింతు, బ్రభవిష్ణుడు విష్ణుడుప్రోచు, బార్వతీ
పతి లయమొందజేయు; హరి పంకరుహాదురుడాది మూర్తి య
చ్యుతుడు త్రిశక్తియుక్తుడగుచుండును నింతకు దానమూలమై” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 101)
(divyaśakti, jñānaśakti, kriyāśakti anu mūḍuśaktulu - dravyaśaktiyanagā bhūmi modalagu paṃcamahābhūtamulanu puṭṭiṃcu śakti. jñānaśaktiyanagā kaṃḍlu modalagu jñānēṃdriyamulanu kaligiṃcuśakti, kriyāśaktiyanagā vākku modalagu karmēṃdriyamulanu kaligiṃcu śakti).
sṛṣṭi sthiti saṃhāra śaktulu.
satvarajastamō guṇamulu - ī guṇamulugala prakṛti,
utsāha prabhu maṃtra śaktulu.
icchā jñāna kriyā śaktulu -
“rajassatvaṃbula cēta nupa bṛmhitaṃbai vikāraṃbunoṃdinamahattatvaṃbuvalanaṃ tanuḥ pradhānaṃbai dravyajñāna kriyātmakaṃbagu nahaṃkāraṃbu galige adiyu rūpāṃtaraṃbu loṃducu dravyaśaktiyaina rājasaṃbunu, griyāśaktīyina tāmasaṃbunu, jñānaśakti ayina sātvikaṃbunu nana mūḍu vidhaṃbulayye - (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 86)
“vāgīśvarī jñānaśaktiḥ vāgbhāvē mōkṣarūpiṇī |
kāmarājē kriyāśaktiḥ kāmēśau kāma rūpiṇī |
śakti bījē parāśaktiḥ icchaivaśivarūpiṇī |
ēvaṃ dēvī tryakṣarītu mahā tripurasuṃdarī||”
(vāgbhavakūṭamaṃdu vāgīśvarijñānaśakti,kāmarājakūṭamaṃdukriyāśakti,śivarūpamē ayinaśakti bījamu icchāśakti).
(bhagavaṃtuḍu sarvajñuḍu. ā jñānamu kaligiyuṃḍuṭacēta oka vastuvulōnuṃḍi maṟiyoka vastuvunu dāninuṃḍi puṭṭiṃpacēyuṭa kriyāśakti).
vi tatamugāga sṛjiṃtu, brabhaviṣṇuḍu viṣṇuḍuprōcu, bārvatī
pati layamoṃdajēyu; hari paṃkaruhāduruḍādi mūrti ya
cyutuḍu triśaktiyuktuḍagucuṃḍunu niṃtaku dānamūlamai” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 101)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.