“వృక్షస్య గతో భేదః పత్ర పుష్ప ఫలాదిభిః |
(భేదము మూడు విధములు - స్వగతభేదము, సజాతీయభేదము, విజాతీయభేదము. ఒకచెట్టులో అనేక భేదములుండును - వేళ్ళు, మాన్ ఉ, కొమ్మలు, ఆకులు, చిదుళ్ళు, పువ్వులు, కాయము, పళ్ళు. ఒక భాగమువలె ఇంకొకటియుండదు - ఇది చెట్టులోనే ఉన్న భేదము - స్వగతభేదము. ఒకచెట్టునకు ఇంకొక చెట్టునకు భేదముండును. ఆ చెట్టు ఈ చెట్టుకాదు - రెండూ చెట్లే అయినను, ఒకజాతికి చెందినవైనను ఆ రెండింటికి భేదమున్నది. ఇది సజాతీయభేదము - చెట్టు, ఱాయి లేక ఇంకే ఇతర వస్తువుగాని ఒకే రీతిగనుండవు. ఆ రెండు వేఱు వేఱు జాతులకు చెందినవి - అందుచేత ఆ రెండింటికినీ ఉన్న భేదము విజాతీయభేదము).
(భగవంతుడు ఈ మూడు విధములైన భేదము లేనివాడు - “ఆత్మైవేద మగ్ర అసీత్”, “ఏకమేవ” “అద్వితీయం”, “నాన్యత్ కించనమిషత్” - ఇప్పుడు ఈ కనబడు అనేకనామరూపములతో ఉన్న ఈజగత్తు అంతయు మొట్టమొదట - అనగా, సృష్టికి పూర్వము ఒక్క ఆత్మగానే ఉండేది. అది ఒకటే ఉండెను. ప్రపంచములో నామరూపములలో భేదమున్న వస్తువులువలె తనలో ఏవిధమైన విభాగములు లేక, ఒక్కటే అయి యుండెను - అందుచేత ఆత్మ స్వగతభేదములేనిది. “అద్వితీయం” అనుటవలన అటువంటి ఆత్మ ఇంకొకటిలేదు, అందుచేత ఆత్మ సజాతీయరహితము. ఇంకొక అత్మ లేకపోవడమేకాక ఇంకే ఇతర వస్తువులేదు - అందుచేత ఆత్మ విజాతీయభేదము లేనిది. అందుచేత ఆత్మ విజాతీయ త్రివిధ భేదములేనిది).- “స్వజాతీయ విజాతీయ స్వగతభేదమేమిలేక, అఖిలరూపుడైన వాని” (శ్రీత్యాగరాజు).
“vṛkṣasya gatō bhēdaḥ patra puṣpa phalādibhiḥ |
(bhēdamu mūḍu vidhamulu - svagatabhēdamu, sajātīyabhēdamu, vijātīyabhēdamu. okaceṭṭulō anēka bhēdamuluṃḍunu - vēḷḷu, mān u, kommalu, ākulu, ciduḷḷu, puvvulu, kāyamu, paḷḷu. oka bhāgamuvale iṃkokaṭiyuṃḍadu - idi ceṭṭulōnē unna bhēdamu - svagatabhēdamu. okaceṭṭunaku iṃkoka ceṭṭunaku bhēdamuṃḍunu. ā ceṭṭu ī ceṭṭukādu - reṃḍū ceṭlē ayinanu, okajātiki ceṃdinavainanu ā reṃḍiṃṭiki bhēdamunnadi. idi sajātīyabhēdamu - ceṭṭu, ṟāyi lēka iṃkē itara vastuvugāni okē rītiganuṃḍavu. ā reṃḍu vēṟu vēṟu jātulaku ceṃdinavi - aṃducēta ā reṃḍiṃṭikinī unna bhēdamu vijātīyabhēdamu).
(bhagavaṃtuḍu ī mūḍu vidhamulaina bhēdamu lēnivāḍu - “ātmaivēda magra asīt”, “ēkamēva” “advitīyaṃ”, “nānyat kiṃcanamiṣat” - ippuḍu ī kanabaḍu anēkanāmarūpamulatō unna ījagattu aṃtayu moṭṭamodaṭa - anagā, sṛṣṭiki pūrvamu okka ātmagānē uṃḍēdi. adi okaṭē uṃḍenu. prapaṃcamulō nāmarūpamulalō bhēdamunna vastuvuluvale tanalō ēvidhamaina vibhāgamulu lēka, okkaṭē ayi yuṃḍenu - aṃducēta ātma svagatabhēdamulēnidi. “advitīyaṃ” anuṭavalana aṭuvaṃṭi ātma iṃkokaṭilēdu, aṃducēta ātma sajātīyarahitamu. iṃkoka atma lēkapōvaḍamēkāka iṃkē itara vastuvulēdu - aṃducēta ātma vijātīyabhēdamu lēnidi. aṃducēta ātma vijātīya trividha bhēdamulēnidi).- “svajātīya vijātīya svagatabhēdamēmilēka, akhilarūpuḍaina vāni” (śrītyāgarāju).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.