← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్యాగము tyāgamu

Original — తెలుగు
  1. ముక్త హస్తతా.

(పిడికిటి పట్టి యుంచక వదలివేయుట - ఈవి -, విడిచిపెట్టుట; అన్నింటిని విడిచిపెట్టుట).

  1. “సన్యాసః” (శ్రీశంకరః)

(సన్యాసము - అన్నియు వదలివేయుట; వైరాగ్యము; విరాగియొక్కభావము. దేనియందును అనురాగము లేకుండుట).

  1. “త్యాగః ఫలత్యాగ ఏవ” (శ్రీ ఆనందతీర్థః)

(కర్మలవలన కలుగు ఫలమును వదలుకొనుటయే - ఫలమందాసక్తి లేకుండటయే త్యాగము).

  1. “సర్వ కర్మ ఫల త్యాగం ప్రాహుస్తాగం విచక్షణాః |” (శ్రీమద్భగవద్గీత - 18 - 2)

(సమస్త కర్మలఫలమును త్యజించుటయే - విడిచిపెట్టుటయే - త్యాగమని దాని విచక్షణ తెలిసినవారు చెప్పుదురు).

  1. “నిత్య నైమిత్తికానాం అనుష్టీయ మానానాం సర్వ కర్మణాం ఆత్మ సంబంధి తయా ప్రాప్తస్య ఫలస్యపరిత్యాగః సర్వ కర్మఫలత్యాగః త్యాగం” (శ్రీశంకరః)

(నిత్య నైముత్తిక కర్మలవలన, అనుష్టించుచున్న సర్వ కర్మల వలన తనకు సంబంధించి కలుగు ఫలమును పరిత్యజించుటయే సర్వ కర్మ ఫల త్యాగము. అదియే త్యాగము).

  1. “శ్లో||. త్యాగః ప్రపంచరూపస్య చిదాత్మ త్వావ లోకనాత్ |

త్యాగోహి మహతాం పూజ్యః సద్యో మోక్షమయో యతః ||“.

(ప్రపంచమంతయు చైతన్యాత్మకుడైన పరమాత్మయని భావించుటయే త్యాగము - ప్రపంచమంతయు పరమాత్మయే అయినయెడల ఇక పరమాత్మకన్న అభిలషించవలసిన వస్తువే ఉండదు - అందుచేత ప్రపంచమంతయు త్యజించినట్లే యగును. త్యాగము మహాత్ములకు కూడ (సత్పురుషులకు కూడ) పూజనీయమే - దానివలన సద్యోముక్తి (అప్పటికప్పుడే ముక్తినొందుట) లభించును).

    1. “త్యాగః త్రివిధః” : -

1. కర్మ జన్యం స్వర్గాదికం ఫలం మమ నస్యాత్ ఇతి ఫలత్యాగః,

2. మదీయ ఫలసాదన తయా మదీయం ఇదం కర్మ ఇతి కర్మణి మమతా యాః పరిత్యాగః - కర్మ విషయ స్త్యాగః.

3. సర్వేశ్వరే కర్తృత్వాను సంథానేన ఆత్మనః కర్తృతా త్యాగః - కర్తృత్వ విషయస్త్యాగః “. (శ్రీరామనుజః)

(ఈ కర్మవలన - యజ్ఞయాగాదికములవలన - కలుగు ఫలము, స్వర్గము మొదలగునవి కావు, అవి పరమేశ్వరునివే యని తలచుట ఫలత్యాగము.

1. కర్మఫలము నాకవసరము లేదని దానినివదలుట, దానియందాశ లేకుండుట.

2. నేను ఈ పని చేయుచున్నాను కనుక ఈ కర్మ నాది అని ఆ కర్మయందు మమత్వమును - మమకారమును (మమ = నాది) - విడచుట కర్మవిషయమగు త్యాగము.

3. ఈ కర్మచేయుచున్నవాడు పరమేశ్వరుడే, నేనుకాదు అని పరమేశ్వరుని యందే కర్త త్వమునుంచి, తాను కర్తను కాను అని పరమేశ్వరుని యందే కర్తత్వమునుంచి తాను కర్తౄత్వమును విడుచుట కర్తృత్వ విషయమగు త్యాగము).

  1. “నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే |

మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః |

దుఃఖ మిత్యేన యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ |

స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్ |

కార్య మిత్యేవ యత్కర్మ నియతం క్రియతే(అ)ర్జున |

సంగంత్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః | - - -

నహిదేహ భృతా శక్యం త్యక్తుం కర్మాణ్య శేషతః |

యస్తు కర్మఫల త్యాగీ సత్యా గీత్యభిధీయతే||” (శ్రీమద్భగవద్గీత - 18 - 7 to 9)

(నియతకర్మను విడిచిపెట్టకూడదు. మోహమువలన దానిని విడిచిపెట్టుట తామస త్యాగమనబడును - శరీరమునకు కష్టముకలిగించునదని, చేయుట కష్టమని కర్మను త్యజించుట రాజస త్యాగమనిపించుకొనును. దానివలన త్యాగఫలము లభించదు - నియతమైన కర్మను - చేయవలసినదానిని, దానియందాసక్తిలేక, - ఆ కర్మఫలమందాసక్తిలేక దానిని విడుచుట సాత్విక త్యాగము - మానవులు ఏకర్మనైనను చేయక ఊరక ఉండలేరు - అందుచేత కర్మఫలమును త్యజించుటయే త్యాగము - అట్లు కర్మఫలమును త్యజించువాడే త్యాగి).

  1. త్యాగః త్రివిధః తామసాది ప్రకారైః శాస్త్రేషు కథితః. (శ్రీమాన్ రామానుజః)

(తామస, రాజస, సాత్విక గుణములను బట్టి త్యాగము మూడువిధములుగా నున్నది).

  1. “నాస్తి త్యాగసమం సుఖం” (త్యాగముతో సమానమైన సుఖములేదు).
Transliteration
  1. mukta hastatā.

(piḍikiṭi paṭṭi yuṃcaka vadalivēyuṭa - īvi -, viḍicipeṭṭuṭa; anniṃṭini viḍicipeṭṭuṭa).

  1. “sanyāsaḥ” (śrīśaṃkaraḥ)

(sanyāsamu - anniyu vadalivēyuṭa; vairāgyamu; virāgiyokkabhāvamu. dēniyaṃdunu anurāgamu lēkuṃḍuṭa).

  1. “tyāgaḥ phalatyāga ēva” (śrī ānaṃdatīrthaḥ)

(karmalavalana kalugu phalamunu vadalukonuṭayē - phalamaṃdāsakti lēkuṃḍaṭayē tyāgamu).

  1. “sarva karma phala tyāgaṃ prāhustāgaṃ vicakṣaṇāḥ |” (śrīmadbhagavadgīta - 18 - 2)

(samasta karmalaphalamunu tyajiṃcuṭayē - viḍicipeṭṭuṭayē - tyāgamani dāni vicakṣaṇa telisinavāru ceppuduru).

  1. “nitya naimittikānāṃ anuṣṭīya mānānāṃ sarva karmaṇāṃ ātma saṃbaṃdhi tayā prāptasya phalasyaparityāgaḥ sarva karmaphalatyāgaḥ tyāgaṃ” (śrīśaṃkaraḥ)

(nitya naimuttika karmalavalana, anuṣṭiṃcucunna sarva karmala valana tanaku saṃbaṃdhiṃci kalugu phalamunu parityajiṃcuṭayē sarva karma phala tyāgamu. adiyē tyāgamu).

  1. “ślō||. tyāgaḥ prapaṃcarūpasya cidātma tvāva lōkanāt |

tyāgōhi mahatāṃ pūjyaḥ sadyō mōkṣamayō yataḥ ||“.

(prapaṃcamaṃtayu caitanyātmakuḍaina paramātmayani bhāviṃcuṭayē tyāgamu - prapaṃcamaṃtayu paramātmayē ayinayeḍala ika paramātmakanna abhilaṣiṃcavalasina vastuvē uṃḍadu - aṃducēta prapaṃcamaṃtayu tyajiṃcinaṭlē yagunu. tyāgamu mahātmulaku kūḍa (satpuruṣulaku kūḍa) pūjanīyamē - dānivalana sadyōmukti (appaṭikappuḍē muktinoṃduṭa) labhiṃcunu).

    1. “tyāgaḥ trividhaḥ” : -

1. karma janyaṃ svargādikaṃ phalaṃ mama nasyāt iti phalatyāgaḥ,

2. madīya phalasādana tayā madīyaṃ idaṃ karma iti karmaṇi mamatā yāḥ parityāgaḥ - karma viṣaya styāgaḥ.

3. sarvēśvarē kartṛtvānu saṃthānēna ātmanaḥ kartṛtā tyāgaḥ - kartṛtva viṣayastyāgaḥ “. (śrīrāmanujaḥ)

(ī karmavalana - yajñayāgādikamulavalana - kalugu phalamu, svargamu modalagunavi kāvu, avi paramēśvarunivē yani talacuṭa phalatyāgamu.

1. karmaphalamu nākavasaramu lēdani dāninivadaluṭa, dāniyaṃdāśa lēkuṃḍuṭa.

2. nēnu ī pani cēyucunnānu kanuka ī karma nādi ani ā karmayaṃdu mamatvamunu - mamakāramunu (mama = nādi) - viḍacuṭa karmaviṣayamagu tyāgamu.

3. ī karmacēyucunnavāḍu paramēśvaruḍē, nēnukādu ani paramēśvaruni yaṃdē karta tvamunuṃci, tānu kartanu kānu ani paramēśvaruni yaṃdē kartatvamunuṃci tānu kartṝtvamunu viḍucuṭa kartṛtva viṣayamagu tyāgamu).

  1. “niyatasyatu sanyāsaḥ karmaṇō nōpapadyatē |

mōhāttasya parityāgastāmasaḥ parikīrtitaḥ |

duḥkha mityēna yatkarma kāyaklēśa bhayāt tyajēt |

sa kṛtvā rājasaṃ tyāgaṃ naiva tyāga phalaṃ labhēt |

kārya mityēva yatkarma niyataṃ kriyatē(a)rjuna |

saṃgaṃtyaktvā phalaṃ caiva satyāgaḥ sātvikō mataḥ | - - -

nahidēha bhṛtā śakyaṃ tyaktuṃ karmāṇya śēṣataḥ |

yastu karmaphala tyāgī satyā gītyabhidhīyatē||” (śrīmadbhagavadgīta - 18 - 7 to 9)

(niyatakarmanu viḍicipeṭṭakūḍadu. mōhamuvalana dānini viḍicipeṭṭuṭa tāmasa tyāgamanabaḍunu - śarīramunaku kaṣṭamukaligiṃcunadani, cēyuṭa kaṣṭamani karmanu tyajiṃcuṭa rājasa tyāgamanipiṃcukonunu. dānivalana tyāgaphalamu labhiṃcadu - niyatamaina karmanu - cēyavalasinadānini, dāniyaṃdāsaktilēka, - ā karmaphalamaṃdāsaktilēka dānini viḍucuṭa sātvika tyāgamu - mānavulu ēkarmanainanu cēyaka ūraka uṃḍalēru - aṃducēta karmaphalamunu tyajiṃcuṭayē tyāgamu - aṭlu karmaphalamunu tyajiṃcuvāḍē tyāgi).

  1. tyāgaḥ trividhaḥ tāmasādi prakāraiḥ śāstrēṣu kathitaḥ. (śrīmān rāmānujaḥ)

(tāmasa, rājasa, sātvika guṇamulanu baṭṭi tyāgamu mūḍuvidhamulugā nunnadi).

  1. “nāsti tyāgasamaṃ sukhaṃ” (tyāgamutō samānamaina sukhamulēdu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.