(సంసారములో నున్నవాడు - జననమరణములు ప్రవాహరూపముగా గలవాడు.; జీవుడు). కర్మఫలమనుభవింపవలసిన వాడు.
న తం పశ్యామి యస్యాహం తం న పశ్యామి యో మమ |
అహమేవ పరబ్రహ్మ జగన్నాధోహ మీశ్వరః |
ఇతిస్యాన్నిశ్చి - కో ముక్తో బద్ధస్స్యావన్యధా పుమాన్ ||".
(నేను ఒక్కడినే; నాకు ఎవరూ లేరు - 'నా' అనువారు ఎవరూ లేరు - నేనెవనివాడను కాను - నేనే పరబ్రహ్మను, జగన్నాధుడను, ఈశ్వరుడను, అని యీ ప్రకారము నిశ్చ య బుద్ధి కలిగియుండుటవలన ముక్తుడగును, - అట్లుగాని యడల బద్ధుడగును).
బోధో (అ)హం జ్ఞాన ఖడ్గేన తన్నిష్కృత్యసుఖీ భవ ||". (అష్టావక్రగీత - 1 - 14)
(నేను దేహాభిమానము - దేహమే ఆత్మ యను అభిప్రాయము – కలిగి యుండుట అను పాశము చేత నీవు కట్టబడియున్నావు. ఆ పాశమును జ్ఞానమను ఖడ్గముతో భేధించి సుఖముగా నుండుము).
(వాస్తవముగా దేహములో లేనివాడైనను అజ్ఞాని దేహముతో నున్నట్లు దానికి కలుగు సుఖ దుఃఖాముల ననుభవించువాడు, కలలో కన్న దేహము కలవాడుగా భావించువాడు).
(పూర్వ జన్మలలో చేసిన కర్మలకనుగుణమైన ఫలముననుభవించుటకు తగిన ఈ జన్మలోని దేహమందు జీవుడు ఈ దేహముచే బంధింపబడు చున్నాడు - దీనికి కారణమేమనగా ' నేను కర్తను ' అను అహంకారము కలిగియుండుట).
"వ. - - - అజ్ఞానియైనవానికి, సత్వరజస్తమోగుణంబులు కలిగి యుండువానికి గుణమయంబులైన ఇంద్రియాదులె యాత్మ యని తోచుచుండును. కావున వాడా గుణంబులచేత బద్ధుండగును. ఆ గుణంబులకు సాక్షిమాత్రంబగు శరీరంబు ఎవ్వడెఱుంగనోపు వాడా గుణంబులచేత బద్ధుండుకాడు" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 12 - 414)
"హేతుసు కర్మసు ఫలసంగ రహితత్వాన్న బద్ధో భవతి కుశలతా".
(హేతువులైన కర్మలందు ఫలసంగరాహిత్యము లేనందున బద్ధుడైనవాడు కుశలుడు కానేరడు - బద్ధుడు గానే యుండును).
(saṃsāramulō nunnavāḍu - jananamaraṇamulu pravāharūpamugā galavāḍu.; jīvuḍu). karmaphalamanubhaviṃpavalasina vāḍu.
na taṃ paśyāmi yasyāhaṃ taṃ na paśyāmi yō mama |
ahamēva parabrahma jagannādhōha mīśvaraḥ |
itisyānniści - kō muktō baddhassyāvanyadhā pumān ||".
(nēnu okkaḍinē; nāku evarū lēru - 'nā' anuvāru evarū lēru - nēnevanivāḍanu kānu - nēnē parabrahmanu, jagannādhuḍanu, īśvaruḍanu, ani yī prakāramu niśca ya buddhi kaligiyuṃḍuṭavalana muktuḍagunu, - aṭlugāni yaḍala baddhuḍagunu).
bōdhō (a)haṃ jñāna khaḍgēna tanniṣkṛtyasukhī bhava ||". (aṣṭāvakragīta - 1 - 14)
(nēnu dēhābhimānamu - dēhamē ātma yanu abhiprāyamu – kaligi yuṃḍuṭa anu pāśamu cēta nīvu kaṭṭabaḍiyunnāvu. ā pāśamunu jñānamanu khaḍgamutō bhēdhiṃci sukhamugā nuṃḍumu).
(vāstavamugā dēhamulō lēnivāḍainanu ajñāni dēhamutō nunnaṭlu dāniki kalugu sukha duḥkhāmula nanubhaviṃcuvāḍu, kalalō kanna dēhamu kalavāḍugā bhāviṃcuvāḍu).
(pūrva janmalalō cēsina karmalakanuguṇamaina phalamunanubhaviṃcuṭaku tagina ī janmalōni dēhamaṃdu jīvuḍu ī dēhamucē baṃdhiṃpabaḍu cunnāḍu - dīniki kāraṇamēmanagā ' nēnu kartanu ' anu ahaṃkāramu kaligiyuṃḍuṭa).
"va. - - - ajñāniyainavāniki, satvarajastamōguṇaṃbulu kaligi yuṃḍuvāniki guṇamayaṃbulaina iṃdriyādule yātma yani tōcucuṃḍunu. kāvuna vāḍā guṇaṃbulacēta baddhuṃḍagunu. ā guṇaṃbulaku sākṣimātraṃbagu śarīraṃbu evvaḍeṟuṃganōpu vāḍā guṇaṃbulacēta baddhuṃḍukāḍu" (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 12 - 414)
"hētusu karmasu phalasaṃga rahitatvānna baddhō bhavati kuśalatā".
(hētuvulaina karmalaṃdu phalasaṃgarāhityamu lēnaṃduna baddhuḍainavāḍu kuśaluḍu kānēraḍu - baddhuḍu gānē yuṃḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.