← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బాధ్య బాధక బావము bādhya bādhaka bāvamu

Original — తెలుగు
  1. వీడు బాధింపబడువాడు, వీడు బాధించువాడు అను భావము.

  2. మేకను చంపెడు స్వభావముగలది సింహము కనుక సింహము బాధకము - బాధనుకలిగించెడిది. సింహముచే చంపబడు స్వభావము గలది కనుక మేక బాధ్యము - చంపబడునది. ఈ రెండింటికీ గల సంబంధము బాధ్య బాధకీ భావము - అంధకారము, సూర్యుడు వలె, అజ్ఞానము. జ్ఞానమువలె.

  3. భగవాన్ బాధ్య బాధక దేవాసుర వర్ణయోః అంతరాత్మతయా తచ్ఛరీరకత్వేన అవస్థితః గుణ కర్మానుగుణ ప్రేర్యమాణ శరీర భూత దేవాసుర వర్గగతః బాధ్య బాధక భావః న ప్రకృతి ద్వయ విలక్షణ తదాత్మ భూత పరమాత్మ గతః - యధా దేహాది గతావస్థానాత్మ గతః తథా ఇతి భావః.

(భగవంతుడు బాధ్య బాధకులైన దేవాసురులు అంతరాత్మగాను, వారి శరీరముగానున్నాడు - త్రిగుణములువలన చేసిన కర్మకు అనుగుణముగా ప్రేరేపింపబడిన శరీరముగల దేవతులను,అసురులను పొందినవాడై భగవంతుడు బాధ్య బాధక భావము పొందుచున్నాడు - ప్రకృతి ద్వయ విలక్షణుడై వాటి ఆత్మ అయిన పరమాత్మగా కాదు - దేహమునుపొందియున్న అంతరాత్మయగుటవలన ఈ బాధ్య బాధక భావము పొందుచున్నాడు).

  1. "వ్యక్తుండుగాక, గుణంబులు లేక, ప్రకృతిం జెందక, భవంబులనొందక,పరమేశ్వరుండు దన మాయవలన నయిన గుణంబులు నావేశించి బాధ్య బాధకం బుల నొందును". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - )

"పూర్వ భవ కర్మాధీనమై ప్రాణులన్

కీడున్ మేలును జెందు, లేడొకడు శిక్షింపంగ రక్షింప - --". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - )

Transliteration
  1. vīḍu bādhiṃpabaḍuvāḍu, vīḍu bādhiṃcuvāḍu anu bhāvamu.

  2. mēkanu caṃpeḍu svabhāvamugaladi siṃhamu kanuka siṃhamu bādhakamu - bādhanukaligiṃceḍidi. siṃhamucē caṃpabaḍu svabhāvamu galadi kanuka mēka bādhyamu - caṃpabaḍunadi. ī reṃḍiṃṭikī gala saṃbaṃdhamu bādhya bādhakī bhāvamu - aṃdhakāramu, sūryuḍu vale, ajñānamu. jñānamuvale.

  3. bhagavān bādhya bādhaka dēvāsura varṇayōḥ aṃtarātmatayā taccharīrakatvēna avasthitaḥ guṇa karmānuguṇa prēryamāṇa śarīra bhūta dēvāsura vargagataḥ bādhya bādhaka bhāvaḥ na prakṛti dvaya vilakṣaṇa tadātma bhūta paramātma gataḥ - yadhā dēhādi gatāvasthānātma gataḥ tathā iti bhāvaḥ.

(bhagavaṃtuḍu bādhya bādhakulaina dēvāsurulu aṃtarātmagānu, vāri śarīramugānunnāḍu - triguṇamuluvalana cēsina karmaku anuguṇamugā prērēpiṃpabaḍina śarīramugala dēvatulanu,asurulanu poṃdinavāḍai bhagavaṃtuḍu bādhya bādhaka bhāvamu poṃducunnāḍu - prakṛti dvaya vilakṣaṇuḍai vāṭi ātma ayina paramātmagā kādu - dēhamunupoṃdiyunna aṃtarātmayaguṭavalana ī bādhya bādhaka bhāvamu poṃducunnāḍu).

  1. "vyaktuṃḍugāka, guṇaṃbulu lēka, prakṛtiṃ jeṃdaka, bhavaṃbulanoṃdaka,paramēśvaruṃḍu dana māyavalana nayina guṇaṃbulu nāvēśiṃci bādhya bādhakaṃ bula noṃdunu". (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - )

"pūrva bhava karmādhīnamai prāṇulan

kīḍun mēlunu jeṃdu, lēḍokaḍu śikṣiṃpaṃga rakṣiṃpa - --". (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.