← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బహిరంగసాధనములు bahiraṃgasādhanamulu

Original — తెలుగు
  1. యస్య సాధనస్య శ్రవణం వా జ్ఞానం వా దృష్ట ప్రయోజనం న భవతి, కింతు, చిత్తశుద్ధి మాత్రం ఫలం. తత్ జ్ఞానస్య బహిరంగ సాధనం.

(ఏ సాధనమువలన శ్రవణముకాని, జ్ఞానముకాని. ప్రత్యక్షముగా ఫలరూపముగా కలుగదో, చిత్తశుద్ధి మాత్రమే కలుగచేయునో అది జ్ఞానమునకు బహిరంగసాధనము).

  1. "యజ్ఞ దాన తప ఆదీన బహిరంగ సాధనాని - యథా ధనుః ల్క్ష్యవేధనే బహిష్టమేవ సత్ బాణ సంథాన ద్వారోపకారకత్వాత్ బహిరంగ సాధనం, ఏవం నిత్యనైమిత్తిక యజ్ఞాదీని శ్రౌత స్మార్త కర్మాణి సగుణోపాసనాదీని చ మల విక్షేపాది దోష నిరాకరణేన చిత్తశుద్ధిం ఐకాగ్ర్యరం చోత్పాద్య జిజ్ఞాసోత్పత్తిద్వారా జ్ఞానీ ఆరాదుపకార కత్వాత్ బహిరంగాని ఇత్యుచ్యతే" (విచారసాగరం)

"అంతరంగసాధన సిద్ధ్యనంతరమేవ బహిరంగ సాధనాని పరిత్యజ్యాని. అన్యథా, వివేకాది సాధన సిద్ధేః పూర్వమేవ నిత్య నైమిత్తిక యజ్ఞాది కర్మ పరిత్యాగే ఉభయ భ్రష్టో అధః పతేత్ ఏవ - యథా అంధకూపే పతితః దుర్బలం తృణాద్యావష్టం భం అవలంబ్య లంబమానః సోద్ధారణాయ ప్రహిత దృఢతర రజ్వలంబనాత్ పూర్వమేవ ప్రాక్తనా వలంబం పరిత్యజన్ అధః పతేత్, తద్వత్" (విచారసాగరం)

(యజ్ఞము, దానము, తపస్సు మొదలగునవి బహిరంగసాధనములు. లక్ష్య వస్తువును - గురిచేసిన వస్తువును - కొట్టుటకు బాణము సంధించుటకు ధనస్సు ఉపయోగపడుటచే అది బహిరంగసాధనము. ఆ ప్రకారముగానే నిత్య నైమిత్తిక కర్మలు యజ్ఞములు మొదలగునవి శ్రౌత కర్మలు (శృతిలో చెప్పబడినవి), స్మార్త కర్మలు (స్మృతులలో చెప్పబడినవి). సగుణ బ్రహ్మోపాసనలు మలము విక్షేపము మొదలగు దోషములు లేకుండునట్లు చేసి చిత్త శుద్ధిని ఐకాగ్ర్యమును (ఒకే వస్తువునందు మనస్సును కేంద్రీకరించుటను) కలుగచేసి జిజ్ఞాస కలిగించుట ద్వారా జ్ఞానమును (బ్రహ్మ జ్ఞానమును) పొందుటకు ఉపచరించుటచేత అవి బహిరంగసాధనములు అని చెప్పబడుచున్నవి).

(అంతరంగసాధనమములు సిద్ధించిన తర్వాతనే బహిరంగసాధనములను విడిచి పెట్టవలెను.అట్లు గాకున్న యడల నిత్యానిత్య వస్తు వివేకము మొదలగు సాధనములు సిద్ధించకమునుపే నిత్య నైమిత్తిక కర్మలను యజ్ఞము మొదలగు వాటిని వదలి వేసినచో ఉభయ భ్రష్టుడై (రెండింటికి చెడినవాడై). అధోగతి చెందును. (క్రిందకు పడిపోవును). (రెండింటిలో నేదియు లేకుండపోవును. చీకటినుయ్యిలో పడినవాడు ఒక గడ్డిపోచను పట్టుకొని వేలాడుచు తాను పైకి వచ్చుటకుగాను అంతకంటె బలమైనదైన త్రాడును పట్టుకొనకముందే గడ్డిపోచను వదలివేసి నూతిలో క్రిందకు పడిపోవును - ఆ ప్రకారముగానే అధః పతనము - ఉభయభ్రష్టత్వము, రెండిటికి చెడుట జరుగును). .

Transliteration
  1. yasya sādhanasya śravaṇaṃ vā jñānaṃ vā dṛṣṭa prayōjanaṃ na bhavati, kiṃtu, cittaśuddhi mātraṃ phalaṃ. tat jñānasya bahiraṃga sādhanaṃ.

(ē sādhanamuvalana śravaṇamukāni, jñānamukāni. pratyakṣamugā phalarūpamugā kalugadō, cittaśuddhi mātramē kalugacēyunō adi jñānamunaku bahiraṃgasādhanamu).

  1. "yajña dāna tapa ādīna bahiraṃga sādhanāni - yathā dhanuḥ lkṣyavēdhanē bahiṣṭamēva sat bāṇa saṃthāna dvārōpakārakatvāt bahiraṃga sādhanaṃ, ēvaṃ nityanaimittika yajñādīni śrauta smārta karmāṇi saguṇōpāsanādīni ca mala vikṣēpādi dōṣa nirākaraṇēna cittaśuddhiṃ aikāgryaraṃ cōtpādya jijñāsōtpattidvārā jñānī ārādupakāra katvāt bahiraṃgāni ityucyatē" (vicārasāgaraṃ)

"aṃtaraṃgasādhana siddhyanaṃtaramēva bahiraṃga sādhanāni parityajyāni. anyathā, vivēkādi sādhana siddhēḥ pūrvamēva nitya naimittika yajñādi karma parityāgē ubhaya bhraṣṭō adhaḥ patēt ēva - yathā aṃdhakūpē patitaḥ durbalaṃ tṛṇādyāvaṣṭaṃ bhaṃ avalaṃbya laṃbamānaḥ sōddhāraṇāya prahita dṛḍhatara rajvalaṃbanāt pūrvamēva prāktanā valaṃbaṃ parityajan adhaḥ patēt, tadvat" (vicārasāgaraṃ)

(yajñamu, dānamu, tapassu modalagunavi bahiraṃgasādhanamulu. lakṣya vastuvunu - guricēsina vastuvunu - koṭṭuṭaku bāṇamu saṃdhiṃcuṭaku dhanassu upayōgapaḍuṭacē adi bahiraṃgasādhanamu. ā prakāramugānē nitya naimittika karmalu yajñamulu modalagunavi śrauta karmalu (śṛtilō ceppabaḍinavi), smārta karmalu (smṛtulalō ceppabaḍinavi). saguṇa brahmōpāsanalu malamu vikṣēpamu modalagu dōṣamulu lēkuṃḍunaṭlu cēsi citta śuddhini aikāgryamunu (okē vastuvunaṃdu manassunu kēṃdrīkariṃcuṭanu) kalugacēsi jijñāsa kaligiṃcuṭa dvārā jñānamunu (brahma jñānamunu) poṃduṭaku upacariṃcuṭacēta avi bahiraṃgasādhanamulu ani ceppabaḍucunnavi).

(aṃtaraṃgasādhanamamulu siddhiṃcina tarvātanē bahiraṃgasādhanamulanu viḍici peṭṭavalenu.aṭlu gākunna yaḍala nityānitya vastu vivēkamu modalagu sādhanamulu siddhiṃcakamunupē nitya naimittika karmalanu yajñamu modalagu vāṭini vadali vēsinacō ubhaya bhraṣṭuḍai (reṃḍiṃṭiki ceḍinavāḍai). adhōgati ceṃdunu. (kriṃdaku paḍipōvunu). (reṃḍiṃṭilō nēdiyu lēkuṃḍapōvunu. cīkaṭinuyyilō paḍinavāḍu oka gaḍḍipōcanu paṭṭukoni vēlāḍucu tānu paiki vaccuṭakugānu aṃtakaṃṭe balamainadaina trāḍunu paṭṭukonakamuṃdē gaḍḍipōcanu vadalivēsi nūtilō kriṃdaku paḍipōvunu - ā prakāramugānē adhaḥ patanamu - ubhayabhraṣṭatvamu, reṃḍiṭiki ceḍuṭa jarugunu). .

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.