← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భాగత్యాగలక్షణ bhāgatyāgalakṣaṇa

Original — తెలుగు
  1. పదస్య వాచ్యార్థే అంశమేవకం విహాయ అంశాంతరగ్రహణం భాగత్యాగలక్షణా. స ఏవ జహద జహల్లక్షణా.

(ఒక పదముయొక్క వాచ్యార్థమందు ఒక భాగము విడిచిపెట్టి, రెండవ భాగము తీసుకొనుట, ఒకభాగము తీసుకొని, ఇంకొక భాగము వదలివేయుట భాగత్యాగలక్షణము - దీనినే జహదజవల్లక్షణ యనికూడ చెప్పుదురు). “తత్వమసి” (ఆ పరబ్రహ్మ నీవే) అను మహావాక్యములో తత్ అనగా ‘అది’ (పరబ్రహ్మ), ‘త్వం’ అనగా ‘నీవు’ - జీవాత్మ. అసి = అయితిని. పరబ్రహ్మలోను చైతన్యమున్నది, జీవాత్మలోను చైతన్యమున్నది. కాని మిగిలిన లక్షణములు ఇద్దరికి విరోధ లక్షణములు - పరబ్రహ్మ సర్వజ్ఞుడు, జీవుడు కించిత్ జ్ఞుడు, ఉపాధులుకూడ వేరు - పరబ్రహ్మకు ఉపాధి మాయ. జీవాత్మకు ఉపాధి అవిద్య - ఈ విరుద్ధలక్షణములను వదలివేసి ఇద్దరికి యున్న చైతన్య లక్షణమే తీసుకొని ఆ పరబ్రహ్మమే ఈ జీవాత్మ అని చెప్పబడినది. ఇట్లు ఒక లక్షణము విడిచిపెట్టి మిగిలిన లక్షణము తీసుకొనుట భాగత్యాగ లక్షణము - ఒకభాగమును విడిచి, రెండవదానిని తీసుకొనుట - దీనినే జహదజహల్లక్షణ యని యందురు).

  1. పదద్వయ వాచ్యార్థాం తర్భూత దేశకాలాత్మక వాచ్యాంశం విహాయ వస్తుమాత్రే పదద్వయస్య భాగత్యాగలక్షణా -

(“సోయం దేవ దత్తం” (ఆ దేవదత్తుడే ఇతను) అను వాక్యములో ‘ఆ’ అనగా జరిగిపోయినకాలమునాటివాడు అయిన దేవదత్తుడు లేక, అక్కడ ఎక్కడో ఇదివరకు ఉన్న దేవదత్తుడే ఇప్పుడిక్కడ యున్న దేవదత్తుడు - ఈ వాక్యములోని కాలము - అప్పుడు, ఇప్పుడు అనునది - అక్కడ ఇక్కడ అను దేశము - ఈ రెండు అంశలు విడిచిపెట్ట్టి ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు - రెండువ్యక్తులు ఓకే దేవదత్తుడు - అతనే ఈతను అనుట - మనిషి ఒకడే - దేశకాలములలో చూచుట వేరయినను - వాటిని వదలివేసి దేవదాస్తు వ్యక్తిత్వమే తీసుకొనుట - జగదజగల్లక్షణ - భాగత్యాగలక్షణ). ఇట్లే పరబ్రహ్మకు జీవాత్మకు లక్షణములు వేరుగానున్న - పరబ్రహ్మ సర్వజ్ఞుడు - జీవాత్మ కించిత్ జ్ఞుడు - మొదలగునవి ఇటువంటివాటిని - ఇద్దరకు గల పరస్పర విరోధలక్షణములను వదలివేసి, ఇద్దరికి సమానలక్షణమైన చైతన్యము తీసుకొని ఇద్దరు ఒకటే - ఆ పరబ్రహ్మమే ఈ జీవాత్మ యని చెప్పుట భాగత్యాగలక్షణ).

  1. “సర్వమహావాక్యేషు ద్వయోః ద్యయోః పదయోః వాచ్యభూత జీవేశ్వరయోః సర్వజ్ఞత్వకించిత్ జ్ఞత్వాది ధర్మవిశిష్ఠోపాది రూప విరుద్ధ వాచ్యాంశం విహాయ అవిరుధ్ధ చేతనాంశో గ్రాహ్యః తత్ర సర్వజ్ఞత్వ కించిత్ జ్ఞత్వాది ధర్మ విశిష్ట మాయావిద్యయోః చైతన్యేవ సహ అధిష్ఠానత్వ సంబంధః అస్తి చైతన్యస్య స్వేన తాదాత్మ్య సంబంధో అస్తి ఏతేషాం సర్వేషాం వాచ్యానాం చైతన్యాంశేనసహ అధిష్ఠానత్వ తాదాత్మ్యసంబంధో యః సా లక్షణా. విరోధి భూత వాచ్యాంశం విహాయ అవిరోధి భూతచతనాంశః గృహ్యతే తస్మాదియం భాగత్యాగలక్షణా ఇతి ఉచ్యతే”.

(మహావాక్యములన్నింటిలోను జీవేశ్వరులకు వాచ్యభూతములైన రెండు రెండు పదములలోని సర్వజ్ఞత్వము, కించిత్ జ్ఞత్వము మొదలగు ధర్మవిరుద్ధములైన ధర్మములుగల - ఉపాధి విరుద్ధములుగల వాచ్యములను అంశను విడిచిపెట్టి - ఒకదాని లక్షణమునకు రెండవదాని లక్షణమునకు విరోధములేని అంశను గ్రహించవలెను - సర్వజ్ఞత్వము, కించిత్ జ్ఞత్వము మొదలగు ధర్మములతోకూడిన మాయా అవిద్యలకు అధిష్ఠానమైన చైతన్యముతో సంబంధమున్నది. పరబ్రహ్మలోను, జీవాత్మలోను చైతన్యమున్నది, కాని పరబ్రహ్మ మాయను అధిష్టించియున్నాడు, జీవాత్మ అవిద్యను అధిష్టించియున్నాడు - రెండింటిలోను చైతన్యమే యున్నప్పటికీ అధిష్ఠాన సంబంధమువేరు - అందుచేత ఒకదానిని - విరుద్ధధర్మములను విడిచిపెట్టి, రెండవదానిని - చైతన్యమునే గ్రహించుట భాగత్యాగలక్షణము - ఒక భాగమును విడిచిపెట్టి రెండవదానిని గ్రహించుట).

Transliteration
  1. padasya vācyārthē aṃśamēvakaṃ vihāya aṃśāṃtaragrahaṇaṃ bhāgatyāgalakṣaṇā. sa ēva jahada jahallakṣaṇā.

(oka padamuyokka vācyārthamaṃdu oka bhāgamu viḍicipeṭṭi, reṃḍava bhāgamu tīsukonuṭa, okabhāgamu tīsukoni, iṃkoka bhāgamu vadalivēyuṭa bhāgatyāgalakṣaṇamu - dīninē jahadajavallakṣaṇa yanikūḍa ceppuduru). “tatvamasi” (ā parabrahma nīvē) anu mahāvākyamulō tat anagā ‘adi’ (parabrahma), ‘tvaṃ’ anagā ‘nīvu’ - jīvātma. asi = ayitini. parabrahmalōnu caitanyamunnadi, jīvātmalōnu caitanyamunnadi. kāni migilina lakṣaṇamulu iddariki virōdha lakṣaṇamulu - parabrahma sarvajñuḍu, jīvuḍu kiṃcit jñuḍu, upādhulukūḍa vēru - parabrahmaku upādhi māya. jīvātmaku upādhi avidya - ī viruddhalakṣaṇamulanu vadalivēsi iddariki yunna caitanya lakṣaṇamē tīsukoni ā parabrahmamē ī jīvātma ani ceppabaḍinadi. iṭlu oka lakṣaṇamu viḍicipeṭṭi migilina lakṣaṇamu tīsukonuṭa bhāgatyāga lakṣaṇamu - okabhāgamunu viḍici, reṃḍavadānini tīsukonuṭa - dīninē jahadajahallakṣaṇa yani yaṃduru).

  1. padadvaya vācyārthāṃ tarbhūta dēśakālātmaka vācyāṃśaṃ vihāya vastumātrē padadvayasya bhāgatyāgalakṣaṇā -

(“sōyaṃ dēva dattaṃ” (ā dēvadattuḍē itanu) anu vākyamulō ‘ā’ anagā jarigipōyinakālamunāṭivāḍu ayina dēvadattuḍu lēka, akkaḍa ekkaḍō idivaraku unna dēvadattuḍē ippuḍikkaḍa yunna dēvadattuḍu - ī vākyamulōni kālamu - appuḍu, ippuḍu anunadi - akkaḍa ikkaḍa anu dēśamu - ī reṃḍu aṃśalu viḍicipeṭṭṭi ā dēvadattuḍu ī dēvadattuḍu - reṃḍuvyaktulu ōkē dēvadattuḍu - atanē ītanu anuṭa - maniṣi okaḍē - dēśakālamulalō cūcuṭa vērayinanu - vāṭini vadalivēsi dēvadāstu vyaktitvamē tīsukonuṭa - jagadajagallakṣaṇa - bhāgatyāgalakṣaṇa). iṭlē parabrahmaku jīvātmaku lakṣaṇamulu vērugānunna - parabrahma sarvajñuḍu - jīvātma kiṃcit jñuḍu - modalagunavi iṭuvaṃṭivāṭini - iddaraku gala paraspara virōdhalakṣaṇamulanu vadalivēsi, iddariki samānalakṣaṇamaina caitanyamu tīsukoni iddaru okaṭē - ā parabrahmamē ī jīvātma yani ceppuṭa bhāgatyāgalakṣaṇa).

  1. “sarvamahāvākyēṣu dvayōḥ dyayōḥ padayōḥ vācyabhūta jīvēśvarayōḥ sarvajñatvakiṃcit jñatvādi dharmaviśiṣṭhōpādi rūpa viruddha vācyāṃśaṃ vihāya avirudhdha cētanāṃśō grāhyaḥ tatra sarvajñatva kiṃcit jñatvādi dharma viśiṣṭa māyāvidyayōḥ caitanyēva saha adhiṣṭhānatva saṃbaṃdhaḥ asti caitanyasya svēna tādātmya saṃbaṃdhō asti ētēṣāṃ sarvēṣāṃ vācyānāṃ caitanyāṃśēnasaha adhiṣṭhānatva tādātmyasaṃbaṃdhō yaḥ sā lakṣaṇā. virōdhi bhūta vācyāṃśaṃ vihāya avirōdhi bhūtacatanāṃśaḥ gṛhyatē tasmādiyaṃ bhāgatyāgalakṣaṇā iti ucyatē”.

(mahāvākyamulanniṃṭilōnu jīvēśvarulaku vācyabhūtamulaina reṃḍu reṃḍu padamulalōni sarvajñatvamu, kiṃcit jñatvamu modalagu dharmaviruddhamulaina dharmamulugala - upādhi viruddhamulugala vācyamulanu aṃśanu viḍicipeṭṭi - okadāni lakṣaṇamunaku reṃḍavadāni lakṣaṇamunaku virōdhamulēni aṃśanu grahiṃcavalenu - sarvajñatvamu, kiṃcit jñatvamu modalagu dharmamulatōkūḍina māyā avidyalaku adhiṣṭhānamaina caitanyamutō saṃbaṃdhamunnadi. parabrahmalōnu, jīvātmalōnu caitanyamunnadi, kāni parabrahma māyanu adhiṣṭiṃciyunnāḍu, jīvātma avidyanu adhiṣṭiṃciyunnāḍu - reṃḍiṃṭilōnu caitanyamē yunnappaṭikī adhiṣṭhāna saṃbaṃdhamuvēru - aṃducēta okadānini - viruddhadharmamulanu viḍicipeṭṭi, reṃḍavadānini - caitanyamunē grahiṃcuṭa bhāgatyāgalakṣaṇamu - oka bhāgamunu viḍicipeṭṭi reṃḍavadānini grahiṃcuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.