← Back to భ · Booklets 31–40 (digitized file 4)

భగవచ్ఛరీరము bhagavaccharīramu

Original — తెలుగు
  1. భగవంతుడు అజుడు - జన్మలేనివాడు. జన్మలేనిదే శరీరముండదు -

"మోక్ష ధర్మోక్త రీత్యాపి వస్తుతోహం నిరాకృతిః |

యస్యా విద్యాది సంబంధో జన్మ తస్యైవ యుజ్యతే |

నిరవద్య స్య కథం భూతమయం వపుః |

తదైవోక్తం పురాణేపి బ్రహ్మండాఖ్యే మహర్షిణా |

స్త్రీ పుం మలాను సంగాత్మా దేహో నాస్య విజాయతే |

కింతు నిర్దోష చైతన్యం సుఖనిత్యాం స్వికాంతమం |

ప్రకాశయతి సైవేయం జనివిష్ణో న చాపరా |

నిత్యో యః కారణోపాధిః మాయాభ్యో నైక శక్తిమాన్ |

స ఏవ భగవద్దేహః ఇతి భాష్యకృతాం మతం |

అన్యేత్వాహుః నచైవాస్తి దేహ దేహి భిధా హరౌ |

కిం త్వఖండ చిదానందఘనో యో విభురద్యయః |

నిర్గుణో నిత్య పూర్ణాత్మా నిగ్రహో(అ)స్య స ఏవహి |

భౌతికో మాయికో నాన్యో నాస్తి దేహో హరేర్విభోః |

అతః అహ స్వయం విష్ణు రజ ఇత్యాదికా గిరః |

ఆకాశవత్సర్వగతో నిత్య ఇత్యాది వేదతః |

ప్రకృతింస్వాం చిదానందస్వభావం ప్రకృతేః పరం |

సర్వదైకరసం నిత్యం స్వేమిహిమ్ని ప్రతిష్టితం |

స్వస్వరూపమధిష్టాయ స్వస్వరూపే హ్యవస్థితః |

దేహనద్విరామీశో దేహి దేహ భిదోఙ్ఙితః ||". (గీతాభావప్రకాశము - 4 - 38 to 49)

(మోక్ష ధర్మములో చెప్పిన ప్రకారముగా నేను (భగవంతుడనువాడను) వాస్తవముగా ఆకారము లేనివాడను; ఆకారములేదు కనుక శరీరములేనివాడను. అవిద్య - ప్రకృతి - మొదలగువాటి సంబంధము కలిగినవాటికే జన్మ కలుగును. అవిద్యతో - ప్రకృతితో - సంబంధములేని నాకు పంచభూతముల సమ్మేళనవలనకలుగు శరీరమెట్లు కలుగును? వ్యాస మహర్షి వ్రాసిన బ్రహ్మాండ పురాణములోకూడ నిట్లే చెప్పబడియున్నది. స్త్రీ పురుషుల మలాను సంగమువలన కలుగు దేహము ఇతనికి కలుగదు - ఏ విధమైన దోషము లేని శుద్ధ చైతన్యము, నిత్య సుఖరూపము - మోక్షరూపము - అయినదే తన్నుతానే - తన స్వరూపమును తానే - ప్రకాశింప చేయును. (అతి సూక్ష్మముగానున్నందున కంటికి కానరానిదైన వస్తువు కంటికి కనబడినట్లగును. ఇదియే శ్రీమహావిష్ణువు యొక్క జన్మ - అవతారము - అని చెప్పబడినది. మాయ యని చెప్పబడు కారణోపాధి (అన్నింటికి కారణమగు మాయా ప్రకృతి) - భగవంతునికి ఉపాధి. అనేక శక్తులుగలదియే (ప్రకృతియే) భగవంతుని శరీరము. భగవంతుడు సృష్టి చేయగోరి, తాను సృష్టించ తలచుకొనిన వస్తువులకు ఉపాదానకారణముగా ప్రకృతి యను తన శక్తిని మొదట సృజించెను. (" ప్రథమం కృతం ఇతి ప్రకృతిః" - మొట్టమొదట సృష్టి చేయబడినది కనుక ప్రకృతి యని చెప్పబడినది. ఆ ప్రకృతి జడమగుటవలన భగవంతుడు తన చిచ్ఛక్తితో - చైతన్యముతో ఆ ప్రకృతితో కలియుటవలన దానిలోనుండి ప్రపంచకములోని వస్తువులన్నియు ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవి. భగవంతుడు ప్రకృతిలో ప్రవేశించుటవలన అది అతనికి పురము - నివాస స్థలము - పురములోనుండువాడు కనుక (పురిశయనాత్ పురుషః) పురుషుడు అని చెప్పబడుచున్నాడు. ప్రకృతిలోనుండి ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టిన వస్తువులన్నింటిలోను ప్రకృతి అంశ, పురుషుని అంశ (భగవంతుని అంశ - చిచ్ఛక్తి), రెండునున్నవి. అట్లు సృష్టి ప్రారంభములో ప్రకృతిలో కలిసిన పురుషునకు ప్రకృతి శరీరము - అట్లే ప్రకృతి అనేక రూపములుగా మారినప్పుడు, ఆ రూపములన్నియు శరీరములు, అందులోనున్న భగవంతుని అంశ పురుషుడు - మొదటి పురుషుడు పురుషోత్తముడు. ఈ శరీరములు వాటిలోనున్న పురుషునకు ఉపాధులు - దీనిని బట్టి భగవంతునికి ప్రకృతియే, లేక, దాని వికారములే - రూపములే - శరీరము. భాష్యకారులు కూడ భగవంతుని శరీరము ఇట్టిదనియే అభిప్రాయపడుచున్నారు. కొందఱు భగవంతునికి దేహి దేహ భేదము లేదని చెప్పిరి - అనగా, భగవంతుడు వేరు, అతని శరీరము వేరు అని లేదు - అని చెప్పిరి. (సచ్చత్యచ్చ అభవత్). భగవంతుడు అఖండచిదా నందుడు, అంతములేని చైతన్యము (చైతన్య ఘనము). అందుచే సృష్టిలో ఎన్ని వస్తువులుగా భగవంతుడు మారినను తరగని చైతన్యశక్తి గలవాడు. శత్వ రజస్తమో గుణములు, వాటిప్రభావము లేనివాడు - ఈ త్రిగుణములవలననే శరీరముకలుగుచున్నది. ఈ త్రిగుణములు ప్రకృతి గుణములు - అందుచేత ప్రకృతితో కలిసినంతనే శరీరము కలుగును - భగవంతుడు త్రిగుణములకు అతీతుడు. అందుచేత అతనికి ప్రాకృత శరీరము కలుగుటకు అవకాశము లేదు. అతనిని నిగ్రహించువాడు లేడు. అందుచేత మాయ (ప్రకృతి) వలనకలుగు పాంచభౌతిక మైన శరీరము అతనికిలేదు. అందుచేతనే వేదములు అతనిని ' అజుడు ' అని ("న జాయతే ఇత్యజః" = పుట్టుక లేనివాడు) చెప్పినవి. భగవంతుడు నిత్యుడు (సర్వకాలములందుండువాడు) అనికూడ చెప్పినవి. శరీరము పంచభూతమయ మగుటచేతను, పంచభూతములు క్షీణించి నశించునవే యగుటచేతను, భగవంతుడట్లు నశించక ఎల్లకాలము లందుండువాడగుట చేతను, అతనికి పాంచభౌతిక మైన శరీరము లేదు - భగవంతుడు మాయకు అతీతుడు - మాయను తన స్వాధీనములోనుంచుకొనినవాడుకనుక మాయాసంబంధమైన శరీరము లేదు. భగవంతుడు ఎప్పుడూ ఒకే రసము - చైతన్య శక్తి - గలవాడు, మార్పులు కలిగినవాడు కాడు - శరీరము కలిగిన దగ్గరనుండి అనేక మార్పులు గలదగును. అందుచేత దేహము గలవాడుగ విహరించుచున్నాడుగాని అతనికి శరీరమునునది లేదు).

  1. ద్వివిధస్యాస్య ధర్మస్య వేదప్రామాణికస్య చ |

స్వర్గమోక్ష నిమిత్తస్య ప్రాణినాం హి యదా యదా |

క్షతిర్భవత్య ధర్మాం శైః స్వర్గమోక్ష విరోధిభిః |

శ్రుతి స్మృతి నిషద్ధస్య ధర్మస్యానర్థ కారిణః |

ఉద్భవోధర్మ శత్రోశ్చ భవతీహ యదా యదా |

తదా తదాత్మానం నిత్య సిద్ధం స్వమాయయా |

దర్శయామి సృష్టమివ చిద్ఘనం పరమార్థతః ||". (గీతాభావప్రకాశము - 4 - 51 to 54)

(ప్రాణుల మోక్షమునకు, స్వర్గమునకు కారణమైనటువంటిన్నీ, ఇందుకు వేదమే ప్రమాణముగా గలదిన్నీ, అయిన రెండు విధములగు ధర్మము - ప్రవృత్తి ధర్మము, నివృత్తిధర్మము - స్వర్గమోక్షములకు విరోధి అయినటువంటిన్నీ, శ్రుతులలోను, స్మృతులలోను (చేయకూడదని) నిషేధించబడినదిన్నీ, అయిన అధర్మము, ఎప్పుడు ఎప్పుడు ఉద్భవించునో అప్పుడు నిత్యసిద్ధుడనైన నేను (ఎక్కడైనను, ఎప్పుడైనను సిద్ధముగా నున్నటువంటి నేను) ప్రతి వస్తువులోను, ప్రతిచోట, అన్ని కాలములందునుండు భగవంతుడనైన నేను, సాధారణముగా కంటికికనబడని వాడనైన నేను, నా మాయచేత సృష్టింపబడినవానివలె, సాధారణ జన్మ కలవాడువలె కనబడుదును. అంతియేకాని నిజముగా పాంచభౌతిక శరీరముతో పుట్టినవాడనుకాను - నా అవతారములలోని నా శరీరమిట్టిదే).

"యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం |

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం |

ధర్మసంస్థాప నార్థాయ సంభవామి యుగే యుగే ||". (శ్రీమద్భగవద్గీత - 4 - 7, 8). (చూడుము - అవతారములు)

(అవతారకాలమందలి పరిస్థితులను బట్టి ఏ రూపమైనను - ఏ శరీరమైనను (చేప, తాబేలు, పంది, నరసిమ్హము, వామనము, మొదలగు శరీరములను) ధరించుదును. అవన్నియు మాయా శరీరములే, ప్రాకృత శరీరములుకావు).

  1. భగవంతుడు సృష్టి చేయు తలంపుతో బ్రహ్మాండమును సృష్టించి భేదించెను.

"క. భువనాత్మకుడా యీశుడు

భవనాకృతి తోడనుండు బ్రహ్మాండంబున్

వివరముతో పదునాలుగు

వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్

మ. - - -

- - - విద్వాంసులూహించి త

ద్బహు రూపావయవంబులన్ భువన సంపత్తిన్ విచారింతురు.

- - -" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 87, 88)

"శ్లో||. అండకోశే శరీరే (అ)స్మిన్ సప్తావరణ సం యుతే |

వైరాజః పురుషో యో(అ)సౌ భగవాన్ ధారణాశ్రయః |

పాతాళమే తస్య హి పాదమూలం పఠంతి పార్షి ప్రసదే రసాతలం |

మహాతలం విశ్వ సృజో(అ)ధ గుల్భౌతలా తలాతలం వై పురుషస్య జంఘే |

ద్వేజానునీ సుతలం విశ్వమూర్తే రూరు ద్వయం వితలం చా తలంచ |

మహీతలం తజ్జఘనం, మహీపతే, నభస్థలం నాభి సరో ఘృణంతి |

ఉరస్థలం జ్యోతిరనీకమస్య గ్రీవా మహర్వదనం వై జనో(అ)స్య |

తపో లలాటం విదురాది పుంసః సత్యం తు శీర్షాణి సహస్ర శీర్ష్ణః.” (శ్రీమద్భాగవతం - 2 - 1 - 25 to 28)

  1. భగవంతుడు ప్రకృతి సం యోగమువలన సృష్టిలోని వస్తువులన్నియు, ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవనియు, ఆ వస్తువులన్నింటిలో భగవంతుడు తన చిచ్ఛక్తి (చైతన్యశక్తి) తో నుండుటవలన ఆ వస్తువులన్నియు అతనికి శరీరములనియు (ఉపాధులు) పైన చెప్పబడినది. ఆ వస్తువులన్నియు కలిసి వేఱు వేఱు లోకములుగా నుండుటవలన భగవంతునకు వేఱు వేఱు శరీరములున్నవనియు కూడ చెప్పబడినది. మానవ శరీరములో ఎముకలు, రక్తము, మాంసము, అవయవములుండగా వాటి అన్నింటిపైన కప్పుగా అన్నింటిని ఆవరించి చర్మముకలిగి అవన్నియు ఒక పురముగా నున్నట్లు భగవంతుడు సృష్టిచేసిన వస్తువులన్నియు వేఱు వేఱు పురములైనను వాటి అన్నింటిని వేఱు వేఱు లోకములుగా విభజించి, వాటి అన్నింటిని కలిపి కప్పిపుచ్చు ఆవరణములు వాతన్నింటిని ఒక పెద్ద (బ్రహ్మాండమైన) వస్తువుగా చేసినది. ఆ పెద్ద వస్తువే ప్రపంచము - (ప్రపంచములోనున్న వస్తువులన్నికలిసి ప్రపంచమైనది - ప్రపంచములో లేని వస్తువు వేరే లేదు). ఆ ప్రపంచమంతటిలోను - దానిలోని ప్రతివస్తువులోను భగవంతుడున్నాడుకనుక - ఆ ప్రపంచమే అతనికి శరీరము. అట్టి శరీరమే విశ్వము - అదికలవాడు - విశ్వ శరీరము కలవాడు కనుక భగవంతుడు విశ్వుడు అని చెప్పబడుచున్నాడు - " విశ్వం విష్ణుర్వష్కాపిరో " అని విష్ణుసహస్రనామములు, "విశ్వం నారాయణం దేవం" అని మంత్రపుష్పము చెప్పుచున్నవి. "సర్వ శరీరకతయా విశ్వరూపశబ్దితాం " (అన్ని శరీరములు తానే అయి యుండుటవలన విశ్వరూపుడు అని చెప్పబడున్నాడు)

  2. ఈ విశ్వరూపములోని వస్తువులన్నియు లోకములుగా అగుటవలన భగవంతుడు లోకమయుడు అని చెప్పబడెను - ఆ లోకములన్నియు భగవంతుని విశ్వశరీరములోని అవయవములుగా విద్వాంసు లూహించిరి - (చూడుము -3).

"చతుర్దశ లోకంబులందు మీది ఏడు లోకంబులు శ్రీమహావిష్ణువునకుం గటి ప్రదేశంబున నుండి యూర్థ్వదేహమనియు, క్రింది యేడు లోకంబులు జఘనంబుననుండి యధోదేహమనియును బలుకుదురు. - - - - భూలోకంబు కటి పర్యంత ప్రదేశంబు, భువర్లోకంబు నాభి, సువర్లోకంబు హృదయంబు, మహర్లోకంబు వక్షంబు, జనలోకంబు గ్రీవంబు, తపోలోకంబు స్తనద్వయంబు, సనాతంబును బ్రహ్మనివాసంబును నైన సత్యలోకంబు శిరంబు, గటి ప్రదేశంబతలంబు, తొడలు వితలంబు, జానువులు సుతలంబు, జంఘలు దలాతలంబు, గుల్ఫంబులు మహాతలంబు, పాదాగ్రంబులు రసాతలంబు, పాదతలంబు పాతాళంబునని లోకమయుంగా భావింతురు".

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 87 to 89).

  1. "అట్టి బ్రహ్మాండంబు శ్రీమన్నారాయణుని స్థూల శరీరమగుటంజేసి బ్రహ్మాండంబెవ్వరు వర్ణింతురు, ఎవ్వరు విందురు వారలకు సకల శ్రేయస్సులుం గలుగును - - - భూద్వీపవర్షసలిదద్రి నభస్సముద్ర పాతాళాది దిఙ్నరక తారాగణలోక సంస్థితంబయి సకల జీవ నికాయ్యంబై యద్భుతంబైన శ్రీహరి స్థూలశరీరంబు వినిపించితిని -". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - ).

  2. "మ. అమరశ్రేణికి నెల్ల జక్రి ముఖరుండా చక్రి ధర్మంబునం

దమరున్; గోవులు,భూమిదేవులు, దితిక్షామ్నాయ కారుణ్య స

త్యములున్, యాగ తపో దమంబులును, శ్రద్ధాశాంతులున్ విష్ణుదే

హములు - - - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ,భా. 168)

Transliteration
  1. bhagavaṃtuḍu ajuḍu - janmalēnivāḍu. janmalēnidē śarīramuṃḍadu -

"mōkṣa dharmōkta rītyāpi vastutōhaṃ nirākṛtiḥ |

yasyā vidyādi saṃbaṃdhō janma tasyaiva yujyatē |

niravadya sya kathaṃ bhūtamayaṃ vapuḥ |

tadaivōktaṃ purāṇēpi brahmaṃḍākhyē maharṣiṇā |

strī puṃ malānu saṃgātmā dēhō nāsya vijāyatē |

kiṃtu nirdōṣa caitanyaṃ sukhanityāṃ svikāṃtamaṃ |

prakāśayati saivēyaṃ janiviṣṇō na cāparā |

nityō yaḥ kāraṇōpādhiḥ māyābhyō naika śaktimān |

sa ēva bhagavaddēhaḥ iti bhāṣyakṛtāṃ mataṃ |

anyētvāhuḥ nacaivāsti dēha dēhi bhidhā harau |

kiṃ tvakhaṃḍa cidānaṃdaghanō yō vibhuradyayaḥ |

nirguṇō nitya pūrṇātmā nigrahō(a)sya sa ēvahi |

bhautikō māyikō nānyō nāsti dēhō harērvibhōḥ |

ataḥ aha svayaṃ viṣṇu raja ityādikā giraḥ |

ākāśavatsarvagatō nitya ityādi vēdataḥ |

prakṛtiṃsvāṃ cidānaṃdasvabhāvaṃ prakṛtēḥ paraṃ |

sarvadaikarasaṃ nityaṃ svēmihimni pratiṣṭitaṃ |

svasvarūpamadhiṣṭāya svasvarūpē hyavasthitaḥ |

dēhanadvirāmīśō dēhi dēha bhidōṅṅitaḥ ||". (gītābhāvaprakāśamu - 4 - 38 to 49)

(mōkṣa dharmamulō ceppina prakāramugā nēnu (bhagavaṃtuḍanuvāḍanu) vāstavamugā ākāramu lēnivāḍanu; ākāramulēdu kanuka śarīramulēnivāḍanu. avidya - prakṛti - modalaguvāṭi saṃbaṃdhamu kaliginavāṭikē janma kalugunu. avidyatō - prakṛtitō - saṃbaṃdhamulēni nāku paṃcabhūtamula sammēḷanavalanakalugu śarīrameṭlu kalugunu? vyāsa maharṣi vrāsina brahmāṃḍa purāṇamulōkūḍa niṭlē ceppabaḍiyunnadi. strī puruṣula malānu saṃgamuvalana kalugu dēhamu itaniki kalugadu - ē vidhamaina dōṣamu lēni śuddha caitanyamu, nitya sukharūpamu - mōkṣarūpamu - ayinadē tannutānē - tana svarūpamunu tānē - prakāśiṃpa cēyunu. (ati sūkṣmamugānunnaṃduna kaṃṭiki kānarānidaina vastuvu kaṃṭiki kanabaḍinaṭlagunu. idiyē śrīmahāviṣṇuvu yokka janma - avatāramu - ani ceppabaḍinadi. māya yani ceppabaḍu kāraṇōpādhi (anniṃṭiki kāraṇamagu māyā prakṛti) - bhagavaṃtuniki upādhi. anēka śaktulugaladiyē (prakṛtiyē) bhagavaṃtuni śarīramu. bhagavaṃtuḍu sṛṣṭi cēyagōri, tānu sṛṣṭiṃca talacukonina vastuvulaku upādānakāraṇamugā prakṛti yanu tana śaktini modaṭa sṛjiṃcenu. (" prathamaṃ kṛtaṃ iti prakṛtiḥ" - moṭṭamodaṭa sṛṣṭi cēyabaḍinadi kanuka prakṛti yani ceppabaḍinadi. ā prakṛti jaḍamaguṭavalana bhagavaṃtuḍu tana cicchaktitō - caitanyamutō ā prakṛtitō kaliyuṭavalana dānilōnuṃḍi prapaṃcakamulōni vastuvulanniyu okadānilōnuṃḍi okaṭigā puṭṭinavi. bhagavaṃtuḍu prakṛtilō pravēśiṃcuṭavalana adi ataniki puramu - nivāsa sthalamu - puramulōnuṃḍuvāḍu kanuka (puriśayanāt puruṣaḥ) puruṣuḍu ani ceppabaḍucunnāḍu. prakṛtilōnuṃḍi okadānilōnuṃḍi okaṭigā puṭṭina vastuvulanniṃṭilōnu prakṛti aṃśa, puruṣuni aṃśa (bhagavaṃtuni aṃśa - cicchakti), reṃḍununnavi. aṭlu sṛṣṭi prāraṃbhamulō prakṛtilō kalisina puruṣunaku prakṛti śarīramu - aṭlē prakṛti anēka rūpamulugā mārinappuḍu, ā rūpamulanniyu śarīramulu, aṃdulōnunna bhagavaṃtuni aṃśa puruṣuḍu - modaṭi puruṣuḍu puruṣōttamuḍu. ī śarīramulu vāṭilōnunna puruṣunaku upādhulu - dīnini baṭṭi bhagavaṃtuniki prakṛtiyē, lēka, dāni vikāramulē - rūpamulē - śarīramu. bhāṣyakārulu kūḍa bhagavaṃtuni śarīramu iṭṭidaniyē abhiprāyapaḍucunnāru. koṃdaṟu bhagavaṃtuniki dēhi dēha bhēdamu lēdani ceppiri - anagā, bhagavaṃtuḍu vēru, atani śarīramu vēru ani lēdu - ani ceppiri. (saccatyacca abhavat). bhagavaṃtuḍu akhaṃḍacidā naṃduḍu, aṃtamulēni caitanyamu (caitanya ghanamu). aṃducē sṛṣṭilō enni vastuvulugā bhagavaṃtuḍu mārinanu taragani caitanyaśakti galavāḍu. śatva rajastamō guṇamulu, vāṭiprabhāvamu lēnivāḍu - ī triguṇamulavalananē śarīramukalugucunnadi. ī triguṇamulu prakṛti guṇamulu - aṃducēta prakṛtitō kalisinaṃtanē śarīramu kalugunu - bhagavaṃtuḍu triguṇamulaku atītuḍu. aṃducēta ataniki prākṛta śarīramu kaluguṭaku avakāśamu lēdu. atanini nigrahiṃcuvāḍu lēḍu. aṃducēta māya (prakṛti) valanakalugu pāṃcabhautika maina śarīramu atanikilēdu. aṃducētanē vēdamulu atanini ' ajuḍu ' ani ("na jāyatē ityajaḥ" = puṭṭuka lēnivāḍu) ceppinavi. bhagavaṃtuḍu nityuḍu (sarvakālamulaṃduṃḍuvāḍu) anikūḍa ceppinavi. śarīramu paṃcabhūtamaya maguṭacētanu, paṃcabhūtamulu kṣīṇiṃci naśiṃcunavē yaguṭacētanu, bhagavaṃtuḍaṭlu naśiṃcaka ellakālamu laṃduṃḍuvāḍaguṭa cētanu, ataniki pāṃcabhautika maina śarīramu lēdu - bhagavaṃtuḍu māyaku atītuḍu - māyanu tana svādhīnamulōnuṃcukoninavāḍukanuka māyāsaṃbaṃdhamaina śarīramu lēdu. bhagavaṃtuḍu eppuḍū okē rasamu - caitanya śakti - galavāḍu, mārpulu kaliginavāḍu kāḍu - śarīramu kaligina daggaranuṃḍi anēka mārpulu galadagunu. aṃducēta dēhamu galavāḍuga vihariṃcucunnāḍugāni ataniki śarīramununadi lēdu).

  1. dvividhasyāsya dharmasya vēdaprāmāṇikasya ca |

svargamōkṣa nimittasya prāṇināṃ hi yadā yadā |

kṣatirbhavatya dharmāṃ śaiḥ svargamōkṣa virōdhibhiḥ |

śruti smṛti niṣaddhasya dharmasyānartha kāriṇaḥ |

udbhavōdharma śatrōśca bhavatīha yadā yadā |

tadā tadātmānaṃ nitya siddhaṃ svamāyayā |

darśayāmi sṛṣṭamiva cidghanaṃ paramārthataḥ ||". (gītābhāvaprakāśamu - 4 - 51 to 54)

(prāṇula mōkṣamunaku, svargamunaku kāraṇamainaṭuvaṃṭinnī, iṃduku vēdamē pramāṇamugā galadinnī, ayina reṃḍu vidhamulagu dharmamu - pravṛtti dharmamu, nivṛttidharmamu - svargamōkṣamulaku virōdhi ayinaṭuvaṃṭinnī, śrutulalōnu, smṛtulalōnu (cēyakūḍadani) niṣēdhiṃcabaḍinadinnī, ayina adharmamu, eppuḍu eppuḍu udbhaviṃcunō appuḍu nityasiddhuḍanaina nēnu (ekkaḍainanu, eppuḍainanu siddhamugā nunnaṭuvaṃṭi nēnu) prati vastuvulōnu, praticōṭa, anni kālamulaṃdunuṃḍu bhagavaṃtuḍanaina nēnu, sādhāraṇamugā kaṃṭikikanabaḍani vāḍanaina nēnu, nā māyacēta sṛṣṭiṃpabaḍinavānivale, sādhāraṇa janma kalavāḍuvale kanabaḍudunu. aṃtiyēkāni nijamugā pāṃcabhautika śarīramutō puṭṭinavāḍanukānu - nā avatāramulalōni nā śarīramiṭṭidē).

"yathā yathāhi dharmasya glānirbhavati bhārata |

abhyutthānamadharmasya tadātmānaṃ sṛjāmyahaṃ |

paritrāṇāya sādhūnāṃ vināśāya ca duṣkṛtāṃ |

dharmasaṃsthāpa nārthāya saṃbhavāmi yugē yugē ||". (śrīmadbhagavadgīta - 4 - 7, 8). (cūḍumu - avatāramulu)

(avatārakālamaṃdali paristhitulanu baṭṭi ē rūpamainanu - ē śarīramainanu (cēpa, tābēlu, paṃdi, narasimhamu, vāmanamu, modalagu śarīramulanu) dhariṃcudunu. avanniyu māyā śarīramulē, prākṛta śarīramulukāvu).

  1. bhagavaṃtuḍu sṛṣṭi cēyu talaṃputō brahmāṃḍamunu sṛṣṭiṃci bhēdiṃcenu.

"ka. bhuvanātmakuḍā yīśuḍu

bhavanākṛti tōḍanuṃḍu brahmāṃḍaṃbun

vivaramutō padunālugu

vivaraṃbulugā nonarce viśadaṃbulugan

ma. - - -

- - - vidvāṃsulūhiṃci ta

dbahu rūpāvayavaṃbulan bhuvana saṃpattin vicāriṃturu.

- - -" (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 87, 88)

"ślō||. aṃḍakōśē śarīrē (a)smin saptāvaraṇa saṃ yutē |

vairājaḥ puruṣō yō(a)sau bhagavān dhāraṇāśrayaḥ |

pātāḷamē tasya hi pādamūlaṃ paṭhaṃti pārṣi prasadē rasātalaṃ |

mahātalaṃ viśva sṛjō(a)dha gulbhautalā talātalaṃ vai puruṣasya jaṃghē |

dvējānunī sutalaṃ viśvamūrtē rūru dvayaṃ vitalaṃ cā talaṃca |

mahītalaṃ tajjaghanaṃ, mahīpatē, nabhasthalaṃ nābhi sarō ghṛṇaṃti |

urasthalaṃ jyōtiranīkamasya grīvā maharvadanaṃ vai janō(a)sya |

tapō lalāṭaṃ vidurādi puṃsaḥ satyaṃ tu śīrṣāṇi sahasra śīrṣṇaḥ.” (śrīmadbhāgavataṃ - 2 - 1 - 25 to 28)

  1. bhagavaṃtuḍu prakṛti saṃ yōgamuvalana sṛṣṭilōni vastuvulanniyu, okadānilōnuṃḍi okaṭigā puṭṭinavaniyu, ā vastuvulanniṃṭilō bhagavaṃtuḍu tana cicchakti (caitanyaśakti) tō nuṃḍuṭavalana ā vastuvulanniyu ataniki śarīramulaniyu (upādhulu) paina ceppabaḍinadi. ā vastuvulanniyu kalisi vēṟu vēṟu lōkamulugā nuṃḍuṭavalana bhagavaṃtunaku vēṟu vēṟu śarīramulunnavaniyu kūḍa ceppabaḍinadi. mānava śarīramulō emukalu, raktamu, māṃsamu, avayavamuluṃḍagā vāṭi anniṃṭipaina kappugā anniṃṭini āvariṃci carmamukaligi avanniyu oka puramugā nunnaṭlu bhagavaṃtuḍu sṛṣṭicēsina vastuvulanniyu vēṟu vēṟu puramulainanu vāṭi anniṃṭini vēṟu vēṟu lōkamulugā vibhajiṃci, vāṭi anniṃṭini kalipi kappipuccu āvaraṇamulu vātanniṃṭini oka pedda (brahmāṃḍamaina) vastuvugā cēsinadi. ā pedda vastuvē prapaṃcamu - (prapaṃcamulōnunna vastuvulannikalisi prapaṃcamainadi - prapaṃcamulō lēni vastuvu vērē lēdu). ā prapaṃcamaṃtaṭilōnu - dānilōni prativastuvulōnu bhagavaṃtuḍunnāḍukanuka - ā prapaṃcamē ataniki śarīramu. aṭṭi śarīramē viśvamu - adikalavāḍu - viśva śarīramu kalavāḍu kanuka bhagavaṃtuḍu viśvuḍu ani ceppabaḍucunnāḍu - " viśvaṃ viṣṇurvaṣkāpirō " ani viṣṇusahasranāmamulu, "viśvaṃ nārāyaṇaṃ dēvaṃ" ani maṃtrapuṣpamu ceppucunnavi. "sarva śarīrakatayā viśvarūpaśabditāṃ " (anni śarīramulu tānē ayi yuṃḍuṭavalana viśvarūpuḍu ani ceppabaḍunnāḍu)

  2. ī viśvarūpamulōni vastuvulanniyu lōkamulugā aguṭavalana bhagavaṃtuḍu lōkamayuḍu ani ceppabaḍenu - ā lōkamulanniyu bhagavaṃtuni viśvaśarīramulōni avayavamulugā vidvāṃsu lūhiṃciri - (cūḍumu -3).

"caturdaśa lōkaṃbulaṃdu mīdi ēḍu lōkaṃbulu śrīmahāviṣṇuvunakuṃ gaṭi pradēśaṃbuna nuṃḍi yūrthvadēhamaniyu, kriṃdi yēḍu lōkaṃbulu jaghanaṃbunanuṃḍi yadhōdēhamaniyunu balukuduru. - - - - bhūlōkaṃbu kaṭi paryaṃta pradēśaṃbu, bhuvarlōkaṃbu nābhi, suvarlōkaṃbu hṛdayaṃbu, maharlōkaṃbu vakṣaṃbu, janalōkaṃbu grīvaṃbu, tapōlōkaṃbu stanadvayaṃbu, sanātaṃbunu brahmanivāsaṃbunu naina satyalōkaṃbu śiraṃbu, gaṭi pradēśaṃbatalaṃbu, toḍalu vitalaṃbu, jānuvulu sutalaṃbu, jaṃghalu dalātalaṃbu, gulphaṃbulu mahātalaṃbu, pādāgraṃbulu rasātalaṃbu, pādatalaṃbu pātāḷaṃbunani lōkamayuṃgā bhāviṃturu".

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 87 to 89).

  1. "aṭṭi brahmāṃḍaṃbu śrīmannārāyaṇuni sthūla śarīramaguṭaṃjēsi brahmāṃḍaṃbevvaru varṇiṃturu, evvaru viṃduru vāralaku sakala śrēyassuluṃ galugunu - - - bhūdvīpavarṣasalidadri nabhassamudra pātāḷādi diṅnaraka tārāgaṇalōka saṃsthitaṃbayi sakala jīva nikāyyaṃbai yadbhutaṃbaina śrīhari sthūlaśarīraṃbu vinipiṃcitini -". (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - ).

  2. "ma. amaraśrēṇiki nella jakri mukharuṃḍā cakri dharmaṃbunaṃ

damarun; gōvulu,bhūmidēvulu, ditikṣāmnāya kāruṇya sa

tyamulun, yāga tapō damaṃbulunu, śraddhāśāṃtulun viṣṇudē

hamulu - - - (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū,bhā. 168)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.