గీతాశాస్త్రే వినిర్ణీతో - - - (గీతాభావప్రకాశము - 1 - 42)
(ఈ భగవద్గీతలో వేదాంతములో చెప్పబడిన అఖండవ్యాక్యార్థము - ఖండింప బడకుండ సిద్దాంతీకరింపబడిన 'తత్వమసి' (జీవబ్రహ్మైక్యము) అను మహావాక్యార్థము నిర్ణయింపబడినది).
తత్రాద్ర్యకాండే హరిణా త్వం పదార్థస్య శోధినం |
మహామోహ సముచ్ఛేద సిద్ధయే కృతమాదరాత్ |
మధ్య మాధ్యాయషట్కేణపురుషార్థైక జన్మభూః |
తావతా తత్పదార్థోపి ధ్యేయో జ్ఞేయో (అ)ర్చ్య ఆదరాత్ |
ముముక్షోరుపకారాయ హరిణా సన్నిరూపితః |
తతస్తత్వం పదార్థైక్యరూపా (అ)విద్యా విరోధినీ ||". (గీతాభావప్రకాశము - -)
(శ్రీమద్భగవద్గీతా శాస్త్రము మూడు కాండల క్రింద విభజింపబడినది - ఒక్కొక్క భాగమునకు ఆరు అధ్యాయములు. మొదటిభాగములో మహామోహమును పోగొట్టుటకై 'తత్వమసి' అను మహావాక్యములోని 'త్వం' పదార్థము శోధించి చెప్పబడినది. రెండవ భాగములో 'తత్' పదార్థము చెప్పబడినది. మూడవభాగములో 'తత్వమసి' అను మహావాక్యార్థము చెప్పబడినది - జీవ బ్రహ్మైక్యము చెప్పబడినది).
గీతాయామస్తి తేనేయం సర్వ శాస్త్రమయీ మాతా ||.
(భారతమునందు వేదములన్నింటియొక్క సారాంశము కలదు. భారతములోని సారాంశము శ్రీమద్భగవద్గీతలో కలదు. అందుచేత ఈ గీతాశాస్త్రము సమస్త శాస్త్రమయము - అన్ని శాస్త్రముల సారాంశము దీనిలో కలదు –
యతః కృష్ణస్తతో జయః |
ఇత్యేవం రూపకేణార్థో భారతే మునినేరితః ||
అత్రాపి ప్రథమే శ్లోకే తద్రూపక ప్రదర్శనం ||". (గీతాభావప్రకాశము - 107 to 109)
(ధర్మము ఎవరి పక్షమున నుండునో భగవంతుడు వారి పక్షమున నుండును - భగవతుడెవరి పక్షమున నుండునో ఆ పక్షమునకే జయము అని భారతములో వ్యాస భగవానునిచే నిరూపింపబడినది. భగవద్గీతలో కూడా ఈ విషయము ప్రారంభములోనే చెప్పబడినది - "ధర్మ క్షేత్రే కురుక్షేత్రే" అని చెప్పుతవలన యుద్ధభూమి కురుక్షేత్రము ధర్మభూమి - అందుచేత ధర్మమే జయించును అని స్ఫురించును - భగవద్గీత ఆఖరునకూడా - యత్ర యోగీశ్వరః కృష్ణో, యత్ర పార్థో ధనుర్ధరః | తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ" అని చెప్పబడినది - యోగేశ్వరుడైన కృష్ణుడెక్కడ నుండునో, ధనస్సును ధరించిన అర్జుడెక్కడనుండునో. అక్కడే లక్ష్మి, విజయము, ఐశ్వర్యము, ధృఢమైన నీతియు ఉండునని నా అభిప్రాయము - అని సంజయుని వాక్యము).
"తథా ఛాందోగ్యో వేదాంతగిరామప్యత్ర సంగతిః |
ఇంద్రియ వృత్తయో దేవాః అసురాశ్చ శ్రుతౌ శ్రుతాః |
శాస్త్రానుగాః సురాః ప్రోక్తాః స్వాభావిక్యస్తథా సురాః |
స్వాభావిక్యాస్తమో రూపా ఇంద్రియాణాం ప్రవృత్తయః |
ప్రవృత్తాఃశాస్త్ర సిద్ధార్థ ప్రకాశాభి భవా యతాః |
శాస్త్రానుగాః సురాస్తత్ర శాంతి దాంతి పురస్సరాః |
భ్రాంతి సిద్ధ ప్రవృత్తీకామా సురీణాం క్షయావహాః |
అనాదికాల మారభ్య దేవాసుర సమాగమః ||.
ప్రతిదేహం ప్రవృత్తో(అ)సౌ సర్వప్రాణిషు సంగరః |
ఏవమేవ మునేర్భావోదర్శితీయ మథాధునా ||". (గీతాభావప్రకాశము - 1 - 121 to 125)
(ఛాందోగ్యోపనిషత్తులో చెప్పిన ప్రకారము అన్వయము చేసుకోవలసినదెట్లనగా - ఇంద్రియ వృత్తులలో కొన్ని దైవీసంపత్తిలోనివి, కొన్ని ఆసురసంపత్తిలోనివి. అనాదికాలమునుండి ప్రతిదేహములోను ఈ అసుర సంపత్తికి, దైవీసంపత్తికీ యుద్ధమువంటిది జరుగుచేయున్నది. ఈ విషయమే శ్రీమద్భగవద్గీతలో రూపకముగా చెప్పబడినది).
కథంబద్ధో స్మ్యహం కేన సంసారే వినిపాతితః |
కేనోపాయేన ముక్యస్స్యామితి మోక్షోన్ముఖం నరం |
బిబోధయిషురాహేదం గీతాశాస్త్రం హరిర్విభుః |
సర్వలోక హితార్థాయ నిమిత్తీకృత్యపాండవం |
తమర్థం భగవాన్ వ్యాసః సర్వజ్ఞః సప్తభిశ్శతైః |
శ్లోకానాం భగవద్గీతాభిధై ర్వేదార్థ గోచరైః |
నిబబంధ స్వయం సాక్షాద్గోవిందముఖ ని సృతైః |
ప్సంగార్థం స్వయం కాంశ్చిత్ శ్లోకాస్వ్యర చ యన్మునిః |
గీతాఖ్య తనిదం శాస్త్రం కైనవ్యైక ప్రయోజనం |
సర్వ వేదార్థ సారాంశ సంగ్రహాత్మక ముత్తమం |
తత్వం శ్రీవాసుదేవాఖ్యం బ్రహ్మాస్య విషయః పరః |
విశిష్టఫల సంబంధాభిదే యాన్విత మద్భుతం |
దుర్జ్ఞేయమిదం శాస్త్రాం పదశో యస్య విజ్ఞానాత్ సర్వ సిద్ధిర్మహాత్మనాం". (గీతాభావప్రకాశము - 1 - 28 to 36)
(శోకము, మోహము, మొదలగువానితో కూడి అనర్థకరమైన యీ సంసారము వదలి వేయుటకు శక్యముకాదు. అధ్యాత్మిక, ఆధి భౌతిక ఆధి దైవికములు అను మూడు విధములగు తాపములతో నిండియున్న యీ సంసారము ఏ విధమున నశించును - నేను ఎందుచేత బద్ధుడనైతిని, ఎందుచేత నీ సంసారములో పడితిని? ఏ ఉపాయముచే ఈ సంసారమునుండి ముక్తుడగుదును? అని విచారించుచు మోక్షము కోరు నరునకు సమస్తమునకు ప్రభువు అయిన శ్రీకృష్ణభగవానుడు సమస్త లోకములకు హితము చేయకోరి, అర్జునుని నిమిత్తమాత్రుడుగా చేసి - అనగా, అర్జునునకు చెప్పినట్లుగా కనబడినను లోకులందఱకు చెప్పినట్లే అని భావించి) యీ గీతా శాస్త్రమును (శ్రీమద్భగవద్గీతను) బోధించెను - ఇట్లు శ్రీకృష్ణభగవానుడు చేసిన ఈ భగవద్గీతార్థము సర్వజ్ఞుడైన శ్రీ వ్యాస భగవానుడు వేదార్థమును స్పష్టముగా తెలియచేయుచు భగవద్గీత అను పేరు కలిగి సాక్షాత్తు శ్రీకృష్ణభగవానుని ముఖమునుండి వెలువడిన ఏడు వందల శ్లోకములతో చెప్పెను. వాటికి సందర్భానుసారముగా తన స్వంతముగా కొన్నిశ్లోకములను కలిపిచెప్పెను -
(శ్రీమద్భగవద్గీత అన పేరుగల యీ శాస్త్రము ముక్తి యొక్కటే ప్రయోజనముగా గలది, ఉత్తమమైనది, వేదములన్నింటి సారముగలది. వాసుదేవబ్రహ్మ అను పేరుగల పరతత్వమే యందలి విషయము. విశిష్టమైన ఫలముతో సంబంధించినదగుటచేత అద్భుతమైనది. ఈ శాస్త్రము నర్థము చేసుకొనుట చాల కష్టము- దీని యర్థమును వినిన మహాత్ములకు సర్వమును సిద్ధించును).
ఆసీత్ - - - |
స సృష్ట్వేదం జగత్సర్వం చి కీర్షుస్తస్యచ స్థితిం |
స సర్జ బ్రహ్మ రూపేణ మరీచ్యాది ప్రజాపతిన్ |
ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయా మాస తన్మునీన్ |
సంసార స్థితేర్హేతుర్థర్మః స్వర్గాది సాధనం |
నివృత్తి లక్షణం ధర్మం సనకాదీన కల్మషాన్ |
సృష్ట్వాతాన్ గ్రాహయా మాస మోక్ష హేతుం స వైదికం |
గృహీతో ద్వివిధో ధర్మో మునిభిస్తత్వ దర్శిభిః |
ప్రవర్తితో యథా శాస్త్రం లోకే(అ)నధికారిషు |
కృతాదిషు యుగేష్వేష ధర్మః సద్భిః ప్రవర్తితః |
క్షీణ ప్రాయో అభవల్లోకే కాలేన చింత్య వర్త్మనా |
కామా దీనాంచ బాహుల్యాద్వై చిత్ర్యాత్కర్మణాం తథా |
హీయమానే క్షితే ధర్మే వర్తమానే హ్య ధర్మకే |
ధర్మగోపా మహా విష్ణరాది కర్తా మహేశ్వరః |
స పిపాలయి షుర్ధర్మం క్షితా నవ తతారహ |
స్వాం మాయాం వైష్ణవీం శక్తిం వశీకృత్య గుణాత్మికాం |
(అ)వ్యయో(అ)క్రియా నిత్యః శుద్ధో బుద్ధః స చేశ్వరః
- - - స్వేచ్చయా సంబభూవాద్యో దేవక్యాం వసుదేవతః |
నిహత్యాసుర పక్షోయాన్ ధర్మ శత్రూననేకథా |
ధర్మః ప్రవర్తితో లోకే స్వమూర్త్యాద్భుత రూపయా |
సధర్మో ద్వివిదోపీహ వర్థమానో యథా భవేత్ |
సంప్రదాయ ముఖేనైవ తథాకార్యం మయాధునా |
"ఇతి సంచింత్య గోవిందో నిమిత్తీ కృత్యార్జునం |
సంగ్రామే (అ)వసరం లబ్ధ్వా ద్వివిధం ధర్మమీశ్వరః |
తస్మాదుపది దేశేఢ్యః ఉత్తమా సద్గుణాధికైః |
స్వయమేనహి కాలేన ప్రచయం ప్రగమిష్యతి |
ఇత్యతో(అ)ర్జునముద్దిశ్య ధర్మం సంప్రోక్తవాన్ హరిః ||". (గీతాభావప్రకాశము - 1 - 5 - 7 to 20)
(నారాయణుడను పేరుతో పరబ్రహ్మ సృష్టికి ముందుండెను - అతను ఈ జగత్తంతను సృష్టించి దానికి స్థితి కల్పించడానికి (సృష్టి స్థితి లయములను మూడింటిలోను మధ్యస్థితి కల్పించడానికి), అనగా, యీ సృష్టించినదాని స్థితి కాలములో పోషించడానికి, బ్రహ్మరూపముతో మరీచి మొదలగు ప్రజాపతులను సృష్టించెను - సంసారమునకు కారణమైనటువంటిన్నీ, సర్వము మొదలగువాటికి సాధనమైనటువంటిన్నీ ప్రవృత్తి లక్షణములుగల ధర్మమును వారిచే స్వీకరింపచేసెను - వేదమందు చెప్పబడినటు వంటిన్నీ, హేతువైనటువంటిన్నీ నివృత్తి లక్షణమైన ధర్మములను సనక సననందన సనత్కుమార సనత్సుజాతులను మునులను సృష్టించి వారిచే స్వీకరింపచేసెను - ఈ ప్రకారముగ వారు స్వీకరించిన ఈ రెండు ధర్మములు మునులు గ్రహించి వారి వారి శిష్యులకు శాస్త్రములో చెప్పిన ప్రకారము చెప్పుచూ వచ్చుటచేత పరంపరగా లోకములో ప్రచారమయి ధర్మము ప్రవర్తింప చేయబడినది, కృతయుగము మొదలగు యుగములలో ఈ ధర్మము సత్పురుషులచేత ప్రవర్తింపబడినది. చింతించుటకు నలవికాని కాలక్రమముచేత, కామాదులు బలిసి పోవుటచేతను, కర్మలవైచిత్రము వలనను ఈ ధర్మము క్షీణించుచు వచ్చుటబట్టి, అధర్మము వృద్ధిపొందు చునుండుట బట్టిన్నీ ఆదికర్త అయిన - ఈ ధర్మమును మొట్టమొదట సృష్టించిన - శ్రీమహావిష్ణువు ధర్మమును పాలించుటకు పునరుద్ధరించుటకు భూమిమీద అవతరించెను.
(త్రిగుణాత్మకయు, విష్ణువుయొక్క శక్తియే అయిన తనమాయను తన వశములోనుంచుకొని, జన్మలేనివాడయ్యును, క్షీణించనివాడయ్యును, త్రికాలలందు నుండువాడయ్యును, శుద్ధుడు, బుద్ధడు సృష్టికి మూలకారణమైన శ్రీమహావిష్ణువు (నారాయణుడు) తన యిచ్ఛా ప్రకారము దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడను పేరుతో కుమారుడై పుట్టి ధర్మమును ప్రవర్తింపచేయుటకు శత్రువులయిన అసురులను (ఆసుర సంపత్తి గలవారలను) అనేక ప్రకారములుగా చంపి, అద్భుతమైన తన శ్రీకృష్ణావతారముతో ధర్మమును తిరిగి ప్రవర్తింప చేసెను).
("ఈ రెండు విధములగు ధర్మములు భూమిమీద సంప్రదాయమూలముగా ఏ ప్రకారముగా వృద్ధిపొందగలవో ఆ ప్రకారము ఇప్పుడు నేను చేయుదును" అని సంకల్పించుకొని భారతయుద్ధమను అవసరము కుదరగనే, యుద్ధభూమియందు ఉత్తమాధికారి అయిన అర్జునుని నిమిత్తమాత్రునిగా చేసి అతనికి బోధించెను - అను మిషతో లోకమందఱికి శ్రీకృష్ణుడు ఈ ధర్మమును ఉపదేశించెను - ఈ ప్రకారముగా చేసినయడల ధర్మము తానంతట అదియే లోకములో ప్రచారమయి, వృద్ధిపొంది వ్యాపించగలదని ఉద్దేశముతో భగవంతుడీ ప్రకారముగా చేసెను - ఇట్లు శ్రీకృష్ణభగవానుడు అర్జునకు చేసిన బోధయే శ్రీమద్భగవద్గీత).
వేదము మూడు కాండలుగా విభజింపబడినది - కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. అట్లే వేదముల సారాంశమైన శ్రీమద్భగవద్గీత మూడు భాగములుగ విభజించపడినది - ఇందులోని మొదటి ఆరు అధ్యాయములు కర్మయోగమును సూచించును, రెండవ ఆరు అధ్యాయములు భక్తియోగమును తెలియ చేయును - మూడవ ఆరు అధ్యాయములు జ్ఞానయోగమును తెలియచేయును.
"సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందనః |
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ||".
"అద్వైతామృతవర్షిణీం భగవతీ మష్టాదశాధ్యాయినీం |
అంబత్వాం అనసందధామి, భగవద్గీతే, భవద్వేషిణీం ||".
"పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం |
వ్యాసేన గ్రధితాం పురాణ మునినా మధ్యే మహాభారతం ||". (గీతాధ్యానము - 1 - 3)
(శ్రీకృష్ణుడు గోపాలుడు, గోవుల పాలు పితుకుటలో నేర్పరి. అందుచేత ఉపనిషత్తులన్నింటిని ఒక గోవుగా చేసి, పార్థుడను భక్తుని (అధికారిని) గోవత్సముగా చేసి (దూడగాచేసి) గీతయను అమృతమును పిదికి శ్రీకృష్ణభగవానుడు జ్ఞానులకు ఇచ్చెను - అని ఈభగవద్గీత ఒక రూపముగా చెప్పబడినది. ఇది అన్ని ఉపనిషత్తుల సారాంశమును భోధించునది. ఉపనిషత్తులలోని సారాంశము బ్రహ్మజ్ఞానము - సాధారణులకు బోధపడనిది. దీనిని సాక్షాత్తు భగవంతుడే అయిన శ్రీకృష్ణునిచేత చెప్పబడినది. భగవంతుడే చెప్పినదిగనుక శ్రీమద్భగవద్గీత అని చెప్పబడినది. శ్రీకృష్ణుడను లోకగురువు ఉపదేశించిన ఈ బ్రహ్మజ్ఞానమును, తాను చెప్పగా వినుటకర్హుడైన (అధికారి అయిన) అర్జునునితో చెప్పెను - ఇట్లు చెప్పిన ఆ జ్ఞానము అర్జునునిద్వారా లోకములో వ్యాపించునని భగవంతుని ఆశయము - ఈ గీత ఆవుపాలవలె అమృత తుల్యమైనది - "క్షీరేణాయుః ప్రవర్థతే" అని యున్నదికదా - పాలవలన ఆయుర్దాయము పెరుగునట్లు ఈ గీతార్థము తెలుసుకొనినవారు అమృతమయమగు మోక్షమును పొందుదురు అని దీని ఫలము చెప్పబడినది. 18 అధ్యాయములు కలిగి, అద్వైత తత్వజ్ఞానము అను అమృతము అను వర్షమువలె కురిపించు ఈ భగవద్గీతను అనుసంధానము చేయుచున్నాను).
(శ్రీమద్భగవద్గీతలో సంక్షేపముగా చెప్పబడిన ప్రయోజనము నిశ్శ్రేయసము, సంసారమునుండి ఉపరమ లక్షణమైనది) ఇట్టి నిశ్శ్రేయస్సు లక్షణమున్నూ, సంసారమునుండి అత్యంత ఉపలక్షణమైనది. ఇట్టి స్థితి సర్వకర్మసన్యాసము చేసి ఆత్మజ్ఞానమందు నిష్టకలిగియుండిననే కలుగును).
gītāśāstrē vinirṇītō - - - (gītābhāvaprakāśamu - 1 - 42)
(ī bhagavadgītalō vēdāṃtamulō ceppabaḍina akhaṃḍavyākyārthamu - khaṃḍiṃpa baḍakuṃḍa siddāṃtīkariṃpabaḍina 'tatvamasi' (jīvabrahmaikyamu) anu mahāvākyārthamu nirṇayiṃpabaḍinadi).
tatrādryakāṃḍē hariṇā tvaṃ padārthasya śōdhinaṃ |
mahāmōha samucchēda siddhayē kṛtamādarāt |
madhya mādhyāyaṣaṭkēṇapuruṣārthaika janmabhūḥ |
tāvatā tatpadārthōpi dhyēyō jñēyō (a)rcya ādarāt |
mumukṣōrupakārāya hariṇā sannirūpitaḥ |
tatastatvaṃ padārthaikyarūpā (a)vidyā virōdhinī ||". (gītābhāvaprakāśamu - -)
(śrīmadbhagavadgītā śāstramu mūḍu kāṃḍala kriṃda vibhajiṃpabaḍinadi - okkokka bhāgamunaku āru adhyāyamulu. modaṭibhāgamulō mahāmōhamunu pōgoṭṭuṭakai 'tatvamasi' anu mahāvākyamulōni 'tvaṃ' padārthamu śōdhiṃci ceppabaḍinadi. reṃḍava bhāgamulō 'tat' padārthamu ceppabaḍinadi. mūḍavabhāgamulō 'tatvamasi' anu mahāvākyārthamu ceppabaḍinadi - jīva brahmaikyamu ceppabaḍinadi).
gītāyāmasti tēnēyaṃ sarva śāstramayī mātā ||.
(bhāratamunaṃdu vēdamulanniṃṭiyokka sārāṃśamu kaladu. bhāratamulōni sārāṃśamu śrīmadbhagavadgītalō kaladu. aṃducēta ī gītāśāstramu samasta śāstramayamu - anni śāstramula sārāṃśamu dīnilō kaladu –
yataḥ kṛṣṇastatō jayaḥ |
ityēvaṃ rūpakēṇārthō bhāratē muninēritaḥ ||
atrāpi prathamē ślōkē tadrūpaka pradarśanaṃ ||". (gītābhāvaprakāśamu - 107 to 109)
(dharmamu evari pakṣamuna nuṃḍunō bhagavaṃtuḍu vāri pakṣamuna nuṃḍunu - bhagavatuḍevari pakṣamuna nuṃḍunō ā pakṣamunakē jayamu ani bhāratamulō vyāsa bhagavānunicē nirūpiṃpabaḍinadi. bhagavadgītalō kūḍā ī viṣayamu prāraṃbhamulōnē ceppabaḍinadi - "dharma kṣētrē kurukṣētrē" ani cepputavalana yuddhabhūmi kurukṣētramu dharmabhūmi - aṃducēta dharmamē jayiṃcunu ani sphuriṃcunu - bhagavadgīta ākharunakūḍā - yatra yōgīśvaraḥ kṛṣṇō, yatra pārthō dhanurdharaḥ | tatra śrīrvijayō bhūtiḥ dhruvānītirmatirmama" ani ceppabaḍinadi - yōgēśvaruḍaina kṛṣṇuḍekkaḍa nuṃḍunō, dhanassunu dhariṃcina arjuḍekkaḍanuṃḍunō. akkaḍē lakṣmi, vijayamu, aiśvaryamu, dhṛḍhamaina nītiyu uṃḍunani nā abhiprāyamu - ani saṃjayuni vākyamu).
"tathā chāṃdōgyō vēdāṃtagirāmapyatra saṃgatiḥ |
iṃdriya vṛttayō dēvāḥ asurāśca śrutau śrutāḥ |
śāstrānugāḥ surāḥ prōktāḥ svābhāvikyastathā surāḥ |
svābhāvikyāstamō rūpā iṃdriyāṇāṃ pravṛttayaḥ |
pravṛttāḥśāstra siddhārtha prakāśābhi bhavā yatāḥ |
śāstrānugāḥ surāstatra śāṃti dāṃti purassarāḥ |
bhrāṃti siddha pravṛttīkāmā surīṇāṃ kṣayāvahāḥ |
anādikāla mārabhya dēvāsura samāgamaḥ ||.
pratidēhaṃ pravṛttō(a)sau sarvaprāṇiṣu saṃgaraḥ |
ēvamēva munērbhāvōdarśitīya mathādhunā ||". (gītābhāvaprakāśamu - 1 - 121 to 125)
(chāṃdōgyōpaniṣattulō ceppina prakāramu anvayamu cēsukōvalasinadeṭlanagā - iṃdriya vṛttulalō konni daivīsaṃpattilōnivi, konni āsurasaṃpattilōnivi. anādikālamunuṃḍi pratidēhamulōnu ī asura saṃpattiki, daivīsaṃpattikī yuddhamuvaṃṭidi jarugucēyunnadi. ī viṣayamē śrīmadbhagavadgītalō rūpakamugā ceppabaḍinadi).
kathaṃbaddhō smyahaṃ kēna saṃsārē vinipātitaḥ |
kēnōpāyēna mukyassyāmiti mōkṣōnmukhaṃ naraṃ |
bibōdhayiṣurāhēdaṃ gītāśāstraṃ harirvibhuḥ |
sarvalōka hitārthāya nimittīkṛtyapāṃḍavaṃ |
tamarthaṃ bhagavān vyāsaḥ sarvajñaḥ saptabhiśśataiḥ |
ślōkānāṃ bhagavadgītābhidhai rvēdārtha gōcaraiḥ |
nibabaṃdha svayaṃ sākṣādgōviṃdamukha ni sṛtaiḥ |
psaṃgārthaṃ svayaṃ kāṃścit ślōkāsvyara ca yanmuniḥ |
gītākhya tanidaṃ śāstraṃ kainavyaika prayōjanaṃ |
sarva vēdārtha sārāṃśa saṃgrahātmaka muttamaṃ |
tatvaṃ śrīvāsudēvākhyaṃ brahmāsya viṣayaḥ paraḥ |
viśiṣṭaphala saṃbaṃdhābhidē yānvita madbhutaṃ |
durjñēyamidaṃ śāstrāṃ padaśō yasya vijñānāt sarva siddhirmahātmanāṃ". (gītābhāvaprakāśamu - 1 - 28 to 36)
(śōkamu, mōhamu, modalaguvānitō kūḍi anarthakaramaina yī saṃsāramu vadali vēyuṭaku śakyamukādu. adhyātmika, ādhi bhautika ādhi daivikamulu anu mūḍu vidhamulagu tāpamulatō niṃḍiyunna yī saṃsāramu ē vidhamuna naśiṃcunu - nēnu eṃducēta baddhuḍanaitini, eṃducēta nī saṃsāramulō paḍitini? ē upāyamucē ī saṃsāramunuṃḍi muktuḍagudunu? ani vicāriṃcucu mōkṣamu kōru narunaku samastamunaku prabhuvu ayina śrīkṛṣṇabhagavānuḍu samasta lōkamulaku hitamu cēyakōri, arjununi nimittamātruḍugā cēsi - anagā, arjununaku ceppinaṭlugā kanabaḍinanu lōkulaṃdaṟaku ceppinaṭlē ani bhāviṃci) yī gītā śāstramunu (śrīmadbhagavadgītanu) bōdhiṃcenu - iṭlu śrīkṛṣṇabhagavānuḍu cēsina ī bhagavadgītārthamu sarvajñuḍaina śrī vyāsa bhagavānuḍu vēdārthamunu spaṣṭamugā teliyacēyucu bhagavadgīta anu pēru kaligi sākṣāttu śrīkṛṣṇabhagavānuni mukhamunuṃḍi veluvaḍina ēḍu vaṃdala ślōkamulatō ceppenu. vāṭiki saṃdarbhānusāramugā tana svaṃtamugā konniślōkamulanu kalipiceppenu -
(śrīmadbhagavadgīta ana pērugala yī śāstramu mukti yokkaṭē prayōjanamugā galadi, uttamamainadi, vēdamulanniṃṭi sāramugaladi. vāsudēvabrahma anu pērugala paratatvamē yaṃdali viṣayamu. viśiṣṭamaina phalamutō saṃbaṃdhiṃcinadaguṭacēta adbhutamainadi. ī śāstramu narthamu cēsukonuṭa cāla kaṣṭamu- dīni yarthamunu vinina mahātmulaku sarvamunu siddhiṃcunu).
āsīt - - - |
sa sṛṣṭvēdaṃ jagatsarvaṃ ci kīrṣustasyaca sthitiṃ |
sa sarja brahma rūpēṇa marīcyādi prajāpatin |
pravṛtti lakṣaṇaṃ dharmaṃ grāhayā māsa tanmunīn |
saṃsāra sthitērhēturtharmaḥ svargādi sādhanaṃ |
nivṛtti lakṣaṇaṃ dharmaṃ sanakādīna kalmaṣān |
sṛṣṭvātān grāhayā māsa mōkṣa hētuṃ sa vaidikaṃ |
gṛhītō dvividhō dharmō munibhistatva darśibhiḥ |
pravartitō yathā śāstraṃ lōkē(a)nadhikāriṣu |
kṛtādiṣu yugēṣvēṣa dharmaḥ sadbhiḥ pravartitaḥ |
kṣīṇa prāyō abhavallōkē kālēna ciṃtya vartmanā |
kāmā dīnāṃca bāhulyādvai citryātkarmaṇāṃ tathā |
hīyamānē kṣitē dharmē vartamānē hya dharmakē |
dharmagōpā mahā viṣṇarādi kartā mahēśvaraḥ |
sa pipālayi ṣurdharmaṃ kṣitā nava tatāraha |
svāṃ māyāṃ vaiṣṇavīṃ śaktiṃ vaśīkṛtya guṇātmikāṃ |
(a)vyayō(a)kriyā nityaḥ śuddhō buddhaḥ sa cēśvaraḥ
- - - svēccayā saṃbabhūvādyō dēvakyāṃ vasudēvataḥ |
nihatyāsura pakṣōyān dharma śatrūnanēkathā |
dharmaḥ pravartitō lōkē svamūrtyādbhuta rūpayā |
sadharmō dvividōpīha varthamānō yathā bhavēt |
saṃpradāya mukhēnaiva tathākāryaṃ mayādhunā |
"iti saṃciṃtya gōviṃdō nimittī kṛtyārjunaṃ |
saṃgrāmē (a)vasaraṃ labdhvā dvividhaṃ dharmamīśvaraḥ |
tasmādupadi dēśēḍhyaḥ uttamā sadguṇādhikaiḥ |
svayamēnahi kālēna pracayaṃ pragamiṣyati |
ityatō(a)rjunamuddiśya dharmaṃ saṃprōktavān hariḥ ||". (gītābhāvaprakāśamu - 1 - 5 - 7 to 20)
(nārāyaṇuḍanu pērutō parabrahma sṛṣṭiki muṃduṃḍenu - atanu ī jagattaṃtanu sṛṣṭiṃci dāniki sthiti kalpiṃcaḍāniki (sṛṣṭi sthiti layamulanu mūḍiṃṭilōnu madhyasthiti kalpiṃcaḍāniki), anagā, yī sṛṣṭiṃcinadāni sthiti kālamulō pōṣiṃcaḍāniki, brahmarūpamutō marīci modalagu prajāpatulanu sṛṣṭiṃcenu - saṃsāramunaku kāraṇamainaṭuvaṃṭinnī, sarvamu modalaguvāṭiki sādhanamainaṭuvaṃṭinnī pravṛtti lakṣaṇamulugala dharmamunu vāricē svīkariṃpacēsenu - vēdamaṃdu ceppabaḍinaṭu vaṃṭinnī, hētuvainaṭuvaṃṭinnī nivṛtti lakṣaṇamaina dharmamulanu sanaka sananaṃdana sanatkumāra sanatsujātulanu munulanu sṛṣṭiṃci vāricē svīkariṃpacēsenu - ī prakāramuga vāru svīkariṃcina ī reṃḍu dharmamulu munulu grahiṃci vāri vāri śiṣyulaku śāstramulō ceppina prakāramu ceppucū vaccuṭacēta paraṃparagā lōkamulō pracāramayi dharmamu pravartiṃpa cēyabaḍinadi, kṛtayugamu modalagu yugamulalō ī dharmamu satpuruṣulacēta pravartiṃpabaḍinadi. ciṃtiṃcuṭaku nalavikāni kālakramamucēta, kāmādulu balisi pōvuṭacētanu, karmalavaicitramu valananu ī dharmamu kṣīṇiṃcucu vaccuṭabaṭṭi, adharmamu vṛddhipoṃdu cunuṃḍuṭa baṭṭinnī ādikarta ayina - ī dharmamunu moṭṭamodaṭa sṛṣṭiṃcina - śrīmahāviṣṇuvu dharmamunu pāliṃcuṭaku punaruddhariṃcuṭaku bhūmimīda avatariṃcenu.
(triguṇātmakayu, viṣṇuvuyokka śaktiyē ayina tanamāyanu tana vaśamulōnuṃcukoni, janmalēnivāḍayyunu, kṣīṇiṃcanivāḍayyunu, trikālalaṃdu nuṃḍuvāḍayyunu, śuddhuḍu, buddhaḍu sṛṣṭiki mūlakāraṇamaina śrīmahāviṣṇuvu (nārāyaṇuḍu) tana yicchā prakāramu dēvakī vasudēvulaku śrīkṛṣṇuḍanu pērutō kumāruḍai puṭṭi dharmamunu pravartiṃpacēyuṭaku śatruvulayina asurulanu (āsura saṃpatti galavāralanu) anēka prakāramulugā caṃpi, adbhutamaina tana śrīkṛṣṇāvatāramutō dharmamunu tirigi pravartiṃpa cēsenu).
("ī reṃḍu vidhamulagu dharmamulu bhūmimīda saṃpradāyamūlamugā ē prakāramugā vṛddhipoṃdagalavō ā prakāramu ippuḍu nēnu cēyudunu" ani saṃkalpiṃcukoni bhāratayuddhamanu avasaramu kudaraganē, yuddhabhūmiyaṃdu uttamādhikāri ayina arjununi nimittamātrunigā cēsi ataniki bōdhiṃcenu - anu miṣatō lōkamaṃdaṟiki śrīkṛṣṇuḍu ī dharmamunu upadēśiṃcenu - ī prakāramugā cēsinayaḍala dharmamu tānaṃtaṭa adiyē lōkamulō pracāramayi, vṛddhipoṃdi vyāpiṃcagaladani uddēśamutō bhagavaṃtuḍī prakāramugā cēsenu - iṭlu śrīkṛṣṇabhagavānuḍu arjunaku cēsina bōdhayē śrīmadbhagavadgīta).
vēdamu mūḍu kāṃḍalugā vibhajiṃpabaḍinadi - karmakāṃḍa, upāsanākāṃḍa, jñānakāṃḍa. aṭlē vēdamula sārāṃśamaina śrīmadbhagavadgīta mūḍu bhāgamuluga vibhajiṃcapaḍinadi - iṃdulōni modaṭi āru adhyāyamulu karmayōgamunu sūciṃcunu, reṃḍava āru adhyāyamulu bhaktiyōgamunu teliya cēyunu - mūḍava āru adhyāyamulu jñānayōgamunu teliyacēyunu.
"sarvōpaniṣadō gāvō dōgdhā gōpāla naṃdanaḥ |
pārthō vatsaḥ sudhīrbhōktā dugdhaṃ gītāmṛtaṃ mahat ||".
"advaitāmṛtavarṣiṇīṃ bhagavatī maṣṭādaśādhyāyinīṃ |
aṃbatvāṃ anasaṃdadhāmi, bhagavadgītē, bhavadvēṣiṇīṃ ||".
"pārthāya pratibōdhitāṃ bhagavatā nārāyaṇēna svayaṃ |
vyāsēna gradhitāṃ purāṇa muninā madhyē mahābhārataṃ ||". (gītādhyānamu - 1 - 3)
(śrīkṛṣṇuḍu gōpāluḍu, gōvula pālu pitukuṭalō nērpari. aṃducēta upaniṣattulanniṃṭini oka gōvugā cēsi, pārthuḍanu bhaktuni (adhikārini) gōvatsamugā cēsi (dūḍagācēsi) gītayanu amṛtamunu pidiki śrīkṛṣṇabhagavānuḍu jñānulaku iccenu - ani ībhagavadgīta oka rūpamugā ceppabaḍinadi. idi anni upaniṣattula sārāṃśamunu bhōdhiṃcunadi. upaniṣattulalōni sārāṃśamu brahmajñānamu - sādhāraṇulaku bōdhapaḍanidi. dīnini sākṣāttu bhagavaṃtuḍē ayina śrīkṛṣṇunicēta ceppabaḍinadi. bhagavaṃtuḍē ceppinadiganuka śrīmadbhagavadgīta ani ceppabaḍinadi. śrīkṛṣṇuḍanu lōkaguruvu upadēśiṃcina ī brahmajñānamunu, tānu ceppagā vinuṭakarhuḍaina (adhikāri ayina) arjununitō ceppenu - iṭlu ceppina ā jñānamu arjununidvārā lōkamulō vyāpiṃcunani bhagavaṃtuni āśayamu - ī gīta āvupālavale amṛta tulyamainadi - "kṣīrēṇāyuḥ pravarthatē" ani yunnadikadā - pālavalana āyurdāyamu perugunaṭlu ī gītārthamu telusukoninavāru amṛtamayamagu mōkṣamunu poṃduduru ani dīni phalamu ceppabaḍinadi. 18 adhyāyamulu kaligi, advaita tatvajñānamu anu amṛtamu anu varṣamuvale kuripiṃcu ī bhagavadgītanu anusaṃdhānamu cēyucunnānu).
(śrīmadbhagavadgītalō saṃkṣēpamugā ceppabaḍina prayōjanamu niśśrēyasamu, saṃsāramunuṃḍi uparama lakṣaṇamainadi) iṭṭi niśśrēyassu lakṣaṇamunnū, saṃsāramunuṃḍi atyaṃta upalakṣaṇamainadi. iṭṭi sthiti sarvakarmasanyāsamu cēsi ātmajñānamaṃdu niṣṭakaligiyuṃḍinanē kalugunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.